Travis Kalanick
-
ట్రావిస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం
ముంబై : ప్రపంచంలో అత్యంత విలువైన స్టార్టప్‌లలో ఒకటిగా పేరున్న ఉబర్‌కు, పలు కారణాలచే గుడ్‌బై చెప్పిన ట్రావిస్ కలానిక్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. భారత్, చైనా స్టార్టప్‌ల్లో తన వ్యక్తిగత పెట్టుబడులు కోసం కొత్త ఫండ్‌ను లాంచ్‌చేశారు. 10100 పేరుతో ఈ ఫండ్‌ను కలానిక్ లాంచ్ చేసినట్టు తెలిసింది. కొన్ని నెలల నుంచి కలానిక్ తన కొత్త జర్నీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలిసింది. పలు కంపెనీ బోర్డులతో పనిచేయడం, లాభాపేక్ష లేని కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపడం చేస్తున్నట్టు వంటివి చేశారు. ''ఈ ఫండ్ ఎక్కువగా భారత్‌లోని నూతనావిష్కరణలు, స్టార్టప్‌లకు ఎక్కువగా మద్దతు ఇవ్వనున్నాయి. దీంతో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాల సృష్టి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు, భారత్, చైనాల్లో ఈకామర్స్, ఎమర్జింగ్ ఇన్నోవేషన్‌పై దృష్టిసారించవచ్చు. ప్రస్తుతం లాభాపేక్ష లేని నా పెట్టుబడులు తొలుత విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. నగరాల భవిష్యత్తుపై కూడా దృష్టిసారించనున్నాయి'' అని కలానిక్ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు. దీని కోసం ఉబర్‌లో ఆయనకున్న షేరులో మూడోవంతు విక్రయించాలని కూడా కలానిక్ చూస్తున్నారు. ఈ విక్రయంతో కలానిక్ తన డ్రీమ్ నెరవేర్చుకుని, ఇన్వెస్టర్‌గా మారబోతున్నారు. ఈ సేల్ అనంతరం కలానిక్‌కు 1.4 బిలియన్ డాలర్లను పొందనున్నారు. ఈ ఈక్విటీని జపనీస్ ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు కొనుగోలు చేస్తోందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. గతేడాది జూన్‌లో కలానిక్ ఉబర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కానీ కంపెనీ బోర్డులో డైరెక్టర్‌గా మాత్రం కొనసాగుతున్నారు. కలానిక్ పెట్టుబడులు చైనా కంటే ఎక్కువగా భారత్‌లో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసంకలానిక్ ఇప్పటికే పలుమార్లు భారత్‌ను సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల్లో అవకాశాలను వెతకడం కోసం స్థానికంగా కలానిక్ టీమ్ పనిచేస్తుందని కూడా ఐవీ కాప్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ విక్రమ్ గుప్తా తెలిపారు. -
ఉబర్ మాజీ సీఈవో ఏకపక్ష నిర్ణయం
ఉబర్ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ ఏకపక్షంగా కీలక నిర్ణయం తీసుకుని బోర్డు సభ్యులను ఆశ్చర్యపరిచారు. ఈ పాపులర్ రైడ్ సర్వీసులో ఇప్పటికే నాయకత్వంలో ఉన్న టెన్షన్‌ను మరింత పెంచుతూ.. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలోకి మరో ఇద్దరు కొత్త సభ్యులను చేర్చుకున్నారు. శుక్రవారం రోజు జిరాక్స్ మాజీ చైర్మన్, సీఈవో ఉర్సుల బర్న్స్ ను, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ జాన్ థైన్లను బోర్డులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నియామకంపై వచ్చే వారంలో బోర్డు ఓటింగ్ జరుగనుంది. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు జూన్‌లో కలానిక్ ఉబర్ సీఈవోగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో కొత్త సభ్యుల నియామకంపై జరుగబోయే ఓటింగ్‌లో కలానిక్‌కు తక్కువ ఓటింగ్ అధికారాలున్నట్టు అమెరికా మీడియా రిపోర్టు చేసింది. అపారమైన బోర్డు అనుభవం కలిగిన ఉర్సుల, జాన్ థైన్లు ఇద్దరూ అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లీడర్లని కలానిక్ చెప్పారు. బోర్డును పునర్వ్యస్థీకరించాలనే తాజా బోర్డు ప్రతిపాదన మేరకే వీరి నియామకం జరిగినట్టు చెప్పారు. వీరి నియామకంపై కలానిక్ బోర్డును సంప్రదించకపోవడం బోర్డు ఆఫ్ డైరెక్టర్లను ఆశ్చర్యపరించింది. ఉర్సుల, జాన్ థైన్ నియామాకం ఇటు ఉబర్‌కు, అటు బోర్డుకు పూర్తిగా ఆశ్చర్యపరిచే విషయమని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో మరో కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. బోర్డులో కలానిక్‌కు మద్దతిచ్చేవారు, వ్యతిరేకించేవారు రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. -
ఉబర్ మాజీ సీఈవో కలానిక్‌కు కొత్త కష్టాలు
శాన్ఫ్రాన్సిస్కో : రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్‌ను స్థాపించి, దానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపంటూ తీసుకొచ్చిన ఆ కంపెనీ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ను కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని, వాటి నుంచి బయట పడేసేందుకు ఇన్వెస్టర్ల ఒత్తిడితో సీఈవో పదవి నుంచి తప్పుకున్న ఈయనపై తాజాగా మోసపూరిత దావా నమోదైంది. ఉబర్ అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకటైన బెంచ్‌మార్కు వెంచర్ కలానిక్పై యుద్ధానికి దిగింది. మోసం, ఇతర అతిక్రమణల పేరుతో ఆయన్ను ఉబర్ బోర్డు నుంచి కూడా తొలిగించేందుకు సిద్ధమైంది. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిల్ సంస్థ అయిన బెంచ్‌మార్కు, గురువారం డెలావేర్ ఛాన్జరీ కోర్టులో కలానిక్పై ఫిర్యాదు నమోదుచేసింది. ఈ ఫిర్యాదులో ఉబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ మోసానికి పాల్పడినట్టు, విశ్వసనీయతకు, కాంట్రాక్ట్‌కు తూట్లుపొడిచినట్టు ఆరోపించింది. అంతేకాక 2016లో పలు బోర్డు సీట్లను కలానిక్ ఎలా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారో వివరించింది. ఉబర్ బోర్డులో కలానిక్‌కు స్థానం ఉండటం అక్రమమని, చెల్లనిదిగా బెంచ్‌మార్కు క్యాపిటల్ తన ఫిర్యాదులోనే పేర్కొంది. ఉబర్ సీఈవోగా కలానిక్ బాధ్యతలు వహించేటప్పుడు పలు స్కాండల్స్ బయటికి వచ్చాయి. దీంతో బలవంతంగా ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కొత్త సీఈవోగా వెతుకుతున్నట్టు రెండు రోజుల క్రితమే ఆ కంపెనీ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పారు. అంతేకాక ఉబర్ సీఈవో పదవిలోకి ఇక ట్రావిస్ కలానిక్ రారని కూడా వెల్లడించారు. ఇదే విషయాన్ని బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ప్రకటించింది. తాజాగా బోర్డు సభ్యుడిగా కూడా ట్రావిస్ కలానిక్ను దించేయడానికి బెంచ్‌మార్కు క్యాపిటల్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ దావాలో ఉన్న ప్రతీ అంశం నిరాధారమేనని, తప్పు అని కలానిక్ అధికార ప్రతినిధి చెప్పారు. కలానిక్ సీఈవోగా లేకపోయినా షాడో లీడర్‌గా కొనసాగాలని ఇతరులు కోరుకుంటున్నట్టు తెలిసింది. ఈ దావా సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టార్టప్‌ల గవర్నెన్స్ సమస్యలను ఎత్తిచూపుతోందని విశ్లేషకులంటున్నారు. ఇటీవల స్టార్టప్ వ్యవస్థాపకులే తమ కంపెనీల్లో ఎక్కువ అధికారాలు పొందుతున్నారు. ఇన్వెస్టర్ల కంటే కూడా ఎక్కువగా, అన్ని ఓటింగ్ రైట్స్‌ను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
ఉబర్ సీఈవోగా ఆయన ఇక రారు..
ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ ప్రపంచానికి తెగ ప్రాచుర్యం. రైండింగ్ సర్వీసుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఆ కంపెనీ సంక్షేమం కోసం, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, తాత్కాలికంగా కంపెనీ సీఈవో నుంచి తప్పుకోనున్నట్టు ట్రావిస్ కలానిక్ రెండు నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక, ఆయన మళ్లీ తిరిగి కంపెనీ కీలక వ్యక్తిగా వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తిరిగి ఉబర్ సీఈవోగా తన పదవిలోకి రారట. ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ మళ్లీ తన పదవిలోకి రారని కంపెనీకి చెందిన కీలక బోర్డు సభ్యుడు చెప్పారు. ఈ వారం ఉబర్ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ను రీకోడ్ లీక్ చేసింది. దీనిలో కలానిక్ తిరిగి సీఈవోగా వెనక్కి రారని ఉద్యోగులకు ఉబర్ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పినట్టు వెల్లడైంది. ట్యాక్సీ సర్వీసుల అగ్రగామిని లీడ్ చేయడానికి ప్రముఖ వరల్డ్ క్లాస్ సీఈవోను నియమించనున్నట్టు తెలిపినట్టు తెలిసింది. క్యాంప్ ప్రకటనను బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ట్వీట్ చేసింది. ఉబర్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన బెంచ్ మార్కు కంపెనీ నిర్ణయాలకు అంకితభావంతో ఉన్నామని, కొత్త సీఈవో కోసం అన్వేసిస్తున్నామని తన ట్వీట్లో పేర్కొంది. సీఈవోగా పదవిలో నుంచి దిగిపోయినప్పటికీ, కలానిక్ ఉబర్ బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే క్యాంప్ మెమో, బెంచ్‌మార్కు ప్రకటన వచ్చి ఉంటుందని రిపోర్టులు వెలువడ్డాయి. 1990లో స్టీల్ జాబ్స్ ఆపిల్ సీఈవోగా ఎలా వెనక్కి తిరిగి వచ్చారో అదేమాదిరి ఉబర్ సీఈవోగా మళ్లీ ట్రావిస్ కలానిక్ తన పదవి చేపడతారని రీకోడ్ గతవారం రిపోర్టు చేసింది. కానీ ఈ రిపోర్టుకు భిన్నంగా తాజా రిపోర్టును వెలువరించింది. లైంగిక వేధింపులు, లింగవివక్ష, పని ప్రదేశంలో సమస్యలు వంటి కారణాలతో సీఈవోగా ట్రావిస్ కలానిక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఉబర్ సీఈవోకు మరో కోలుకోలేని దెబ్బ
ఉబర్ సీఈవోకు ఇటీవల దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 15 రోజుల క్రితమే తన తల్లి బోటు ప్రమాదంలో మరణించగా.. తండ్రి తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే ఆయన్ను కొన్ని రోజుల పాటు సీఈవోగా పక్కనపెట్టాలని కంపెనీ బోర్డు సభ్యులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా కంపెనీలో సాగుతున్న లైంగిక వేధింపులు వంటి వివాదస్పద అంశాల నుంచి రికవరీ అవడానికి తాత్కాలికంగా ట్రావిస్ కలానిక్ ను కంపెనీకి దూరంగా ఉంచాలని బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆదివారం రోజు సమావేశమైన మేనేజ్ మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కంపెనీలోని పని వాతావరణం మార్పులపై మాజీ అమెరికా అటార్ని జనర్నల్ ఎరిక్ హోల్డర్ రిపోర్టుపై కూడా ఈ భేటీలో చర్చించారు. వీటిపై రిపోర్టును కంపెనీ మంగళవారం బయటికి వెల్లడించనుంది. 70 బిలియన్ డాలర్లు(రూ.4,50,870కోట్లకు పైగా) విలువైన ఈ స్టార్టప్ ను ఎనిమిదేళ్ల క్రితం ట్రావిస్ కలానిక్, గారెట్ క్యాంపులు కలిసి కాలిఫోర్నియా వేదికగా స్థాపించారు. కలానిక్ ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలానిక్ తో పాటు ఉబర్ బిజినెస్ ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిల్ మైఖెల్ ను కూడా కంపెనీ నుంచి బయటికి పంపేయాలని బోర్డు సభ్యులు నిర్ణయించినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. కలానిక్ తో పాటు ఏడుగురు బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఈవోగా కలానిక్ తాత్కాలికంగా వైదొలగడమేనా, ఆయనకు ఇది కోలుకోలేని దెబ్బే అని పలువురంటున్నారు. ఈ విషయంపై స్పందించడానికి మాత్రం ఉబర్ నిరాకరించింది. కంపెనీలో అంతర్గతంగా జరుగుతున్న లైంగిక వేధింపుల, అనైతిక కార్యకలాపాలపై ప్రస్తుతం రెండు లా సంస్థలు పెర్కిన్స్ కోయి, కోవింగ్టన్ అండ్ బుర్లింగ్ లు లోతుగా విచారణ జరుపుతున్నాయి. పెర్కిన్స్ విచారణలో బయటపడిన లైగింక వేధింపులు, అనైతిక ప్రవర్తన సాగిస్తున్న 20 మంది ఉద్యోగులను ఉబర్ యాజమాన్యం తొలగించింది. మరో 100 మందిపై విచారణ సాగిస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్నింగ్ లెటర్లు కూడా పంపింది. గతవారమే కంపెనీ ఎరిక్ అలెగ్జాండర్ అనే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ను బయటికి పంపించేసింది. ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఓ మహిళ మెడికల్ రిపోర్టులను ఆయన సొంతం చేసుకున్నాడనే నెపంతో ఉబర్ ఆయన్ను తొలగించింది. ఈ అత్యాచార ఘటనపై ట్రావిస్ కలానిక్ అనుమానాలు వ్యక్తంచేసినట్టు గతవారం పలు రిపోర్టులు కూడా వెలువడ్డాయి. ఈ రిపోర్టులను ఎరిక్, ట్రావిస్ కలానిక్, మైఖెల్ కు చూపించినట్టు తెలిసింది. అయినప్పటికీ వారు ఇంకా ఈ ఘటనపై సందేహాలే వ్యక్తం చేసినట్టు కంపెనీకి చెందిన పలువురు చెప్పారు. -
విషాదంలో ఉబర్ సీఈఓ
కాలిఫోర్నియా: ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ సీఈవో ట్రావిస్ కలా నిక్ తల్లి బోనీ కలానిక్ (71) బోటు ప్రమాదంలో మరణించారు. తండ్రి డొనాల్డ్ కలానిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని పైన్ఫ్లాట్ సరస్సులో విహరిస్తుండగా ప్రమాదం జరిగింది. వారి బోటు ఓ పెద్ద బండరాయిని ఢీకొని మునిగిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డొనాల్డ్ కలానిక్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నగర షెరిఫ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్రావిస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ట్రావిస్ కుప్పకూలిపోయారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన ఉబర్ సీఈఓ