24న గుంటూరుకు జగన్ | on 24th july jagan arrivals to guntur | Sakshi
Sakshi News home page

24న గుంటూరుకు జగన్

Published Tue, Jul 22 2014 3:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

24న గుంటూరుకు జగన్ - Sakshi

24న గుంటూరుకు జగన్

మూడు రోజులపాటు పార్టీ సమావేశాలు
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు
వైఎస్సార్ సీపీ నాయకులు, విభాగాల సభ్యులు హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపు
సమీక్ష సమావేశాల షెడ్యూల్ ఇలా...
24వ తేదీ...
ఉదయం 9 గంటలకు: గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు
మధ్యాహ్నం 12 గంటలకు : పొన్నూరు, ప్రత్తిపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : తాడికొండ, మంగళగిరి
 
25వ తేదీ ..
ఉదయం 9 గంటలకు : తెనాలి, చిలకలూరిపేట
మధ్యాహ్నం 12 గంటలకు : సత్తెనపల్లి, పెదకూరపాడు
మధ్యాహ్నం 2 గంటలకు : మాచర్ల, గురజాల
సాయంత్రం 5 గంటలకు : వినుకొండ, నరసరావుపేట
రాత్రి 7 గంటలకు : రేపల్లె

26వ తేదీ..
ఉదయం 9 గంటలకు :
బాపట్ల, వేమూరు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 24న గుంటూరు రానున్నారు. ఆయన అధ్యక్షతన  24, 25, 26 తేదీల్లో పార్టీ సమీక్ష సమావేశాలు వరసగా మూడు రోజుల పాటు గుంటూరులో జరగనున్నాయి. ఇందుకు పలకలూరు రోడ్డులోని ‘రమణీయం’ కల్యాణ మండపాన్ని వేదిక నిర్ణయించారు. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సోమవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు..
జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల  మూడు పార్లమెంటు స్థానాలతో పాటు, 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది.
పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్య ర్థులు, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి.
వీరితోపాటు జిల్లా, నియోజకవర్గాల పరిధిలోని, అన్ని విభాగాల సభ్యులు హాజరు కావాలి. కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర పాలక మండలి సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా హాజరు కావాలి.
ఈ సమావేశాలకు పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎం.వి.మైసూరారెడ్డి హాజరు కానున్నారు.
పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 24వ తేదీ ఉదయం గుంటూరు చేరుకుంటారు. నియోజకవర్గ సమీక్షల్లో నేతలు తప్పక పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచించారు.
విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), లేళ్ల
అప్పిరెడ్డి, కత్తెర సురేష్‌కుమార్, కొత్త చినపరెడ్డి, పురుషోత్తం, నూనె ఉమామహేశ్వరరెడ్డి, బీసీసెల్ కన్వీనర్ మద్దుల రాజాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement