కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు | CM YS Jagan Spandana And Review Meetings | Sakshi
Sakshi News home page

కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు

Published Tue, Aug 23 2022 12:01 PM | Last Updated on Tue, Aug 23 2022 5:16 PM

CM YS Jagan Spandana And Review Meetings - Sakshi

సాక్షి, తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన చర్చించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి
పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలి
3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తిచేయాలి
ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలి
ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలి
అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తికావాలి. సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలి
 అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలి
ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్‌ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలి
సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలి
ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి
ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలి. అదే సమయంలో ఎస్‌డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలి

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు
ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు
ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించాం
ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికిన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది
వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలి
దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం
వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరం
2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం
దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది
పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా
ఆగస్టు 25న నేతన్న నేస్తం
సెప్టెంబర్‌ 22న వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.


ఇదీ చదవండి: యజ్ఞంలా ‘గడప గడపకు మన ప్రభుత్వం’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement