review meetings
-
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలి : సీఎం వైఎస్ జగన్
-
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం
-
21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ప్రొక్యూర్మెంట్ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది. ఫైనాన్షియల్ సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. -
జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
-
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. అదే విధంగా స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారం.. పురోగతి పైనా ఆయన చర్చించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి ►పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తిచేయాలి ►3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తిచేయాలి ►ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలి ►ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలి ►అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తికావాలి. సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలి ► అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రది రోజూ మధ్యాహ్నం 3 గటలనుంచి సాయంత్రం 5 గంటలవరకూ స్పందన కార్యక్రమంగా కచ్చితంగా జరగాలి ►ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, సబ్ డివిజన్, మండల స్థాయిల్లో కచ్చితంగా స్పందన జరగాలి ►సంబంధిత అధికారులు కచ్చితంగా స్పందనలో పాల్గొనాలి ►ప్రతి బుధవారం స్పందన వినతులపై కలెక్టర్లు సమీక్ష చేయాలి ►ప్రతి గురువారం చీఫ్‌సెక్రటరీ జిల్లాకలెక్టర్లతో స్పందనపై సమీక్షచేయాలి. అదే సమయంలో ఎస్డీజీ లక్ష్యాలపైనా రివ్యూ చేయాలి ►గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారు ►ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారు ►ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించాం ►ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికిన వాటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది ►వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలి ►దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం ►వృద్ధిరేటులో ఏపీ టాప్‌గా నిలవడం సంతోషకరం ►2021–22లో ఏపీ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 11.43 శాతంగా నిలవడం సంతోషకరం ►దేశ వృద్ధిరేటు కంటే అధికంగా ఉంది ►పారదర్శక విధానాలే ఈ వృద్ధికి మూలకారణమని భావిస్తున్నా ►ఆగస్టు 25న నేతన్న నేస్తం ► సెప్టెంబర్ 22న వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: యజ్ఞంలా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ -
Telangana: అడవే ఉండాలి.. ఆక్రమణ ఉండొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల మూడో వారం నుంచి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘భవిష్యత్తులో అంతా అడవే ఉండాలని, లోపల ఎవరూ ఉండటానికి వీల్లేదు (నన్ ఈజ్ ఇన్ సైడ్. ఇన్సైడ్ ఈజ్ ఓన్లీ ఫారెస్ట్)’ అని స్పష్టం చేశారు. అడవుల మధ్యలో పోడు చేస్తున్నవారిని గుర్తించి అంచులకు తరలిస్తామని.. అక్కడ భూమి ఇచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని.. రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం పోడు భూముల అంశంపై ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అటవీ పరిరక్షణ కమిటీల నియామకానికి విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. పోడు సమస్య పరిష్కారంపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, అవసరమైతే ఇతర పార్టీల నేతలను హెలికాప్టర్లో తీసుకెళ్లి అన్యాక్రాంతమైన భూములను చూపిస్తామని చెప్పారు. సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు, ఇచ్చిన ఆదేశాలు ఆయన మాటల్లోనే.. నిర్లక్ష్యం వద్దు ‘‘మానవ మనుగడకు అడవుల సంరక్షణ ఎంతో కీలకం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలకు ఒక్క చెట్టూ మిగలదు. అడవుల సంరక్షణ, పచ్చదనం పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. హరితహారంతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. హరితనిధికి విశేష స్పందన వస్తోంది. అడవులను రక్షించుకునే విషయంలో అటవీశాఖ అధికారులు మరింతగా శ్రద్ధ కనబర్చాలి. సమర్థవంతమైన అధికారులను నియమించాలి. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూముల సమస్య పరిష్కారానికి అక్టోబర్ మూడో వారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. బయటివారితోనే అసలు సమస్య గిరిజనుల సంస్కృతి అడవితో ముడిపడి ఉంటుంది. వారు అడవులకు హాని తలపెట్టరు. జీవనోపాధి కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, కట్టెలు, ఇతర అటవీ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించుకుంటారు. సమస్య అంతా బయటినుంచి వెళ్లి అటవీ భూములను ఆక్రమించి, చెట్లను నరికి, అటవీ సంపదను దుర్వినియోగం చేసేవారితోనే. వారి స్వార్థానికి అడవులను బలికానివ్వం. పోడు సమస్య పరిష్కారమైన మరుక్షణమే అటవీభూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలను ప్రారంభిస్తాం. అక్రమ చొరబాట్లు లేకుండా చూసుకోవడం అటవీశాఖ అధికారుల బాధ్యతే. మూడో వారంలో దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించి ఈ నెల మూడో వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలి. ఆ దరఖాస్తుల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా.. వ్యవసాయ భూమి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్థారించాలి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. ఈ విషయంగా ఎమ్మెల్యేల సలహాలు, సూచనలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమశాఖతో సమన్వయం చేసుకుని అటవీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి. నవంబర్ నుంచి సర్వే.. రాష్ట్రంలో అటవీ భూముల సర్వేను నవంబర్ నుంచి ప్రారంభించనున్నాం. అక్షాంశ, రేఖాంశాల కో–ఆర్డినేట్స్ ఆధారంగా.. ప్రభుత్వ, అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలి. అవసరమైన చోట కందకాలు తవ్వడం, కంచె వేయడం వంటి చర్యలు చేపట్టాలి. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. పకడ్బందీ చర్యల కోసం అవసరమైతే పోలీస్ రక్షణ అందిస్తాం. అంతిమంగా అందరి లక్ష్యం ఆక్రమణలకు గురికాకుండా అడవులను పరిరక్షించుకునేదై ఉండాలి..’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్ , భూపాల్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్, పీసీసీఎఫ్ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మైనింగ్ శాఖలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: మైనింగ్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మైనింగ్ శాఖలో సంస్కరణలపై చర్చించారు. ఈ– ఆక్షన్ ద్వారా మైనర్ మినరల్స్ అమ్మాలని.. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు. గ్రానైట్ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని తెలిపారు. ఇకపై ఎన్ని టన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ ఫీజు వసూలు చేయాలని అధికారులు తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని.. దీని వల్ల ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచాన వేశారు. ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయన్నారు అధికారులు. మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని.. ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు అన్నారు. అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
రైతుల విషయంలో రాజీ పడొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : తమ పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం రైతులకు సహాయకారిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎక్కడా పంట కొనుగోలు జరగకూడదని అధికారులను ఆదేశించారు. వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదని, రైతుల విషయంలో రాజీ పడొద్దని అన్నారు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్లో పోటీ ఏర్పడాలని తెలిపారు. తద్వారా రైతులకు మెరుగైన ధర రావాలని, ఇదీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. (ఇకపై రైతుల ఇంటికే ఎరువులు, ఎస్ఎంఎస్లు) ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీ ఏర్పడేలా చేస్తుందన్నారు. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని దాదాపు రూ.3200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పలు పంటలు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన దాని కన్నా ఎక్కువ కేటాయించి పంటలు కొనుగోలు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా రూ.3300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం జరిగిందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు రావొద్దని అన్నారు. పంటలకు ముందుగానే ధరలు ప్రకటిస్తామని చెప్పామని, ఆ మేరకు రేపు (అక్టోబరు1) పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించబోతున్నామని వెల్లడించారు. అంతే కాకుండా తప్పనిసరిగా ఆ ధరలు రైతులకు దక్కేలా చూస్తామన్నారు. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ను కలిసిన పొగాకు బోర్డు చైర్మన్) జనతా బజార్లు: రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలని, రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. వారు ఎక్కడా నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి కె కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. (ఇదొక అద్భుతమైన నిర్ణయం) -
హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన 13 నగరాల్లో పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా గురువారం సమీక్షించారు. హైదరాబాద్ సహా 13 నగరాల్లోనే 70 శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లతో కేబినెట్ కార్యదర్శి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులూ హాజరయ్యారు. హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ/న్యూఢిల్లీ, అహ్మదాబాద్, థానే, పుణే, కోల్‌కతా/హౌరా, ఇండోర్, జైపూర్, జోధ్‌పూర్, చెంగల్పట్టు, తిరువల్లూరు నగరాల్లో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. కేసుల నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను సమావేశంలో సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో కోవిడ్ నిర్వహణపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్ కేసుల రేటు, రెట్టింపు రేటు, టెస్టుల సంఖ్య తదితర అంశాలపై దృష్టిపెట్టేలా మార్గదర్శకాలు ఉన్నాయి. కేసులు, భౌగోళిక వ్యాప్తి వంటి అంశాల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను భౌగోళికంగా నిర్వచించాలని కేంద్రం నొక్కి చెప్పింది. తద్వారా లాక్డౌన్ నియమావళిని అమలు చేయడంలో సహాయపడుతుంది. రెసిడెన్షియల్ కాలనీలు, బస్తీలు, మునిసిపల్ వార్డులు లేదా పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాలు, మునిసిపల్ జోన్లు, పట్టణాలను అవసరమైన విధంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించవచ్చా అన్న అంశాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు నిర్ణయించవచ్చు. -
అధినేతను పట్టించుకోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో నిర్వహిస్తున్న నియోజకవర్గాల సమీక్ష సమావేశాలను కొందరు ఆ పార్టీ నేతలు లైట్‌గా తీసుకున్నారు. నందికొట్కూరు, కోడుమూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బండి జయరాజు, రామాంజనేయులు డుమ్మా కొట్టారు. అలాగే కోడుమూరు నియోజకవర్గ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు. గతంలో ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో రెండో రోజు మంగళవారం చంద్రబాబు ఆరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట నందికొట్కూరుపై సమీక్షించారు. బండి జయరాజు గైర్హాజరు కావడంతో అంతా మాండ్ర శివానందరెడ్డి చూసుకున్నారు. అనంతరం కోడుమూరు సమీక్ష జరగ్గా.. రామాంజనేయులు హాజరుకాలేదు. గతంలో ఇక్కడ ఇన్చార్జ్గా వ్యవహరించిన డి.విష్ణువర్ధన్‌రెడ్డి హాజరైనప్పటికీ కోట్ల వర్గానికి, తన వర్గానికి ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును డిమాండ్ చేశారు. ఇందుకు సోమిశెట్టి ఒప్పుకోకపోవడంతో పార్టీ కోసం కష్టపడిన నేతలను విస్మరిస్తారా అంటూ విష్ణు తన మద్దతుదారులతో కలిసి అలిగి వెళ్లిపోయారు. దీంతో సమీక్షలో కోట్ల చక్రపాణిరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, పత్తికొండ నుంచి కేఈ శ్యామ్‌బాబు, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ హాజరయ్యారు. అంతకుముందు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చంద్రబాబును కలిశారు. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్ హాజరు కాలేదు. అయితే మసాల పద్మజ, వైకుంఠం కుటుంబ సభ్యులు వచ్చారు. సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి.. నాయకులు, కార్యకర్తలకు అండగా ఉండకపోతే వెనుకబడి పోతామని అన్నారు. ఇక నుంచైనా క్రమం తప్పకుండా నియోజకవర్గాల్లో ఉండాలని వేడుకున్నట్లు తెలిసింది. ఎక్కడికక్కడే ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేయాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పేందుకు ప్రయత్నించాలని సూచినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
బుజ్జగించేందుకు బాబొస్తున్నారు!
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో మూడు రోజులు మకాం వేయనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో జిల్లాలో అనేకమంది పార్టీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధినేత నిర్ణయాలతో అన్ని విధాలుగా నష్టపోయామంటూ తీవ్ర అసంతృప్తితో ఐదు నెలలుగా దూరంగా ఉంటున్నారు. పారీ్టలో ఓ వర్గం నాయకుల పెత్తనమే అధికంగా ఉండడంతో కొందరు పార్టీ మారిపోయారు. మరి కొందరు ఇప్పుడా? అప్పుడా? అంటూ సమయం కోసం వేచిచూస్తున్నారు. వారిని బుజ్జగించి స్థానిక ఎన్నికల్లో పనిచేయాలని చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం జిల్లాకు వస్తున్నారు. సాక్షి, తిరుపతి: చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు మకాం వేస్తున్నారు. నియోజక వర్గాలవారీగా సమీక్షించి పార్టీ నేతల మధ్య ఉన్నవిభేదాలు, అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఒప్పించడమే పర్యటన ముఖ్య ఉద్దేశంగా పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు ఇస్తామని ఆశ చూపించారు. టీటీడీ పాలకమండలిలో చోటు కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న వారికి మొండిచేయి ఇచ్చారు. అందరి ఆశలపై నీళ్లు చల్లారు. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించారు. కులాల కుంపట్లు పెట్టి పార్టీని చీలికలు పేలికలు చేసి ఘోర పరాజయానికి కారణమయ్యారు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే దూరం.. దూరం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీచేసి గెలవలేనని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసే పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని, ఆయనపై పోటీచేసి ఎవరూ గెలిచే అవకాశమే లేదని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయినా సత్యప్రభను బలవంతంగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపి ఓటమికి కారణమయ్యారని ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు ఓ వర్గాన్ని మాత్రం చేరదీయడం, మరో వర్గాన్ని విస్మరించడంతో పార్టీలలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కోసం పార్టీలో వర్గాలుగా విడిపోయారు. దీంతో రాందాస్ చౌదరి ఎన్నికలకు ముందే పార్టీ వీడారు. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత పార్టీలో తనకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, మరో వర్గాన్ని ప్రోత్సహిస్తుండడంతో ఆమె పార్టీ మారిపోయారు. పీలేరులో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎన్నికల బరిలో నిలపడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సుదీర్ఘ కాలంగా మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినా నియోజకవర్గానికి ఏమీ చెయ్యకపోవడంతో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది. జిల్లాకు ఏం చేశారు? సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. జిల్లాకు ప్రత్యేకం చేసింది ఏమిటని చంద్రబాబును ఆ పార్టీ నాయకులే ప్రశి్నస్తున్నారు. జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా... ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మూడు రోజుల కార్యక్రమాలు ఇలా.. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 1.30 గంటలకు మామండూరు వద్ద శ్రీదేవి అతిథిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జిల్లా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం. సాయంత్రం 4 గంటల తరువాత తంబళపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం, 5 గంటలకు మదనపల్లె నియోజకవర్గం, 6 నుంచి 7 వరకు పీలేరు సమావేశం జరుగుతుంది. రెండో రోజు గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాడులకు గురైన బాధితులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు పుంగనూరు, 2–3 గంటల మధ్య పలమనేరు, 3–4 గంటల మధ్య నగరి, సాయంత్రం 4 – 5 మధ్య చిత్తూరు, 5 – 6 శ్రీకాళహస్తి, 6 – 7 మధ్య సత్యవేడు నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయి. మూడో రోజు 8వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. 10 నుంచి 11 వరకు చంద్రగిరి, మధ్యాహ్నం 1 – 12 మధ్య కుప్పం, 12 – 1 పూతలపట్టు, 2 – 3 గంగాధర నెల్లూరు, 3 – 4 మధ్య తిరుపతి సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 . 30 గంటలకు విలేకర్ల సమావేశం, 5:00 గంటలకు విజయవాడకు పయనమవుతారు. -
సూటిగా.. స్పష్టంగా.. ఆత్మీయంగా..
సాక్షి, అమరావతి : వివిధ ప్రభుత్వ శాఖల తీరు తెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సమీక్షలు పూర్తిగా స్నేహ పూర్వక వాతావరణంలో సాగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో సమీక్షల సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు పట్ల అధికార వర్గాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అధికారులతో చర్చలు జరిపేటప్పుడు ఆ భావనను కాసేపు పక్కన పెట్టి సమాచారాన్ని రాబట్టడం, విశ్లేషించి అప్పటికప్పుడు సూచనలు చేయడం, వారితో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా వ్యవహరిస్తుండటం వారి హృదయాలను హత్తుకుంటోంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు తమను జగన్ పదే పదే ‘అన్నా.. అన్నా..’ అని సంబోధిస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి తమను అన్నా.. అని సంబోధించడం పట్ల వారు ముగ్ధులవుతున్నారు. ఆయా అంశాలను ఆకళింపు చేసుకోవడంలో కూడా జగన్ వేగం ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అనవసర ఉపోద్ఘాతం, సోది లేకుండా సూటిగా చెప్పదల్చుకున్న విషయాలను చెబుతుండటంతో అధికారులకు బాగా స్పష్టత వస్తోందంటున్నారు. సమీక్షా సమావేశాలు కూడా సమయానికే ప్రారంభమై నిర్ధిష్ట సమయానికే ముగుస్తున్నాయి. శనివారం నాటి సమీక్షలు సరిగ్గా 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభమై, కచ్చితంగా మధ్యాహ్న భోజన సమయానికి 12.55 గంటలకు ముగిశాయి. అంతకు ముందు రోజు కూడా ఇలాగే జరిగింది. సీఎంను కలిసిన ఐఏఎస్ అధికారి నాగలక్ష్మి ప్రాధాన్యతల ప్రాతిపదికగా సమీక్షలు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ దృష్టి అంతా ఎన్నికల సమయంలో, అంతకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలనే అంశంపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాతిపదికనే ఆయా శాఖల సమీక్షల ప్రాధాన్యతలను జగన్ ఎంచుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే స్కూళ్లల్లో చదువుకునే వాతావరణం కల్పిస్తే చిన్న పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి గట్టి పునాదులు పడతాయని భావించారు. ఇంజినీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు బాగు పడతాయని కూడా జగన్ గట్టిగా విశ్వసించారు. ఇందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకం రూపకల్పన చేసినట్లు ప్రచార సభల్లో, ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. అందుకే ముఖ్యమంత్రి కాగానే ప్రాథమిక విద్యాశాఖపై తొలి సమీక్ష చేశారు. కార్పొరేట్ బడులకు దీటుగా సర్కారు బడులు ఉండాలని సంకల్పించారు. రాష్ట్రంలోని 44 వేల పాఠశాలల్లో మౌలిక, ఇతర సౌకర్యాలపై శ్రద్ధ వహించాలని గట్టి ఆదేశాలిచ్చారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, పరిశుభ్ర వాతావరణంలో వంట శాలలుండాలని, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణంలో శ్రద్ధ వహించాలని సూచించారు. ఆదాయ వనరుల అన్వేషణపై వైఎస్ జగన్ నిర్దిష్టమైన సూచనలు చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు క్యాంపు కార్యాలయంలో సైతం విలాసవంతమైన ఫర్నీచర్ వద్దని, సాధారణ, తక్కువ ఖరీదు చేసే ఫర్నీచర్‌నే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం జగన్ షెడ్యూలు ఇలా సాగింది.. ఉదయం 9 గంటలకు : వ్యక్తిగత సిబ్బంది, అధికారులతో చర్చలు (కొందరు అధికారుల మర్యాదపూర్వక భేటీలు) ఉదయం 11 గంటలకు : ఆర్థిక, ఆదాయ వనరులను సమకూర్చే శాఖలపై సుమారు రెండు గంటల పాటు సమీక్షలు మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మధ్యాహ్నం : 3.00 గంటలకు ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి పయనం (హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి) మధ్యాహ్నం : 3.30 గంటలకు హైదరాబాద్‌కు విమానంలో పయనం సాయంత్రం : 5.00 గంటలకు రాజ్‌భవన్‌కు చేరిక సాయంత్రం : 6.30 గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పలువురు ప్రముఖులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రాత్రి 7.30 : హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరిక నోట్ : ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడలోని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అభద్రతా భావంతోనే బాబు రాద్ధాంతం
సాక్షి, అమరావతి : చంద్రబాబు అసహనంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల రగడ జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆపద్ధర్మ ముఖ్మమంత్రి చంద్రబాబు చేస్తున్న పనులేవీ గతంలో జరుగలేదన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఉద్దేశ పూర్వకంగానే ఎన్నికలు పెట్టారని చంద్రబాబు ఆరోపించడం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడమేనని మండిపడ్డారు. అవివేకులే ఇలాంటివి చేస్తారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని, సీఎం అవుతారని అర్థమయ్యే చంద్రబాబు ఇటువంటి రగడ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు.. ‘ఎలక్షన్ కమిషన్ ఏడవ షెడ్యూల్ ప్రకారం ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. ఎలక్షన్ కమిషన్ అనుమతితో సీఎం సమీక్షలు చేయొచ్చు. కానీ మిగతా సమయంలో సమీక్షలు చేయకూడదు. కానీ చంద్రబాబు కావాలనే సమీక్షలు అంటూ రాద్దాంతం చేస్తున్నారు. పోలవరం పర్యటనకు చంద్రబాబు వెళ్తే ఆయన వెనక నిబంధనలు ప్రకారం ఏ అధికారులు వెళ్ళలేదు. దాంతో అసహనానికి గురై చంద్రబాబు.. సీఎస్, సీనియర్ అధికారులపై పలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని, వైఎస్సార్ సీపీ గెలుస్తుందని చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు. ఆయన అభద్రతా భావంలో కూరుకుపోయారు’ అని చంద్రబాబు తీరును ఉమ్మారెడ్డి ఎండగట్టారు. -
అఖిలప్రియకు పదవీ గండం?
సాక్షి, అమరావతి: కొత్తగా మంత్రివర్గంలో చేరిన ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచిఉందనే వార్తలు ఏపీ తెలుగుదేశంలో గుప్పు మంటున్నాయి. విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో బాధ్యతలనుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయంట. అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉందని పార్టీ అధిస్టానంతో పాటు, సీనియర్లు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి ఒకటిన్నర నెలలవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, పనులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్య మంత్రి సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏమాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శించారు. పార్టీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికార పార్టీ వేధింపులు, ప్రలోభాలకు పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు. -
లక్షల ఎకరాల్లో వరి ఎండుతోంది: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండున్నర లక్షల ఎకరాల్లో వరి ఎండిపోతోందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆయా శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాలపై దత్తాత్రేయ శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతేడాది మిరప క్వింటాలుకు రూ.14 వేలు ధర పలికితే, ఇప్పుడు కేవలం రూ.4 వేలకే రైతు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. మిరపను రూ.7–8 వేలకు కొనుగోలు చేసేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి చర్చిస్తానన్నారు. అలాగే, మిరప రైతులను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. పంట రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు మధ్య సయోధ్య లేదని విమర్శించారు. గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ. 4 వేల కోట్లు కోరిందని, ఇది కేంద్రం పరిశీలనలో ఉందని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు దత్తాత్రేయ తెలిపారు. 10 కోల్డ్‌స్టోరేజీలు మంజూరుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కోరినట్లు ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలోని రూ.180 కోట్ల పుర ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. -
మంత్రులు, అధికారులు.. ఉరుకులు, పరుగులు
ఇంతకుముందు సాయంత్రం 6 గంటలైతే చాలు.. లక్నోలోని సచివాలయం మొత్తం బోసిపోయినట్లు ఉండేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత మంత్రులు, అధికారులు అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. పెద్ద పదవుల్లో, పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నామని ఇన్నాళ్ల బట్టి హాయిగా కూర్చున్న పెద్ద మనుషులంతా ఇప్పుడు ఆయాసపడుతూ అటూ ఇటూ తిరగాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక్క మాట రావడం పాపం.. వెనువెంటనే దాన్ని పాటించక తప్పడం లేదు. మంత్రులు కూడా ఇదివరకటిలా అధికారాన్ని అనుభవించడం కాకుండా, తమ తమ శాఖల కార్యదర్శులతో నిత్యం చర్చలలో మునిగిపోవాల్సి వస్తోంది. రాత్రి 11 గంటలకు కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యాశాఖకు చెందిన పలువురు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఫైళ్లు పట్టుకుని అధికారులు అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. ఏ నిమిషంలో ఆయన ఏ సమాచారం అడుగుతారో తెలియకపోవడంతో.. ప్రతి ఫైలూ సమావేశానికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమావేశాలు కూడా చాలా ఎక్కువ సేపు కొనసాగుతున్నాయి. ఇంతకుముందులా సాయంత్రం 6 గంటలకు బయల్దేరి ఇళ్లకు వెళ్లి టీవీలు చూస్తూ జంక్ ఫుడ్ తినడానికి వీల్లేకపోవడంతో ఉన్నతాధికారులకు సైతం పొట్టలు కరుగుతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రతి వాళ్లకూ బాధ్యతలను అప్పగిస్తూ, ఆ పని పూర్తయ్యేవరకు వాళ్లే చూసుకునేలా చేస్తున్నారు. మొదటి వందరోజులకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయిస్తూ, వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు ఏం వేస్తారో సిద్ధం చేసుకు రమ్మని చెబుతున్నారు. తొలి వందరోజుల పాలన పూర్తయిన తర్వాత బాగా పనిచేసేవారికి తగిన గుర్తింపు ఉంటుందని, అలాగే పని ఎగ్గొట్టేవారు, సరైన ఫలితాలు రాబట్టని వారి మీద మాత్రం చర్యలు తప్పవని చెబుతున్నారు. ఆ తర్వాత 6 నెలలకు, ఏడాదికి ఒక్కోసారి చొప్పున అందరి మీద సమీక్ష ఉంటుందన్నారు. రాత్రి 11 గంటలకు నిర్వహించిన విద్యాశాఖ సమావేశానికి కేబినెట్ మంత్రి ముకుట్ బిహారీ వర్మను కూడా పిలిపించారు. ప్రస్తుతం విద్యావ్యవస్థ తీరుతెన్నులు, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ లాంటి ముఖ్యమైన అంశాలను చర్చించారు. వంద రోజుల్లోగా ఫీజులను ఒక కొలిక్కి తేవాలని ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు బాధ్యత అప్పగించారు. రోజుకు కనీసం 18-20 గంటలు పనిచేసేవాళ్లే తనకు కావాలని ఇటీవల గోరఖ్‌పూర్‌లో చెప్పిన మాటలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. -
రెండో రోజు కొనసాగుతోన్న సీఎం సమీక్షలు
-
రెండో రోజు కొనసాగుతోన్న సీఎం సమీక్షలు
హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు జిల్లా నేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లా నేతలతో సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా నేతలు హాజరయ్యారు. ఆదివారం మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. -
జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షలు
-
జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియ తుదిదిశకు చేరింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సీఎం కేసీఆర్ జిల్లాల నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. -
తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ
-
తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ
నాలుగురోజుల వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఆయన పలు అంశాలపై సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముందుగా సమీక్షించారు. పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోడానికి ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంబై నగరంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి ఇక్కడ ఏర్పాటుచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఒకేచోట భవనాల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. రాజధానిలో సీఎం, సీఎస్, డీజీపీల నివాస ప్రాంగణాలు ఒకేచోట ఏర్పాటుచేయడంపై చర్చించారు. ఇంకోవైపు.. తెలంగాణలో గుడుంబా నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మూడు రోజుల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
వైఎస్ జగన్ నేడు కర్నూలు రాక
ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం రెండు రోజులపాటు వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశాలు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న అధినేత కర్నూలు(జిల్లా పరిషత్):వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అలంపూర్ చెక్‌పోస్టు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ముఖ్యులతో ఘన స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుంచి భారీగా తరలిరానున్న నేతలు, కార్యకర్తల మధ్య వుునిసిపల్ కార్యాలయుం, ఎస్వీ కాంప్లెక్స్, వర్యఇన్, రాజ్‌విహార్ సెంటర్ నుంచి మెగాసిరి ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారని వివరించారు. అనంతరం 12 గంటల నుంచి కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశాలను ఆయన ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నేడు నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష ఈ నెల 9వ తేదీన నంద్యాల పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీశైలం, బనగానపల్లి, సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు నందికొట్కూరు, డోన్, 6 గంటలకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రేపు కర్నూలు పార్లమెంటులోని నియోజకవర్గాలు ఈనెల 10వ తేదీన కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు కర్నూలు, కోడుమూరు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 వరకు ఆలూరు, ఎమ్మిగనూరు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మంత్రాలయం, ఆదోని, సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు పత్తికొండ నియోజకవర్గాలను సమీక్షించనున్నారు. అనంతరం జిల్లాలో ఉన్న ప్రధాన సవుస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ తరపున చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రవూల గురించి అధినేత దిశానిర్దేశం చేస్తారని బుడ్డా రాజశేఖరరెడ్డి వివరించారు. -
కర్నూలులో నేడు, రేపు వైఎస్సార్సీపీ సమీక్షలు
వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సమీక్షా సమావేశాలు ఈ నెల 9, 10 తేదీల్లో కర్నూలులో జరుగుతాయని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమీక్షల్లో ప్రధానంగా సంస్థాగత వ్యవహారాలపైనే చర్చ జరుగుతుంది. వైఎస్సార్సీపీలో పలు నియామకాలు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా మిట్టపల్లి రమేష్‌బాబు(నర్సరావుపేట), మాసీమ బాబు(ఆర్వీ సుబ్బారెడ్డి-కమలాపురం), సీఈసీ సభ్యునిగా కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు(భీమిలి), పెందుర్తి(విశాఖపట్నం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా అన్నమారెడ్డి అదీప్‌రాజ్(పెందుర్తి) నియమితులయ్యారు.