బార్సిలోనా: వాతారవణంలోని మార్పులు కారణంగా 2050 కల్లా దాదాపుగా 200 మిలియన్ల మంది ప్రజలు తమ నివాసాలు వదిలి వలసలు వెళ్లతారని ప్రపంచ బ్యాంక్ నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా నీటి కొరత, సముద్ర మట్టాలు పెరగడం, పంట ఉత్తాదకత తగ్గడం. వంటి వాటితో మొదలై 2050 కల్లా అది తీవ్ర వలసలకు మారిపోవచ్చు మారిపోవచ్చు అని నివేదికలో హెచ్చరించింది.
అభివృద్ధి ముసుగులో అత్యధిక పరిశ్రమలను నెలకొల్పి వాటి నుంచి విడుదలై ఉద్గారాలను శుద్ధి చేయకుండా గాల్లోకి వదిలి మానవుడు తన వినాశనానికి తానే శ్రీకారం చుడుతున్నాడంటూ వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఆరు దేశాలైన లాటిన్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, సహారా ఆఫ్రికా, తూర్పు యూరప్, పసిఫిక్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 216 మిలియన్ల మంది ప్రజలు తమ మాతృభూమిని వీడి పోవాల్సి వస్తుందని నివేదిక నొక్కి చెప్పింది.
వలసలు ప్రేరేపించేలా...
సహారా ఆఫ్రికాలో అత్యధిక శాతం మంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం అందువల్ల దాదాపు 86 మిలియన్ల మంది ప్రజలు వలసి వెళ్లిపోక తప్పదని నివేదికలో తెలిపింది. నార్త్ ఆఫ్రికా, ఈశాన్య తునిషియా, వాయువ్య అల్గేరియా, మొరాకో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వరదలు, నీటి కొరత కారణంగా సుమారు 19 మిలియన్ల మంది వలసి పోయే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక రానురానూ భవిష్యత్తరాలలో వలసలను ప్రేరేపించే విధంగా వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని వాతావరణ నిపుణుడు వివియనే వీ చెన్ నివేదికలో పేర్కొన్నారు. (చదవండి: క్వాడ్ సదస్సుకు అమెరికా ఆతిధ్యం)
శరణార్థుల శిభిరాల కేంద్రంగా...
అనుకూలమైన వాతావరణం ఉండి, కాలుష్యం తక్కువగా ఉన్నా కూడా తమ అభివృద్ధి కోసమో లేక ఉన్నత ఉద్యోగమనో...లేదా మరే ఇతర కారణాల వల్ల ఇప్పటికే సుమారు 44 మిలియన్ల మంది ప్రజలకు తమ సోంత గడ్డను విడిచి పట్టణాలు/ విదేశాల బాట పట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పర్యావరణ నిపుణురాలు డాక్టర్ కాంత కుమారి రిగౌడ్ మాట్టాడుతూ..."వలసలు మనకేమి కొంత కాదు. ప్రపంచంలో మనకు తెసిన ప్రతి నలుగురిలో ముగ్గురు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. దీనికి అననూకూల వాతావరణం తోడైతే వలసలు అధికమై శరణార్థుల శిభిరాల కేంద్రాలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని" అన్నారు.
కార్యాచరణ దిశగా అడుగులు పడాలి...
ప్రపంచ దేశాలన్ని ఉద్గారాలను తగ్గించడానికి ముందుకొస్తేనే ఈ పరిస్థితి జయించగలమన్నారు. వాతావరణ అత్యవసర పరిస్థితి రావడానికి బాధ్యులైన దేశాల్లో ముందున్నది అమెరికానే అని నివేదిక స్పష్టం చేసిందన్నారు. ప్రతి ఏటా కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్(కాప్ 25) వంటి సదస్సులు పెట్టి తీసకుంటున్న నిర్ణయాలు మాటల వరకే పరిమతమవుతున్నాయి తప్ప కార్యచరణ దిశగా తీసుకురావడానికీ ఏ దేశం ముందుకు రావటం లేదని నివేదికలో వ్యాఖ్యానించారు. కర్బన ఉద్గారాలకు ప్రధాన కారణమైన దేశాల నుంచి ముందుకు వస్తేనే 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించే దిశగా అడుగులు వేయగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
(చదవండి: సీబీఐ, ఈడీపై పశ్చిమ బెంగాల్ స్పీకర్ ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment