విషాదంలో ఉబర్‌ సీఈఓ | Mother of Uber CEO killed in California boating accident | Sakshi
Sakshi News home page

విషాదంలో ఉబర్‌ సీఈఓ

Published Sun, May 28 2017 10:50 PM | Last Updated on Thu, Aug 30 2018 9:12 PM

విషాదంలో ఉబర్‌ సీఈఓ - Sakshi

విషాదంలో ఉబర్‌ సీఈఓ

కాలిఫోర్నియా:
ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్‌ సీఈవో ట్రావిస్‌ కలా నిక్‌ తల్లి బోనీ కలానిక్‌ (71) బోటు ప్రమాదంలో మరణించారు. తండ్రి డొనాల్డ్‌ కలానిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని పైన్‌ఫ్లాట్‌ సరస్సులో విహరిస్తుండగా ప్రమాదం జరిగింది.

వారి బోటు ఓ పెద్ద బండరాయిని ఢీకొని మునిగిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డొనాల్డ్‌ కలానిక్‌ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నగర షెరిఫ్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్రావిస్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ట్రావిస్‌ కుప్పకూలిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement