new fund
-
ఎల్ఐసీ నుంచి మాన్యుఫాక్చరింగ్ ఫండ్
ముంబై: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తయారీ రంగంలో పెట్టుబడుల అవకాశాలతో ‘మాన్యూఫాక్చరింగ్ ఫండ్’ను ప్రారంభించింది. అక్టోబర్ 4 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. నిఫ్టీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్ ఈ పథకానికి ప్రామాణికంగా ఉంటుందని పేర్కొంది. తయారీ రంగంలో వైవిధ్యమైన కంపెనీలతో కూడిన పోర్ట్‌ఫోలియోని ఈ పథకం అందిస్తుందని, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, హెవీ ఇంజనీరింగ్ ఉత్పత్తులు, మెటల్స్, షిప్ బిల్డింగ్, పెట్రోలియం ఉత్పత్తుల కంపెనీలకు ఇందులో చోటు ఉంటుందని వివరించింది.ఈ సందర్భంగా కొత్త పథకం (ఎన్ఎఫ్వో) వివరాలను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆర్కే ఝా వెల్లడించారు. తయారీ థీమ్ లోని కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పె డుతుందని, ఇన్వెస్టర్లకు మంచి సంపద సమకూర్చడమే మాన్యుఫాక్చరింగ్ ఫండ్ ఆవిష్కరణ ఉద్దేశ్యమని చెప్పా రు. ఇన్వెస్టర్లు రోజువారీగా రూ. 300 లేదా నెలవారీగా రూ.1,000 నుంచి, త్రైమాసికం వారీగా అయితే రూ.3,000 చొప్పున ఈ పథకంలో సిప్ చేసుకోవచ్చని తెలిపారు.‘‘ఈ పథకం అక్టోబర్ 16 నుంచి తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు రోజువారీ సిప్ రూ.100కు, నెలవారీ సిప్ రూ.200కు తగ్గుతుంది. తక్కువ ఆదాయంలో ఉన్న వారు సైతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు’’ అని ఝా వివరించారు. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రూ.5,000 నుంచి చేసుకోవచ్చని చెప్పారు. పరిశ్రమ వ్యాప్తంగా 11 మాన్యుఫాక్చరింగ్ ఫండ్స్ ఉన్నాయని, వీటి నిర్వహణలో రూ.34,700 కోట్ల ఆస్తులున్నట్టు తెలిపారు. -
360 వన్‌కు ముంబై ఏంజెల్స్‌లో నియంత్రణ వాటా
న్యూఢిల్లీ: ఆరంభ స్థాయి కంపెనీల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టే ‘ముంబై ఏంజెల్స్’లో నియంత్రిత వాటాను సొంతం చేసుకున్నట్టు 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) ప్రకటించింది. ఆరంభ స్థాయి పెట్టుబడుల విభాగంలో ముంబై ఏంజెల్స్ ప్రముఖ సంస్థగా ఉందని, ఈ కొనుగోలుతో స్టార్టప్‌లలో పెట్టుబడులను మరింత విస్తతం చేయనున్నట్టు తెలిపింది. తమ ఇన్వెస్టర్లకు మరింత విస్తృత శ్రేణి డీల్స్‌ను ఆఫర్ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మద్దతుగా నిలవడం ద్వారా, తమ ఇన్వెస్టర్ల సంపద వృద్ధికి సాయపడనున్నట్టు వివరించింది. మరోవైపు ముంబై ఏంజెల్స్ రెండు నూతన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌ను ఈ సందర్భంగా ప్రకటించింది. ఆరంభ దశలోని కంపెనీల్లో ఆకర్షణీయమైన పెట్టుబడుల అవకాశాలను వీటి ద్వారా తమ క్లయింట్లకు అందించొచ్చని 360వన్ ఎండీ, సీఈవో కరణ్ భగత్ తెలిపారు. -
మిరే అసెట్ హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్
మిరే అసెట్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్‌ను ప్రకటించింది. ఒకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ కాగా మరొకటి హాంగ్ సెంగ్ టెక్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్). మొదటిదానిలో పెట్టుబడులకు నవంబర్ 29, రెండో దానికి డిసెంబర్ 1 ఆఖరు తేదీ. ఈటీఎఫ్‌కు సిద్ధార్థ శ్రీవాస్తవ, ఎఫ్వోఎఫ్కు ఏక్తా గాలా ఫండ్ మేనేజర్లుగా ఉంటారు. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. హాంకాంగ్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన 30 చైనా టాప్ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి. -
ట్రావిస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం
ముంబై : ప్రపంచంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా పేరున్న ఉబర్‌కు, పలు కారణాలచే గుడ్‌బై చెప్పిన ట్రావిస్ కలానిక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్, చైనా స్టార్టప్‌ల్లో తన వ్యక్తిగత పెట్టుబడులు కోసం కొత్త ఫండ్‌ను లాంచ్‌చేశారు. 10100 పేరుతో ఈ ఫండ్‌ను కలానిక్ లాంచ్ చేసినట్టు తెలిసింది. కొన్ని నెలల నుంచి కలానిక్ తన కొత్త జర్నీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది. పలు కంపెనీ బోర్డులతో పనిచేయడం, లాభాపేక్ష లేని కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపడం చేస్తున్నట్టు వంటివి చేశారు. ''ఈ ఫండ్ ఎక్కువగా భారత్‌లోని నూతనావిష్కరణలు, స్టార్టప్‌లకు ఎక్కువగా మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల సృష్టి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, భారత్, చైనాల్లో ఈకామర్స్, ఎమర్జింగ్ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించవచ్చు. ప్రస్తుతం లాభాపేక్ష లేని నా పెట్టుబడులు తొలుత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. నగరాల భవిష్యత్తుపై కూడా దృష్టిసారించనున్నాయి'' అని కలానిక్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. దీని కోసం ఉబర్‌లో ఆయనకున్న షేరులో మూడోవంతు విక్రయించాలని కూడా కలానిక్ చూస్తున్నారు. ఈ విక్రయంతో కలానిక్ తన డ్రీమ్ నెరవేర్చుకుని, ఇన్వెస్టర్‌గా మారబోతున్నారు. ఈ సేల్ అనంతరం కలానిక్‌కు 1.4 బిలియన్ డాలర్లను పొందనున్నారు. ఈ ఈక్విటీని జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు కొనుగోలు చేస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. గతేడాది జూన్‌లో కలానిక్ ఉబర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా మాత్రం కొనసాగుతున్నారు. కలానిక్ పెట్టుబడులు చైనా కంటే ఎక్కువగా భారత్‌లో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసంకలానిక్ ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అవకాశాలను వెతకడం కోసం స్థానికంగా కలానిక్ టీమ్ పనిచేస్తుందని కూడా ఐవీ కాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ విక్రమ్ గుప్తా తెలిపారు. -
షేర్లలో పెట్టుబడికి మంచి తరుణమిది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్నికలొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈక్విటీలకు మరింత కేటాయించాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫండ్ మేనేజర్ వెంకటేష్ సంజీవి సూచించారు. ఎలక్షన్ల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైతే.. స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు మార్కెట్లు కూడా మరింత మెరుగుపడగలవని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు 15-20 శాతం పెరిగాక ఇన్వెస్ట్ చేయడం కన్నా కాస్త ముందుగానే నిర్ణయాలు తీసుకుంటే గణనీయంగా లాభపడొచ్చని చెప్పారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్తగా ప్రారంభించిన ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ సిరీస్ 1 గురించి వివరించేందుకు మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెంకటేష్ ఈ విషయాలు తెలిపారు. చాలా మటుకు దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. మార్కెట్లు అధిక స్థాయిల్లో ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా వంటి కొన్ని రంగాలు మినహా చాలా రంగాల పీఈ నిష్పత్తి గతంతో పోలిస్తే తక్కువగానే ఉందని ఆయన చెప్పారు. టెలికం, సిమెంటు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాల షేర్లలో గణనీయ వృద్ధికి ఆస్కారం ఉందని వెంకటేష్ పేర్కొన్నారు. మరోవైపు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు కూడా దిగిరావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురుకు డిమాండ్ అదుపులో ఉన్నంత దాకా దేశీయంగా ద్రవ్యోల్బణం ఎగియకపోవచ్చని చెప్పారు. అందుబాటులో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ - సిరీస్1 ఈ క్లోజ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్ ప్రధానంగా వచ్చే మూడేళ్లలో అధిక రాబడులు అందించే అవకాశమున్న 20-25 కంపెనీల షేర్లపై దృష్టి సారిస్తుందని వెంకటేష్ చెప్పారు. కొత్త ఇన్వెస్టర్లకు పన్ను పరమైన ప్రయోజనాలు అందించే.. రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ (ఆర్జీఈఎస్ఎస్)కి అర్హమైన కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తామని వివరించారు. ఈ నెల 20న మొదలైన ఈ న్యూ ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ. 5,000 కాగా, కనీస లాకిన్ వ్యవధి మూడేళ్లు ఉంటుందని వెంకటేష్ పేర్కొన్నారు.