ఐడీబీఐలో 500 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఐడీబీఐలో 500 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Published Tue, Nov 22 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)..
వివిధ బ్రాంచ్‌లు, కార్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులను నియమించేందుకు దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ కాల వ్యవధిని ఏడాదిగా
పేర్కొన్నప్పటికీ సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరు ఆధారంగా
మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. మూడేళ్ల
కాంట్రాక్ట్ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తిచేసినవారు
ఐడీబీఐ నిర్వహించే ఎంపిక ప్రక్రియ ద్వారా ‘ఏ’ గ్రేడ్ అసిస్టెంట్
మేనేజర్‌గా నియమితులయ్యేందుకు అర్హత పొందుతారు.
మొత్తం ఖాళీలు: 500
(ఎస్సీ-85, ఎస్టీ-40, ఓబీసీ-130, ఇతరులు-245. ఇందులో దివ్యాంగులకు-26)
వేతనం: మొదటి ఏడాదినెలకు రూ.17,000; రెండో ఏడాది నెలకు రూ.18,500; మూడో ఏడాది నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 2016 అక్టోబర్ 1 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 25 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
90 నిమిషాల (గంటన్నర) వ్యవధిలో జరిగే పరీక్షలో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.
తతెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలు రూ.150; ఇతరులు రూ.700 చెల్లించాలి.
ముఖ్య తేదీలు
1. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30.
2.హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం:
డిసెంబర్ 27 తర్వాత
3.ఆన్‌లైన్ పరీక్ష తేది: 2017 జనవరి 6
వెబ్‌సైట్: www.idbi.com
క్ర.సం. సబ్జెక్టు {పశ్నల సంఖ్య మార్కులు
1. రీజనింగ్ 50 50
2. వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 50
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50
మొత్తం 150 150
Advertisement