4 నుంచి వైఎస్సార్‌సీపీ సమీక్షలు
ఎన్నికల్లో గెలుపోటములకు గల కారణాలపై జగన్ దృష్టి: జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్: రాజమండ్రిలో జూన్ 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు వరుసగా ఐదు జిల్లాల పరిధిలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ సమీక్షా సమావేశాలు జరుగుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగే ఈ సమీక్షల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇటీవల ముగి సిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు, ఓట ములపై చర్చిస్తారని వివరించారు. నెహ్రూ శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడిం చారు. తాజా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన, ఓడిన అభ్యర్థులు, జిల్లాలోని ముఖ్యనేతలు, జెడ్‌పీటీసీకి పోటీ చేసిన వారిని కూడా సమీక్షలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పోటీ చేసిన అభ్యర్థులు తమ గెలుపు, ఓటములకు గల కారణాలపై నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని సూచించామని చెప్పారు.
పోలవరం ఆర్డినెన్స్‌పై వివాదం సరికాదు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్డినెన్స్ వల్ల ఎవరికీ నష్టం లేదని.. దీనిని వివాదం చేయడం తగదని నెహ్రూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రాజెక్టు ఒక రాష్ట్రంలోనూ, ముంపునకు గురయ్యే భూభాగం మరో రాష్ట్రంలోనూ ఉండటం తగదనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలోని కొంత భాగాన్ని ఆంధ్రకు కలుపుతూ ఆర్డినెన్స్ జారీ అయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కట్టక పోయినా గోదావరి నదీ ప్రవాహంలో ఎపుడూ ఈ ప్రాంతంలోని చాలా గ్రామాలు మునకకు గురవుతూ ఉంటాయనే విష యం గమనించాలన్నారు. ముంపునకు గురయ్యే భూభాగం వేరే రాష్ట్రంలో ఉంటే ఆలమట్టి ప్రాజెక్టు విషయంలో ఉత్పన్నమైన పరిస్థితే తలెత్తుతుందన్నారు. ప్రాజెక్టు వల్ల భద్రాచలం రామాలయం కూడా ముంపునకు గురికాదని, ఆ మాటకొస్తే భద్రాచలం గతంలో ఆంధ్రాదే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. సుహృద్భావ వాతావరణంలో