
కర్నూలులో నేడు, రేపు వైఎస్సార్‌సీపీ సమీక్షలు
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సమీక్షా సమావేశాలు ఈ నెల 9, 10 తేదీల్లో కర్నూలులో జరుగుతాయని పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమీక్షల్లో ప్రధానంగా సంస్థాగత వ్యవహారాలపైనే చర్చ జరుగుతుంది.
వైఎస్సార్‌సీపీలో పలు నియామకాలు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం విడుదలైన ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా మిట్టపల్లి రమేష్‌బాబు(నర్సరావుపేట), మాసీమ బాబు(ఆర్వీ సుబ్బారెడ్డి-కమలాపురం), సీఈసీ సభ్యునిగా కాకర్లపూడి శ్రీకాంత్‌రాజు(భీమిలి), పెందుర్తి(విశాఖపట్నం జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా అన్నమారెడ్డి అదీప్‌రాజ్(పెందుర్తి) నియమితులయ్యారు.