ఏపీ ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని ప్రపంచం బ్యాంకు గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన చదువులు అందించే ‘నాడు-నేడు’కు వరల్డ్ బ్యాంకు ఆర్థిక సాయం ప్రకటించింది. 250 మిలియన్ డాలర్లతో మరింత సమర్థవంతంగా పథకం అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు 250 మిలియన్ డాలర్ల నిధులను షరతులు లేని రుణంగా మంజూరు చేసింది. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఇప్పటికే నిర్వహిస్తున్నారు.
సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద కొత్తగా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఈ సాయంతో మొత్తం ప్రపంచ బ్యాంకు నిధులతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన ఇది తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం రూ. 53 వేల కోట్ల ఖర్చు చేసింది. ఒక్క అమ్మ ఒడి పథకానికే రూ.19,617 కోట్లు సీఎం జగన్ కేటాయించారు. వచ్చే ఇదేళ్లలో ఈ నిధులను ఉపయోగించుకుని జరిగే అభివృద్ధి ని ప్రోగ్రాం ఫర్ రిజల్ట్స్ కింద చూడనున్నట్లు వరల్డ్ బ్యాంకు పేర్కొంది.
చదవండి: విశాఖ రాజధానిపై విషం.. ఉత్తరాంధ్ర ప్రగతికి మోకాలడ్డు
14, 15 న దక్షిణాది రాష్ట్రాల సదస్సు
పాఠశాల విద్యలో ఉత్తమ పద్ధతులు, సంస్కరణలే ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల సామర్థ్యం పెంచాలనే ఉదేశ్యంగా దక్షిణాది రాష్ట్రాల యుడిఐఎస్ఈ సదస్సును విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా సంస్కరణలను చర్చించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు నేడు పథకంపై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment