ఉత్తమమైన కస్టమర్ సర్వీసులు..
12 బ్యాంకులే పాస్..
ముంబై: దేశంలోని 51 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులు మాత్రమే కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందిస్తున్నాయి. ఇవి ‘హై’ రేటింగ్‌ను పొందాయి. ఈ 12 బ్యాంకుల్లో కేవలం ఒకే ఒక ప్రభుత్వ బ్యాంక్ ‘ఐడీబీఐ’ స్థానం పొందింది. మిగతావన్నీ ప్రైవేట్, విదేశీ బ్యాంకులే. బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) తాజాగా వార్షిక కోడ్ కాంప్లియెన్స్ రేటింగ్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం..
‘హై’ రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ఆర్‌బీఎల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, సిటీ బ్యాంక్‌లు ఉన్నాయి. ఆర్‌బీఎల్ బ్యాంక్ స్కోర్ మిగతా అన్నింటికన్నా ఎక్కువగా 95గా నమోదయ్యింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్యాంకులు స్కోర్ సగటున 77గా ఉంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కోర్ 78గా నమోదయ్యింది. ఇది కొంత విచారింపదగిన అంశం. కాగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఒక స్వతంత్ర సంస్థ ఈ బీసీఎస్‌బీఐ. మంచి బ్యాంకింగ్ విధానాలను ప్రోత్సహించడం, పారదర్శకత పెంపొందించడం, కార్యాచరణ ప్రమాణాల మెరుగుదల వంటి పలు అంశాల సాధనే బీసీఎస్‌బీఐ ప్రధాన లక్ష్యం.