వైఎస్ జగన్ నేడు కర్నూలు రాక
ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం
రెండు రోజులపాటు వైఎస్‌ఆర్‌సీపీ సమీక్ష సమావేశాలు
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న అధినేత
కర్నూలు(జిల్లా పరిషత్):వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు అలంపూర్ చెక్‌పోస్టు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, ముఖ్యులతో ఘన స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుంచి భారీగా తరలిరానున్న నేతలు, కార్యకర్తల మధ్య వుునిసిపల్ కార్యాలయుం, ఎస్వీ కాంప్లెక్స్, వర్యఇన్, రాజ్‌విహార్ సెంటర్ నుంచి మెగాసిరి ఫంక్షన్ హాల్‌కు చేరుకుంటారని వివరించారు. అనంతరం 12 గంటల నుంచి కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న మెగాసిరి ఫంక్షన్ హాలులో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశాలను ఆయన ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
నేడు నంద్యాల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష
ఈ నెల 9వ తేదీన నంద్యాల పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆళ్లగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీశైలం, బనగానపల్లి, సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు నందికొట్కూరు, డోన్, 6 గంటలకు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
రేపు కర్నూలు పార్లమెంటులోని నియోజకవర్గాలు
ఈనెల 10వ తేదీన కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు కర్నూలు, కోడుమూరు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 వరకు ఆలూరు, ఎమ్మిగనూరు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మంత్రాలయం, ఆదోని, సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు పత్తికొండ నియోజకవర్గాలను సమీక్షించనున్నారు. అనంతరం జిల్లాలో ఉన్న ప్రధాన సవుస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ తరపున చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రవూల గురించి అధినేత దిశానిర్దేశం చేస్తారని బుడ్డా రాజశేఖరరెడ్డి వివరించారు.