రిసైలియన్స్(Resilience) అనే పదానికి ఖచ్చితమైన అనువాదం స్థితిస్థాపకత. మామూలు మాటల్లో చెప్పాలంటే.. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే సామర్థ్యం. శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అనేది వాతావరణ ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
భూతాపోన్నతి(Global Warming) వల్ల కలిగే తుపాన్లు, తీవ్ర వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక జనసమూహం లేదా పర్యావరణ వ్యవస్థ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి, మార్పు చెందడానికి గల సామర్ధ్యం ఎంత అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల అనివార్యంగా ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని పర్యావరణాన్ని(Environment), ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలు, సమూహాలు, ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. కొత్త నైపుణ్యాలను పొందడానికి, కొత్త రకాల ఆదాయ వనరులను అందిపుచ్చుకోవటానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం.. విపత్తులకు మరింత బలంగా ప్రతిస్పందించే, పునరుద్ధరణ సామర్థ్యాలను పెంపొందించటం..
వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయడం ద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కునే సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. నిజానికి సమాజం వాతావరణపరంగా స్థిరత్వాన్ని పొందాలంటే శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం ముఖ్యమైనది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పనులను భారీగా తగ్గించటమే భవిష్యత్తులో వాతావరణ ప్రభావాలను(climate changes) తగ్గించే ఉత్తమ మార్గం. ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే సమాజాలకు, వ్యక్తులకు మద్దతుగా నిలవటంలోనే వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి.
(చదవండి: ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!)
Comments
Please login to add a commentAdd a comment