ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్​న్యూస్! | IDBI Bank Revised Fixed deposit FD Rates | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్​న్యూస్!

Published Mon, Jul 19 2021 7:57 PM | Last Updated on Mon, Jul 19 2021 7:57 PM

IDBI Bank Revised Fixed deposit FD Rates - Sakshi

ముంబై: ఐడీబీఐ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది​. బ్యాంకులో పెట్టుబడి పెట్టిన ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎఫ్​డీ వడ్డీ రేట్లలో కొన్ని మార్పులు చేసింది. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ పేర్కొంది. ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్​ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో వస్తాయి. ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8%% వరకు వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు అనేవి జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్​డీలపై ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ల కొరకు ప్రస్తుతం బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు ఎఫ్​డీ రేట్లను అందిస్తుంది. ఈ డిపాజిట్లను పన్ను ఆదా చేసే ఎఫ్​డీలు అని కూడా అంటారు. ఐడీబీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బీపీఎస్ వడ్డీరేట్లను అన్ని టెనర్లలో అందిస్తుంది. ఐడీబీఐ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్ల అయితే ఈ వడ్డీ రేట్లకు 50 బీపీఎస్(0.50 శాతం) అదనం అని గుర్తు పెట్టుకోవాలి.

ఎఫ్​డీలపై తాజా వడ్డీ రేట్లు 

  • 7 రోజుల నుంచి 14 రోజులు వరకు అయితే 2.7%
  • 15 రోజుల నుంచి 30 రోజులు వరకు అయితే 2.7%
  • 31 రోజుల నుంచి 45 రోజులు వరకు అయితే 2.8%
  • 46 రోజుల నుంచి 60 రోజులు వరకు అయితే 3.00%
  • 61 రోజుల నుంచి 90 రోజులు వరకు అయితే 3.00%
  • 3 నెలల నుంచి 6 నెలలు వరకు అయితే 3.5%
  • 6 నెలలు 1 రోజు నుంచి 270 రోజులు వరకు అయితే 4.3%
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు అయితే 4.3%
  • 1 సంవత్సరం వరకు అయితే 5%
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే 5.1%
  • 2 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.1%
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ అయితే 5.3%
  • 5 సంవత్సరాల వరకు అయితే 5.25%
  • 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి 7 సంవత్సరాల వరకు అయితే 5.25%
  • 7 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 10 సంవత్సరాల వరకు అయితే 5.25%
  • 10 సంవత్సరాలకంటే ఎక్కువ నుంచి 20 సంవత్సరాలు వరకు అయితే 4.8%

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement