
రెండో రోజు కొనసాగుతోన్న సీఎం సమీక్షలు
కొత్త జిల్లాల ఏర్పాటుపై జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం వరంగల్ జిల్లా నేతలతో సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా నేతలు హాజరయ్యారు. ఆదివారం మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే.