Nadu- Nedu
-
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
Fact check: ప్రభుత్వ బడులపైనే బండలా!
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది. మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు. ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు. ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి. -
అభివృద్ధి పథంలో ఏపీ విద్యావ్యవస్థ
విశాఖ (విద్య): ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అభివృద్ధి పథంలో పయనిస్తోందని మేధావులు స్పష్టం చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో నాన్–పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రగతి బాటలో ఏపీ విద్యావ్యవస్థ’ అంశంపై సోమవారం చర్చాగోష్టి నిర్వహించారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం) పూర్వ వీసీ హెచ్.లజపతిరాయ్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ (రాజమండ్రి) మాజీ వీసీ ఎం.జగన్నాథరావు, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కె.శ్రీరామమూర్తి, ఏయూ విద్యా విభాగాధిపతి టి.షారోన్‌రాజు, ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగం విశ్రాంత ఆచార్యులు పి.విశ్వనాథం, సీహెచ్.సూర్యనారాయణ, బీవీకే కళాశాల రిటైర్డ్ లెక్చరర్ సి.వెంకటరావు చర్చాగోష్టిలో మాట్లాడారు. నాణ్యమైన విద్యనందించే విధంగా పాఠశాల స్థాయినుంచి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. జర్మనీ, జపాన్ వంటి దేశాలు యువతను ఉన్నత, సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్ది మెరుగైన ప్రగతిని సాధించాయని, ఇదే తరహాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఆయన ధృక్పథం, పనితీరు మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. నాలుగేళ్ల కాలంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు 33 శాతానికి పైగా పెంచారన్నారు. రానున్న కాలంలో ఏపీ యువత ప్రపంచంలోనే నంబర్–1గా నిలుస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అణగారిన వర్గాల పిల్లలు పాఠశాల బాట పడుతున్నారని చెప్పారు. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద వంటి పథకాలు, బైజూస్ కంటెంట్‌తో డిజిటల్ పాఠాల బోధన ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. అవాస్తవాలతో దుష్ప్రచారం ఈ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని చూడటం సరికాదని విద్యారంగ నిపుణులు హితవు పలికారు. పేద పిల్లలకు చదువుల్ని దూరం చేసేందుకు కొన్నిశక్తులు కుట్రపూరితంగా పనిచేస్తున్నాయని, దీనిని మేధావి వర్గాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, భవిష్యత్ తరాలకు జరగనున్న మేలుపై వాస్తవ గణాంకాలతో వివరించేందుకు ఏ వేదికపైన అయినా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. నూతన విధానాలతో బోధన, విద్యకు నైపుణ్యం జోడిస్తూ ప్రతి విద్యార్థి మెరుగైన ఉద్యోగాలు సాధించేవిధంగా విద్యావ్యవస్థను ప్రగతివైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నాన్–పొలిటికల్ జేఏసీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. -
విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. ‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే.. అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండగా.. స్థూల నమోదు 2017తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు.. ► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. ► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. ► అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. ► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. -
బోగస్ విజనరీ బాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అదే!
కొద్ది రోజుల క్రితం యూట్యూబ్‌లో ఒక ఆసక్తికరమైన వీడియో చూశాను. అది ఒక ప్రొఫెసర్ చేసిన వీడియో! ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన అనుభవం వింటుంటే మాత్రం గొప్ప అనుభూతి కలుగుతుంది.ఎందుకంటే ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన అద్బుతమైన మార్పులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి స్కూళ్లలో నేర్పుతున్న విద్యను ఏపీకి ఎలా తీసుకు వస్తున్నది ఆయన చెబుతుంటే ఇది కదా అభివృద్ది అంటే అనిపిస్తుంది. ఎల్కేజీకి రెండు లక్షలు ఫ్రొఫెసర్ రమేష్ అనే ఈయన కొన్నేళ్ల క్రితం తన పిల్లలను చేర్చడం కోసం హైదరాబాద్ ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్లాడట. అక్కడ ఎల్కేజీకి తీసుకునే ఫీజు సుమారు రెండు లక్షల రూపాయలని తెలుసుకున్నాడు. ఏం సదుపాయాలు ఉన్నాయో కూడా ఆయన గమనించారు. ప్రత్యేకించి స్కూల్ ఆంబియన్స్ అంటే చూడగానే పిల్లలు ఆకర్షితులయ్యే విధంగా భవనాలు, రంగులు, బొమ్మలు, క్లాస్ రూమ్స్ ,బల్లలు, డిజిటల్ బోదన ఉంటాయి. అలాగే సీబీఎస్ఈ సిలబస్ ఉంది. దానికి తోడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఐబీ సిలబస్ కూడా మరికొన్ని చోట్ల ఉంది. వారు పిల్లలకు బస్ రవాణా సదుపాయం, ఇతర వసతులు కల్పిస్తారు. దీనికి గాను వారికి అంత మొత్తం ఫీజ్ కావచ్చు. ఆంగ్ల మాద్యమం అవసరం కానీ ఏపీలో ఇలాంటి వసతులతో కూడిన స్కూల్లో ఒక్క పైసా ఖర్చు కాకుండా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు అమోఘం అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక పిల్లలకు డ్రెస్‌లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర అన్ని ఏర్పాట్లను జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఇది మరి గొప్ప విషయం కాదా! ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టడాన్ని ఆ ఫ్రొఫెసర్ స్వాగతించడమే కాకుండా, అంతర్జాతీయంగా ఎక్కడకు వెళ్లాలన్నా ఆంగ్ల మాద్యమం అవసరం అని ఆయన అబిప్రాయపడ్డారు. దివంగత నటి సావిత్రి సాయం ఈ మద్య నేను కూడా రేపల్లె వద్ద వడ్డివారి పాలెం అని ఒక ప్రభుత్వ స్కూల్‌కు వెళ్లడం జరిగింది. ఆ స్కూల్‌ను అభివృద్ది చేయడానికి ప్రముఖ నటి, దివంగత సావిత్రి నాలుగైదు దశాబ్దాల క్రితం ఆర్దిక సాయం చేశారు. ఆ గ్రామం ఆమె అమ్మమ్మగారి గ్రామం కావడంతో ఆమె శ్రద్ద చూపించారు. అందుకు కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు స్కూల్ ఆవరణలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆమె జయంతి సందర్భంగా ముఖ్య అతిధిగా వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సదుపాయాలు గమనించాను. ప్రభుత్వ పాఠశాలకు బస్ సౌకర్యం స్కూల్ ఆంబియన్స్ మార్చారు. స్కూల్ లోపల కూడా రోడ్డు వేశారు. ఒకప్పుడు వంద మంది కూడా లేని స్కూల్లో ఇప్పుడు మూడు వందల మందికి పైగా ఉన్నారని గ్రామస్తులు, స్కూల్ టీచర్లు వివరించారు. వారు సొంతంగా పాఠశాల తరపున ఒక బస్‌ను నడిపి సమీప గ్రామాలకు పంపి పిల్లలను రప్పిస్తున్నారు. బహుశా ఒక ప్రభుత్వ పాఠశాల ఇలా బస్ నడుపుతుండడం అరుదైన విషయమే కావచ్చు. ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం స్కూల్ గోడలపై మంచి రంగు, రంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా కనిపించాయి. ఒకప్పుడు స్కూళ్లలో మంచి నీటి సదుపాయమే ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. టాయిలెట్లలో స్టార్ హోటళ్లలో మాదిరి పరికరాలుపెట్టారు. అయితే అక్కడ మాత్రం కాస్త నిర్వహణ లోపం కనిపించింది. నేను చూసిన మరికొన్ని స్కూళ్లలో మాత్రం టాయిలెట్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. అయినా పిల్లల కోసం అలాంటి సదుపాయం ఏర్పాటు చేయడమే ఏపీలో మారుతున్న సంస్కృతికి నిదర్శనం. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన సదుపాయాలు ఈ మద్య తెలంగాణలో ఉన్న స్కూళ్ల పరిస్థితిని, ఏపీ స్కూళ్ల స్థితిని పోల్చుతూ కొన్ని వీడియోలు వచ్చాయి. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఒక స్కూల్‌కు వెళ్లినప్పుడు పిల్లలతో పాటు తాను కూడా కింద కూర్చోవలసి వచ్చింది. మరి అదే ఇప్పుడు మంచి, మంచి బల్లలు ఏర్పాటు చేశారు. క్లాస్ రూమ్‌లో భారీ టెలివిజన్లు ఏర్పాటై కనిపించాయి. డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన అన్ని అక్కడ ఉన్నాయి. అమ్మ ఒడి కింద పదిహేను వేలు ఒక్క బైజూస్ కంటెంట్‌తో కూడిన టాబ్ కావాలంటే ప్రైవేట్ స్కూళ్లలో 35 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందట. ఈ రకంగా చూస్తే ప్రవేటు స్కూళ్లలో ఎల్‌కేజీకే రెండున్నర లక్షల రూపాయల వ్యయం చేయవలసి వస్తుంది. కాని ఏపీలో పేద పిల్లల విద్యాబ్యాసానికి ఇంత ఖరీదైన విద్యను కాణీ ఖర్చు లేకుండా ఇస్తున్నారు. పైగా అమ్మ ఒడి కింద పదిహేనువేల రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు పిట్టలదొర కబుర్లు నమ్ముతారా? పిల్లలకు చిన్న క్లాస్‌ల నుంచే టోఫెల్, ఐబీ వంటివాటిలో శిక్షణ ఇవ్వాలని తలపెట్టారు. మాతృభాషకు విఘాతం కలగకుండా ఇంగ్లీష్‌తో పాటు, మరికొన్ని ఇతర విదేశీ భాషలు నేర్పాలన్న తలంపుతో జగన్ ప్రభుత్వం ఉంది. అలాంటి మార్పులు వస్తున్నందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతోషపడడం లేదు. పైగా పేదల చదువును అవహేళన చేసేలా మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంను అడ్డుకునే యత్నం చేశారు. బైజూస్‌ను జగన్ జ్యూస్ అంటూ అసభ్యంగా మాట్లాడడానికి కూడా సిగ్గు పడలేదు. పైగా ఇప్పుడు కుప్పంలో తిరుగుతూ మీ పిల్లల భవిష్యత్తుకు, మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ కోసరం తాను పనిచేస్తానని పిట్టలదొర కబుర్లు చెబుతున్నారు. దీనిని ఎవరైనా నమ్ముతారా? 35 ఏళ్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సెంటర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆయన ఎందుకు బాగు చేయించలేకపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ స్కూల్‌ను నాడు-నేడు కింద బాగు చేయించారు. దానిని చంద్రబాబు కాదనగలరా! ఆయన ప్రభుత్వం నడిపిన రోజుల్లో ఏమనేవారో గుర్తుకు చేసుకోండి! విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, ప్రైవేటు రంగం పని అని చెప్పేవారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ఏమన్నారో చూడండి. ఈనాడు నీచ రాతలు ‘మన పిల్లలకు మనం ఇచ్చే సంపద విద్యే. ప్రతి ఒక్కరిని చదివించాలి. అందుకోసం ఎంతవరకైనా వెళతాం’ అని అంటారు. బోగస్ విజనరీ చంద్రబాబుకు, డెడికేటెడ్ పర్సన్ జగన్‌కు ఉన్న తేడా అది! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబును భుజాన ఎక్కించుకుని తిరిగే ఈనాడు మీడియా అయితే ఏకంగా పిల్లలకు టాబ్లు ఇస్తే వారు ఏవేవో చూసి పాడైపోతున్నారని నీచంగా రాసింది. దారుణమైన రీతిలో అసత్యాలు నిజానికి ఆ టాబ్ లలో విద్యకు సంబంధించిన కంటెంట్ తప్ప మరొకటి ఓపెన్ కావు. అయినా పచ్చి అబద్దాలతో, లేదా అజ్ఞానంతో ఈనాడు పేపర్ అలాంటి దిక్కుమాలిన రాతకు పాల్పడింది. అందుకే జగన్ ఒక సభలో ఈనాడు పత్రికను ప్రజలకు చూపించి ఛీ అంటూ విసిరికొట్టి బుద్ది చెప్పే యత్నం చేశారు. అయినా ఆ పత్రిక యాజమాన్యం తన వైఖరి మార్చుకోకపోగా, ఇంకా రెచ్చిపోయి దారుణమైనరీతిలో అసత్యాలు రాసి ప్రజల మీదకు వదులుతోంది. వాటిని తట్టుకుని జగన్ ముందుకు వెళుతున్నారు. విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి ప్రజలకు, ముఖ్యంగా పేదలకు వాటిని అందుబాటులోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేకించి ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నవారు అత్యధికం బలహీనవర్గాల పిల్లలు, ఇతర వర్ణాలలోని పేదలు మాత్రమే. వారికి విద్య రావాలని తపన పడడం జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. అందుకే ఇంత గొప్పగా విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనుకుంటే ఏపీలో విద్యారంగం వందేళ్లు వెనుకబడిపోతుందని ఫ్రొఫెసర్ రమేష్ అంటున్నారు. ఏపీ ప్రజలు విజ్ఞులే కాబట్టి తమ కోసం తపిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కాదనబోరని సర్వేలు కూడా చెబుతున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
వైద్యం.. కొత్త ముఖచిత్రం... నాలుగేళ్లలో విప్లవాత్మక సంస్కరణలు
మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారెవరైనా మనకు తారసపడినప్పుడో లేక ఫోన్ చేసినప్పుడో వినిపించే తొలి పదం ‘బాగున్నారా..’ అని. ఆ తర్వాతే మిగతా విషయాలు. అంటే ఆరోగ్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. అప్పుడే అన్ని పనులను సవ్యంగా చేసుకోగలమని.. దేన్నయినా సాధించుకోగలమనే నమ్మకం ఉంటుంది. దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా, దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే గొప్పగా వైద్య, ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతోంది. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, కొత్త వైద్య.. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తోంది. మన ఇంట్లో వారికే బాగోలేకపోతే ఎలాంటి వైద్యం కోరుకుంటామో అచ్చంగా అలాంటి వైద్యాన్నే ప్రజల ముంగిటకు తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలన్నీ శభాష్.. అనేలా విప్లవాత్మక సంస్కరణలతో ఈ రంగం ముఖ చిత్రాన్నే మార్చివేసింది. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరుకు చెందిన నాగమణెమ్మ ఎనిమిదేళ్ల క్రితం నరాల బలహీనత వ్యాధికి గురై మంచానికే పరిమితమైంది. భర్త గంగన్న, కొడుకు, కూతురు ఆమె బాగోగులు చూస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా ప్రస్తుతం నాగమణెమ్మ ఇంటి వద్దకు నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యుడు వస్తున్నాడు. ఆమెకు బీపీ చూసి, ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాడు. ఒకప్పుడు ఆసుపత్రికి పోవాలంటే ఆటో బాడుగకు తీసుకుని, ఇంట్లో వాళ్లు కష్టపడి తీసుకెళ్లేవాళ్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసలు తగ్గాయి. గతంలో వీలును బట్టి ఏదో ఒక ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు. ఒక్కోసారి ఒక్కో వైద్యుడి వద్దకు వెళ్లడంతో ఆమె ఆరోగ్య చరిత్రపై వారికి అవగాహన లేక మందులు, వైద్యం విషయంలో కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఒకే వైద్యుడు క్రమం తప్పకుండా నాగమణెమ్మకు వైద్యం అందిస్తుండటంతో ఆ ఇబ్బందులేవీ లేవు. ప్రస్తుతం ఇలా ఊరూరా వైద్య సేవలందించేలా ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించడానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాక్షి, అమరావతి : ప్రస్తుతం చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ, సీహెచ్‌సీ, పెద్దాస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. గ్రామాల్లోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్స్‌కు 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు చూశాక, మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల గృహాలను సందర్శించి వారికి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఈ విధానంలో రాష్ట్రంలోని 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలలో రెండు సార్లు పీహెచ్సీ వైద్యులు సందర్శిస్తున్నారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. టెలిమెడిసన్ కన్సల్టేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది. ఏ రోగికైనా మెరుగైన వైద్యం అవసరం అని భావిస్తే.. ఇక్కడి నుంచే పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తారు. ఆ రోగిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించడం, అక్కడ అతనికి వైద్యం అందేలా చూడటం వంటి కార్యకలాపాలను సీహెచ్‌వో, ఏఎన్ఎం చూస్తారు. వీరు విలేజ్ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. 1.17 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ విధానం ట్రయల్ రన్‌ను గత ఏడాదిలో ప్రారంభించి.. ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన పూర్తి స్థాయిలో అమలులోకి తెచ్చారు. 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. ఈ క్రమంలో 1,17,08,895 వైద్య సేవలు అందించారు. నాడు–నేడుతో మహర్దశ ఇది 2019కు ముందు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీ. నెర్రెలు చీలిన ప్రహరీ.. పిచ్చి మొక్కలు, గడ్డితో కూడిన ఆవరణ.. అపరిశుభ్ర వాతావరణం, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి. ఇక్కడికి రావాలంటేనే రోగులు వణికిపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఆస్పత్రిలో నాడు–నేడు కింద పనులు చేపట్టింది. కుర్చీలు, ఓపీ గదులు, 10 పడకలతో ఇన్ పేషెంట్ వార్డు, కాన్పుల గది ఇలా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చూపించుకోవడానికి జనం క్యూ కడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వాటికి శాశ్వత భవనాలు సమకూర్చే దిశగా అడుగులు వేశారు. 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటికే సొంత భవనాలు ఉన్న వాటికి మరమ్మతులు చేయడంతో పాటు, పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తుండగా 882 చోట్ల పనులు పూర్తయి అధునాతనంగా ఆస్పత్రులు తయారయ్యాయి. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్ ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. రూ.50 కోట్లతో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ వైద్యులు, సిబ్బందిని నియమించారు. ప్రభుత్వ కృషి ఫలితంగా 443 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్వాష్) గుర్తింపుతో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. గుజరాత్, కేరళ, హరియాణా, తెలంగాణలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన ప్రసూతి సేవలకు గాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపులో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ ఉంది. వైద్య విద్యలో నవశకం రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు చేపట్టాలని లక్ష్యం నిర్దేశించుకోగా, ఇప్పటికే నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం కళాశాలలకు అనుమతులు వచ్చాయి. రాజమండ్రి వైద్య కళాశాలకు త్వరలో అనుమతి రానుంది. ఫలితంగా ఒక్కో చోట 150 సీట్లు చొప్పున 750 సీట్లు పెరగనున్నాయి. 2024–25లో పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు.. ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావుండదు. ప్రజలకు ఆరోగ్యశ్రీ రక్ష సీఎం జగన్.. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశారు. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తేవడం ద్వారా 1.4 కోట్లకు పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 3,255కు పెంచారు. పేద, మధ్యతరగతి ప్రజలు శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని కింద 1519 రకాల ప్రొసీజర్లలో చికిత్స అనంతరం వైద్యుడు సూచించిన విశ్రాంతి సమయానికి రోజు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.ఐదు వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పథకాల కోసం ప్రభుత్వం రూ.8,302.47 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా 36,19,741 మంది, ఆసరా ద్వారా 16,20,584 మంది లబ్ధి పొందారు. ఇంకా ఎన్నెన్నో సేవలు ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ), 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున 104, 108 వాహనాలను సమకూర్చారు. 768 అంబులెన్స్‌లతో 2020లో సేవలను విస్తరించారు. తాజాగా మరో 146 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నారు. రోజుకు సగటున 3300 మంది అంబులెన్స్ సేవలను ప్రస్తుతం వినియోగించుకుంటున్నారు. 104 ఎంఎంయూలను ప్రారంభంలో మండలానికి ఒకటి చొప్పున 676 వాహనాలను సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి సచివాలయాన్ని రెండు సార్లు నెలలో 104 ఎంఎంయూలు సందర్శించేలా మరో 256 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ► గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 500 కొత్త వాహనాలతో ‘డాక్టర్ వైఎస్సార్ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్’ సేవలను విస్తరించారు. రోజుకు సగటున 631 మంది బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా విలేజ్ క్లినిక్స్‌లో 105, పీహెచ్‌సీల్లో 172, సీహెచ్‌సీ ఏరియా ఆస్పత్రుల్లో 330 రకాల మందులను సమకూరుస్తున్నారు. బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు రోగులకు పెట్టే ఆహారం విషయంలోను నాణ్యత ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంది. నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసించాయి. దేశంలో మధ్య తరగతి వర్గాలకు ఆరోగ్యబీమా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ అని ‘హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఇండియాస్ మిస్సింగ్ మిడిల్ క్లాస్’ పేరుతో రూపొందించిన నివేదికలో నీతి ఆయోగ్ తెలిపింది. ► క్షయ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న టాప్–3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ► దేశంలో వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న రాష్ట్రం ఏపీ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు నివేదికల్లో స్పష్టం చేసింది. ► హెపటైటిస్ నియంత్రణలో ఏపీ చర్యలు భేష్‌గా ఉంటున్నాయని కేంద్ర వైద్య శాఖ ప్రశంసిచింది. హైరిస్క్ వర్గాలకు ముందస్తుగా టీకా పంపిణీ చేపడుతున్న రాష్ట్రంగా కూడా రికార్డు సాధించింది. కొరతకు తావు లేకుండా.. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటికి ఏకంగా 48,639 పోస్టులు భర్తీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఖాళీ అయ్యే పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా ప్రభుత్వం అత్యవసర అనుమతులు ఇచ్చింది. దేశంలో స్పెషాలిటీ వైద్యులు కొరత ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61 శాతం మేర ఉండగా, ఏపీలో కేవలం 5 శాతం మేర ఉంటోంది. గైనకాలజిస్టుల సంఖ్య జాతీయ స్థాయిలో కొరత 50 శాతం ఉంటే, ఏపీలో 1.4 శాతం మాత్రమే ఉంది. స్టాప్నర్స్ల కొరత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో కొరతకే ఆస్కారం లేదు. ఫలితంగా డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు మించి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4,469 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సగటున రోజుకు 1,360 సర్జరీలు బోధనాస్పత్రుల్లో 2018–19లో సగటున రోజుకు 817 మైనర్, మేజర్ ఆపరేషన్లు నిర్వహించే వారు. 2022–23లో రోజుకు 1360 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అప్పట్లో రోజుకు 19 వేల చొప్పున ఓపీలు, 1900 మేర ఐపీలు ఉండగా, గత ఏడాది 22 వేలకు పైగా ఓపీల చొప్పున 83.16 లక్షలు, ఐపీలు రోజుకు 2,253 చొప్పున 8.22 లక్షలు నమోదు అయ్యాయి. నాటికి, నేటికి ఎంత తేడా! కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2019కి ముందు ఒక డాక్టర్, ఆరుగురు నర్సులు, ముగ్గురు టెక్నికల్ సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఉన్న ఒక్క వైద్యుడు సెలవు పెడితే అంతే సంగతులు. సీటీ సర్జన్ ఆపరేషన్ చేసే సమయంలో గుండె నుంచి రక్త ప్రసరణ నిలిపివేసి, మెషిన్ ద్వారా ఇతర శరీర భాగాలకు రక్తం సహా ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన మిషన్‌ను పర్ఫ్యూజనిస్ట్లు ఆపరేట్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన పోస్టు అప్పట్లో ఖాళీగా ఉండేది. దీంతో హైదరాబాద్ నుంచి కేసుల ప్రాతిపదికన పర్ఫ్యూజనిస్ట్ను పిలిపించుకుని సర్జరీలు చేసేవారు. అత్యవసర సమయాల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోయేవారు. దీంతో 2017–18లో ఈ విభాగంలో 120 సర్జరీలు మాత్రమే చేశారు. ఓపీలు నెలకు 80లోపే చూసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ విభాగంలో అదనంగా ముగ్గురు వైద్యులు, నలుగురు నర్సులు, ముగ్గురు టెక్నీషియన్లు రావడంతో పాటు పర్ఫ్యూజనిస్ట్ పోస్టు భర్తీ అయింది. దీంతో 2022–23లో ఏకంగా 1600 ఓపీలు నమోదు అయ్యాయి. మేజర్, మైనర్ కలిపి 566 సర్జరీలు చేశారు. మొత్తంగా 1500 పడకలున్న ఈ ఆస్పత్రిలో 2018–19లో 9.46 లక్షల ఓపీలు, 80 వేల ఐపీ, 29 వేల మైనర్, మేజర్ సర్జరీలు నమోదయ్యాయి. 2022–23లో 12 లక్షల మేర ఓపీ, లక్షకుపైగా ఐపీ సేవలు అందించడంతో పాటు, 41 వేల సర్జరీలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దాస్పత్రుల్లో పరిస్థితి మెరుగైంది. అనుబంధం ఏర్పడుతుంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ చర్యలపై సరైన అవగాహన లేదు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ వైద్యుడే నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడం మంచి పరిణామం. గర్భిణి, బాలింత.. బీపీ, మధుమేహం వ్యాధిగ్రస్తులను రెండు, మూడు సార్లు చూస్తే వైద్యుడు వారిని పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో ఆ వైద్యుడికి ప్రజలకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఇది రోగికి మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ మానసిక బలం రోగి త్వరగా కోలుకోవడానికి ఎంతో ఉపయోగకరం. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ ప్రజారోగ్య రక్షణలో మంచి ఫలితాలు బీపీని నియంత్రణలో ఉంచుకోకపోవడంతో ప్రస్తుతం 20 శాతం పెరాలసిస్ కేసులు వస్తున్నాయి. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నారు. మన దగ్గర 60 శాతం గ్రామీణ జనాభా ఉంది. గ్రామాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల కోసం 10–20 కి.మీ ప్రయాణించి చూపించుకోవడం వారికి అయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైద్యుడే ఆయా గ్రామాలకు వెళ్లడం ప్రజారోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. భవిష్యత్‌లో గుండెపోటు, కిడ్నీ, మెదడు జబ్బుల బారినపడే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్స్‌లర్, వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం -
‘Andhra Pradesh: ఉన్నత’ వైద్యం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో 48 వేలకుపైగా వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో గ్రామాల్లోనే వైద్య సేవలందిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరత అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడంపై దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ఒక్కో ఆస్పత్రిని యూనిట్‌గా తీసుకుని క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో మానవ వనరులపై ఆడిట్ చేపట్టాలని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల పురోగతి, కరోనా తాజా పరిస్థితులను పరిశీలించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిబ్బందిపై ప్రతి సమీక్షలోనూ వివరాలివ్వాలి.. ప్రభుత్వాస్పత్రులను నాడు – నేడు ద్వారా తీర్చిదిద్దడం ద్వారా ప్రజల్లో భరోసా ఏర్పడింది. రోగుల తాకిడికి సరిపడా నియామకాలను చేపడితే సగం సమస్యలకు తెర పడుతుంది. మానవ వనరులపై ఆడిట్ నిర్వహించిన అనంతరం గుర్తించిన ఖాళీలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెంటనే భర్తీ చేయాలి. అవసరం మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు మందులు సరిపడా స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అనే అంశాలపై ప్రతి సమీక్షలోనూ నాకు వివరాలు అందచేయాలి. పకడ్బందీగా ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ (ఎఫ్పీసీ) అత్యంత పకడ్బందీగా అమలు కావాలి. నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) మేరకు వైద్యులు గ్రామానికి వెళ్లి సేవలు అందించాలి. జీవనశైలి జబ్బుల బాధితులను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ ఫలానా గ్రామానికి ఫలానా రోజు వస్తారనే వివరాలను ముందుగానే వెల్లడించాలి. ఆయా తేదీల్లో గ్రామానికి డాక్టర్ వస్తున్నట్లు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలందరికీ తెలియచేయాలి. దీనివల్ల డాక్టర్ వద్దకు వచ్చి వైద్య సేవలు పొందగలుగుతారు. ఎఫ్పీసీని మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేలా జిల్లాల్లో సమర్థులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. రక్తహీనత నివారణ.. నేత్ర పరీక్షలు గర్భిణులు, చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ ద్వారా ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలి. రక్త హీనతతో బాధపడే గర్భిణులను గుర్తించి తప్పనిసరిగా పౌష్టికాహారం అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనే క్రమం తప్పకుండా కంటి పరీక్షలు కూడా నిర్వహించాలి. ఈమేరకు కంటి డాక్టర్లకు షెడ్యూల్ రూపొందించి నెల, రెండు నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయాలి. దృష్టి సంబంధిత సమస్యలున్న వారికి కంటి అద్దాలు ఇవ్వాలి. ఎమర్జెన్సీ సీపీఆర్‌పై శిక్షణ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను (సీహెచ్‌వో) విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయాలి. ఇందుకోసం ప్రత్యేక కరిక్యులమ్‌ను సిద్ధం చేయాలి. సీహెచ్‌వోలకు సరఫరా చేసే వైద్య పరికరాల వినియోగంపై బోధనాసుపత్రుల్లో శిక్షణ ఇవ్వాలి. వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో సమీక్షించాలి. దంత సంరక్షణ, ఈఎన్టీ, వృద్ధాప్య సమస్యలతోపాటు సీపీఆర్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వైద్య సేవలు అందించాలో శిక్షణ ఇప్పించాలి. వీటితోపాటు గ్రామాల్లో పాము కాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా శిక్షణ ఉండాలి. 5 కొత్త మెడికల్ కాలేజీలు ఈ ఏడాదే రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై సీఎం జగన్ తాజాగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఏకంగా మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వివరించారు. 2023–24 విద్యాసంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని కొత్త మెడికల్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 2024–25లో మరో 350 మెడికల్ సీట్లు అదనంగా రాబట్టేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యేలా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తద్వారా మరో 1,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. 23 రోజుల్లో 20.25 లక్షల మందికి వైద్య సేవలు ఏప్రిల్ 6వతేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో ప్రారంభం కాగా గత నెల 28 నాటికి గ్రామాల్లో 20,25,903 మందికి వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. రక్తపోటుతో 4.86 లక్షల మంది, మధుమేహంతో 2.70 లక్షల మంది బాధ పడుతుండగా 4.43 లక్షల మంది ఈ రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్యం, మందులు అందజేస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్ బాధితులు 4,649 మంది, ఛాతీ క్యాన్సర్ బాధితులు 1,761 మంది, గర్భాశయ క్యాన్సర్ బాధితులు 7,042 మంది గ్రామాల్లోనే వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. పూర్తిగా అదుపులో కోవిడ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా అదుపులో ఉందని, గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులను బట్టి దేశంలో 23వ స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. 24 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ఫీవర్ సర్వేను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్‌లో 20 ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. 14 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు పని చేస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో టెస్టులు చేస్తున్నామని, మందులు, మాస్క్‌లు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, డీఎంఈ డాక్టర్ నరసింహం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి, నాడు–నేడు టెక్నికల్ డైరెక్టర్ మనోహరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి. కానీ... రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్ కథనాలు. జూనియర్ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమారయ్యేది. ఇంటర్ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!. ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్‌లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. ఫలితాన్నిచ్చిన పథకాలు... ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... జీఈఆర్ పెంచిన అమ్మ ఒడి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది. నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్‌లో ఒక స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్‌బుక్‌లు ఇంగ్లీష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్‌తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? అది.. ఆడపిల్లల గౌరవం సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్ వాటర్ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్ నిర్వహణ నిధిని (ఎస్ఎంఎఫ్) ఏర్పాటు చేశారు. ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్ (ఆర్ఎల్సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్‌తో కలిసి టీచర్లు స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. వినూత్నంగా డిజిటల్ తరగతులు... పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన 15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్ తరగతులతో పిల్లలకు నాణ్యమైన ఈ–కంటెంట్... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది. మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు ప్రభుత్వం 2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే తెలుగుదేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో ఒకటి హైస్కూల్‌ను అప్‌గ్రేడ్ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్ జూనియర్ కాలేజీలనూ బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలేదంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు.. ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్ అయ్యేవారు. చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థినులకు సరైన సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యాకానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్‌తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’ ‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి. హాజరు పెంచిన ‘గోరుముద్ద’ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అందించేలా చేశారు. వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్‌ఫాస్ట్‌గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను అందించాలని కూడా ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. డిజిటల్ లెర్నింగ్... కొత్త చరిత్ర కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్ రీడ్ ఎలాంగ్ పీఎఎల్, బైజూస్ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్ లెర్నింగ్‌కు పనికొస్తాయి. తరవాత ఇంటర్మీడియెట్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్ వంటి ఎడ్యుటెక్ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది. -
వేసవి సెలవుల్లోనూ మనబడి నాడు–నేడు
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమానికి నిధుల కొరత లేదని, స్కూళ్లకు ఎండాకాలం సెలవులను సద్వినియోగం చేసుకుంటూ రెండో దశ పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో రూ.734.21 కోట్లు ఉన్నాయని, తదుపరి ఖర్చుల కోసం మరో రూ.1,400 కోట్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన బడి నాడు – నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. జూన్ 12 లోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్ల బిగింపు ఐఎఫ్‌పీ పానెళ్లను బిగించడం ద్వారా 15,715 స్కూళ్లలో మొదటి విడత నాడు– నేడు పనులు పూర్తైనట్లు అవుతుంది. దీంతో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి 30,230 క్లాస్‌రూమ్స్‌లో డిజిటలైజేషన్ పూర్తవుతుంది. జూన్ 12వతేదీ లోగా ఐఎఫ్‌పీ ప్యానెళ్ల బిగింపు పూర్తి కావాలి. రెండో దశలో 16,461 స్కూళ్లలో నాడు– నేడు చేపడుతున్నాం. ఫేజ్ – 3లో సుమారు మరో 13 వేల స్కూళ్లలో నాడు– నేడు ద్వారా పనులు జరుగుతాయి. వేసవి సెలవుల్లో పనులపై దృష్టి పెట్టాలి మూడు విడతల్లో దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు పనులు పూర్తవుతాయి. వేసవి సెలవుల్లో పనులు చేయడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఈ సమయాన్ని పనుల కోసం బాగా వినియోగించుకోవాలి. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. తొలి విడతలో ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దాలి మొదటి విడతలో నాడు– నేడు పనులు చేపట్టిన పాఠశాలలపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టాలి. ఎక్కడైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దాలి. ఇంత పెద్ద సంఖ్యలో స్కూళ్లలో పనులు చేపడుతున్నాం. నాణ్యత లోపించకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలి. పేరెంట్స్ కమిటీ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇసుక, సిమెంట్, స్టీలు లాంటివి కొరత లేకుండా పంపిణీపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. తద్వారా పనుల్లో ఆలస్యం జరగకుండా నివారించవచ్చు. ట్యాబ్‌లు బాగున్నాయా? 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి సుమారు 5,18,740 ట్యాబ్‌లు ఇచ్చాం. వీటి ద్వారా విద్యార్థులకు ప్రయోజనం అందేలా చూడాలి. అవి సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలి. సమస్యలుంటే ఏం చేయాలో ఎస్‌వోపీలు రూపొందించాం. హెడ్మాస్టర్కు గానీ స్థానిక సచివాలయాల్లో గానీ అందచేస్తే మూడు రోజుల్లోగా రిపేరు చేసి తిరిగిస్తారు. ఈ మేరకు ఎస్వోపీల అమలుపై కలెక్టర్లు పర్యవేక్షించాలి. నెలకోసారి డిజిటల్ డే గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు, పిల్లలకు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. నెలకోసారి తప్పనిసరిగా డిజిటల్ డే పాటిస్తూ వారు స్కూళ్లకు వెళ్తారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబుల వినియోగంపై అవగాహన కల్పించడం, వినియోగించడంపై శిక్షణ ఇస్తారు. జూన్ 12న స్కూళ్లు తెరవగానే ‘విద్యాకానుక’ స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుస్తారు, అదే రోజు వారికి జగనన్న విద్యాకానుక అందించాలి. ఇందులో ఎలాంటి ఆలస్యానికి తావు ఉండకూడదు. దాదాపు 43.10 లక్షల మందికి జగనన్న విద్యాకానుక అందుతుంది. విద్యాకానుక పంపిణీపై ప్రోటోకాల్‌ను పాటించాలి. విద్యాకానుక ద్వారా అందించే వస్తువుల క్వాలిటీపై కూడా బెస్ట్ ప్రోటోకాల్ పాటించాలి. బై లింగ్యువల్ (ద్విభాషా) పాఠ్య పుస్తకాలు, మూడు జతల యూనిఫామ్, నోట్‌బుక్స్, బ్యాగ్, షూ, రెండు జతల సాక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బెల్టు, వర్క్‌బుక్స్‌తో కూడిన కిట్ నాణ్యతను పిల్లలకు అందించే ముందు కచ్చితంగా పరీక్షించాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను మానిటరింగ్ చేయాలి. జగనన్న విద్యాకానుకపై ఏ ఒక్క స్కూలు, ఏ విద్యార్థి నుంచి నాకు ఫిర్యాదులు రాకూడదు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్లు పిల్లలకు విద్యాకానుక అందించాలి. గతంలో పుస్తకాలు సమయానికి ఇచ్చేవారు కాదు. అక్టోబర్, నవంబర్ నెలలొచ్చినా పిల్లలకు అందేవి కావు. నా పాదయాత్ర సమయంలో ఆ ఇబ్బందులు నేను స్వయంగా చూశా. మనం వచ్చాక పాఠశాలలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాం. మొత్తం వ్యవస్థలో మార్పులు తీసుకునివచ్చాం. పాఠశాలల్లో నైట్ వాచ్మెన్లను నియమించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసు అధికారులు దృష్టిపెట్టాలి. ప్రతి యూనివర్సిటీ, కాలేజీల్లో ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రదర్శిస్తూ పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. జిల్లాల పోలీసు కార్యాలయాల్లో ప్రత్యేక డివిజన్‌ను సిద్ధం చేయాలి. విద్యాసంస్థల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నిరంతరం సమాచారం సేకరించాలి. పిల్లలు వాటి బారిన పడకుండా కౌన్సెలింగ్ నిర్వహించాలి. మాదక ద్రవ్యాల తయారీదారులు, రవాణా, పంపిణీదారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 15 వేల మందికిపైగా మహిళా పోలీసుల (మహిళా సంరక్షణ కార్యదర్శులు) సేవలను సమర్థంగా వినియోగించాలి. (చదవండి: పేపరు మీద లెక్కలు.. చూస్తే బోగస్ సంస్థలు!) -
‘నాడు–నేడు రెండో దశ’ జూన్ 12లోగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు రెండో దశ పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యా శాఖ అధికారులకు పాఠశాలల మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మన బడి నాడు–నేడు కింద రూ.8,000 కోట్ల అంచనా వ్యయంతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్కూళ్లల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం పనులు మినహా పై కప్పు, సీలింగ్, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల మరమ్మతులు, నిర్మాణాలు, ఫర్నీచర్ సరఫరా–ఏర్పాటు, పెద్ద, చిన్న రిపేర్లను జూన్ 12లోగా పూర్తి చేసి స్కూళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే బాధ్యతలను సంబంధిత హెడ్మాస్టర్లకు అప్పగించాలని సూచించారు. నాడు–నేడు కోసం కొనుగోలు చేసిన మెటీరియల్‌ను హెడ్మాస్టర్లతో పాటు తల్లిదండ్రుల కమిటీలు తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు చేసిన మెటీరియల్ నాణ్యత లేకపోయినా, తక్కువ సరఫరా చేసినా హెడ్మాస్టర్ తిరస్కరించాలని ఆదేశించారు. స్కూళ్ల పై కప్పుల మరమ్మతుల ఫొటోలను దశల వారీగా హెడ్మాస్టర్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. తరగతి గదుల్లో మెటీరియల్ నిల్వ ఉంచినప్పుడు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మెటీరియల్‌ను సురక్షితంగా నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అదనపు వ్యయం అయినా హెడ్మాస్టర్లు లేదా సంబంధిత అధీకృత ప్రతినిధి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ హెడ్మాస్టర్లకు తెలియజేసి అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు. -
ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్ వాచ్మన్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని 2020–21 నుంచి మిషన్ మోడ్‌లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, ప్రహరీ, కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది. ఫేజ్–1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్–2 కింద 22,228 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్–3లో అభివృద్ధి చేస్తారు. ఇదేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు–నేడు ఫేజ్–2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ)లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు. నాడు–నేడు ఫేజ్–1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్‌పీలలోని కంటెంట్‌తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది. వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మన్లను నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్ రెసిడెన్షియల్ (నివాసేతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ్‌మన్‌ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధిమీనా మెమో విడుదల చేశారు. నైట్ వాచ్‌మన్ విధులు ► పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. ► పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి. ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. ► రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన æభవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి. ► పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. ► ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్ మాస్టర్‌కు, సమీప పోలీస్ స్టేషన్‌కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి. ► సాయంత్రం పాఠశాల గార్డెన్‌కు నీరు పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్‌ను శుభ్రం చేయాలి. ► పాఠశాలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురావడం, వాటిని హెచ్ఎంకు అందించడం చేయాలి. ► స్కూలుకు సంబంధించి హెచ్ఎం చెప్పే ఇతర పనులను చేయాలి. ► నైట్ వాచ్‌మన్ పనిని హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ► 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. ► నైట్ వాచ్‌మన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్మాస్టర్ ఐఎంఎంఎస్ యాప్ ద్వారా చేపట్టాలి. ► వాచ్మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలి. మార్గదర్శకాలు.. ► పేరెంట్ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్ వాచ్‌మన్‌ను నియమించాలి. ► ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్ కమ్ హెల్పర్ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ► గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ► వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు. ► నైట్ వాచ్‌మన్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి. ► ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి. ► వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. ► ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. ► ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి చెల్లించాలి. -
బాబుకు స్క్రిప్టు కోసమే! మనబడి నాడు–నేడుపై ‘ఈనాడు’ కబోది కథనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగు పడుతుంటే ఆనందించాల్సింది పోయి.. అదెక్కడ టీడీపీ కొంప ముంచుతుందోనని ‘ఈనాడు’ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దుతుండటం కళ్లెదుటే కనిపిస్తున్నా, లేదు లేదంటూ ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేస్తోంది. నాడు–నేడు రెండో దశ కింద ఏకంగా 22,344 స్కూళ్లలో పనులు జరుగుతుంటే.. అక్కడెక్కడో పనులు ఆగిపోయాయని యాగీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం చాక్‌పీస్‌లకు కూడా గతిలేని వైనాన్ని మరచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. వేల కోట్ల రూపాయలతో ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా దిగజారుడు రాతలు రాస్తోంది. ప్రజలేమనుకుంటారోనన్న భయం లేకుండా తన చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉవ్విళ్లూరుతూ రోజుకో రీతిలో తప్పుడు కథనం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం అనూహ్య రీతిలో అద్భుత ఫలితాలిస్తోందని వేనోళ్లా ప్రశంసలు వ్యక్తమవుతుండటాన్ని జీర్ణించుకోలేని రామోజీ రావు ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ‘నాడు–నేడుకు నిధుల్లేవ్’ అంటూ తాజాగా తన అక్కసు వెళ్లగక్కింది. ఒక్క అధికారితో మాట్లాడకుండా, విద్యా శాఖ నుంచి వివరాలు తీసుకోకుండా తనకు తోచిన లెక్కలతో బాబుకు స్క్రిప్టు అందిస్తోంది. ఆరోపణ: నాడు–నేడుకు నిధులు లేవు వాస్తవం: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పేదల బతుకులు మార్చే ఏకైక సాధనం విద్య మాత్రమే అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమంతో పాటు, మరెన్నో సంస్కరణలు, గొప్ప గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ప్రభుత్వ విద్యా రంగంపై ఇంతటి వ్యయం కాని, దృష్టి కాని ఎన్నడూ.. ఎవ్వరూ పెట్టలేదు. మన బడి నాడు – నేడు మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,713 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, 2021–22లో పూర్తి చేశారు. 2021–22లో 22,344 విద్యా సంస్థల్లో రూ.8,000 కోట్లతో రెండవ దశ పనులు చేపట్టారు. విద్యా రంగం నాడు–నేడు ఇదీ పరిస్థితి ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఐదేళ్లపాటు పాఠశాలల్లో అభివృద్ధి కోసం రూ.1,709.64 కోట్లు మాత్రమే కేటాయించారు. అవీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2014–2019 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రూ.76.85 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్–1, ఫేజ్–2లో చిత్తూరు జిల్లాకు ఏకంగా రూ.1,133.09 కోట్లు కేటాయించింది. ఫేజ్ –1 కింద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ► రూ.668 కోట్లతో ట్యాబులను, రూ.778 కోట్ల విలువగల బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేశారు. ► 5,800 పాఠశాలలకు 6వ తరగతిపైన ఉన్న 30,302 తరగతి గదులకు డిజిటల్ బోర్డు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) 2023 జూన్ నాటికే అందించేలా సన్నాహాలు చేపట్టారు. దిగువ తరగతులు ఉన్న స్కూళ్లకు అంటే, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలలో 10 వేల స్మార్ట్ టీవీలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈపథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తోంది. 2019–20లో 42,33,098 మంది, 2020–21లో 44,48,865, 2021–22లో 43,96,402 మంది తల్లులకు సాయం అందించారు. ► రాష్ట్రంలోని లోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రవేశ పెట్టారు. 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలను ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో, ద్విభాషా విధానంలో రూపొందించారు. 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్ లను ప్రవేశపెట్టారు. ► ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంచడం కోసం ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు చిత్రాలతో కూడిన డిక్షనరీ ఇస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నారు. విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్‌లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు 3, 4, 5 తరగతులకు ఇంటర్మీడియట్, డీఎడ్ మాత్రమే విద్యార్హతలుగా ఉన్న ఉపాధ్యాయులు బోధించేవారు. ఇప్పుడు, ఈ తరగతులకు బీఎస్సీ, బీఈడీ అర్హతలున్న ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వం 10,114 మంది సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. ► జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రు.2323.99 కోట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి స్కూలు ప్రారంభం రోజు 3 జతల బట్టలు, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ, టెక్స్ బుక్స్, తదితరాలను ఇస్తోంది. 2016–17లో ప్రభుత్వ బడులలో 37,57,474 విద్యార్థులు ఉండగా, ఈ కార్యక్రమాలన్నింటి వల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరోపణ: రంగులు వెలుస్తున్నాయి వాస్తవం: పనులే జరగలేదని చెబుతున్న ఈనాడు రంగులు వెలిసిపోతున్నాయని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, చిన్న, పెద్ద మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, ప్రహరీ, ఫర్నీచర్, క్యాంపస్ మొత్తానికి పెయింటింగ్, గ్రీన్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ (స్మార్ట్ టీవీలు), కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు) ఇలా 12 రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వేలాది స్కూళ్లలో ఇంతగా మేలు చేస్తుండటం రామోజీరావుకు కనిపించడం లేదు కాబోలు. రంగులు ఎక్కడ వెలిసిపోయాయో చెప్పకుండా, చూపకుండా ఆవు కథ రాశారు. ఆరోపణ : రూ.1,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి వాస్తవం: మన బడి నాడు – నేడు రెండవ దశ కింద రూ.8,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.3,750 కోట్లు విడుదల చేశారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయనే కనీస పరిజ్ఞానం లేని వారెవరూ ఉండరు. ఈనాడు చెబుతున్న రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు గత నెలవి అయ్యుంటాయి. అవి ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో విడుదలవుతాయి. రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉంటే.. మొత్తం నాడు–నేడు కార్యక్రమమే ఆగిపోయినట్లు తప్పుడు రాతలు రాయడం చంద్రబాబు కోసమే కదా! ఆ తప్పుల తడక చిట్టా పట్టుకుని చంద్రబాబు ఊదరగొట్టాలనేగా! ఈ లెక్కన బిల్లులు రావని కాంట్రాక్టర్లలో భయం పెంచి, ఎలాగైనా సరే ఆ పనులు ఆపేయించాలన్నది రామోజీ పన్నాగం అని స్పష్టమవుతోంది. ఇది నిజం కాకపోతే రూ.3,750 కోట్లు చెల్లించారనే వాస్తవాన్ని ఎందుకు రాయలేదు రామోజీ? ఆరోపణ : విద్యార్థుల అవస్థలు వాస్తవం: పెద్ద ఎత్తున్న పనులు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న పాటి అసౌకర్యాలు సహజం. దాన్ని కూడా భూతద్దంలో చూపడం దారుణం. ఈనాడు చెబుతున్నట్లు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోనూ పిల్లలు ఇబ్బంది పడటం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసినా, తూతూమంత్రంగా నిధులు విదిలించినా ఒక్క మాటా రాయని ఈనాడు నేడు వేల కోట్లతో అన్ని విద్యా సంస్థలనూ సర్వాంగ సుందరంగా మారుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. -
ఏపీలో విద్యారంగం అద్భుతం
► ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు.. ► ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. (గుంటూరులో ప్రపంచ ప్రఖ్యాత ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ ప్రశంసల వర్షం) సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ మంత్రముగ్థులయ్యారు. ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన ఫిదా అయ్యారు. గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థినులకు లక్ష్యసాధన, దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముఖాముఖీగా మాట్లాడారు. ఆ తర్వాత సాయంత్రం బీఆర్ స్టేడియంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలతో పాటు నగరంలోని వివిధ మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన వేలాది మంది టెన్త్ విద్యార్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, చేపడుతున్న కార్యక్రమాలపై మరోమారు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతో అంకితభావం ఉన్న ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండటం అభినందనీయమంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. అలాగే, ‘నేను ప్రపంచవ్యాప్తంగా 78 దేశాలలో పర్యటించా. కానీ ఏ దేశంలో లేని అనుభూతి, ప్రత్యేకతను నేను గుంటూరులో పొందాను. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఎంతోమంది నన్ను హీరో అని పిలిచి ఉండవచ్చు.. కానీ, అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇక్కడ పొందాను. వెలకట్టలేని విద్యకు, విజ్ఞానానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంతో మంచి పాలకుడు మీకు ఉన్నారు. అంకితభావం ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉంది. గుంటూరు ప్రాంతం విజ్ఞానం, విద్య పరంగా ఎంతో సామర్థ్యం ఉన్న ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కలిశాను. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎంతో కలవబోవడం ఎంతో ప్రత్యేకానుభూతిగా ఉంది’.. అంటూ నిక్ తన అనుభూతిని పంచుకున్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. విద్యార్థిని ట్యాబ్‌ను పరిశీలిస్తూ.. పాఠ్యపుస్తకంలో నిక్‌పై పాఠం ఇది సామాన్యమైన విషయం కాదు.. ఏపీలోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థినులు నేను మాట్లాడిన ఫారిన్ ఇంగ్లిష్ భాషాశైలిని అర్థంచేసుకుని, అంతేస్థాయిలో ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడిన తీరు ఎంతో అద్భుతం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత గొప్పగా ఉంటాయని నేను ఊహించలేదు. కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో ఒక ప్రభుత్వ పాఠశాల సకల హంగులతో ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులను ఇంత గొప్ప ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం సామాన్య విషయం కాదు. నా జీవితగాధపై పాఠ్యాంశమా!? రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 10వ తరగతి ఇంగ్లిషు టెక్ట్స్‌బుక్‌లోని మొదటి పాఠ్యాంశంగా ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్లో ‘ఆటిట్యూడ్ ఆల్టిట్యూడ్’ పేరుతో తన జీవితగాధను ముద్రించడం ఆశ్చర్యకరం. పాఠ్యాంశంగా నాకు చోటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మీ పాఠ్య పుస్తకంలో రాసిన నా జీవితం గురించి చదివారా? (మీ గురించి చదివామని విద్యార్థులు చెప్పగా, ఆయన ఆంతులేని ఆనందానికి లోనయ్యారు.) నాడు–నేడుతో పాఠశాల రూపం మార్చేశారు.. నిక్ వుజిసిక్తో టెన్త్ విద్యార్థిని సాజిదా మాట్లాడుతూ.. ‘నేను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన చలువతో మా పాఠశాలలో అన్ని రకాల వసతులతో చదువుకుంటున్నాం. జగనన్న విద్యాకానుక కిట్లు, గోరుముద్ద, ఇంగ్లిషు మీడియంతో నేను ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన మీతో ఆంగ్లంలో ఇలా మాట్లాడగలుగుతున్నాను.. వైఎస్ జగన్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాను’. (ఆత్మవిశ్వాసంతో సాజిదా చెప్పిన మాటలకు నిక్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.) నాడు–నేడుతో ‘కార్పొరేట్’ను తలదన్నేలా.. మరో విద్యార్థిని డి. శిరీష మాట్లాడుతూ.. ‘ఇంగ్లిష్ టెక్ట్స్బుక్లో మీ బయోగ్రఫీ చదివి స్ఫూర్తి పొందా. ప్రపంచం మెచ్చే మోటివేషనల్ స్పీకర్‌గా ఎదిగిన తీరుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాడు–నేడుకు ముందు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంతో దుర్భరంగా ఉండేది. సరిపడా తరగతి గదుల్లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయితే, జగన్ మావయ్య సీఎం అయిన తరువాత నాడు–నేడు ద్వారా కల్పించిన వసతులతో మేం కార్పొరేట్ పాఠశాలలను మించిన స్థాయిలో ఆధునిక తరగతి గదులు, నూతన ఫర్నిచర్‌పై కూర్చుని తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుత్ లైట్ల మధ్య ఏకాగ్రతతో చదువుకునేందుకు అవకాశం కలిగింది. జగనన్న విద్యాకానుక కిట్‌తో ఉచిత పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పొందడంతో పాటు 8వ తరగతిలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబుల్లో నాణ్యమైన బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన తీరు అద్భుతం’.. అంటూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శిరీష నిక్ దృష్టికి తెచ్చింది. దేశంలోనే బెస్ట్ సీఎం వైఎస్ జగన్ ఇక సీఎం వైఎస్ జగన్ ఎంతో విజన్ కలిగిన నాయకునిగా దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారని నిక్ వుజిసిక్ అభివర్ణించారు. ఆ తర్వాత వేణుగోపాల్‌నగర్‌లోని కోన బాల ప్రభాకరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్ పుష్ప స్వయంగా గీసిన నిక్ చిత్రాన్ని ఆయనకు బçహూకరించగా ఆయన ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంసలహాదారు ఆర్. ధనుంజయరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. కాలాన్ని ఎదిరించిన కాలు! ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణుడు, ప్రేరణాత్మక వక్త నిక్ వుజిసిక్ రాసిన వ్యాసాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలు లక్షల మందిలో వెలుగులు నింపి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. టెట్రా అమీలియా సిండ్రోమ్ కారణంగా నిక్ కాళ్లు, చేతులు లేకుండా జన్మించినా నిక్ నైరాశ్యం చెందలేదు. అతి స్వల్పంగా ఉన్న ఎడమ తుంటి భాగం సాయంతో శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆయన మెల్బోర్న్లో పుట్టారు. 2002లో ఆస్ట్రేలియా నుంచి అమెరికా చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాలని నిర్ణయించుకుని 2005లో లైఫ్ వితౌట్ లిమిట్స్ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. 2007లో ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే మరో సంస్థను ప్రారంభించారు. కొద్దిపాటి కాలుతోనే అన్నీ.. నిక్ కష్టాల గురించి తెలుసుకోవాలంటే పొద్దున్నే లేవగానే ఒళ్లు విరుచుకునేందుకు కాళ్లు చేతులు లేకపోవడం.. కాస్తంత దురదగా అనిపించినప్పుడు, ప్రేమగా కౌగిలించుకునేందుకు చేతులు లేకపోవడం ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. 26 ఏళ్లుగా ఆయన్ను ఇవేమీ ఆపలేకపోయాయి. ఫుట్‌బాల్, గోల్ఫ్‌తోపాటు ఈత, సర్ఫింగ్ లాంటివి ఆయన వ్యాపకాలు. అవయవ శేషంగా మిగిలిన కొద్దిపాటి కాలుతోనే ఆయన టైప్ చేస్తుంటారు. పెన్నుతో రాస్తుంటారు. ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆసరాగా వినియోగిస్తుంటారు. తన కాలును ఆయన సరదాగా చికెన్ డ్రమ్‌స్టిక్ అని వ్యాఖ్యానిస్తుంటారు. సాధారణ బడికే.. ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం నిర్వహించే స్పెషల్ స్కూళ్లకు కాకుండా సాధారణ పాఠశాలలకే పంపాలని తన తల్లిదండ్రులు తీసుకున్న కఠిన నిర్ణయం తనను రాటుదేల్చిందని నిక్ చెబుతుంటారు. నిక్ పుట్టగానే ఆస్పత్రిలో ఆయన్ను చూసిన తండ్రి షాక్ తిని వాంతి చేసుకున్నాడు. నాలుగు నెలల వయసు వచ్చేవరకు నిక్ తల్లి సైతం ఆయన్ను దరిచేర్చుకోలేకపోయారు. ► న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ ఆథర్ ► ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు ► 2005లో యంగ్ ఆస్ట్రేలియన్ అవార్డు ► ద బటర్ ఫ్లై సర్కస్ షార్ట్ ఫిల్మ్‌లో నటనకు 2010లో ఉత్తమ నటుడిగా ఎంపిక. ► ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా 2011లో స్విట్జర్లాండ్‌లో నిక్ ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ► 2012లో జీవిత భాగస్వామి కనే మియహరను కలుసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. -
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ కార్యక్రమాలు అద్భుతం
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నాబార్డ్ చైర్మన్‌తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు. ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్‌గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంక్‌ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్‌కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: క్వాలిటీ వైద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తాం. ఇందులో భాగంగానే నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం కింద ఆస్పత్రుల బలోపేతానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. తద్వారా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీహెచ్ఎస్)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం’ అని మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం సందర్భంగా 2020 ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం వైఎస్ జగన్ చెప్పిన మాటలకు కార్యరూపం ఇస్తూ అడుగులు ముందుకు వేశారు. ఫలితంగా మన రాష్ట్రంలోని అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు దక్కింది. ఏకంగా 443 ప్రభుత్వాస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపుతో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. 209 ఆస్పత్రులతో రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కేరళ (134), నాలుగో స్థానంలో హరియాణ (121), ఐదో స్థానంలో తెలంగాణ (114) ఉన్నాయి. ఎన్‌క్వాష్ అంటే.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016 నుంచి అత్యున్నత ప్రమాణాలతో రోగులకు నాణ్యమైన సేవలందించే ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాష్) గుర్తింపు ఇవ్వడం ప్రారంభించింది. ఆస్పత్రిలోకి రోగి అడుగు పెట్టినప్పటి నుంచి వైద్యం చేయించుకుని బయటకు వెళ్లేంత వరకు అన్ని స్థాయిల్లో సదుపాయాల కల్పనను పరిగణనలోకి తీసుకుంటారు. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రు(డీహెచ్)లకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. పీహెచ్‌సీల్లో 6 విభాగాల్లో 1,600 రకాల అంశాలను.. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 విభాగాల్లో 6,625 అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు రోగి సింక్ వద్దకు వెళ్లి చేతులు కడుక్కునే తీరు, ఆహారం తీసుకునే విధానం, వారికి మందులు ఇచ్చే విధానం తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా గమనిస్తారు. ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోసిŠట్క్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 70 శాతానికి పైగా పాయింట్లు సాధించిన ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు ఇస్తారు. అప్పట్లో 26 ఆస్పత్రులకే ఎన్‌క్వాష్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి నామ మాత్రంగా కేవలం 26 ఆస్పత్రులకు మాత్రమే ఎన్‌క్వాష్ గుర్తింపు ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాం చుట్టారు. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడిచిన మూడున్నరేళ్లలోనే ఏకంగా 417 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్ గుర్తింపు లభించింది. వీటిలో 391 పీహెచ్‌సీలు, 25 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలలోగా 200 వరకూ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం వైద్య శాఖ దరఖాస్తు చేయనుంది. కాగా, ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీలను అభివృద్ధి చేయడం కోసం రూ.664.96 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో పాత భవనాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు, శిథిలావస్తలో ఉన్న పీహెచ్సీ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్, ఆస్పత్రిలో వసతులు లేదా గదులకు సంబంధించి సైన్ బోర్డులు, రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు, మరుగుదొడ్లు, ఆస్పత్రికి వచ్చిన రోగులు కూర్చోవడానికి కుర్చీలు ఇలా అన్ని రకాల వసతులు సమకూరాయి. ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చేసింది అనేదానికి గత మూడున్నరేళ్లలో ఏకంగా 391 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాష్ గుర్తింపు రావడమే నిదర్శనం అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పలు సూపర్ స్పెషాలిటీ, గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తోంది. మానవ వనరుల కొరతకు చెక్ పెడుతూ వైద్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 47 వేలకు పైగా పోస్టులు భర్తీ చేపట్టారు. దీంతో 2019తో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధన, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాగా పెరిగారు. ‘లక్ష్య’ గుర్తింపులో రెండో స్థానం మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ప్రసూతి సేవలకుగాను ఇచ్చే ‘లక్ష్య’ గుర్తింపు విభాగంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో గత నెలలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంసీహెచ్ వర్క్‌షాప్‌లో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య శాఖకు అవార్డు ప్రదానం చేసింది. ఆస్పత్రుల్లో ప్రసూతి సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు లక్ష్య గుర్తింపు వస్తుంది. నెలకు వంద, అంత కంటే ఎక్కువ ప్రసవాలు జరిగే ఆస్పత్రులకు ఈ గుర్తింపు పొందడానికి అర్హత ఉంటుంది. కాగా, మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌లలో అత్యున్నత ప్రమాణాలు పాటించే ఆస్పత్రులకు ఈ గుర్తింపు ఇస్తారు. మన రాష్ట్రంలో 40 ప్రభుత్వాస్పత్రులకు ఇప్పటి వరకు లక్ష్య గుర్తింపు లభించింది. ఎన్‌క్వాష్, లక్ష్య ఇతర కేంద్ర వైద్య శాఖ ఇచ్చే గుర్తింపు పొందిన ఆస్పత్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు సైతం లభిస్తాయి. ఆస్పత్రి వాతావరణంతో రోగి ప్రభావితం ఆస్పత్రుల్లోని వాతావరణం రోగులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలకు ఒక రకమైన భావన ఉంటుంది. ఇక్కడ శానిటేషన్ సరిగా ఉండదు. వసతుల కొరత ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు రావడానికి మొగ్గు చూపరు. ఈ క్రమంలో వాటి రూపురేఖలు మార్చడం ద్వారా సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి సీఎం వైఎస్ జగన్ పలు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అధ్వానంగా తయారైన ఆస్పత్రులన్నీ ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా తయారవుతున్నాయి. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తగ్గుతుంది. శుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం రోగులకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది వారు త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది. – డాక్టర్ యాదల అశోక్‌బాబు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి విలేజ్ క్లినిక్లకూ ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం దరఖాస్తు ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆ మేరకు నాడు–నేడు కింద ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక ఎన్‌క్వాష్ గుర్తింపు కలిగిన ఆస్పత్రులు మన రాష్ట్రంలో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు కూడా ఎన్‌క్వాష్ గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం కోసం 10,032 విలేజ్ క్లినిక్‌లు నెలకొల్పింది. దశల వారీగా వీటికి ఎన్‌క్వాష్ కోసం దరఖాస్తు చేస్తున్నాం. – ఎం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఎన్‌క్వాష్ గుర్తింపు సంవత్సరం ఆస్పత్రులు 2017–18 4 2018–19 22 2019–20 46 2020–21 కరోనా కారణంగా సర్టిఫికేషన్ ప్రక్రియ ఆపేశారు 2021–22 306 2022–23 65 (మరో 23 ఆస్పత్రులకు అసెస్మెంట్ పూర్తి. ఫలితాలు రావాల్సి ఉంది.) ––––––––– -
ఆధునిక అంగన్వాడీలు
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఆ చిన్నారులకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి పట్ల సానుకూల ధృక్పథంతో పని చేయాలి. 10 – 12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నాడు–నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించి అంగన్వాడీలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేస్తూ మూడు విడతల్లో ఈ పనులను పూర్తి చేయాలని నిర్దేశించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ప్రతి మండలంలోనూ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీల్లో టీచింగ్ క్వాలిటీపై మరింత దృష్టి సారించడంతోపాటు మాంటెస్సొరీ తరహా విద్యా విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. 63 సీడీపీవో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలని సూచించారు. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగాల తరహాలో మహిళా శిశు సంక్షేమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమగ్ర పర్యవేక్షణ అంగన్వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణతో చిన్నారులకు ఆహ్లాదకరమైన మంచి వాతావరణాన్ని అందించాలి. అంగన్వాడీల ద్వారా అందించే పాలు, గుడ్లు పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకుంటూ ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఆహారం పంపిణీలో ఎక్కడైనా లోపాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. సూపర్వైజర్లపై కూడా పర్యవేక్షణ ఉండాలి. ఫ్లేవర్డ్ మిల్క్ పంపిణీ అంగన్వాడీ కేంద్రాల్లో నూటికి నూరుశాతం పిల్లలకు పాల పంపిణీ జరగాలి. పిల్లలకు ఫ్లే్లవర్డ్ పాల పంపిణీని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పూర్తిస్థాయిలో ఫ్లే్లవర్డ్ మిల్క్ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలి. అంగన్వాడీలలో బోధనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహ్లాదకరంగా ఉత్తమ బోధనా విధానాలను అందుబాటులోకి తేవాలి. స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. విలేజ్, వార్డు క్లినిక్స్ సేవలు అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పర్యవేక్షణ చేపట్టాలి. చిన్నారులకు వైద్యపరంగా ఎలాంటి చికిత్స అవసరమైనా ఆరోగ్యశ్రీ వినియోగించుకుని మెరుగైన వైద్యం అందచేయాలి. ఎవరైనా తల్లీబిడ్డలు రక్తహీనత, పౌష్టికాహార లోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే నివారించేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి. ఈ విషయంలో అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలి. రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలు ఉన్నవారికి అందరితోపాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా అదనంగా అందించి ఆరోగ్యం మెరుగుపడేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దీనిపై సమగ్ర ఎస్‌వోపీలు రూపొందించుకోవాలి. ఈ విధానాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్ హోం రేషన్ విధానాన్ని లోపాలకు తావులేకుండా అమలు చేయాలి. సమీక్షలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాబు.ఎ, పాఠశాల మౌలిక వసతుల శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ.సిరి, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
నాడు-నేడుకు లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్ల విరాళం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యామౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు కార్యక్రమానికి లారస్ ల్యాబ్స్ రూ.4 కోట్లను విరాళంగా అందించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రత్యేక వార్డు (కాలిన గాయాలకు సంబంధించిన) నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ డా. సత్యనారాయణచావా.. సీఎం జగన్‌తో తెలిపారు. నాడు- నేడు పథకం కింద లారస్ ల్యాబ్స్ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా సీఎంని కలిసిన వారిలో సీఈఓ డా.సత్యనారాయణ చావా, కార్పొరేట్ డెవలప్మెంట్, సింథసిస్ మరియు ఇంగ్రిడియంట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణచైతన్య చావా, మానవ వనరుల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు చావా, సీఎస్ఆర్ హెడ్ సౌమ్య చావా ఉన్నారు. చదవండి: (సీఎం జగన్ చేతుల మీదుగా పాడి రైతులకు బోనస్ పంపిణీ) -
ముమ్మరంగా నాడు – నేడు రెండోదశ పనులు
నెల్లూరు(టౌన్): ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజలకు చిన్నచూపు ఉండేది. అక్కడ సౌకర్యాలు ఉండవని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు పంపేవారు. నేడు పరిస్థితి మారింది. కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు – నేడు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో తొలివిడతలో 1,059 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.232 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడత పనులు ప్రస్తుతం శరవేగంగా నాణ్యతగా జరుగుతున్నాయి. ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలల్లో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 15 శాతం నిధులు విడుదల చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తి చేసి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేట్ లుక్‌లో విద్యార్థులకు స్వాగతం చెప్పనున్నాయి. ఏం చేస్తారంటే.. ఎంపికైన పాఠశాలలు, అంగన్వాడీలు, బీఈడీ, డైట్ కళాశాలల్లో మొత్తం పది రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేస్తున్నారు. పెయింట్ వేయిస్తారు. లైట్లు, ఫ్యాన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం కుర్చీలు, బెంచీలు, ఇంగ్లిష్ ల్యాబ్, గ్రీన్ చాక్బోర్డు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. మేజర్, మైనర్ రిపేర్లు చేపడతారు. ఎక్కడంటే.. కొత్త నెల్లూరు జిల్లాలో రెండో విడత నాడు – నేడులో భాగంగా 1,357 పాఠశాలలు, అంగన్వాడీలు తదితరాలను ఎంపిక చేశారు. మొత్తం 531 పాఠశాలల్లో 1,841 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రెండో విడత పనుల కోసం ప్రభుత్వం రూ.466.40 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి తొలిదశలో రూ.79.67 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను నేరుగా ఆయా పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటికే రూ.72.10 కోట్లు ఖర్చు చేసి పనులు చేశారు. మిగిలిన నిధులను దశల వారీగా ప్రభుత్వం ఆయా అకౌంట్లలో జమ చేయనుంది. పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు నాడు–నేడు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాల స్థాయిలో హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ సభ్యులు, మండల స్థాయిలో ఎంఈఓ, ఏపీఎం, డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓ, జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ ఎస్ఈ, సమగ్రశిక్ష ఈఈ కమిటీల్లో ఉన్నారు. సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ రోజూ తమ బడులకు వెళ్లి పనులను ఫొటో తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. త్వరగా పూర్తి చేయాలి నాడు–నేడు పనుల కోసం రూ.4 కోట్ల మేర సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ (ఫర్నీచర్, శానిటరీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రికల్స్, సిరామిక్ టైల్స్ తదితరాలు) జిల్లాకు వచ్చింది. వీటితోపాటు సిమెంట్ కూడా వచ్చింది. పనులను అత్యంత నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు జరుగుతున్న పాఠశాలల్లో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. – ఉషారాణి, ఏపీసీ, సమగ్రశిక్ష జూనియర్ కళాశాలల్లోనూ.. జిల్లాలోని 22 జూనియర్ కళాశాలలను నాడు–నేడుకు ఎంపిక చేశారు. వాటిల్లో పలు రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించడం, కళాశాల భవవాలకు మరమ్మతులు, పెయింట్ వేయించడం, గ్రీన్ చాక్బోర్డు, కుర్చీలు, బల్లలు తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.13.44 కోట్లను మంజూరు చేశారు. తొలివిడతలో భాగంగా రూ.2.42 కోట్లను తల్లిదండ్రుల కమిటీ అకౌంట్లలో జమ చేశారు. ఇప్పటివరకు రూ.1.62 కోట్లను ఆయా పనుల కోసం ఖర్చు చేశారు. కళాశాలల్లో నాడు–నేడు పనులను కూడా మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
అంగన్వాడీలను తీర్చిదిద్దాలి
పిల్లలు చిన్న వయసులోనే ఏ విషయాన్ని అయినా త్వరగా గ్రహించగలుగుతారు. అందువల్ల అంగన్వాడీల నుంచే వారికి భాషపై గట్టి పునాది అందించాలి. అంటే అభ్యాస సామర్థ్యం (లర్నింగ్ ఎబిలిటీ) పొంపొందించుకునేలా మాంటిస్సోరీ విధానంతో కూడిన కరికులమ్ (బోధనాంశం) అందుబాటులోకి తేవాలి. అప్పుడే వారి మెదడు పరిణతి చెందుతుంది. చాలా విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేక అధికారిని నియమించాలి. ఈ మార్పుల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. నాడు–నేడు కింద చేపడుతున్న పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. ఈ దిశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలను అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు, నాణ్యత, నాడు–నేడు పనుల పురోగతి వంటి అంశాలకు సంబంధించి కచ్చితమైన మార్పు కనిపించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వీటిలో మార్పు కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సిబ్బంది నియామకాలతోపాటు ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా రావాల్సి ఉందన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్వైజర్స్ సక్రమంగా పనిచేస్తే అంగన్వాడీల పనితీరు మెరుగు పడటంతోపాటు నాణ్యత కూడా పెరుగుతుందన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సూపర్వైజర్ల సహాయంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరుపైనా తనిఖీలు ఉండాలని చెప్పారు. అంగన్వాడీలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు, మంచి వాతావరణాన్ని కల్పించడం ముఖ్యం అన్నారు. సార్టెక్స్ బియ్యం సరఫరా చేయాలని, న్యూట్రిషన్ కిట్ సరఫరాలో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఆదేశించారు. పిల్లలకు కల్పిస్తున్న సౌకర్యాలు అన్నింటిలోనూ నాణ్యత పెరగాలని, ఆ ఫలితాలు కనిపించాలని చెప్పారు. గతంలో కన్నా పిల్లలకు మంచి చేస్తున్నామన్న సంతృప్తి కలగాలని, ఇందు కోసం కావాల్సిన వసతులు, సదుపాయాలు పూర్తిగా కల్పించాలని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖాళీలు భర్తీ చేయండి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 61 సీడీపీఓ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులను సైతం వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా సీడీపీఓ నియామకాలు చేపడతామని అధికారులు తెలిపారు. గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కాటమనేని భాస్కర్, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.సిరి, పౌర సరఫరాల శాఖ ఎండీ జి.వీరపాండ్యన్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే తదతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏటేటా సంక్షేమ వ్యయం పెరుగుదల
సాక్షి, అమరావతి: విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక స్పష్టంచేసింది. సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా భారీగా పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. రాష్ట్రాల వారీగా సామాజిక రంగం, ఆస్తుల కల్పన వ్యయంతో పాటు రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాల వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పీహెచ్‌సీలు, మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపడుతున్నందున ఆ రంగాల్లో వ్యయం ఎక్కువగా ఉంది. మరోపక్క.. నవరత్నాల పేరుతో అర్హులైన వారందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నందున సామాజిక రంగం వ్యయం గత మూడేళ్లుగా ఏటా పెరుగుతోందని నివేదిక వివరించింది. మరోపక్క.. ఆస్తుల కల్పన వ్యయం కూడా బాబు హయాంలో కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక స్పష్టంచేసింది. 2018–19లో ఆస్తుల కల్పన వ్యయం రూ.35 వేల కోట్లుండగా 2019–20 ఆర్థిక ఏడాదిలో రూ.36,224 కోట్లు చేసిందని.. అదే 2021–22లో ఆస్తుల కల్పన వ్యయం రూ.47,583 కోట్లకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కానీ, ఆర్థిక మందగమనంతో పాటు కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల రాష్ట్ర సొంత పన్ను ఆదాయం పెరగకపోగా తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. 2021–22లో మాత్రం సొంత పన్ను ఆదాయం పుంజుకుందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక 2018–19లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.58,677 కోట్లు రాగా 2019–20లో రూ.57,601 కోట్లే వచ్చింది. 2020–21లో మరింత తగ్గి రూ.57,359 కోట్లకు పరిమితమైంది. అదే 2021–22లో మాత్రం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.85.265 కోట్లుగా ఆర్బీఐ పేర్కొంది. -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్‌కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్‌ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్‌ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
వైద్యరంగంలో సత్ఫలితాలిస్తున్న నాడు-నేడు పనులు
-
నాడు– నేడు’ స్ఫూర్తితో ‘పీఎం శ్రీ’
అనంతపురం: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి ‘నాడు–నేడు ’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలి్పంచేందుకు ‘పీఎం శ్రీ’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 1,174 పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, మండల పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1,174 పాఠశాలల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2026–27 వరకు దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రీన్ స్కూల్స్, పాఠశాల ఆవరణంలో ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, సేంద్రీయ విధానంలో తోటల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి యాజమాన్య పద్ధతులు, వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం, విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రతి విద్యారి్థకీ మేథమేటిక్స్, సైన్స్ కిట్లు అందజేయడం చేస్తారు. అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం, స్మార్ట్ తరగతులు, డిజిటల్ శిక్షణ నిర్వహించడం, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు. తుది జాబితా ఎంపిక చేస్తాం పీఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రాథమికంగా 1,174 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం. – కే. వెంకట కృష్ణారెడ్డి, ఇన్చార్జి డీఈఓ, అనంతపురం (చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!) -
వడివడిగా బడి దిశగా.. 1.43 లక్షల డ్రాపవుట్స్ తిరిగి బడికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలందరూ మంచి చదువులు చదవాలని, ప్రపంచస్థాయిలో పోటీ పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది. పిల్లలు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది. బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడి బాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరీ బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్లలోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిలో 1,43,573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది. – సాక్షి, అమరావతి సచివాలయాలు కేంద్రంగా డ్రాపవుట్స్‌ను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా స్కూళ్ల నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేకంగా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్‌ను రూపొందించింది. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించి పాఠశాల వయస్సుగల పిల్లలందరూ స్కూళ్లలో చేరారో లేదో పరిశీలిస్తోంది. ఈ సర్వే, పాఠశాల విద్యా శాఖ అందించిన సమాచారం మేరకు బడి మానేసిన పిల్లల ఇళ్లకు సంక్షేమ, విద్యా అసిస్టెంట్, వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, వలంటీర్ వెళ్తున్నారు. పిల్లల్ని బడికి పంపించాలని తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. ఎక్కువ కాలం బడికి రాకపోతే అందుకు కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారా, బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. వాటికి పరిష్కారాలను చూపి, తల్లిదండ్రులకు నచ్చ చెప్పి మరీ పిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఆ వివరాలను, తల్లిదండ్రులతో సిబ్బంది మాట్లాడుతున్న ఫొటోలను ఎప్పటికప్పుడు కన్సిస్టెంట్ రిథమ్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ పిల్లలు పాఠశాలలకు వస్తున్న తీరును సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పిల్లలు వరుసగా మూడు రోజులు బడికి హాజరు కాకపోతే తల్లిదండ్రులకు వలంటీర్లు ఫోన్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. తిరిగి వారు బడికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. అలాగే ఉపాధ్యాయులు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను కూడా రిథమ్స్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, స్కూలు సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. నెలలో ఒక రోజు ఏఎన్ఎం స్కూళ్లను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్ వివరాలు సేకరిస్తున్నారు. వారంలో ఒక రోజు మహిళా పోలీసు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. వీరందరూ తమ పరిశీలనలో వెల్లడైన వివరాలను రిథమ్స్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఆ వివరాలకు అనుగుణంగా ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రతి గురువారం సీఎస్ సమీక్ష గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి పిల్లల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కూళ్లలో పిల్లలు హాజరు, బడి మానేసిన వారిని తిరిగి బడుల్లో చేర్పించడంపై సమీక్షిస్తున్నారు. తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిశీలన సత్ఫలితాలనిస్తోంది. పిల్లల్ని బడి బాట పట్టించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో డ్రాపవుట్స్ తగ్గి, స్కూళ్లలో పిల్లల సంఖ్య పెరుగుతోంది. -
విద్యాశాఖలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సెర్ప్‌తో షేర్
ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్‌లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం సెర్ప్‌లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి. – బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి