ఉబర్ సీఈవోగా ఆయన ఇక రారు..
ఉబర్ సీఈవోగా ఆయన ఇక రారు..
Published Wed, Aug 9 2017 8:45 AM | Last Updated on Thu, Aug 30 2018 9:12 PM
ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ ప్రపంచానికి తెగ ప్రాచుర్యం. రైండింగ్ సర్వీసుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఆ కంపెనీ సంక్షేమం కోసం, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, తాత్కాలికంగా కంపెనీ సీఈవో నుంచి తప్పుకోనున్నట్టు ట్రావిస్ కలానిక్ రెండు నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక, ఆయన మళ్లీ తిరిగి కంపెనీ కీలక వ్యక్తిగా వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తిరిగి ఉబర్ సీఈవోగా తన పదవిలోకి రారట. ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ మళ్లీ తన పదవిలోకి రారని కంపెనీకి చెందిన కీలక బోర్డు సభ్యుడు చెప్పారు. ఈ వారం ఉబర్ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ను రీకోడ్ లీక్ చేసింది. దీనిలో కలానిక్ తిరిగి సీఈవోగా వెనక్కి రారని ఉద్యోగులకు ఉబర్ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పినట్టు వెల్లడైంది.
ట్యాక్సీ సర్వీసుల అగ్రగామిని లీడ్ చేయడానికి ప్రముఖ వరల్డ్ క్లాస్ సీఈవోను నియమించనున్నట్టు తెలిపినట్టు తెలిసింది. క్యాంప్ ప్రకటనను బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ట్వీట్ చేసింది. ఉబర్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన బెంచ్ మార్కు కంపెనీ నిర్ణయాలకు అంకితభావంతో ఉన్నామని, కొత్త సీఈవో కోసం అన్వేసిస్తున్నామని తన ట్వీట్‌లో పేర్కొంది. సీఈవోగా పదవిలో నుంచి దిగిపోయినప్పటికీ, కలానిక్ ఉబర్ బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే క్యాంప్ మెమో, బెంచ్‌మార్కు ప్రకటన వచ్చి ఉంటుందని రిపోర్టులు వెలువడ్డాయి. 1990లో స్టీల్ జాబ్స్ ఆపిల్ సీఈవోగా ఎలా వెనక్కి తిరిగి వచ్చారో అదేమాదిరి ఉబర్ సీఈవోగా మళ్లీ ట్రావిస్ కలానిక్ తన పదవి చేపడతారని రీకోడ్ గతవారం రిపోర్టు చేసింది. కానీ ఈ రిపోర్టుకు భిన్నంగా తాజా రిపోర్టును వెలువరించింది. లైంగిక వేధింపులు, లింగవివక్ష, పని ప్రదేశంలో సమస్యలు వంటి కారణాలతో సీఈవోగా ట్రావిస్ కలానిక్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
Advertisement