ముంబై : ప్రపంచంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా పేరున్న ఉబర్‌కు, పలు కారణాలచే గుడ్‌బై చెప్పిన ట్రావిస్ కలానిక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్, చైనా స్టార్టప్‌ల్లో తన వ్యక్తిగత పెట్టుబడులు కోసం కొత్త ఫండ్‌ను లాంచ్‌చేశారు. 10100 పేరుతో ఈ ఫండ్‌ను కలానిక్ లాంచ్ చేసినట్టు తెలిసింది. కొన్ని నెలల నుంచి కలానిక్ తన కొత్త జర్నీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది. పలు కంపెనీ బోర్డులతో పనిచేయడం, లాభాపేక్ష లేని కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపడం చేస్తున్నట్టు వంటివి చేశారు.
''ఈ ఫండ్ ఎక్కువగా భారత్‌లోని నూతనావిష్కరణలు, స్టార్టప్‌లకు ఎక్కువగా మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల సృష్టి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, భారత్, చైనాల్లో ఈకామర్స్, ఎమర్జింగ్ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించవచ్చు. ప్రస్తుతం లాభాపేక్ష లేని నా పెట్టుబడులు తొలుత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. నగరాల భవిష్యత్తుపై కూడా దృష్టిసారించనున్నాయి'' అని కలానిక్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు.
దీని కోసం ఉబర్‌లో ఆయనకున్న షేరులో మూడోవంతు విక్రయించాలని కూడా కలానిక్ చూస్తున్నారు. ఈ విక్రయంతో కలానిక్ తన డ్రీమ్ నెరవేర్చుకుని, ఇన్వెస్టర్‌గా మారబోతున్నారు. ఈ సేల్ అనంతరం కలానిక్‌కు 1.4 బిలియన్ డాలర్లను పొందనున్నారు. ఈ ఈక్విటీని జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు కొనుగోలు చేస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. గతేడాది జూన్‌లో కలానిక్ ఉబర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా మాత్రం కొనసాగుతున్నారు.
కలానిక్ పెట్టుబడులు చైనా కంటే ఎక్కువగా భారత్‌లో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసంకలానిక్ ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అవకాశాలను వెతకడం కోసం స్థానికంగా కలానిక్ టీమ్ పనిచేస్తుందని కూడా ఐవీ కాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ విక్రమ్ గుప్తా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment