
స్టాన్‌చార్ట్‌తో ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో యూనీఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వీలుంటుంది. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశముంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.