జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్షలు | cm kcr review meetings over new districts formation | Sakshi
Sakshi News home page

Oct 2 2016 12:40 PM | Updated on Mar 21 2024 6:45 PM

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు ప్రక్రియ తుదిదిశకు చేరింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో సీఎం క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు.కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సీఎం కేసీఆర్ జిల్లాల నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ నల్లగొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement