వృద్ధాప్యం దరిచేరనివ్వకూడదంటూ ప్రచారం సాగిస్తున్న ఓ ప్రముఖ కంపెనీ సహవ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ తాజాగా తాను రాసిన పుస్తకంతోపాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రతివ్యక్తి వేగంగా వృద్ధాప్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని బ్రయాన్ జాన్సన్ కోరుతుంటారు. ఈమేరకు ‘బ్లూప్రింట్’ ప్రాజెక్ట్‌లో భాగంగా రివర్స్ ఏజింగ్(పెద్ద వయసులోనూ యువకుడిలా కనిపించేలా)ను ప్రమోట్ చేస్తున్నారు.
బ్రయాన్ జాన్సన్ ఇటీవల తాను రాసిన పుస్తకంతో పాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసేందుకు భారత్‌లో ఆన్‌లైన్ పుడ్ డెలివరీ సేవలందిస్తున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ను కలవనున్నట్లు సమాచారం. బ్రయాన్ జాన్సన్ వెన్మో సంస్థ సహవ్యవస్థాపకుడు. అయితే ఈయన తన కంపెనీను సుమారు రూ.6,640 కోట్లకు పేపాల్‌కు విక్రయించారు. ఈ డీల్‌తో భారీగా నగదు పోగు చేసుకున్న జాన్సన్ వైద్య నిర్ధారణలు, చికిత్సలు, తన లక్ష్యాలను సాధించడానికి కఠినమైన జీవనశైలి కోసం ఏటా 2 మిలియన్ డాలర్లు(రూ.16.6 కోట్లు) పైగా ఖర్చు చేస్తున్నారు.
‘హలో ఇండియా. డోంట్ డైపై నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తి పూనమ్‌పాండే. తనకు దాని గురించి చెప్పాను. నేను డిసెంబర్ 1-3 వరకు ముంబైలో, డిసెంబర్ 4-6 వరకు బెంగళూరులో ఉంటాను’ అంటూ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో తెలియజేస్తూ ‘మర్‌నామత్(చనిపోకండి)’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉంచారు.
ఇదీ చదవండి: రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
జాన్సన్ వృద్ధాప్య చాయలు దరిచేరకూడదని తన టీనేజ్ కుమారుడి నుంచి రక్త మార్పిడి చేసుకున్నారు. జన్యుపరమైన ఇంజెక్షన్లు చేయించుకోవడం, కఠినమైన ఆహార విధానాన్ని అనుసరించడం, రోజూ 100కి పైగా సప్లిమెంట్లను తీసుకోవడం, కఠోర వ్యాయామం.. వంటివి చేస్తూంటారు.
Comments
Please login to add a commentAdd a comment