![Bonanza for MSMEs! World Bank approves usd 500 million program - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/8/MSME.jpg.webp?itok=bENACnHB)
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో భారీగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్) రంగానికి ప్రపంచ బ్యాంకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఈ రంగం పునరుజ్జీవం కోసం 500 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. భారతదేశం దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలక వెన్నెముకలాంటి ఎంఎస్‌ఎంఇ రంగం కోవిడ్ -19 మహమ్మారి తీవ్రంగా దెబ్బతిందని ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. ఇది తిరిగి పుంజుకునేందుకు సంబంధించిన ప్రయత్నాలనువ్తమ మద్దతును మ రింత ముమ్మరం చేస్తుందని, తద్వారా దీర్ఘకాలిక ఉత్పాదకత-ఆధారిత వృద్ధికి, ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాల ఉత్పత్తికి పునాదులు వేస్తున్నామని ఆయన అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి ద్వారా తీవ్రంగా ప్రభావితమైన ఎంఎస్ఎంఈ ల యొక్క తక్షణ ద్రవ్యత, క్రెడిట్ అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రదానంగా 555,000 ఎంఎస్‌ఎంఈల పనితీరు మెరుగుదలను లక్ష్యంగా పెట్టుకుంది. పోస్ట్-కోవిడ్ రెసిలెన్స్ అండ్ రికవరీ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ 3.4 బిలియన్ల డాలర్లలో 15.5 బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్‌ను సమీకరించాలని భావిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇందులో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు, హరిత పెట్టుబడులు మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు ప్రయోజనం పొందడాన్ని ప్రోత్సహిస్తుందని, ప్రైవేటు రంగాలతో సేవా ప్రదాతలుగా అధిక స్థాయికి చేరుకోవడానికి భాగస్వామ్యాన్ని పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ర్యాంప్ కార్యక్రమం ఐదు "ఫస్ట్ మూవర్" రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. తదుపరి ఇతర రాష్ట్రాలుకూడా చేరే అవకాశం ఉందని పేర్కొంది.
చదవండి : నైకీ, హెచ్‌అండ్‌ఎం బ్రాండ్స్‌కు చైనా షాక్
5 నిమిషాల మాక్ డ్రిల్: 22 మంది ప్రాణాలు గాల్లో!
Comments
Please login to add a commentAdd a comment