ఎలక్ట్రిక్ వాహనాలు వాతావరణ మార్పులకు పరిష్కారం చూపవని ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ తెలిపారు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్‌ల ద్వారా వాతావరణ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. అందుకు బదులుగా బంగ్లాదేశ్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై ప్రపంచం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల లండన్ కింగ్స్ కాలేజీలో గ్లోబల్ కల్చర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య. దీన్ని పరిష్కరించేందుకు అందరూ ముందుకు రావాలి. కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ సమస్యకు పరిష్కారం చూపవు. పునరుత్పాదక శక్తి, పరిమితంగా కర్బన ఉద్గారాలను వాడడం వంటి కార్బన్ క్రెడిట్‌ల ద్వారా ఇది పరిష్కారం కాదు. స్థానిక ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగ్లాదేశ్‌లో చాలా ఏళ్లుగా వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అక్కడ వాతావరణ సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దాంతో స్థానికులు వాతావరణానికి చేటు చేసే కార్యాలకు స్వతహాగా దూరంగా ఉంటున్నారు. ఈ మార్పునకు ఏదో గొప్ప సాంకేతిక తోడ్పడలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. భారత్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న దేశం. అలాంటిది ఇక్కడి రైతులు చాలా ఏళ్లుగా తమకు తోచినంతలో నీటిని సమర్థంగా వాడుకుని పంటలు పండిస్తున్నారు. వనరులను సమర్థంగా వాడుకోవాలనే స్పృహ అందరిలోనూ ఉండాలి. అప్పుడే వాతావరణం మరింత క్షీణించకుండా కాపాడుకోవచ్చు’ అని అమితావ్ ఘోష్ అన్నారు.
ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’
‘ఇరాక్ యుద్ధ సమయంలో యూఎస్ మిలిటరీ ఏటా 1.3 బిలియన్ గ్యాలన్ల చమురును వినియోగించింది. ఇది బంగ్లాదేశ్ వార్షిక వినియోగం కంటే ఎక్కువ. యుద్ధాలు, భౌగోళిక అనిశ్చితుల కారణంగా చెలరేగులున్న వైరుధ్యం వల్ల వాతావరణ మార్పులు పెరుగుతున్నాయి. అయినా ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా చర్చకు వస్తాయి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment