CLIMATE
-
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
-
వణుకుతున్న ఉత్తరాది.. ఢిల్లీలో తగ్గిన విజిబిలిటీ
-
కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు
-
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు
గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్‌లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ షంషుద్దీన్ జబ్బార్ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్ అమెరికన్ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సన్నిహత సహచరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్‌కు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్‌పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనున్న డోనాల్డ్ ట్రంప్ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్, న్యూయార్క్, లాస్ వెగాస్ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్ వివాదాన్ని ట్రంప్ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్ పుతిన్ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్ పైప్‌లైన్ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్–హమాస్ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్ ఇంటె లిజెన్స్. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్‌జీపీటీ4ని ఓపెన్ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్‌జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్‌రాబిట్ అనే వెబ్ పేజీకి యాక్సెస్ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్‌జీపీటీ4 ఔట్‌సోర్స్ చేసి, సర్వీస్ ప్రొవైడర్‌కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్‌ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వరాన్ని క్లోన్ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్ కాల్స్ చేశారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్ వ్యాసకర్త ‘హిందుస్థాన్’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సింగల్ డిజిట్ ఎముకలు కొరికే చలి..
-
శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అంటే..!
రిసైలియన్స్(Resilience) అనే పదానికి ఖచ్చితమైన అనువాదం స్థితిస్థాపకత. మామూలు మాటల్లో చెప్పాలంటే.. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే సామర్థ్యం. శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అనేది వాతావరణ ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. భూతాపోన్నతి(Global Warming) వల్ల కలిగే తుపాన్లు, తీవ్ర వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక జనసమూహం లేదా పర్యావరణ వ్యవస్థ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి, మార్పు చెందడానికి గల సామర్ధ్యం ఎంత అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల అనివార్యంగా ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని పర్యావరణాన్ని(Environment), ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలు, సమూహాలు, ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. కొత్త నైపుణ్యాలను పొందడానికి, కొత్త రకాల ఆదాయ వనరులను అందిపుచ్చుకోవటానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం.. విపత్తులకు మరింత బలంగా ప్రతిస్పందించే, పునరుద్ధరణ సామర్థ్యాలను పెంపొందించటం.. వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయడం ద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కునే సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. నిజానికి సమాజం వాతావరణపరంగా స్థిరత్వాన్ని పొందాలంటే శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం ముఖ్యమైనది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పనులను భారీగా తగ్గించటమే భవిష్యత్తులో వాతావరణ ప్రభావాలను(climate changes) తగ్గించే ఉత్తమ మార్గం. ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే సమాజాలకు, వ్యక్తులకు మద్దతుగా నిలవటంలోనే వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. (చదవండి: ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!) -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
-
కోస్తాంధ్రలో మూడు రోజులు భారీ వర్షాలు..
-
RK బీచ్ వద్ద అలల ఉగ్రరూపం
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి చేరిన వరద నీరు
-
Fengal Cyclone: దూసుకొస్తున్న ఫెంగల్
-
Red Alert : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
-
ఏపీకి హై అలర్ట్..
-
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
ఒక్కసారిగా మారిన వాతవరణం..
-
స్వచ్ఛ గాలి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి. కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో తగ్గుముఖంఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగంవాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. -
ప్రతికూల వాతావరణం.. 80 శాతం రైతులు కుదేలు
ఊహకందని రీతిలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు భారీ స్థాయిలో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు.గత ఐదేళ్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 80 శాతం మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. పలు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నాట్లు వేయడం, విత్తనాలు విత్తడంలో జాప్యం జరుగుతున్నదని, ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నదని నిపుణులు అంటున్నారు. ఫోరమ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ (ఫీడ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.దేశంలోని 21 రాష్ట్రాల్లోని 6,615 మంది రైతుల నుంచి ఫీడ్ పలు వివరాలు సేకరించింది. దేశంలో సంభవించిన పంట నష్టాల్లో 41 శాతం కరువు కారణంగా, 32 శాతం సక్రమంగా వర్షాలు కురియక, 24 శాతం రుతుపవనాల ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చిన కారణంగా సంభవించినట్లు ఫీడ్ సర్వేలో తేలింది.సర్వేలో పాల్గొన్న రైతులలో 43 శాతం మంది తమ పంటలో కనీసం సగం పంట నష్టపోయామని తెలిపారు. ముఖ్యంగా వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరి పొలాల్లో కొత్తగా నాటిన మొక్కలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా తక్కువ వర్షపాతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ప్రభావితం చేసింది. బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ తదితర పంటల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపనున్నదని నిపుణులు అంటున్నారు. -
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం
-
హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన
-
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
వాతావరణ యాంగ్జైటీ అంటే ఏంటి..? ఎదుర్కోవడం ఎలా..?
పచ్చని చెట్లు కొట్టేస్తూంటే మీకు గుబులుగా ఉంటోందా? ఊరి చెరువు నెర్రలుబారితే అయ్యో ఇలా అయ్యిందేమిటి? అన్న ఆందోళన మొదలవుతుందా? ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా..‘‘అంతా అయిపోయింది’’ అన్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అయితే సందేహం లేదు.. మీరు కూడా ఎకో యాంగ్జైటీ బారిన పడ్డట్టే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏంటీ ఎకో యాంగ్జైటీ? మానసిక రోగమా? చికిత్స ఉందా? లేదా? ఎలా ఎదుర్కోవాలి? ఈ రోజు జూన్ ఐదవ తేదీ. ప్రపంచం మొత్తమ్మీద పర్యావరణ దినంగా ఉత్సవాలు జరుగుతాయి. మారిపోతున్న పర్యావరణం తీసుకొచ్చే ముప్పుల గురించి చర్చలు, అవగాహన శిబిరాలూ నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో పర్యావరణ మార్పుల చర్చల్లో ఎకో యాంగ్జైటీ కూడా ఒక టాపిక్‌గా మారిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల మీలో ఆందోళన, ఒత్తిడి కలిగిస్తూంటే దాన్ని ఎకో యాంగ్జైటీ అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. గానీ ఆ ప్రభావం మనం మీద ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా మన మూడ్స్ మారిపోవడం జరిగి ఒక దానిపై ఏకాగ్రత పెట్టలేని స్థితికి చేరుకుంటాం. ముఖ్యంగా వరదలు, అడవి మంటలు, భూకంపాలు, అపూర్వమైన వేసవి, చలికాలం, హిమనీనదాలు కరగడం, గ్లోబల్ వార్మంగ్ తదితరాలన్నీ మానవులను ఆందోళనకు గురి చేసేవేననిశారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవేనని నిపుణులు చెబుతున్నారు. పెనుముప్పు... మారుతున్న వాతావరణం కలిగించే ఆందోళన ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ స్వయంగా చెబుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు దీన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించలేమని అంచనా. అయితే తట్టుకునేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకోసం శాస్త్రీయంగా చేయాల్సిన పనులపై దృష్టిసారించడం, తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలను అమలు చేయడం వంటివి చేయాలి. కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణ అనుకూలమైన జీవనశైలి మార్పులను చేసుకోవడం వాతావరణ పరిక్షణకు అనుకూలంగా ఉన్న విధానాలకు మద్దతు ఇవ్వడం లేదా స్థానిక పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్‌ను ప్రాక్టీస్ చేయడం. మనసు ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం, శ్వాస లేదా ప్రకృతిలో గడపడం వంటి వాటితో ఈ పర్యావరణ ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా ఇతరులతో కనెక్ట్ అవ్వడం. ఆన్లైన్ కమ్యూనిటీలు లేదా స్థానిక సంస్థల్లో చేరడం వంటివి చేయండి. వాతావరణ సంక్షోభంపై అవగాహన కలిగి ఉండటం తోపాటు సవాళ్లును ఎదుర్కొనేలా సిద్ధం కావాలి. అలాగే పురోగతిని, వాతావరణ మార్పులు పరిష్కరించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి. (చదవండి: పర్యావరణహితం యువతరం సంతకం) -
ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్
-
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
-
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..
-
ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..
'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) టెక్నాలజీ.. మారుతున్న భౌగోళిక పరిస్థితులు దాదాపు ప్రపంచంలోని సగం వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని దిగ్గజ కంపెనీల సీఈఓలు ఆందోళన చెందుతున్నారు. ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC) సర్వ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4,702 కంపెనీల నాయకుల పోల్‌లో 45 శాతం మంది తమ వ్యాపారాలు అనుకూలించకపోతే 10 సంవత్సరాలలో విఫలమవుతారని తెలిపింది. 2023లో కొన్ని కంపెనీల పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సంఘటనలు ఇప్పటికే కళ్ళముందు కనిపించాయని స్పష్టం చేసింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పీడబ్ల్యుసీ గ్లోబల్ చైర్మన్ 'బాబ్ మోరిట్జ్' (Bob Moritz) మాట్లాడుతూ.. ఆదాయ అవకాశాలు గత ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఉద్యోగులను తొలగించి ఏఐ వినియోగాన్ని పెంచుకోవడానికి కూడా సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా మారుతున్న భౌగోళిక పరిస్థితులు కూడా కంపెనీల వృద్ధికి అడ్డుకట్ట వేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల దాడుల వంటివి ప్రపంచ వాణిజ్యానికి అంతరాయాలుగా ఉన్నాయి. -
రానున్నది ఉష్ణ ప్రకోపమే!
వాతావరణం, శీతోష్ణస్థితి గురించి లెక్కలు తీసి రికార్డుగా దాచి ఉంచడం మొదలుపెట్టి 170 సంవత్సరాలకు పైనే అయింది. ఈ మొత్తం కాలంలోనూ 2023వ సంవత్సరం అన్నిటికన్నా వేడి అయినదిగా నమోదవుతుంది అని పరి శోధకులు అప్పుడే చెప్పేస్తున్నారు. ఇటీ వలి కాలం ఇంత వేడిగా ఉండడా నికి మనుషుల కారణంగా మారుతున్న శీతోష్ణస్థితి మాత్రమే అని ఎటువంటి అనుమానం లేకుండా తేల్చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ స్పేస్ ప్రోగ్రావ్‌ు వారి ‘కోపర్ని కస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ వారి లెక్కల ప్రకారం, ఇంతకు ముందు ఎప్పుడూ వేసంగి ఇంత వేడిగా ఉన్నది లేదు. గతంలో కంటే ఈసారి ఉష్ణోగ్రత 0.32 డిగ్రీ సెల్సియస్ సగటున ఎక్కువగా ఉన్నట్టు లెక్క తేలింది. ప్రపంచం మొత్తం మీద మునుపెన్నడూ లేని మూడు వేడి దినాలు నమోదైనట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ ఏడాది వేసవికాలం మునుపెన్నడూ లేనంత వేడిగా ఉందని లెక్కతేల్చి పెట్టారు. 2023వ సంవత్సరంలో నెలల ప్రకారం లెక్కలు చూచినా... ప్రపంచమంతటా ఆరు మాసాలు అంతకు ముందు ఎన్నడూ లేని వేడి కనబరిచినట్టు ఇప్పటికే లెక్కలు వచ్చాయి. అంటార్కిటికాలో మంచు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనంతగా కరిగిపోయినట్టు కూడా గమనించారు. ప్రపంచంలో పారిశ్రామికీకరణ కన్నా ముందు కూడా వాతా వరణంలోని వేడి గురించిన రికార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సగటున ప్రపంచం మొత్తం మీద 1.46 డిగ్రీల సెల్సియస్ వేడి పారిశ్రామికీకరణకు ముందున్న వేడి కన్నా ఎక్కువగా ఉంది. పరిశ్రమల వల్ల వాతావరణం వేడెక్కుతున్న దన్న భావన చాలాకాలంగా ప్రపంచంలో ఉండటం తెలిసిందే. 2016లో వేడిమి ఎక్కువగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఉన్న రికార్డులు తెలుపుతున్నాయి. అయితే ఈ సంవత్సరం వేడి 2016లో కన్నా ఎక్కువగా ఉన్నట్టు నమోదయింది. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు రికార్డులో ఉన్న సంవత్సరాల అన్నింటిలోకీ 2023 అత్యంత వేడిగా ఉన్నట్టు లెక్క తేలింది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ‘సీ త్రీ ఎస్’ సంస్థ పరిశోధకురాలు సమంతా బుర్జెస్ ఒక ప్రకటనలో బయటపెట్టారు. శరత్ కాలం కూడా వేడిగా ఉండడానికి ‘ఎల్ నినో’ కారణం అని ఇప్పటికే మనకంతా తెలుసు. ఎల్ నినో వల్ల భూమధ్య రేఖ వద్ద సముద్రాలలో ఉపరితలం నీరు వేడెక్కుతుంది. దాని వల్ల ప్రపంచంలోని గాలులు వేడవుతాయి. 2023 జూన్‌లోనే ఈ ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏడాది కూడా ఈ వేడి కొనసాగుతుందని అంటున్నారు. గడచిన మూడు సంవత్సరాల పాటుఎల్ నినోకు వ్యతిరేకంగా ఉండే ‘లా నినా’ అనే పరిస్థితి కారణంగా వేడిమి కొంతవరకు అదుపులో ఉంది. ఈ ‘లా నినా’ప్రస్తుతం లేదు. కనుక వేడిమి హద్దు లేకుండా పెరుగుతున్నది. మరికొంతమంది నిపుణులు టోంగాలో సముద్రం లోపల 2022లో పేలిన అగ్నిపర్వతం కారణంగా వేడి నీటి ఆవిరులు వాతావరణంలో పెరిగాయనీ, ఈ సంవత్సరం వేడి పెరుగుదలకు అది కూడా కొంతవరకు కారణం కావచ్చుననీ అంటున్నారు. అయితే పరి శోధకులు మాత్రం ఈ విషయం గురించి అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచమంతటా వాతావరణం వేడిగా మారడానికి ‘గ్లోబల్ వార్మింగ్’ అన్న ప్రక్రియ కారణం అని అందరికీ తెలుసు. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతున్నదని కూడా తెలుసు. ఈ ప్రక్రియ వల్ల ప్రపంచ వాతావరణంలో 25 బిలి యన్ల అణుబాంబుల శక్తికి సమానంగా ఉష్ణశక్తి చేరిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా గడిచిన 50 సంవ త్సరాల పాటు జరిగిన మార్పు. ఈ మార్పు ఒక పక్కన గాలిని వేడెక్కిస్తుండగా, మరొక పక్కన ఊహకు అందకుండా ఎల్ నినో వచ్చే పరిస్థితులకు దారితీస్తున్నది. రానురానూ పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. డిసెంబర్ 4న ‘కాప్’ 28 అనే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ జరిగింది. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్నుపంపించడం ఈ సంవత్సరం అంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరిందని అక్కడ ప్రకటించారు. పరిస్థితి ఇలాగుంటే, వాతావరణం నియంత్రణలో ఉంటుందని అనుకోవడానికి వీలే లేదు అన్నారు అక్కడ.గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు ప్రస్ఫుటంగా బయట పడు తున్నాయి. ప్రపంచమంతటా తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద సరస్సులు, జలాశయాలు సగం కుదించుకుపోయాయి. సముద్ర అంతర్భాగంలో ఉండే గల్ఫ్ ప్రవాహం కూడా ప్రభావం కనపరు స్తున్నది. సముద్ర మట్టాలు ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అయితే పరిశోధకులు, పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి అవ కాశాలు ఇంకా ఉన్నాయి అని ఆశాభావం కనబరుస్తున్నారు. వాతావరణంలో మార్పులను మనకు అనుకూలంగా మార్చే మార్గాలు లేకపోలేదు అంటున్నారు పెన్సిల్వేనియా విశ్వ విద్యా లయం పరిశోధకులు. కానీ ఆ అవకాశం కూడా రానురానూ తగ్గి పోతున్నది అన్నది వారి అభిప్రాయం. కె. బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
Fog In Tirumala Photos: తిరుమలను చుట్టేసిన పొగమంచు (ఫోటోలు)
-
మిల్లెట్ సాగుకు అనుకూల వాతావరణం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మిల్లెట్ సాగుకు అనుకూలమైన వాతావర ణం ఉందని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. శుక్రవారం హైదరా బాద్‌లో ‘మిల్లెట్ కాంక్లేవ్– 2023’ని జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా షాజీ మాట్లాడు తూ మిల్లెట్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అద్భుత మైన ఫలితాలు అందించిందని చెప్పారు. గ్రామీణ–పట్టణ ఆదాయ అసమానతలు తగ్గించడం, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం తమ కర్తవ్యమన్నారు. ఐక్యరాజ్యసమి తి 2023ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడానికి మన దేశమే కారణమని, మిల్లెట్లను మరింత ముందుకు తీసుకెళ్ల డానికి ఇది భారతదేశానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్‌ను మిల్లెట్ గ్లోబల్ హబ్‌గా మార్చ డానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అత్యుత్తమ కేంద్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్‌పై వ్యవసాయ, వివిధ రంగాల ప్రముఖు లు చర్చించారు. అపెడా చైర్మన్ అభిషేక్ దేవ్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. నాబార్డు సీజీఎంలు మోనోమోయ్ ముఖర్జీ, ఉదయ్ భాస్కర్ తదితరులు మాట్లాడారు. -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
గ్రీన్ ఫైనాన్స్ వ్యవస్థ పటిష్టం కావాలి..
ముంబై: గ్రీన్ ఫైనాన్స్ (వాతావరణ పరిరక్షణకు దోహదపడే పరిశ్రమలకు ప్రోత్సాహకంగా రుణాలు) వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వరరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పర్యవేక్షణ, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, ప్రమాణాల అభివృద్ధికి ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. ఆయా అంశాలకు సంబంధించి కొన్ని అవరోధాలు ఎదురైనా, వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. వాతావరణ పరిరక్షణ అంశాల్లో ఆర్బీఐ పాత్ర గురించి ఇక్కడ జరిగిన ఒక చర్చా గోష్ఠిలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ ఫోరమ్ ఈ చర్చాగోష్ఠిని నిర్వహించాయి. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమం వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. రాజేశ్వర రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు... కొత్త గ్రీన్ వెంచర్లకు ఆర్థిక సహాయం చేయడం మాత్రమే సరిపోదు. ఇప్పటికే ఉన్న ఉద్గార సంస్థలు ఉత్పత్తి లేదా వృద్ధి అంశాలపై రాజీ పడకుండా విశ్వసనీయమైన వాతావరణ అనుకూల పరివర్తన ప్రణాళికలను రూపొందించుకొని, అనుసరించాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల సహాయ సహాయసహకారాలు, కార్యాచరణ ప్రణాళికలు అవసరం. ఇది గ్రీన్ ఫైనాన్స్ మార్కెట్లో పారదర్శకత, ప్రామాణీకరణ, సమగ్రతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. సంవత్సరాలుగా గ్రీన్ ఫైనాన్స్ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి, వాటికి మద్దతు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ వివిధ విధాన చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు బ్యాంకుల ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) పోర్ట్‌ఫోలియోలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ను చేర్చడం జరిగింది. ఈ సంవత్సరం ప్రారంభంలో సావరిన్ గ్రీన్ బాండ్లను (ఎస్‌జీఆర్‌బీ) విజయవంతంగా జారీ చేయడంలో భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మద్దతు ఇచి్చంది. ఈ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల అమలుకు వినియోగించే విషయం తెలిసిందే. సావరిన్ గ్రీన్ బాండ్ల జారీ... ఇందుకు సంబంధించి ఇతర ఆర్థిక సాధనాల విషయంలో ధరను నిర్దారించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే దేశంలో గ్రీన్ ఫైనాన్సింగ్ పర్యావరణ వ్యవస్థకు ఉద్దేశించిన మార్కెట్ అభివృద్ధికి పురికొల్పుతుంది. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థపై వాతావరణ మార్పు ప్రభావాల గురించి ప్రపంచ దేశాల్లో అవగాహన పెరుగుతోంది. తదనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు, పర్యవేక్షకుల సానుకూల ప్రతిస్పందనలూ పెరుగుతున్నాయి. వాతావరణ సమస్యలు, సంబంధిత ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, ప్రణాళికలు రూపొందించడానికి సెంట్రల్ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎకానమీ భాగస్వామ్యులను సన్నద్ధం చేయడానికి పెద్ద ఎత్తున సామర్థ్య నిర్మాణ ప్రయత్నాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. తద్వారానే నూతన ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మూలధనాన్ని సమీకరించగలరు. స్థిరత్వ లక్ష్యాలను సాధించడానికి సమర్థవంతమైన పరివర్తన ప్రణాళికలను రూపొందించగలరు. వాతావరణ అనుకూల పారిశ్రామికీకరణ విషయంలో సూక్ష్మ, లఘు, మధ్య, చిన్న (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలపై పాత్ర ఎంతో కీలకం. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి వాతావరణ పరిరక్షణకు చర్యలు, ఆర్థిక కట్టుబాట్లు, అమలు సంతృప్తికరంగా లేదు. ఏమి చేస్తున్నారు– చేయవలసినది ఏమిటి అన్న అంశాల మధ్య అంతరం పెరుగుతోంది. ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల హామీకి భిన్నంగా 2020లో అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం 83.3 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. 2019తో పోల్చితే ఇది కేవలం 4 శాతం మాత్రమే పెరిగాయి. ఇలాంటి ధోరణి మారాలి. -
ఏపీ ప్రజలకు అలర్డ్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
-
ఆకాశం నుంచి పెద్ద శబ్థం.. భయాందోళనలో జనం.. అక్కడ ఏం జరిగింది!
వేలూరు(చెన్నై): జిల్లాలోని గుడియాత్తం సమీపంలో ఆదివారం రాత్రి ఆకాశం నుంచి ఒక వస్తువు పెద్ద శబ్దంతో కింద పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. గుడియాత్తం తాలూకా నెల్లూరుపేట పంచాయతీ పరిధిలోని లింగుండ్రం గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు పడింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చూశారు. అక్కడ పారాచూట్ లాంటి వస్తువు, సమీపంలో సిగ్నిల్ ఉన్న చిన్న పెట్టెను కనుగొన్నారు. గుడియాత్తం పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో సిగ్నల్స్ ఉన్న చిన్న పెట్టెలో కేంద్ర ప్రబుత్వ జాతీయ వాతావరణ కేంద్రం, మీనంబాక్కం, చెన్నై అనే చిరునామా, ఫోన్ నంబరు ఉండడంతో చెన్నైలోని వాతావారణ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించారు. దీంతో చెన్నై వాతావరణ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు సిగ్నల్స్ ఉన్న పెట్టె సహకారంతో పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వాటిని సేకరించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చదవండి: ఆరో తరగతిలోనే పెళ్లి.. నేనున్నానని తోడు నిలిచిన భార్య.. డాక్టర్ కొలువుకు ‘నీట్’గా -
World Environment Day: ‘వాతావరణ న్యాయం’ కోరుతున్నాం
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు అభివృద్ది చెందుతున్న, పేద దేశాలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాలను డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఒక సందేశం విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని, కలిసికట్టుగా పనిచేయాలి, ఈ విషయంలో సొంత ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. వాతావరణాన్ని చక్కగా కాపాడుకోవాలని, ప్రపంచదేశాలు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మొదట దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ తర్వాత పర్యావరణం గురించి ఆలోచిద్దామన్న ధోరణి ప్రపంచమంతటా పెరిగిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి అభివృద్ధి మోడల్‌తో విధ్వంసమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ అభివృద్ధి లక్ష్యాలు సాధించినప్పటికీ దాని మూల్యం ఇతర దేశాలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న తప్పుడు విధానాలను ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. ‘వాతావరణ న్యాయం’ కోసం అభివృద్ధి చెందిన దేశాల ఎదుట భారత్ బిగ్గరగా గొంతెత్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బడా దేశాల స్వార్థానికి చిన్న దేశాలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ అనేది భారతీయ సంస్కృతిలో వేలాది సంవత్సరాలుగా ఒక భాగంగా కొనసాగుతూ వస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరంచారు. 4జీ, 5జీ కన్టెక్టివిటీ మాత్రమే కాదు, మరోవైపు అడవుల పెంపకం చేపడుతున్నామని తెలియజేశారు. సింగిల్–యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రజలంతా సహకరించాలని కోరారు. గత ఐదేళ్లుగా ఈ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం స్పష్టమైన రోడ్డుమ్యాప్‌తో ముందుకెళ్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. -
విశాఖ ‘గ్రీన్’ప్లాంట్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం.. ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో.. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది. ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది. 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు. కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు. పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం నగర కాలుష్యాన్నీ తగ్గించేలా.. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు. కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు. -
భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్‌లో గ్రీన్ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ.. కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
వాన దంచికొడితే ఆగమాగమే! మరి 20 లక్షల ఏళ్లపాటు కురిస్తే.. ఏంటి పరిస్థితి?
వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమి పొరలను పరిశీలిస్తుండగా.. 1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు.. 23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు. తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి.. కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది. డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి.. కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి. భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్‌మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు.. ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్‌మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు. -
తెలంగాణ: రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కొనసాగిన ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరో రెండ్రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 37.9 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 19.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
ఇకనైనా కళ్ళు తెరుస్తారా?
ప్రపంచానికి మరోసారి ప్రమాద హెచ్చరిక. పారిశ్రామికీకరణ మునుపటి స్థాయితో పోలిస్తే పుడమి తాపం ఇప్పటికే 1.1 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఈ లెక్కన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలనీ, ఈ శతాబ్ది చివరకు భూతాపోన్నతి 1.5 డిగ్రీల లోపలే ఉండేలా చూసు కోవాలనీ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు తీరా రానున్న పదేళ్ళలోనే పూర్తిగా భగ్నం కానున్నాయి. ‘ఆఖరి అవకాశంగా తెరిచి ఉన్న తలుపు సైతం మూసుకుపోతోంద’ని ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తల బృందం ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’(ఐపీసీసీ) చేసిన హెచ్చరిక మానవాళికి మేలుకొలుపు. ఇప్పటికైనా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు తక్షణం బరిలోకి దిగితే, ఎంతో కొంత ప్రయోజనమని సోమవారం నాటి తాజా నివేదిక కర్తవ్యాన్ని బోధిస్తోంది. వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన సంపన్న దేశాలు దీన్ని చెవి కెక్కించుకోకుండా, వర్ధమాన, నిరుపేద దేశాలదే బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుండడమే ఇప్పుడున్న చిక్కు. విషాదం ఏమిటంటే– పాపం ఎవరిదైనా, ఫలితం ప్రపంచమంతా అనుభవించాల్సిందే! ఐపీసీసీ 1988లో ఏర్పాటైన నాటి నుంచి ఇది ఆరో నివేదిక. ఈ ఆరో అంచనా నివేదిక (ఏఆర్6) కు సంబంధించిన నాలుగో విడత వివరాలివి. ఇదే ఆఖరి విడత కూడా! మునుపటి మూడు ప్రధాన విభాగాల నివేదికలోని కీలక సమాచారాన్ని ఒకచోట గుదిగుచ్చి అందిస్తున్నారు గనకనే ఈ చివరి దాన్ని ఐపీసీసీ ఏఆర్6 ‘సంకలన నివేదిక’ అన్నారు. 2021 ఆగస్ట్, 2022 ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో వచ్చిన మొదటి మూడూ వాతావరణ సంక్షోభం, దాని పర్యవసానాలు, గ్రీన్హౌస్ వాయువులను తగ్గించే మార్గాల గురించి చెప్పాయి. తాజా ‘సంకలన నివేదిక’ ప్రధానంగా మునుపటి ప్రచురణ ల్లోని కీలక ఫలితాల పునశ్చరణ. భూతాపం ‘మళ్ళీ తగ్గించలేని స్థాయికి’ చేరుతోందనీ, మానవాళికి దుష్పరిణామాలు తప్పవనీ, కఠిన చర్యలతోనే ప్రమాదాన్ని నివారించగలమనీ ఇది హెచ్చరిస్తోంది. అపార ధనబలం, సాంకేతిక సామర్థ్యం తమ సొంతమైన ధనిక దేశాలు కేవలం అప్పులు, ప్రైవేట్ రంగ పెట్టుబడులిచ్చి వాతావరణ పరిరక్షణ చర్యకు సహకరించామని చేతులు దులుపుకొంటే సరిపోదు. ఈ 2020 –30 మధ్య ఇప్పుడు చేస్తున్న దానికి కనీసం 6 రెట్లయినా వాతావరణంపై పెట్టుబడి పెడితే తప్ప, తాపోన్నతిని 1.5 డిగ్రీల లోపు నియంత్రించే లక్ష్యం సాధ్యం కాదట. అలాగే, 2020 నాటి స్థాయిలోనే మన వాతావరణ విధానాలు బలహీనంగా ఉంటే, ఈ శతాబ్ది చివరకు భూతాపం 3.2 డిగ్రీలు పెరుగుతుంది. ఒకసారి 1.5 డిగ్రీలు దాటి ఎంత పెరిగినా, ఆ వాతావరణ నష్టం పూడ్చలేనిది. మానవాళికి మహా విపత్తు తప్పదు. పెను ప్రభావం పడే దేశాల్లో భారత్ ఒకటని నివేదిక తేల్చింది. వడగాడ్పులు, కార్చిచ్చులు, ఆకస్మిక వరదలు, సముద్రమట్టాల పెరుగుదల,పంటల ఉత్పత్తి తగ్గుదల, 2050 నాటికి 40 శాతం జనాభాకు నీటి కొరత – ఇలా పలు ప్రమాదాలు భారత్‌కు పొంచివున్నాయి. అయితే, వాతావరణ మార్పుల నివారణ భారాన్ని అందరూ పంచు కోవాలనే ‘వాతావరణ న్యాయ’ సూత్రానికి ఈ నివేదిక జై కొట్టడం మన లాంటి దేశాలకు ఊరట. మునుపు మూడు విడతల్లో ప్రచురించిన వేలకొద్దీ శాస్త్రీయ సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు వారు చేపట్టాల్సిన చర్యలను సారాంశరూపంలో అందించడం తాజా సంకలన నివేదిక ప్రత్యేకత. నవంబర్ 20న దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్య మివ్వనున్న ఐరాస తదుపరి వాతావరణ సదస్సు ‘కాప్ 28’కు ఈ నివేదిక ఒక దిక్సూచి. 2015లో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నాటి నుంచి నేటి వరకు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో వివిధ దేశాల పురోగతిని ఆ ‘కాప్ 28’లో మదింపు చేస్తారు. ఇప్పటి దాకా చేస్తున్నవేవీ చాలట్లేదని తాజా నివేదిక సాక్షిగా తెలుస్తూనే ఉంది. వెరసి, వాయు ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో ప్రభుత్వా లన్నీ విఫలమయ్యాయి. నిజానికి, ఐపీసీసీ ఓ సమగ్ర నివేదిక ఇచ్చేందుకు 6 నుంచి 8 ఏళ్ళు పడుతోంది. అయినా గ్రీన్హౌస్ గ్యాస్‌లు పెరుగుతూనే ఉన్నాయి. నివేదికల పరిమాణం, సంక్షోభంపై చర్యల అత్యవసరం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు కఠిన చర్యలు చేపట్టకుంటే, ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టే! ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధనంపైనా – ఇతర తక్కువ కర్బన సాంకేతికతల పైనా దృష్టి సారించి శిలాజ ఇంధనాల వినియోగం మానేయడం, అటవీ పెంపకం లాంటివి ప్రభుత్వాలు చేయాల్సిన పని. అలాగే, ‘వాతావరణాన్ని బాగు చేసే’ మార్గాల్ని అన్వేషించాలి. గాలిలో నుంచి కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసే ‘డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్’ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలి. ఐరాస ప్రధాన కార్యదర్శి మాట విని, ధనిక దేశాలు 2040 నాటికి ‘నెట్ జీరో’ను అందుకొనేలా తమ లక్ష్యాన్ని ముందుకు జరుపుకొంటే మంచిది. ఈ దేశాలు తమ వాతావణ బాధ్యతను నిర్వర్తించేలా చూడడం ఇప్పుడు సవాలు. ధనిక ప్రపంచపు బాధ్యతారహిత, మొండి వైఖరికి మిగతా అందరూ మూల్యం చెల్లించాల్సి రావడం మహా దారుణం. ఐపీసీసీ తదుపరి నివేదిక 2030లో కానీ రాదు. కాబట్టి భూతాపోన్నతిని 1.5 డిగ్రీల లోపలే నియంత్రించేలా చర్యలు చేపట్టడా నికి ఈ ఏఆర్6 తుది ప్రమాద హెచ్చరిక. మేల్కొందామా? లేక కళ్ళు తెరిచి నిద్ర నటిద్దామా? ప్రస్తుతం ఛాయిస్ ప్రపంచ దేశాలదే! ఒకసారి పరిస్థితి చేయి దాటేశాక మాత్రం ఏం చేసినా ఫలితం శూన్యం. -
అయ్యో.. ఏంటి ఈ దారుణం, లక్షల్లో చేపల మృత్యువాత!
ప్రకృతి అనేది మానవులకి లభించిన అద్భతమైన వరం. అయితే మనమే అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రమంలో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాం. ఆ ఫలితాలే.. ఆకస్మిక వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుఫాను, భూకంపాలు వంటివి ప్రజల్ని పలకరిస్తూ తీవ్ర నష్టాలను తీసుకొస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ నదిలో లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ దారుణానికి కారణమేంటి, అక్కడ ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో రెండో పొడవైన నదిగా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్ నది పేరు గాంచింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర రాజధాని సిడ్నీకి పశ్చిమాన 1,000కిమీ (620 మైళ్లు) దూరంలో ఉన్న ఈ నదిలో ఎటు చూసిన కిలోమీటర్ల మేర చేపలు నిర్జీవంగా తేలియాడుతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. దీన్ని పరిశీలించిన అధికారులు వరద నీరు తగ్గుముఖం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడమే భారీ స్థాయిలో చేపల మృత్యువాతకు కారణమని తెలిపారు. 2018, 2019లోనూ ఇదే తరహాల వేల సంఖ్యలో చేపలు చనిపోయాయి. ఇటీవలి వరదల తరువాత నదిలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయని తెలిపారు. ఈ సమస్యను అంచనా వేసేందుకు రాష్ట్ర మత్స్య అధికారులను ఆ ప్రాంతానికి పంపినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
సేవ్ స్పారో
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. కాపాడుతున్న పక్షి ప్రేమికులు గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. ‘స్ఫూర్తి’ నింపుతున్నారు పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు. పిచ్చుకలను కాపాడుకోవాలి పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుకతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది. మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్, విజయవాడ -
వేసవి మంటలు?.. అదే జరిగితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్: చలి తగ్గింది. మధ్యాహ్నం ఎండ.. అప్పుడే వేసవి వచ్చిందా? అన్నట్టుగా ఉంటోంది. ఈసారి ఎండలు మండిపోతాయా? అని కూడా అనిపిస్తోంది. అమెరికా వాతావరణ పరిశోధన సంస్థ జనవరి అంచనాలు కూడా వేసవి ఉష్ణోగ్రతలు మోత మోగిపోతాయని వెల్లడించడం ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశం మొత్తమ్మీద గత మూడేళ్లలో వర్షాలకు ఏమాత్రం కొదవ లేకుండా పోయింది. అదే సమయంలో వేసవిలో విపరీతమైన వడగాడ్పులు వీచాయి. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో గత ఏడాది శీతాకాలం చలి వణికించింది. వాతావరణంలో వస్తున్న మార్పులకు ఇవన్నీ తార్కాణాలే. కాగా నాలుగేళ్ల విరామం తరువాత ఈ ఏడాది వేసవి సమయంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చని, ఎండలు అసాధారణంగా ఉండే అవకాశం ఉందని అమెరికా పరిశోధకులు స్పష్టం చేశారు. లా నినా నుంచి ఎల్ నినో వైపు? అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఈ ఏడాది వాతావరణంపై గత నెలలో ప్రాథమిక అంచనాలను వెలువరించింది. దాని ప్రకారం ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టుల్లో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడేందుకు యాభై శాతం అవకాశం ఉండగా.. జూలై మొదలుకొని సెపె్టంబర్ వరకు ఏర్పడేందుకు 58 శాతం అవకాశాలున్నాయి. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ చుట్టుపక్కల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడాన్ని ఎల్ నినో అని పిలుస్తారు. ఇదే ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గితే అది లా నినా అవుతుంది. కాగా దేశంలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు కారణమైన లా నినా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఎల్ నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే కచి్చతంగా ఇలాగే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. రానున్న మూడు నాలుగు నెలల్లో పరిస్థితులు మారినా మారవచ్చని వీరు అంటుండటం ఊరటనిచ్చే అంశం. ఎన్ఓఏఏ మాదిరిగానే భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) కూడా ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశాలే ఎక్కువని చెబుతోంది. అయితే ఎల్ నినో సీజన్ మొదలయ్యేందుకు ఇంకా మూడు నాలుగు నెలలు ఉన్నందున ఈ అంచనాలు తప్పు కావచ్చునని కూడా పేర్కొంది. కాగా ఈ నెలాఖరుకు తాజా అంచనాలను విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్ ఎం.మహాపాత్ర తెలిపారు. సమాచారం ఆందోళనకరమే: స్కైమెట్ ఈ ఏడాది ఎల్ నినో, లా నినా పరిస్థితులపై అందిన ప్రాథమిక సమాచారం ఆందోళనకరంగానే ఉందని దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్‌కు చెందిన మహేశ్ పలవట్ చెబుతున్నారు. ‘పరిస్థితులు లా నినా నుంచి ఎల్ నినో వైపునకు మారుతున్నాయంటేనే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం. రుతుపవనాల సమయంలో ఎల్ నినో ఏర్పడితే ఈ ఏడాది వర్షాలు తగ్గుతాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. 2020లోనే లా నినా పరిస్థితులు ఏర్పడి, ప్రస్తుతం కూడా అదే కొనసాగుతున్నా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో ఉండటం, గత ఏడాది కొన్నిసార్లు విపరీతమైన వడగాడ్పులు నమోదు కావడం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫ్రిబవరి, మార్చిల్లోనూ ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం అసాధారణ స్థాయిలో ఉండవచ్చు..’ అని పలవట్ పేర్కొన్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోమన్నాం.. మధ్యమ స్థాయి ఎల్ నినో రుతుపవనాలపై ప్రభావం చూపగలదు. దీనివల్ల కురిసే వర్షాల మోతాదు తగ్గుతుంది. కానీ ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రం రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో ఉంటాయని చెప్పలేం. రానున్న మూడు నాలుగు నెలల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రాల ఉపరితల జలాల ఉష్ణోగ్రతల్లో తేడాల ఆధారంగా రుతుపవనాల తీవ్రతలో తేడాలు రావచ్చు. మొత్తం మీద ఈ సారి ఎండలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించాం. – ఎం.రాజీవన్, ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సగటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉష్ణోగ్రతలు నమోదు చేయడం మొదలుపెట్టిన తరువాత అత్యధిక వేడి నమోదైన సంవత్సరాల్లో 2022ది ఐదో స్థానం. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఈ రికార్డులు చెరిగిపోయే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు శతాబ్దం క్రితంతో పోలిస్తే 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు పెరగవచ్చునని అంచనా. గత ఏడాది భారత్‌లో కనీసం తొమ్మిది నగరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఉత్తర, వాయువ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు రావచ్చని గత ఏడాది ఐఎండీ హెచ్చరించింది. సముద్ర జలాలు వెచ్చబడితే అధిక ఉష్ణోగ్రతలు లా నినా పరిస్థితుల్లో తూర్పు నుంచి పశ్చిమం వైపు వీచే వాణిజ్య పవనాలు బలంగా ఉంటాయి. దీనివల్ల సముద్ర ఉపరితలంపై ఉండే వెచ్చటి నీరు పశి్చమ దిక్కుకు ఎక్కువగా కదులుతుంది. అదే సమయంలో సముద్రపు లోపలి భాగంలోని శీతల జల ప్రవాహాలు తూర్పువైపునకు ప్రయాణిస్తాయి. అధిక వర్షాలకు కారణమవుతాయి. ఎల్ నినోలో పరిణామాలు మాత్రం దీనికి వ్యతిరేక దిశలో ఉంటాయి. వాణిజ్య పవనాలు బలహీనపడి ఉపరితలంపైని వెచ్చటి నీరు తూర్పు దిక్కుకు అంటే మన వైపు ప్రయాణిస్తుంది. అప్పటికే చల్లగా ఉన్న నీటిని ఇవి వెచ్చబెడతాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇండోనేసియా, ఆ్రస్టేలియాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గాల్లో తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడిపోతాయి. కరువులు, కార్చిచ్చులు ఎక్కువవుతాయి. -
Climes: కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ.. కాఫీ తాగినంత సులువు!
‘కర్బన తటస్థత’.. ‘కర్బనరహితం’ గురించి మాట్లాడటానికి ‘కాప్26’ మాత్రమే వేదిక కానక్కర్లేదు. మన ఇల్లు కూడా అందుకు వేదిక కావచ్చు. పర్యావరణ అనుకూల జీవనశైలికి వ్యవస్థాగత ప్రయత్నాలే కాదు, వ్యక్తిగత స్థాయిలో జరిగే ప్రయత్నాలు కూడా ముఖ్యం అని నమ్ముతుంది క్లైమెస్... ‘ఇచట ఉంది...అచట లేదు’ అని కాకుండా ఎక్కడ చూసినా కర్బన ఉద్గారాలు కలవరపరుస్తూనే ఉన్నాయి. కర్బన ఉద్గారాలు అనే మాట వినబడగానే పెద్ద పెద్ద పరిశ్రమలు మాత్రమే మనకు గుర్తుకు వస్తాయి. అయితే మెయిల్, మెసేజ్‌లు పంపడం, ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ రూపాల్లో కర్బన ఉద్గారాలు వెలువడడానికి మనం ఏదో రకంగా కారణం అవుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో 3.7 శాతం వాటా ఇంటర్నెట్, వివిధ రకాల గ్యాడ్జెట్లదే. విమానాల నుంచి వెలుబడే ఉద్గారాలకు ఇది సమానం! ఈ నేపథ్యంలో బెంగళూరు, దిల్లీ కేంద్రంగా సిద్దార్థ జయరామ్, అనిరుథ్ గుప్తాలు క్లైమెట్ యాక్షన్ ఫైనాన్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్ క్లైమెస్ మొదలుపెట్టారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పొలిటికల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసిన అనిరుథ్ గుప్తా ఒక స్వచ్ఛందసంస్థను మొదలుపెట్టాడు. ఆ తరువాత జయరామ్‌తో కలిసి ‘క్లైమెస్’కు శ్రీకారం చుట్టాడు. జయరామ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్ చేశాడు. హోటల్లో కప్పు కాఫీ తాగడం నుంచి విమాన ప్రయాణం వరకు వివిధ కారణాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది క్లైమెస్. ‘క్యాలిక్లెట్, ట్రాక్ అండ్ రెడ్యూస్’ అనే నినాదంతో కర్బనరహిత విధానాల ఆచరణపై అవగాహన కలిగిస్తుంది. రిలయన్స్‌తో సహా దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్దిష్టమైన కాలవ్యవధితో శూన్య ఉద్గారాల స్థాయికి చేరాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని కృషి చేస్తున్నాయి. 2070 నాటికి జీరో ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనేది మన దేశ లక్ష్యం. అది విజయవంతం కావాలంటే వ్యవస్థగతంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా కార్యాచరణ కావాలి. దీనికి క్లైమెస్ నిర్మాణాత్మక రూపాన్ని ఇస్తుంది. ‘తెల్లారి లేచింది మొదలు ఏదో ఒక సమయంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ప్రభావం గురించి ఆందోళన పడుతుంటాం. మనిషి మనుగడ, కర్బన ఉద్గారాలు అవిభాజ్యం అని కూడా అనిపిస్తుంటుంది. కాని ఇది నిజం కాదు. కర్బన తటస్థత, కర్బనరహిత వ్యవస్థ సాధ్యమే. అది జటిలమైన ప్రక్రియ కాదు. కాఫీ తాగినంత సులువు’ అంటోంది క్లైమెస్. ప్రస్తుతం ఎనిమిది బ్రాండ్లతో మాత్రమే కలిసి పనిచేస్తున్న ‘క్లైమెస్’ ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అయితే దానికి బలమైన భవిష్యత్ ప్రణాళిక ఉంది. ‘రాబోయే నెలల్లో కొన్ని బ్రాండ్ల నుంచి ఎన్నో బ్రాండ్లకు విస్తరిస్తాం’ అనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు జయరామ్. ‘క్లైమెట్–పాజిటివ్ ఫీచర్స్‌తో సులభంగా యాక్సెస్ అయ్యే సౌకర్యం, పారదర్శకత, ఆర్థిక భారం లేకుండా ఉంటే ప్రజలు మనకు మద్దతు ఇస్తారు’ అంటున్నాడు అనిరుద్. రాబోయే కాలంలో మనకు ఎదురయ్యే అతి పెద్ద సవాలు వాతావరణంలో చోటు చేసుకొనే మార్పులు. ‘మన వంతుగా ఏ ప్రయత్నం చేయకపోతే భవిష్యత్ మసక బారే ప్రమాదం ఉంది’ అని హెచ్చరిస్తున్నారు ఇద్దరు మిత్రులు. వ్యక్తిగత స్థాయిలో మనం ఏంచేయగలం అని తెలుసుకోవడానికి ‘క్లైమెస్’ సైట్లోకి వెళితే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కొత్త దారి దొరుకుతుంది. చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా.. Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. -
సరకు రవాణా ఖర్చులు తగ్గించాలి
సాక్షి, న్యూఢిల్లీ : వాటాదారులు మధ్య సహకారం, సమన్వయం, కమ్యునికేషన్లతో సరకు రవాణా ధరను 14 శాతం, 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ పిలుపునిచ్చారు. తద్వారా ఎగుమతుల్లో 50 శాతం పెరుగుదల సాధించొచ్చని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో‘ క్లైమేట్ గోల్స్: టెక్నలాజికల్ రోడ్ మ్యాప్ టు నెట్ జీరో ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సమాజానికి ముఖ్యమైన మూలస్తంభాలని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు ఒక బృందంగా కలిపి పని చేస్తూ ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరసం ఉందన్నారు. భారతదేశంలో యువ ప్రతిభావంతులైన ఇంజినీరింగ్ మానవశక్తితోపాటు తక్కువ కార్మిక వ్యయంతో దేశీయ మార్కెట్ ఉందన్నారు. బయో ఇథనాల్, బయో సీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఆవశ్యకత వివరించారు. ఏటా 16 లక్షల కోట్ల శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల చాలా కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి 27 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు రూపొందించాలని నిర్ణయించామని కేంద్రమంత్రి గడ్కరీ వివరించారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
ఎండలు తగ్గేదేలే.. ఏకంగా 122 ఏళ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: వేసవి రాగానే భానుడు తగ్గేదేలే అన్నట్లు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రత్యేకంగా దేశంలోని వాయువ్య, మధ్య భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు వేసవి తాపాన్ని నుంచి బయటపడేందుక ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరుసగా 35.9, 37.78 డిగ్రీల సెల్సీయస్ నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ స్థాయి సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం 122 ఏళ్లలో ఇది నాలుగో సారి. మార్చి, ఏప్రిల్‌లలో అధిక ఉష్ణోగ్రతలు నిరంతర తక్కువ వర్షపాతం కారణంగా ఉన్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. దేశంలోని వాయువ్య, పశ్చిమ మధ్య భాగాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. మే నెలలో ఎండ వేడి మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా.. పలు ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అలాగే తీవ్ర ఆగ్నేయ ద్వీపకల్పంలో మేలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. చదవండి: ఇండియన్ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు! -
‘మంచు’కొస్తోందా..?
కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకునేందుకు వీల్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న సూర్యుడిపై జరిగే కార్యకలాపాలకూ వీటికి సంబంధం ఉందన్నది వీరి వాదన. సన్‌స్పాట్స్‌కు, మంచుకు లింకేంటి? సన్‌స్పాట్స్‌లో హెచ్చుతగ్గులకు.. భూమిపై మంచు పడేందుకు సంబంధం ఉంది. సన్‌స్పాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సూర్యుడిపై జరిగే పేలుళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే సూర్యుడి నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ప్లాస్మాలోని కణాలు కాస్తా భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వాతావరణం పైపొరల్లో భారీస్థాయి మేఘాలు ఏర్పడతా యని అంచనా. సూర్యరశ్మి తగ్గిపోయేందుకు, అదే సమయంలో అధిక వర్షాలు/వరదలకూ ఇది కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్య రశ్మి తగ్గిపోతే భూ ఉష్ణోగ్రతలూ తగ్గిపోతాయి. ఎంత? ఎక్కడ? ఎలా? 1645 నాటి పరిస్థితులను తీసుకుంటే.. అప్పట్లో సూర్యుడి నుంచి వెలువడే శక్తి ప్రతి చదరపు మీటర్‌కు మూడు వాట్ల వరకూ తగ్గిందని లెక్క. ఈ చిన్న మార్పుకే బ్రిటన్ మొదలుకొని అనేక యూరోపియన్ దేశాలు మంచులో కూరుకుపోయాయి. నదులు గడ్డకట్టిపోయాయి. శీతాకాలం ఎక్కువ సమయం కొనసాగింది. సూర్యుడిపై సన్‌స్పాట్స్ వేగం పుంజుకోకపోతే ఈసారి కూడా భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ వరకూ పడిపోతుందని అంచనా. అదే జరిగితే భూ ఉత్తరార్ధ గోళంలో చాలాదేశాల్లో మంచు ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లోనూ మంచు కురవడం ఎక్కువ అవుతుంది. 2020 సెప్టెంబర్ తరువాత సన్‌స్పాట్స్ ఏర్పడటం కొంచెం ఎక్కువైనప్పటికీ.. 2023 నాటికి అది పతాకస్థాయికి చేరుకుని 2030 నాటికి కనిష్టానికి చేరతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మికత రానున్న 30 ఏళ్లలో ఏడు శాతం వరకూ తక్కువ కావొచ్చని అంటున్నారు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదని అంటోంది. సన్‌స్పాట్స్ తగ్గినా.. దాని ప్రభావం కంటే కాలుష్యం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆరు రెట్లు ఎక్కువని చెబుతోంది. అంటే.. సూర్యుడిపై ఏర్పడే మచ్చలు వందేళ్లపాటు తక్కువగా ఉన్నా.. భూమి ఉష్ణోగ్రతలు మాత్రం పెద్దగా తగ్గవని అంటోంది. అంతా సూర్య భగవానుడి మహత్తు.. ► మినీ మంచుయుగం గురించి అర్థం చేసుకోవాలంటే సూర్యుడి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయ స్కాంత శక్తి తీవ్రతల్లో తేడాల కారణంగా సూర్యుడిపై పెద్ద పెద్ద పరిమాణాల్లో మచ్చల్లాంటివి ఏర్పడుతుంటాయి. వీటి సంఖ్య కొన్నేళ్లు పెరుగుతూ.. ఇంకొన్నేళ్లు తగ్గుతూ ఉంటాయి. ఈ కాలాన్ని సోలార్ సైకిల్ అం టారు. 1912 నుంచి 24 సోలార్ సైకిల్స్ పూర్తి కాగా.. ఇప్పుడు 25వ సైకిల్ నడుస్తోంది. 2019లో వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో సన్‌స్పాట్స్ ఏర్పడగా ఆ తరువాతి ఏడాది పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తలు లెక్కలేశారు. కానీ, 2020 సెప్టెంబర్ వరకూ ఈ సన్‌స్పాట్స్ పెరగలేదు. అప్పుడెప్పుడో 1645–1710 సంవత్సరాల మధ్య ఇలాగే సూర్యుడిపై అతి తక్కువ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయని.. మాండర్ మినిమం అని పిలిచే ఈ కాలంలోనే భూ ఉత్తరార్ధ గోళం మంచులో మునిగిపోయిందని చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉందన్న అంచనా ఏర్పడింది. -
వాతావరణంపై పరిశోధనలకు పట్టం
స్టాక్‌హోమ్: వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు ఈ ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్ హాసెల్మాన్ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు పునాదులేసినందుకు స్యూకోరో మనాబే, క్లాస్ హాసెల్‌మాన్‌లకు అవార్డులో సగభాగం నగదు బహుమతి లభించగా.. సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు సహకరించిన జియోర్గియో పరిసికు మిగిలిన సగం నగదు దక్కనుంది. భూ వాతావరణం సంక్లిష్టమైందనడంలో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. ఎక్కడో దక్షిణ అమెరికా తీరప్రాంతంలోని సముద్ర ఉపరితల జలాలు కొంచెం వేడెక్కితే దాని ప్రభావం ఎల్‌నినో రూపంలో భారత్‌లో వ్యక్తమవుతుంది. రుతుపవనాలు బలహీనపడి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతుంటాయి. సముద్రాల్లోని జల ప్రవాహాలు మొదలుకొని వాణిజ్య వాయువులు, కొండలు, గుట్టలు, ఉష్ణోగ్రతల్లో తేడాలు, జీవజాతులు, అటవీ విస్తీర్ణంలో మార్పులు ఇలా.. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు ప్రిన్స్టన్ యూనివర్శిటీకి చెందిన స్యూకోరో మనాబే 1960లలోనే ప్రయోగాలు చేశారు. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయో మనాబే పరిశోధనల ద్వారా తెలిసింది. మనాబే సొంతంగా భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేసి.. అందులో రేడియో ధార్మికత సమతౌల్యం, గాలి నిట్టనిలువుగా పైకి ఎలా వెళుతుంది? వంటి అంశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. వీటి ఫలితంగా ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్ మోడల్స్ సిద్ధమయ్యాయి. మనాబే పరిశోధనలు ఒకవైపున ఉంటే...పదేళ్ల తరువాత జర్మనీలోని మ్యాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మీటిరియాలజీకి చెందిన క్లాస్ హాసెల్మాన్ స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు. తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్ మోడల్స్ ఎలా నమ్మదగ్గవో క్లాస్ హాసెల్మాన్ మోడల్ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ. వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు అవసరం: పరిసీ భూ వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విషవాయువుల మోతాదు పెరిగిపోవడం వల్ల వస్తున్న వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు మానవాళి వేగంగా.. గట్టి సంకల్పంతో తక్షణం చర్యలు చేపట్టాలని ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు అందుకున్న వారిలో ఒకరైన జియోర్గియో పరిసీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడు చర్యలు చేపట్టాల్సిందేనని ఆయన అవార్డు ప్రకటించిన తరువాత మాట్లాడుతూ స్పష్టం చేశారు. అంతకుముందు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో నోబెల్ అవార్డు కమిటీ ప్రతినిధి గోరాన్ హాన్సన్... క్లాస్ హాసెల్మాన్, స్యూకోరో మనాబేలతోపాటు జియోర్గియో పరిసీలు ముగ్గురికి ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హాన్సన్ మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది గుర్తించిన ఆవిష్కరణలు వాతావరణానికి సంబంధించిన మన విజ్ఞానం గట్టి శాస్త్రీయ పునాదులపై ఏర్పడిందన్న విషయం స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది అవార్డు గ్రహీతలందరూ సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలను మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు సాయపడ్డవారే’ అని వ్యాఖ్యానించారు. -
న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
న్యూఢిల్లీ: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులు కారణంగా దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఢిల్లీ నగరం కాస్త చల్లబడడంతో మే నెలలో ఏకంగా ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 70 ఏళ్లలో మే నెలలో ఇంత స్వల్ప స్థాయికి చేరడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో కాలుష్యం కారణంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు ప్రతీ ఏటా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు 1951లో నమోదైన 23.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలే అత్యల్పంగా ఉండేది. కానీ ప్రసుత టౌటే తుపాను ప్రభావం వర్షాలు కురవడం వాతావరణం చల్లబడడంతో దేశరాజధానిలో 70 ఏళ్ల రికార్డు చెరిగిపోయిందని ఐఎండీ ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మధ్యలో 1982 మే 13 న 24.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయి నమోదైందని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత నమోదైన ఉష్ణోగ్రత 1951 కంటే అత్యల్పమని ఆయన అన్నారు. 35 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షాలు ఢిల్లీలో టౌటే తుపాను కారణంగా బుధవారం రాత్రి 8.30 గంటల వరకు 60 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లలో బుధవారం కురిసిన వర్షపాతం టౌటే తుపాను, పాశ్చాత్య కారణాల ఫలితంగా ఏర్పడిందని ఐఎండి తెలిపింది. ఇంతకుముందు 1976 లో మే 24 న 24 గంటల వ్యవధిలో రాజధాని 60 మిమీ వర్షపాతం నమోదైంది. నిన్నటి వర్షపాతంతో, ఇప్పటి వరకు ఉన్న మునపటి గణాంకాలను ఇది చెరిపేసిందని జాతీయ వాతావరణ అంచనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కె జెనమణి అన్నారు. మే నెలలో వాతావరణం పొడిగా ఉంటుంది, సాధారణంగా ఈ నెలలో ఢిల్లీలో గరిష్ఠంగా 30-40 మిల్లీ మీటర్ల వర్షం (24గంటల్లో) నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫానుకు పాశ్చాత్య అవాంతరాలు తోడవడంతో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైందని ఆయన చెప్పారు. చదవండి: ఢిల్లీ సీఎం ట్వీట్‌పై సింగపూర్ విదేశాంగ మంత్రి ఫైర్ -
కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ
వాషింగ్టన్: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని .. వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!) అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తాము గర్తించినట్లు ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు. ఫ్లూ జాతికి చెందిన వైరస్ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’) బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్ తెలిపారు. వాతావరణం వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్ తెలిపారు. -
ఇళ్లు తగులబడకుండా ‘గులాబీ పౌడర్’
ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు బుధవారం కూడా కొనసాగుతోంది. అటవి శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలు అంటుకోకుండా అడ్డుకోగల అమ్మోనియంతో తయారు చేసిన ఓ రకమైన గులాబీ ఎరువుల పొడిని హెలికాప్టర్ల ద్వారా ఇంటి కప్పులపైనా, పక్కనున్న పొదలపైన, కార్లపైన చల్లుతున్నారు. ఈ పౌడర్‌లో అమ్మోనియంతోపాటు డైఅమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది మంటలు వ్యాపించకుండా ఉంటుందని, అయితే ఘాటైన వాసన కలిగిన ఈ పౌడర్ వల్ల శ్వాస ఇబ్బందులు, చర్మంపై దద్దులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌడరుకు దూరంగా ఉండే వాళ్లకన్నా పౌడరు చల్లే వారు, వాటిని మోసుకొచ్చే వారికే ఈ ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తులై తగిన సూచనలు చేశారు. కార్లపైన, వాహనాలపైన పడిన గులాబీ పౌడరును నీటితో డైల్యూట్ చేసి, డిటర్జెంట్, బ్రష్‌లు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని, ఆ సందర్భంగా చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, కాళ్లకు జారిపోని బూట్లను ధరించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి 220 డాలర్ల జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. మంటల నుంచి నివాస ప్రాంతాలను రక్షించడం కోసం మంగళవారం అమ్మోనియంతో కూడి గులాబీ పౌడర్‌ను చల్లామని, ఇదే విష పదార్థం కాదని రూరల్ ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి ఇన్స్పెక్టర్ బెన్ షెపర్డ్ మీడియాకు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చని అన్నారు. ఈ పౌడరు బారిన పడిన వారు నీళ్లతో ఒళ్లంతా శుభ్రం చేసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రతించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పర్యావరణ కార్యకర్త ఎరిన్ బ్రొకోవిచ్ హెచ్చరిస్తున్నారు. -
‘వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దృష్ట్యా, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలెప్మెంట్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దానిలో భాగంగానే పౌరులందరికీ మంచి వాతావరణం ఉండాలని విస్తృత స్థాయిలో నిర్వచనం చెప్పినట్లు జస్టిస్ స్వతంత్ర కుమార్ అభిప్రాయపడ్డారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ఒక్క ప్లాస్టిక్ బాటిల్ వల్ల 20 మందికి కాన్సర్.. సమావేశంలో స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో 785 మిలియన్ల ప్రజలకు సురక్షిత మంచినీరు దొరకడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వాతావరణాన్ని నాశనం చేస్తుండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యత. ఢిల్లీలో విద్యార్థులకు బ్లాక్ మాస్కులు ధరించి పాఠశాలకు వెళ్తున్నారు. భవిష్యత్తు తరాలకు పాడైపోయిన వాతావరణ పరిస్థితులు ఇవ్వడం ఎంతవరకు సబబు. కోర్టుల జోక్యం కారణంగా పర్యావరణం కొంత కాపాడు కలుగుతుంది. అడవులు, పర్యావరణ పరిరక్షణకు పటిష్ట విధానాలు రావాలి. చెరువుల నగరంగా ఉన్న బెంగుళూర్లో చెరువులన్నీ మాయం అయ్యాయి. ఢిల్లీలో 1650 మెట్రిక్ టన్నుల చెత్త జమ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ కాల్చడం వల్ల 20 మందికి కాన్సర్ రోగాలు వచ్చే ప్రమాదం. పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. పర్యావరణ చట్టాలు అనేకం వున్నాయి, కానీ అమలు జరగడం లేదు. కాలుష్యానికి సరిహద్దులు లేవు, అందరూ పర్యావరణ పరిరక్షణ చేయాలి. సమిష్టిగా ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని అన్నారు. భయానక పరిస్థితులు తప్పవు.. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారరి ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అన్నారు. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి యూనియన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అనంతగిరిలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. లేదంటే చెన్నై నీటి కరువు, ముంబై వరదలు, ఢిల్లీ వాయు కాలుష్యము తరహాలో భయానక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి కరువు కారణంగా చెన్నైలో ఆఫీసులు రైల్వేలు సైతం తమ సర్వీసులో నిలిపివేయాల్సి వచ్చింది.’ అని పేర్కొన్నారు. గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి.. రెన్యువబుల్ ఎనర్జీపై ప్రపంచమంతా దృష్టిసారించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బూరెలాల్ అభిప్రాయపడ్డారు. ‘సోలార్ ఎనర్జీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. అప్పుడే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మన అవసరాలు తీరవు పర్యావరణానికి హాని జరుగుతుంది. దీనివల్ల వాయు, భూమి, నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భూమి కేవలం ఎనిమిది బిలియన్ల ప్రజలను మాత్రమే మోయగలుగుతుంది. 21వ శతాబ్దం కల్లా ప్రపంచ జనాభా 9 మిలియన్ దాటుతుంది అదే జరిగితే పర్యావరణం తనంతట తానుగా విధ్వంసం సృష్టించే పోతోంది. వైద్యంపై పెట్టే ఖర్చు కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు. -
అమర్నాథ్ యాత్ర
మంచుకొండల్లో కొలువుదీరిన మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తోంది. అదే ‘ఓం నమఃశివాయ’ శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అమర్నాథ్ ఒకటి. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒక్కసారే అవతరిస్తాడు. కానీ, అమర్నాథ్లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు. అదీ మంచుతో, శివలింగ రూపంలో. ప్రపంచంలోని అతి పెద్ద గుహలలో ఒకటి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్నాథ్ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం. జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది?! అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. మంచు మూర్తులు పార్వతి, గణపతులు అమర్నాథ్ గుహలో సహజంగా ఏర్పడే జ్యోతిర్లింగంతో పాటు, మరో రెండు చిన్న మంచు మూర్తులు కూడా కనిపిస్తాయి. వీటిని పార్వతి, గణపతులంటూ భక్తులు కొలుస్తారు. విచిత్రమేమంటే ఈ మూర్తులకు ప్రత్యేక ఆకారాలు ఉండవు. మంచు ముక్కల్లా మాత్రమే కనిపిస్తాయి. కాకపోతే మహాదేవుని లింగరూపం ఏర్పడిన సమయంలో మాత్రమే ఈ రెండు మంచు మూర్తులు కనిపిస్తాయి. ఆ తరువాత ఇవీ ఉండవు. అమరనాథుడికి రెండు మార్గాలు పిలిచిన పలికే అమర్‌నాథుడిని దర్శించుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. బల్దాల్ పహిల్గావ్ల నుంచి భోళా శంకరుడి దర్శనానికి వెళ్లవచ్చు. అయితే బల్దాల్ నుంచి గుఫాకు 18 కిలోమీటర్లు. ఇది చాలా కష్టమైన, క్లిష్టమైన దారి. ఇక పహిల్గావ్ నుంచి 45 కిలోమీటర్ల దూరం నుంచి మరో మార్గం ఉంది. అయితే కష్టమైనా దగ్గర ఉంటుంది కాబట్టి భక్తులు చాలా వరకు బల్దాల్ దారినే ఎంచుకుంటారు. ఈ దారి పొడువునే భక్తులు బారులు తీరుతారు. దీంతో ట్రాఫిక్ తీవ్రంగా జామ్ అవుతుంది. బల్దాల్, పహిల్గావ్... ఈ రెండు మార్గాల నుంచి గుర్రాలు అందుబాటులో ఉంటాయి. క్షణంలో మారే వాతావరణం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్నాథ్ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగానే పెరుగుతున్నారు. శంకరుడిని కళ్లారా చూసి మోక్షప్రాప్తికి తహతహలాడే వారు కొందరైతే, సరదాగా వెళ్లే వారు ఇంకొందరు. యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే... అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకుపోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. ఇక కాలినడక ప్రారంభించే బల్దాల్, పహిల్గావ్ల వద్ద బస చేసేందుకు టెంట్లు, బండారీలు.. అంటే హోటళ్లు అందుబాటులో ఉంటాయి. అక్కడ మన సామగ్రిని భద్రపరుచుకోవచ్చు. అక్కడి నుంచి కొండలు ఎక్కి గుహకు వెళ్లాలి. ఆ సమయంలో ఓ బ్యాగ్‌లో అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచుకోవాలి. అమర్నాథ్ యాత్రలో ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం. ఇంతటి అద్భుతమైన అమరనాథ్ యాత్రను గత 15 ఏళ్లుగా ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే పేరెన్నికగన్న ఈ సంస్థ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది. యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ ఖర్చుల విషయంలో సహకారాలను అందిస్తోంది. మీరు కూడా అమరనాథ్ యాత్ర చేయాలనుకుంటే తెలుగురాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నెన్నో దర్శనీయ ప్రదేశాలను, అనేక పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శింపజేసే తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్ ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా జూన్ 14, జూన్ 30, జులై 5, 2017 తేదీలలో చేయవచ్చు. మరిన్ని వివరాలకు కోసం హైదరాబాద్ లోని కూకట్ పల్లి , ఆఒ్క ఆఫీస్ ఎదురుగా ఉన్న ఖV టూర్స్ అండ్ ట్రావెల్స్ ను సంప్రదించవచ్చు. -
ఈదురు గాలులు.. పెరిగిన ఉష్ణోగ్రతలు
నరసాపురం : జిల్లాలో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముందెన్నడూ లేనివిధంగా శీతాకాలం మధ్యలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఈదురు గాలులు వీస్తున్నాయి. పగలు ఎండ.. రాత్రి చలికి ఈదురు గాలులు తోడవటంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే.. గాలిలోని తేమ శాతంలోనూ భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం మంచు ప్రభావం అంతగా లేదు. డిసెంబర్ రెండో వారం, జనవరి మొదటి వారంలోమాత్రమే మంచు ఎక్కువగా కురిసింది. నాలుగు రోజుల నుంచి పగటిపూట ఈదురు గాలులు ప్రభావం ఎక్కువగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. శీతాకాలంలోనూ 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తగ్గుతున్న తేమ శాతం సాధారణంగా శీతాకాలంలో పగటిపూట గాలిలో తేమశాతం 50 శాతం పైనే ఉంటుంది. తెల్లవారుజామున 95 శాతంగా ఉంటుంది. మొత్తంగా శీతాకాలంలో అత్యల్పంగా 50 అత్యధికంగా 98 శాతం ఉంటుంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమశాతం పడిపోతోంది. పగటిపూట 45 శాతం, తెల్లవారుజాము సమయంలో 85 నుంచి 90శాతంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గత 15 రోజుల నుంచి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పగటిపూట అత్యధికంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 28 డిగ్రీలు నమోదు చేసుకుంది. సాధారణంగా వేసవి సమీపించే కాలంలో.. అంటే ఫిబ్రవరి మొదటి, రెండు వారాల్లో గాని ఇంతగా ఉష్ణోగ్రతలు పెరగవు. ఇదిలా ఉంటే శుక్రవారం నరసాపురం ప్రాంతంలోనే పగటిపూట ఉష్ణోగ్రత 31 డిగ్రీలు నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 32 డిగ్రీలు దాటింది. సహజంగా తీరప్రాంతం కావడంతో వేసవిలో కూడా మిగిలిన ప్రాంతాల్లో పోల్చుకుంటే నరసాపురం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదవుతుంటాయి. ఇప్పుడే ఇలా ఉంటే సంవత్సరం వేసవి ప్రభావం కాస్త ముందుగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఉత్తర భారతం నుంచి దక్షిణ దిశకు గాలులు వీయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు అండమాన్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం ఈదురు గాలుల రూపంలో మన జిల్లాపై ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా వాతావరణంలో మార్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వాకు కష్టమే ప్రస్తుతం కూల్ అండ్ డ్రై అన్న రీతిలో జిల్లాలో వాతావరణం ఉంది. వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు మందులు వాడుతున్న వారు, చిన్నపిల్లలు ఈ వాతావరణం ఇల్ల ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధిక చలిగాలులు, గాలిలో తేమశాతం తక్కువవుతూ ఉండటం వంటి కారణాలతో ఆక్వా సాగుకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి జిల్లాలో నాలుగు రోజుల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్ప పీడనాలు, తుపాన్లు పట్టినప్పుడు ఎలా ఉంటుందో.. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ శాతం 45శాతం నుంచి 50 శాతం వరకు నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఉత్తర ఆగ్నేయ గాలుల ప్రభావం మనపై కనిపిస్తోంది. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కూడా మనపై ఉంది. ఈ పరిస్థితి తాత్కాలికమే. నాలుగు రోజుల తరువాత మార్పు వచ్చే అవకాశం ఉంది. – ఎన్.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం జాగ్రత్త వహించాలి ప్రస్తుత వాతావరణం ఇబ్బందికరమే. ఆస్త్మా రోగులు జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు బయట తిరక్కూడదు. ప్రస్తుత డ్రై అండ్ కూల్ వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో స్వైన్ ఫ్లూ మరణాలు కూడా సంభవించాయి. చర్మ వ్యాధులు ఉన్నవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. – డాక్టర్ సీహెచ్.కృష్ట అప్పాజీ, ఎండీ, నరసాపురం -
ఓజోన్ పొర దెబ్బతినడంతోనే ప్రకృతి వైపరీత్యాలు
– జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓజోన్ పొర దెబ్బతింటుండడంతోనే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలు నెలకొంటున్నాయని పొల్యూషన్ బోర్డు కర్నూలు జోనల్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ ఓజోన్ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పులతో విపరీతమైన ఎండలు, వర్షాలు సక్రమంగా కురవకపోవడం, ప్రజలు రోగాలబారిన పడి చనిపోతుండడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఓజోన్ పొరను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రజలు వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణమన్నారు. వీటిని ప్రజలు మితంగా వాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. లేదంటే 50–60 ఏళ్ల మధ్య ఓజోన్ పొరకు పడిన చిల్లులు విస్తరించి అల్ట్రాసోనిక్ కిరణాలు నేరుగా భూమి పడే ప్రమాదం ఉందన్నారు. వాటితో ప్రజలకు చర్మక్యాన్సర్లు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెంది ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం ఓజోన్ పొరపై నిర్వహించిన వ్యాసరచన విద్యార్థులకు బహుమతులుగా మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు ఇంజినీరు ప్రసాదరావు, ప్రొఫెసర్లు మాధవరెడ్డి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశ శీతోష్ణస్థితి
ఒక రోజు లేదా కొన్ని రోజుల ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం వంటి అంశాల్లోని మార్పులను ‘వాతావరణం’ అంటారు. ఒక ప్రాంత ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అవపాతం మొదలైన అంశాల దీర్ఘ్ఘకాల సగటును ‘శీతోష్ణస్థితి’ అంటారు. ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి మాన్సూన్ (రుతుపవనం) అనే మాట వచ్చింది. అరబిక్ భాషలో మౌసమ్ అంటే రుతువు అని అర్థం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో సంవత్సర కాలాన్ని 6 రుతువులుగా విభజిస్తారు. దీన్నిబట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని తెలుసుకోవచ్చు. 6 రుతువులు.. రుతుపవన ప్రక్రియ ఆవిర్భావ సిద్ధాంతాలు థర్మల్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం ప్రకారం నైరుతి రుతుపవనాలు సముద్ర పవనాల లక్షణాలను కలిగి ఉంటాయి. ఖండ, సముద్ర భాగాలు ఉష్ణోగ్రతను గ్రహించటంలో ఉన్న మార్పుల వల్ల ఇవి ఏర్పడతాయి. నైరుతి రుతుపవనాలను భారత ఉపఖండంలోకి ఆకర్షించే అల్పపీడన మండలం వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా ఏర్పడిందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. ప్లాన్ సిద్ధాంతం: ఆగ్నేయ రుతుపవనాలు దక్షిణాసియా ప్రాంతంలో రూపాంతరం చెంది.. నైరుతి రుతుపవనాలుగా భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. భూమధ్యరేఖ అల్పపీడన మండలం సూర్యుడి గమనం వల్ల కర్కటరేఖ వద్దకు స్థానభ్రంశం చెంది నైరుతి రుతుపవనాలను ఆకర్షిస్తుందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. టిబెటన్ హీట్ ఇంజన్ సిద్ధాంతం: వేసవి కాలంలో టిబెట్ పీఠభూమిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ఫలితంగా టిబెట్ పీఠభూమి నుంచిసంవహన గాలులు దక్షిణంగా వీచి దక్షిణ హిందూ మహాసముద్రంలో అవనతం చెందటం వల్ల ఆ సమద్రంలో అధిక పీడనం ఏర్పడుతుంది. దక్షిణ హిందూ మహాసముద్రానికి, వాయవ్య భారతదేశానికి మధ్య పీడన ప్రవణత ఏర్పడటంతో దక్షిణ హిందూ మహాసముద్రం నుంచి కవోష్ణ ఆర్ద్ర పవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. జెట్ స్ట్రీమ్ సిద్ధాంతం: ఉప ఆయనరేఖా పశ్చిమ జెట్ స్ట్రీమ్ జూన్ మొదటి వారంలో హిమాలయాలకు ఉత్తరంగా స్థానభ్రంశం చెందటం వల్ల నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి వేగంగా ప్రవేశిస్తాయి. ఆఫ్రికా తూర్పు తీరంలో ఉన్న సోమాలియా నుంచి అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరం వైపు వీచే సోమాలియా నిమ్న స్థాయి జెట్‌స్ట్రీమ్ నైరుతి రుతుపవనాలను బలోపేతం చేస్తుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. సూర్యకిరణాల పతనం, సూర్యుడి గమనం, రుతుపవనాలు వంటి అంశాల ఆధారంగా భారతదేశంలో సంవత్సరాన్ని వాతావరణ శాఖ 4 కాలాలుగా విభజించింది. అవి.. వేసవి కాలం: మార్చి నుంచి జూన్ మధ్య వరకు నైరుతి రుతుపవన కాలం: జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబర్ నుంచి నవంబర్ వరకు శీతాకాలం: డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వేసవి కాలం సూర్యుడు మార్చి 21న భూమధ్యరేఖ మీద నిట్టనిలువుగా ప్రకాశించి, ఆ తర్వాత జూన్ 21 వరకు కర్కటరేఖ వరకు ప్రయాణిస్తాడు (కర్కటరేఖ భారతదేశం మధ్య గుండా పశ్చిమం నుంచితూర్పునకు వెళుతుంది). ఈ కాలాన్ని భారతదేశంలో వేసవి కాలంగా పిలుస్తారు. ఈ కాలంలో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవి కాలంలో గంగా సింధూ మైదాన ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. రాజస్థాన్‌లోని ‘జైసల్మీర్’లోని గంగానగర్ ప్రాంతంలో 50నిఇ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశంలో ‘సంవహన వర్షాలు’ కురుస్తాయి. వీటినే రుతుపవన ఆరంభపు జల్లులు అంటారు. వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లలో పిలుస్తారు. అవి.... కర్ణాటకలో: ‘చెర్రీ బ్లోసమ్స్’ అని పిలుస్తారు. ఇవి కాఫీ పంటలకు ఉపయుక్తంగా ఉంటాయి. కేరళ రాష్ర్టంలో: ‘మాంగో షవర్‌స’ లేదా మామిడి జల్లులుగా; తెలంగాణ రాష్ర్టంలో: ‘తొలకరి జల్లులు’ అని; ఆంధ్రప్రదేశ్‌లో: ‘ఏరువాక’ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లో: ‘కాలబైశాఖీ’ అని అంటారు. ఇవి జనుము, వరి పంటకు ఉపయోగకరం. అసోంలో: ‘టీ షవర్‌స’ అని పిలుస్తారు. ఇవి తేయాకు పంటకు ఉపయుక్తం. ఉత్తరప్రదేశ్‌లో: ‘ఆంథీలు’ అంటారు. ఇవి చెరకు పంటకు ఉపయోగకరం. వేసవి కాలంలో ఉత్తర భారతదేశంలో వీచే వేడి గాలులను ‘లూ’ అని అంటారు. వీటినే పశ్చిమ బెంగాల్లో ‘నార్వెస్టర్లు’గా పిలుస్తారు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. దక్షిణ భారతదేశం సన్నగా, సముద్రంతో చుట్టుకుని ఉండటమే దీనికి కారణం. సముద్ర ప్రభావ శీతోష్ణస్థితి కారణంగా వేసవిలో ఉత్తర భారతదేశంతో పోల్చితే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. అలాగే ఉత్తర భారతదేశం ఖండాంతర్గతంగా (సముద్రానికి దూరంగా) ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. వేసవి కాలంలో రాజస్థాన్ నుంచి అసోం వరకు అధిక ఉష్ణోగ్రతలుంటాయి. నైరుతి రుతుపవన కాలం భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను అనుసరించి పవనాలు వీయటాన్ని, వెనక్కు మళ్లటాన్ని రుతుపవనాలుగా పేర్కొనవచ్చు. ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యం, అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పైభాగంలోని వాయు ప్రసరణం వంటి అనేక కారణాల వల్ల రుతుపవనాలు ఏర్పడుతున్నాయి. పశ్చిమ రాజస్థాన్ నుంచిపశ్చిమబెంగాల్ వరకు వ్యాపించి ఉన్న ‘అంతర ఆయనరేఖా అభిసరణం’ ప్రభావంతో పవనాలు వీచే దిశ మారి సముద్రం నుంచి భూభాగం వైపునకు వీస్తాయి. ఈ క్రమంలో భారతదేశంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి దక్షిణార్ధ గోళంలో వీచే ‘ఆగ్నేయ వ్యాపార పవనాల’ను ఆకర్షిస్తుంది. దీంతో ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటిన తరువాత ‘కొరియాలిస్ శక్తి’ ప్రభావం వల్ల ఫెరల్ సూత్రం ప్రకారం వక్రీభవనం చెంది కుడివైపునకు వంగి ‘నైరుతి రుతుపవనాలుగా’ మార్పు చెంది భారత భూభాగంలోకి ప్రవేశిస్తాయి. ఈ పవనాలు సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళ (మలబారు) తీరాన్ని చేరి, ఆ తర్వాత జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో దేశమంతటా విస్తరిస్తాయి. నీటి ఆవిరితో సముద్రం నుంచి భూభాగానికి వచ్చే నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలో సాధారణ వర్షపాతం నుంచి అత్యధిక వర్షపాతాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ రుతువును ‘వర్ష రుతువు’గా కూడా పిలుస్తారు. భారతదేశంలో కురిసే 90% వర్షపాతానికి నైరుతి రుతుపవనాలే మూలాధారం. నైరుతి రుతుపవనాలు ఆరంభంలో సముద్ర ప్రభావిత గాలుల ప్రసరణలో చిక్కుకుపోవటం వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవటాన్ని ‘రుతుపవన ఆరంభ వర్షాలు’ అంటారు. భారత భూభాగాన్ని చేరిన రుతుపవనాలు దేశ విశిష్ట స్వరూపం కారణంగా రెండు శాఖలుగా విడిపోతాయి. అవి.. 1. బంగాళాఖాతం శాఖ 2. అరేబియా శాఖ బంగాళాఖాతం శాఖ ఈ శాఖ హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను సేకరించి ముందుగా అండమాన్ నికోబార్ దీవులకు మే 23-25 మధ్య చేరుకొని వర్షాలనిస్తుంది. ఆ తర్వాత ఈ శాఖ పవనాలు మయన్మార్‌లోని ‘అరకన్యోమ’ పర్వతాలను ఢీకొని అక్కడ వర్షాలనిచ్చి అనంతరం తిరిగి భారతదేశం వైపునకు పయనిస్తాయి. ఈ ప్రయాణంలో ఈ పవనాలు రెండు శాఖలుగా విడిపోతాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశం వైపునకు పయనించి ‘అంబాలా’ వద్ద అరేబియా శాఖను కలుస్తుంది. రెండో శాఖ మేఘాలయాలోని గారో, ఖాసీ, జయంతియా కొండల మధ్య ఇరుక్కొని మొత్తం తేమను అక్కడే వర్షం రూపంలో విడుదల చేస్తుంది. అందువల్లే దేశంలోనే అత్యధిక వర్షపాత ప్రాంతాలైన మౌసిన్రామ్ (1187 సెం.మీ.), చిరపుంజి (1141సెం.మీ.)లు ఖాసీ కొండల ప్రాంతంలోనే ఉన్నాయి. అరేబియా శాఖ ఈ శాఖ మొదటగా నైరుతి దిశలో జూన్ 1న కేరళను చేరుకొని కర్ణాటక, మహారాష్ర్ట, కోల్‌కతాల మీదుగా పయనించిఅనంతరం ఢిల్లీ చేరుకుని ఆ తర్వాత పంజాబ్ మీదుగా వెళుతుంది. ఈ శాఖ మూలంగా అధిక వర్షం సంభవిస్తుంది. దీనికి కారణం అరేబియా సముద్రం మీదుగా ఈ శాఖ ఎక్కువ దూరం ప్రయాణించి అధిక నీటిని గ్రహించటమే. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించే క్రమం.. తేదీ ప్రాంతం నైరుతి రుతుపవన శాఖ మే 22-25 అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతం శాఖ జూన్ 1 కేరళ అరేబియా శాఖ జూన్ 5 కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు అరేబియా శాఖ జూన్ 10 మధ్యప్రదేశ్ అరేబియా శాఖ జూన్ 15 కలకత్తా అరేబియా శాఖ జూలై 1 ఢిల్లీ అరేబియా శాఖ జూలై 15 ఉత్తర భారతదేశం మొత్తం అరేబియా శాఖ భారతదేశంలో అరేబియా శాఖ వల్ల పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం (పవనాభి దిశ)లో మాత్రమే వర్షాలు కురుస్తాయి. పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం (పవన పరాన్ముఖ దిశ లేదా వర్షచ్ఛాయ మండలం)లో పొడి పవనాలు వీస్తాయి. భారత దేశంలో అధిక వర్షపాతం అరేబియా శాఖ వల్ల సంభవిస్తుంది. ఇది పర్వతీయ వర్షపాత రకానికి చెందింది. నైరుతి రుతుపవనాల వల్ల భారతదేశంలోని 3 ప్రాంతాల్లో వర్షాలు కురవవు. అవి.. 1. తమిళనాడు, దక్షిణ కోస్తా 2. వాయవ్య రాజస్థాన్ 3. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ఈశాన్య రుతుపవన కాలం సెప్టెంబర్ మధ్య నుంచిసూర్యుడు దక్షిణార్ధ గోళంలోకి ప్రవేశించటంతో భారతదేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఇదే కాలంలో భారతదేశ భూభాగంపై విస్తరించిన అల్పపీడనం క్షీణించి, అధిక పీడనంగా బలపడుతుంది. దాని ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. ఈ విధంగా తిరోగమించిన ఈ రుతుపవనాలు ‘శుష్కం’ (పొడి)గా ఉంటాయి. కానీ ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను గ్రహించి ఆర్ద్రంగా మారతాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో వీస్తున్న రుతుపవనాలు తిరోగమన నైరుతి రుతుపవనాలను ఈశాన్య రుతుపవనాలుగా రూపాంతరం చెందిస్తాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడులో దేశంలోనే అధిక వర్షపాతం నమోదవుతుంది. దీనికి కారణం ఈ పవనాలకు తమిళనాడులోని ‘షెవరాయ్’ కొండలు అడ్డురావటం. ఈ కాలంలో ఒడిశా ఎక్కువగా తుపాన్లకు గురవుతుంది. అక్టోబర్‌లో భారతదేశంలో ఏర్పడిన వేడిని ‘అక్టోబర్ హీట్’ అంటారు. ఈశాన్య రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ అల్పపీడనాలు తుపానులుగా మారి భారతదేశ తూర్పు తీరంలో వర్షాలు కురుస్తాయి. శీతాకాలం ఈ కాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి, అధిక చలి ఉంటుంది. ఈ కాలంలో ప్రధానంగా దక్షిణ భారతదేశం నుంచిఉత్తర భారతదేశానికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. ఈ కాలంలో సగటు ఉష్ణోగ్రత దక్షిణాన ఉన్న త్రివేండ్రంలో అత్యధికంగా (22.2నిఇ) ఉంటే ఈశాన్యంలో ఉన్న షిల్లాంగ్‌లో అత్యల్పంగా (3.8నిఇ) ఉంటుంది. మధ్యధరా సముద్రం భారతదేశంలో శీతాకాలాన్ని అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ సముద్ర ప్రాంతంలో ఈ కాలంలో వర్షాలు కురవడం వల్ల అక్కడ వీచిన పవనాలు పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ రూపంలో గంటకు 300 కి.మీ.ల వేగంతో ఇరాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా భారతదేశం చేరుకుంటాయి. ఈ జెట్ స్ట్రీమ్స్ దేశంలో విపరీత మంచుకు కారణమవుతున్నాయి. వీటివల్ల హిమాచల్‌ప్రదేశ్ నుంచి గంగా మైదానం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ మంచు... నెలకు 3 నుంచి 5 సార్లు సంభవిస్తుంది. పశ్చిమ పవనాల ప్రభావం వల్ల మధ్యధరా, ఎర్ర సముద్ర ప్రాంతాల నుంచి బలహీనమైన సమశీతోష్ణ మండల చక్రవాతాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల హిమాచల్‌ప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ కాలంలో జల్లులు కురుస్తాయి. వీటినే పశ్చిమ అలజడులు (లేదా) పశ్చిమ కల్లోలాలు అంటారు. వీటి మూలంగా వాయవ్య భారతదేశంలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసి ‘రబీ’ కాలంలో సాగయ్యే ‘గోధుమ’ పంట దిగుబడిని పెంచుతాయి. భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు 1. ఎల్‌నినో 2. లానినో 3. అంతర ఆయన రేఖా అభిసరణ మండలం 4. అక్టోబర్ వేడి మొదలైనవి. ఎల్‌నినో: దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహా సముద్రంలోని పెరూ తీరప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత మూలంగా అక్కడ అధిక స్థాయిలో ‘అల్పపీడన’ స్థితి ఏర్పడుతుంది. దీన్ని‘ఎల్‌నినో’ అంటారు. ఎల్‌నినో కారణంగా భారతదేశం పైకి వీచే నైరుతి రుతుపవనాలు అక్కడికి లాగివేతకు గురవుతాయి. ఫలితంగా భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడతాయి. లానినో: పెరూ తీరానికి పక్కగా వెళ్లే హంబోల్ట్ శీతల ప్రవాహం మూలంగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గి ‘అధిక పీడన’ పరిస్థితులు ఏర్పడటాన్ని ‘లానినో’ అంటారు. దీని మూలంగా భారతదేశం మీదికి రుతుపవనాలు అధికంగా వీస్తాయి. ఫలితంగా భారతదేశంలో అధిక వర్షాలు సంభవిస్తాయి. అంతర ఆయన రేఖా అభిసరణ మండలం: ఉత్తరార్ధ గోళంలోని ఈశాన్య వ్యాపార పవనాలు, దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వద్ద కలిసే ప్రాంతాన్ని అంతర ఆయన రేఖా అభిసరణ మండలం అంటారు. ఇది వేసవి కాలంలో ఉత్తరార్ధ గోళంలో 15నిఇ ఉత్తర అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇది 25నిఇ ఉత్తర అక్షాంశం మీదికి లాగివేతకు గురవుతుంది. దీన్నే రుతుపవన ఆరంభం అంటారు. అక్టోబర్ హీట్ : అక్టోబర్ నాటికి పవనాలన్నీ సముద్రం మీదకు వెళ్లిపోయి ఉత్తర భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే అక్టోబర్ వేడి లేదా హీట్ అంటారు. ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, జీవీఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
మార్స్ అప్పుడు జీవానుకూలం!
లండన్: ఇప్పుడు చల్లగా, పొడి వాతావరణం కలిగి ఉన్న అంగారక గ్రహం ఒకప్పుడు ఇలా ఉండేది కాదని, వెచ్చటి వాతావరణంతో జీవనానికి అనుకూలంగా ఉండేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అరుణ గ్రహం ఉపరితలంలోని పురాతన ప్రాంతంలో గుర్తించిన నదీ అవశేషాలను విశ్లేషించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. 'అరేబియా టెర్రా'గా పిలవబడే అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలో పరిశోధకులు ఇటీవల పురాతన నదీ అవశేషాలను గుర్తించారు. వీటిపై జరిపిన పరిశోధనల్లో మార్స్ 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవానుకూలంగా ఉండేదని పరిశోధనకు నేతృత్వం వహించిన జోయల్ డెవిస్ వెల్లడించారు. అరుణ గ్రహంపై జరుపుతున్న పరిశోధనల్లో గతంలోనే శాస్త్రవేత్తలు నీటి ప్రవాహాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అయితే.. ఇటీవల నాసా స్పేస్ క్రాఫ్ట్.. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) అందించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు అరేబియా టెర్రా ప్రాంతంలో పురాతన నదీ అవశేషాలను కనుగొన్నారు. -
సోయాబీన్లో సస్య రక్షణ చర్యలు
:ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి :తెగులుతో పంటకు నష్టం :ఏడీఏ వినోద్‌కుమార్ జహీరాబాద్ టౌన్:వ్యవసాయ సబ్ డివిజన్లోని రైతులు ఖరీఫ్ సీజన్లో పత్తి, పెసర, కంది. మినుముతో అధిక విస్తీర్ణంలో సోయాబిన్ పంటను సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వేలాది ఎకరాల్లో పంట సాగవుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు ఆశాజనకంగా ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో దెబ్బతింది. ఉన్న పంటకు తెగులు ఆశిస్తున్నాయి. పలు రకాల తెగులు కారణంగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. పంటకు ఆశిస్తున్న తెగులు నివారణ గురించి వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్(7288894426) ఇలా వివరించారు. సోయాబిన్ పంటకు ప్రస్తుతం పల్లాకు తెగులు కనిపిస్తున్నాయి. తెల్లదొమ వల్ల పల్లాకు తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు వల్ల ఆకులు రంగుమారిట్లుగా ఉంటాయి. మొక్కల పెరుగుదల లోపించి, గిడసబారి దిగుబడులు తగ్గుతాయి. వైరస్వల్ల కలిగే పల్లాకు తెగులను అరికట్టాలి నివారణకుగాను 2 మి.లీ ట్రైజోఫాస్ మందును లీటరు నీటి చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి. ఎకరాకు గ్రీసు పూసిన పుసుపు రంగు అట్టలను వేలాడదీయాలి.దీంతో తెల్ల దొమ అట్టలకు అంటుక పోతాయి. కాండంతొలిచే పురుగు కనిపిస్తే మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆశిస్తే గ్రాము కార్ఫండిజం లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకు మచ్చతెగులు ఉన్నట్లయితే 1.5 గ్రాముల పోషామైసిన్, 15గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను 10 లీటర్ల నీటకి కలిపి 2-3 సార్లు పిచికారి చేయాలి. కాండం తొలుచు పురుగు ఉధత్తం కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో కాండంతొలుచు పురుగు గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వెలుబడిన పిల్ల పురుగులు కాండానికి గాటు పెట్టి లోపలికి ప్రవేశించి మెత్తటి పదార్థాన్ని తింటాయి. కాండం లోపలి నుంచి కింది వరకుగల మెత్తటి పదర్థాన్ని తినటం వల్ల కాండం బలహీనమై మొక్క పడిపోతుంది. కాండం తొలచు పురుగు ఆశిస్తే 2 మి.లీ టైజోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పచ్చపురుగు, మొజాయిక్ తెగులు, పేనుబంక తెగులు కూడా పంటకు ఆశిస్తాయి. పచ్చపురుగ నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 50 శాతం 2.5 మి.లీ. లీటరు నీటి చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.మొజాయిక్, పేనుబంక తెగులు ఆశిస్తే డైమిథోయేట్ 2 మి.లీ. లేదాఎసీఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటకి కలిపి పిచికారి చేయాలి. -
ఆ మొక్కలు నాటితే నష్టమే..
అడవులు నరికేయడం సులభమే... కానీ పెంచడం అంత తేలిక కాదు అంటున్నారు యూరోపియన్లు. ఎందుకంటే వారు చేపట్టిన అడవుల పెంపకంవల్ల లాభం కన్నా నష్టాలే ఎదురైనట్లు కనుగొన్నారు. ఫ్రాన్స్ అల్సాస్ ప్రాంత అడవుల్లో పాతిన మొక్కలవల్ల తీవ్ర వాతావరణ మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. రీ ఫారెస్టేషన్ తో మరింత భూ తాపం పెరిగినట్లు పరిశీలకులు చెప్తున్నారు. పర్యావరణంలో మార్పులు సంభవించడానికి అడవులు నరికేయడమే ప్రధాన కారణం అని ఇప్పటిదాకా మనకు తెలుసు. చెట్లు కార్పన్ ను పీల్చుకొని... ప్రాణవాయువును అందిస్తాయని... వాతావరణాన్ని, భూ తాపాన్ని సమతుల్యంగా ఉంచుతాయని తెలుసు. అందుకే చెట్లు నాటడం మంచిదని చెప్తారు. చెట్ల పెంపకం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు కూడ చేపడతాయి. అయితే అడవుల నిర్వహణ అంత సులభం కాదని ఇటీవల వెల్లడైన పరిశోధనలు చెప్తున్నాయి. అడవుల పెంపకంతో ఎన్నో తలనొప్పులు కూడ ఎదురౌతున్నట్లు అధ్యయనకారులు అంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే చెట్లు నాటకపోవడం, చెట్ల ఎంపికలో సమస్యల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని, భూతాపం మరింత పెరిగిపోయిందని తెలుసుకున్నారు. యూరప్ లో అంతరించి పోతున్న అడవుల స్థానంలో తిరిగి పెంపకాన్ని చేపట్టి...2010 నాటికి 85 శాతం పూర్తి చేశారు. అయితే 250 ఏళ్ళలో ఎక్కువగా వాణిజ్యపరంగా విలువైన, త్వరగా పెరిగే, ప్రాణులకు అనువుగా ఉండే మొక్కలపైనే.. నిర్వహణాధికారులు దృష్టి పెట్టినట్లు చరిత్రను పరిశీలించిన అధ్యయన కారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా అడవుల పెంపకంలో వాడిన మూడు జాతుల్లో ఓ జాతి మొక్కలకు ఎక్కువ స్థానం కల్పించారని, వాటిని సుమారు 4 లక్షల చదరపు మైళ్ళలో నాటారని చెప్తున్నారు. కోనిఫర్ జాతికి చెందిన ఆ చెట్లు... అడవుల్లో లేతరంగు ఆకులున్న చెట్లుకన్నా ఎక్కువగా ఉండటమే కాక, చెట్లకు ఆకులకన్నా సూదుల్లాంటి ముళ్ళు కలిగి ఉన్నాయని....అవి సూర్య కాంతిని ఆకర్షించడంకంటే... వికిరణానికి తోడ్పడుతున్నట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అడవులున్న ప్రాంతంలో తీవ్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, భూ తాపాన్ని తగ్గించే బదులు, పెరగడానికి కారణమౌతోందని ఓ సైన్స్ జర్నల్ లో పేర్కొన్నారు. మొక్కలు నాటడం ముఖ్యం కాదని, నాటే మొక్కలు పనికొచ్చేవా... కావా అన్నది తెలుసుకోవడం అవసరమని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. -
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి
-
కోస్తాంధ్ర, తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
విశాఖపట్టణం: నైరుతి రుతపవనాలు, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోకి శనివారం ప్రవేశించాయి. శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాలు మినహా 90 శాతం రుతు పవనాలు విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలోనూ రుతు పవనాలు విస్తరించాయని పేర్కొంది. అదే విధంగా ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగనుంది. దీంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. -
సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి
భారతదేశ సంస్కృతిని భావితరాలకు అందిస్తూ పురాణ గాథలను కళారూపాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగించే జాతిలో ‘బుడగ జంగం’ కులం ఒకటి. ఢిమికీ, తంబూర, అందెల సహాయంతో వీరు ఊరూరా తిరుగుతూ కథలు చెబుతారు. పూర్వం నుంచి కళను ఉపాధిగా చేసుకుని బతికే వీరు నేడు వాటికి ఆదరణ తగ్గిపోవడంతో భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అవుతున్నా చట్ట సభల్లో ఇప్పటికీ వీరికి ప్రాతినిధ్యం లేదు. నిజాం స్టేట్‌లో షెడ్యూలు కులంగా గుర్తింపు పొందిన బుడగ జంగాలను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎస్సీలుగా ధ్రువీకరిం చింది. అప్పటికీ బుడగ జంగాలు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితమయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం లో కూడా బుడగ జంగం కులస్తులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ గా ఉన్నందున ఇక్కడ వీరిని ఎస్సీలుగా గుర్తించింది. అనంతరం బుడగ జంగాలు పెద్ద సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వలసపోయారు. సంచార జీవితం గడిపే వీరు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు. ఈ నేపథ్యంలో 1976లో రాష్ట్ర ప్రభుత్వం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు సవరణ జరిపి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని, వారికి కూడా తెలంగాణలో మాదిరి గా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి 2008 వరకు అంటే 32 ఏళ్లపాటు ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగానే పరిగణించబడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇతర కులస్తులు కొందరు అక్రమంగా బుడగ జంగం కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన విషయం వెలుగుచూసింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మాల రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కుట్రతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుడగ జంగాలు లేరని అక్కడ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2008లో ప్రభుత్వం జీవో 144ను వెలువరించి బుడగ జంగాలకు తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలోనే కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వాలని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జారీ చేయకూ డదని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే చదువుల బాట పట్టిన బుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్‌కు దూరమయ్యారు. అక్రమార్కులను కనిపెట్టి వారిని శిక్షించి, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరో ఆరోపించారని ఏకంగా ఒక కులం మొత్తాన్ని శిక్షిం చడం గర్హనీయం. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ లోని బుడగ జంగాలు కోరుకుంటున్నారు. - తూర్పాటి జె శ్రీధర్ అఖిల భారత బేడబుడగ జంగం సమాఖ్య -
ఇంటింటా జ్వరాలే..
మంచం పట్టిన ‘గుడివాడ’ టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలకలతో సతమతం జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు గుడివాడ మంచం పట్టింది. పట్టణంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణంలోని దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని తెలుస్తోంది. దాదాపు 15 రోజులుగా వ్యాధుల ప్రభావం ఉండగా, వారం రోజుల నుంచి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గుడివాడ : పట్టణ వాసులు వ్యాధులతో వణికిపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విషజ్వరాలతో పాటు వ్యాధులు విజృంభించాయి. ఏ ప్రాంతంలో చూసినా వ్యాధులతో బాధపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి. అనేక వార్డుల్లో విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి.. వెనువెంటనే చల్లబడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. మిక్స్డ్ వైరస్ల కారణంగా వైరల్ జ్వరాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పెద ఎరుకపాడులో ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఉన్నారు. ఇంట్లో ఉన్న నలుగురికీ జ్వరాలు రావటంతో జనం ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఈ ప్రాంతంలో టైఫాయిడ్ రోగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పెద ఎరుకపాడు దళితవాడలో దాదాపు 20 కుటుంబాల్లో ఇంట్లో ఉన్న వారంతా జ్వరంతో మంచం పట్టారు. దీనికితోడు కళ్ల కలకలు, పొంగు, మలేరియా వంటి వ్యాధులతో సతమతమౌతున్నారు. పట్టణంలోని గుడ్మేన్పేట, అరవ పేట, మందపాడు తదితర ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రభావం ఉండగా వారం రోజులుగా అంటువ్యాధుల విజృంభణ మరింత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది... అక్టోబర్‌లో జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారిలో టైఫాయిడ్‌కి గురైనవారే 165 మంది ఉన్నారని పేర్కొంటున్నారు. వీరుగాక ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య ఇంతకు పది రెట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. ప్రతిరోజూ గుడివాడలోని ఒక్కో ఆస్పత్రికి నిత్యం వందమందికి పైగా జ్వరపీడితులు వస్తున్నారని చెబుతున్నారు. మారుతున్న వాతావరణం, తాగునీటి కాలుష్యం కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే విషజ్వరాల వ్యాప్తిని తగ్గించగలమని అంటున్నారు. పరిసరాల పరిశుభ్రత సరిగా లేని కారణంగా కూడా వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇతర అంటువ్యాధులు ఇంట్లో ఒకరి తరువాత మరొకరికి రావటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నామని, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్లే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా టైఫాయిడ్ వస్తోంది. జ్వరం వచ్చిందని బాలింతలు పిల్లలకు పాలివ్వటం మానరాదు. పాలు ఇచ్చి పిల్లల్ని దూరంగా వేరొకరికి ఇవ్వాలి. లేదంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడతారు. తల్లికి జ్వరం వచ్చినా పాలు ఇవ్వవచ్చు. జ్వరం వచ్చిందని పిల్లలకు ఆహారం పెట్టకుండా ఉంచరాదు. అలా చేయటం వల్ల బలహీనత ఏర్పడి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. - డాక్టర్ సుదేష్బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, గుడివాడ -
సేంద్రియ ఎరువుతో సాగు బంగారం
ఖర్చు తక్కువ.. ఫలితమెక్కువ అందుబాటులో ఉన్న వనరులతో ఎరువు తయారీ వర్మి కంపోస్టు వాడకంపై రైతుల్లో ఆసక్తి పంటల సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూమి సారం కోల్పోయి ఆశించిన దిగుబడి రాకపోవడం.. వాతావరణం కాలుష్యం ఏర్పడడం తదితర నష్టాలను గ్రహించిన రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారిస్తున్నారు. సహజసిద్ధంగా అందుబాటులో ఉన్న గొర్రెలు, మేకల ఎరువు, పశువుల పేడ, చెత్త, చెదారంతో వర్మికంపోస్టు తయారు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో జనగామ మండలంలో 40 వర్మి కంపోస్టు యూనిట్లు ప్రారంభయ్యాయి. వర్మి కంపోస్టు తయారీ విధానం వర్మి కంపోస్టు(వానపాములతో) ఎరువు తయారీ యూనిట్‌కు అవసరమైన డేరాను వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తుంది. డేరాలో చెత్త, చెదారం, చెట్ల ఆకులు, పశువుల మేయకుండా వదిలేసిన, ఒడ్డు ఒరాలపై ఉన్న గడ్డి(రెండు వంతులు), పశువుల పేడ(ఒక వంతు) వేయాలి. రోజు సాయంత్రం 10 నుంచి 20 లీటర్ల నీటిని చల్లాలి. 10 నుంచి 15 రోజులలో అంతా కుళ్లి పోతుంది. ఒక కేజీ ఎర్రలు(వాన పాములు) బయట కొనుగోలు చేసి ఈ డేరాలో వేయాలి. డేరాలో కుళ్లిన ద్రావణ రసాయనం వెలువడే చోట కుండ లేదా ఒక పాత్ర ఉంచాలి. మరో 10 రోజుల్లో కుళ్లిన గడ్డి, చెత్త చెదారం, పేడలను తిన్న ఎర్రలు చేత్తలోంచి బయటకు వచ్చి విసర్జింప చేస్తాయి. దీనిని రోజు వారీగా బస్తాలలోకి ఎత్తుకోవాలి. ఇలా రెండు నెలల్లో పూర్తవుతుంది. దీని ద్వారా ఒక టన్ను(వెయ్యి కిలోలు) వర్మి కంపోస్టు తయారవుతుంది. చీడ పీడలు, తెగుళ్లకు చెక్ వర్మి కంపోస్టు డేరాకు మూలన ఏర్పాటు చేసిన కుండలోకి చేరిన ద్రావణాన్ని అన్ని రకాల పంటలపై పిచికారీ చేయవచ్చు. పంటను ఆశించే చీడ, పీడలు, తెగుళ్లు, మసిపేను, బూడిద తెగుళ్ల నివారణిగా పని చేస్తుంది. ప్రతి 10 లీటర్ల నీటికి అర లీటరు ద్రావణాన్ని కలిపి పిచికారి చేయడం వల్ల 15-20 రోజుల వరకు పంటకు ఎలాంటి తెగులు సోకకుండా ఉంటుంది. ఎరువు తయారీ చాలా సులువు వర్మి కంపోస్టు తయారీ అంటే ఇబ్బందులుంటాయని రైతులు అపోహ పడుతున్నారు. ఇది చాలా సులువు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సూచనల మేరకు రెండు నెలల క్రితం అందుబాటులో ఉన్న వనరులతో యూనిట్ ప్రారంభించి నిర్వహిస్తున్నాను. - యానాల చిన్న సిద్ధారెడ్డి(9951021348), రైతు (అడవికేశ్వాపూర్) గొర్ల మందల తోలింపుతో ఖర్చు తగ్గింది ప్రతి ఏటా నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాను. గతంలో డీఏపీ, యూరియా, పోటాష్లకు రూ.12వేల నుంచి రూ.13వేలు ఖర్చు అయ్యేది. మూడేళ్లుగా మేకలు, గొర్రెల మందలను పొలాలు, చెల్కల్లో నిలబెట్టుకుంటున్నం. వాటి యజమానులకు ఎకరాకు రూ.1500 చెల్లిస్తున్నం. దీంతో ఎకరానికి ఎరువుల బస్తాల వాడకానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు వరకు మాత్రమే ఖర్చు అవుతోంది. మామూలుగా పత్తిలో డీఏపీ, యూరియా, పోటాష్ ఐదు నుంచి ఆరు మార్లు వేస్తారు. గొర్రెలు, మేకల మందలను నిలుపుకుంటే ఒకటి, రెండు మార్లు వేస్తే సరిపోతుంది. అంటే రూ.6 వేల వరకు ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా భూమిలో బలం పెరుగుతుంది. - ముక్కెర శ్రీను, పత్తి రైతు(గానుగుపహాడ్) సేంద్రియ ఎరువు అన్ని రకాల మేలు పశువులు, మేకలు, గొర్రెలకు చెందిన టన్ను పేడలో 5 నుంచి 8 కిలోల నత్రజని, 2కిలో భాస్వరం, 2 కిలోల ఫాస్పరస్‌తోపాటు పోటాష్, సల్ఫర్ ఉంటాయి. పంటకు సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా అందడంతోపాటు, పొలాల్లో నత్తగుల్లలు, వానపాములు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. గొర్రెలు, మేకల మందల నిలుపుదలతో వర్షం వచ్చిన కొద్ది రోజుల పాటు భూమిలో తేమ నిలిచి ఉంటుంది. తద్వారా రసాయన ఎరువులు వాడిన దానికంటే పంట దిగుబడిలో 25-30 శాతం వరకు వృద్ధి కనిపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్, ఎర్రగొల్లపహాడ్, పెద్దపహాడ్, ఓబుల్‌కేశ్వాపూర్, గోపరాజుపల్లి గ్రామాలకు 40 వర్మి కంపోస్టు యూనిట్లు పంపిణీ చేశాం. - అలువాల శ్రీనివాస్(88866 14586) (జనగామ ఏఓ) -
వామ్మో మళ్లీ స్వైన్ ఫ్లూ సైరన్
ఐదు నెలల్లో పది మంది మరణం.. 117 పాజిటివ్ కేసులు గుర్తింపు ఒక్క ఉడిపి జిల్లాలోనే నలుగురి మృతి వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం జలుబు, దగ్గు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ బారిన పడి 10 మంది చనిపోగా, 117 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. స్వైన్ ఫ్లూ అనేది ‘ఇన్ఫ్లుయన్జా-ఏ’ (హెచ్1ఎన్1) అనే వైరస్ వల్ల సోకే అంటువ్యాధి. దీని వల్ల రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు లోనవుతాడు. ఈ వ్యాధి సోకిన వారికి విపరీతంగా దగ్గు, జ్వరం ఉంటుంది. ముక్కుల నుంచి నీరు ఎక్కువగా కారుతూ ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో రోగి తీవ్ర ఇబ్బందికి గురయినప్పుడు ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాలం ప్రారంభయ్యే సమయం, వాతావరణంలో తడి ఎక్కువగా ఉన్న సమయంతోపాటు చిత్తడిగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల రానున్న మూడు నెలలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చూచించారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారికి చికిత్స చేయడానికి వీలుగా తాలూకా ఆస్పత్రుల్లో ఐదు పడకలను, జిల్లా ఆస్పత్రిలో పది పడకలను మూడు నెలల పాటు రిజర్వ్‌గా ఉంచాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తం మీద పది స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించగా అందులో ఒక్క ఉడిపి జిల్లాలోనే నలుగురు చనిపోయారు. దీంతో ఒకే ప్రాంతం నుంచి ఐదు అంత కంటే ఎక్కువ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయితే జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో వైద్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలందరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిందిగా కూడా వైద్య శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మధుమేహం, ఆస్మా, ఉబకాయం (ఒబేసిటీ)తో బాధపడుతున్న వారితో పాటు గర్భిణులకు త్వరగా ఈ వైరస్ సోకే అవకాశముంది. అందువల్ల వీరు ఈ వ్యాధి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. -
వీధులన్నీ చెత్త మయం
దుర్గంథంతో పట్టణాలు సతమతం పల్లెల్లో కొరవడిన పారిశుద్ధ్యం ఏజెన్సీలో అనారోగ్యకర పరిస్థితులు క్లోరినేషన్‌కు నోచుకోని తాగునీటి వనరులు యలమంచిలి, న్యూస్‌లైన్: జిల్లాలో పారిశుద్ధ్యం కొరవడింది. పట్టణాలు, పల్లెలు గబ్బుకొడుతున్నాయి. అడపాదడపా వర్షాలతో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వాతావరణంలో మార్పులతో వ్యాధులు కమ్ముకుంటున్నాయి. మన్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూడేళ్ల క్రితం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన నర్సీపట్నం, యలమంచిలిలో సమస్యలు రెట్టింపయ్యాయి. రెండింటా విలీన గ్రామాలప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులతోపాటు పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పురపాలికలుగా రూ పాంతరం చెందినప్పటికీ పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కాలేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. యలమంచిలి, నర్సీపట్నంల్లో పారిశుద్ధ్యం కొరవడింది. రెండింట 15 టన్నుల వరకు చెత్త ఉంటోంది. ఒక్కో పట్టణంలో సుమారు 50 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారితో పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. రెండు ట్రాక్టర్లు, రెండు ఆటోల ద్వారా కేవలం 8నుంచి 9 టన్నుల చెత్త మాత్రమే తొలగిస్తున్నారు. మిగిలిన చెత్త వీధుల్లో , కాలువల్లో గుట్టల కొద్దీ దర్శనమిస్తోంది. తాగునీటి సమస్యనూ ఆయా పట్టణ వాసులు ఎదుర్కొంటున్నారు. నర్సీపట్నం వాసులను డంపింగ్ యార్డు సమస్య ఏళ్లతరబడి పట్టి పీడిస్తోంది. అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం రైతు బజార్ వద్ద పందుల స్వైర విహారంతో జనం ఇబ్బం దులు పడుతున్నారు. వ్యాధులకు గురైయ్యే ప్రమాదముందని వాపోతున్నారు. రోడ్డపై వేస్తున్న చెత్తను ఎప్పటి కప్పుడు తొలగించకపోవడంతో వాటిని తినడానికి పందులు చేరుతున్నాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. కొత్తపాలకవర్గాలపై కోటిఆశలు... నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన కొత్త పాలకవర్గాలపై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. పురపాలికల్లో పేరుకుపేయిన సమస్యలు కొత్తపాలకవర్గాలు పరిష్కరిస్తాయన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో.. మైదానంలోని గ్రామీణుల్లోనూ చైతన్యం కొరవడుతోంది. ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై పోస్తున్నారు. అవి ఎక్కడికక్కడ కుప్పులుగా పేరుకుపోతున్నాయి. వర్షాలకు కుళ్లి దుర్గంధం వెలువడుతోంది. తాగునీటి క్లోరినేషన్ కూడా చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. ఏజెన్సీలో... ఏజెన్సీలో రోజూ వర్షాలు పడుతున్నాయి. తాగునీరు కలుషితమవుతోంది. పంచాయతీల పాలకులకు, అధికారులకు ఇది పట్టడం లేదు. దీంతో అనారోగ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో గిరిజనులు డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. -
విదేశీ వంగడాల సందడి
అమెరికా కూరగాయల సాగుకు మన్యం అనుకూలం ప్రయోగాత్మకంగా ఎనిమిది రకాల పెంపకం దిగుబడి బాగుందన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొండకోనలు పచ్చదనానికి నెలవులు.. హరిత సౌందర్యానికి నిలయాలు.. మన్యంలో ఏ మొక్కయినా ఏపుగా ఎదుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణం అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విదేశీ కూరగాయలకు ఏజెన్సీ ప్రాంతం అనుకూలమని స్పష్టమైంది. అందుకే ఇప్పుడిప్పుడే వీటి సాగు ఇక్కడ పెరుగుతోంది. ఇది విస్తారంగా జరిగితే గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించే వీలుంది. చింతపల్లి, న్యూస్‌లైన్: విశాఖ మన్యంలో విదేశీ జాతుల కూరగాయలు ఏపుగా పెరగడానికి అనువైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరోసారి రు జువైంది. ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగులో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలో సాగవుతున్న వివిధ రకాల కూరగాయలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచగా, మంచి దిగుబడులు వచ్చాయని పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.చంద్రశేఖర రావు ఆదివారం విలేకరులకు తె లిపారు. ఎంతో ఆరోగ్యకరమైన విదేశీ కూరగాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, వీటి ద్వారా గిరిజనులకు ఇబ్బడిముబ్బడిగా రాబడి వచ్చే వీలుందని చెప్పారు. కొద్ది పాటి సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులు చాలాకాలంగా దేశవాళీ కూరగాయలు సాగు చేస్తున్నారు. దిగుబడులు నానాటికీ తగ్గుతూ ఉండడంతో రసాయన ఎరువులను విపరీతంగా వాడుతున్నారు. కానీ వీటికి ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రకాల పంటలపై ఇక్కడి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. శీతల వాతావరణం ఉన్న ఏజన్సీలో విదేశీ రకాలు బాగా పెరుగుతాయని గుర్తించారు. ఇక్కడి ప్రాంతాలకు అనువైన రకాలను హిమచల్ ప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తెచ్చారు. అమెరికాలో అధికంగా సాగవుతున్న 8 రకాల వంగడాలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచడం మొదలెట్టారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని గుర్తించినట్టు చంద్రశేఖరరావు తెలిపారు. కొత్త రకాలు ఇవే అమెరికాలో ఎక్కువగా వినియోగించే అమెరికన్ క్యాబేజి, గ్రీన్ బేబీ లెట్యూస్, సెలరీ, స్పినాచ్, టర్నిప్, బ్రాకోలీ, గ్రీన్ మాజిక్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, నూల్‌కోల్, రిజీ అనే ఆకుకూరలను పెంచేందుకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ రకాలు అధికంగా సాగవుతున్నాయి. సాగుపై అవగాహన కల్పిస్తాం గిరిజన రైతులకు విదేశీ కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తాం. రైతులు ముందుకు వస్తే వీటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ పద్ధతిపై అవగాహన కల్పిస్తాం - కె.చంద్రశేఖరరావు, ఉద్యాన శాస్త్రవేత్త, చింతపల్లి -
విశాఖపట్నం జలమయం
సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య రుతుపవనాలు,ఆవర్తనద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా మంగళవారం వర్షం పడింది. ఉదయంనుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. వాతావరణం చల్లబడింది. తీరం వెంబడి అలలు ఎగిసి పడుతున్నాయి. జిల్లా మొత్తంగా సరాసరి 2.4 సెంటీమీటర్లుగా నమోదయింది. నక్కపల్లిలో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, జీకేవీధిలో అత్యల్పంగా 2.6 సె.మీ. వర్షం పడింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని నదులు, వాగులు, కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే నిండుగా ఉన్న జలాశయాల్లోకి ఎగువ నుంచి భారీ ఎత్తున వరదనీరు వచ్చిపడుతోంది. నక్కపల్లి,పాయకరావుపేట, అడ్డురోడ్డులలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనకాపల్లిలో 9.4 సెంటీమీటర్ల వర్షం పడింది. శారదానదిలో నీటి మట్టం పెరిగింది. ఈ మండలంలోని దేవీనగర్ పరిసర లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఏజెన్సీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాటికి చలిగాలులు తోడవ్వడంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. మన్యంలోని వాగులు, గెడ్డల్లో నీటి ఉధృతి పెరిగింది. అరకులోయ పరిసరాలు భారీ వర్షంతోపాటు దట్టమైన పొగమంచుతో శోభాయమానంగా మారాయి. పర్యాటకులను, స్థానికులను కనువిందు చేసింది. పండువెన్నెలలో చంద్రుని మాదిరి ఉదయం 10 గంటలకు భానుడ్ని చూసి పర్యాటకులు పరవశించిపోయారు. వర్షం కారణంగా వ్యవసాయ పనులకు వెళ్లకుండా గిరిరైతులు ఇళ్లకే పరిమితమయ్యారు. యలమంచిలి నియోజకవర్గంలోనూ భారీ వర్షం కురిసింది. కోటవురట్ల మండలంలోని దుగ్గాడ కాలువలో జలకళ ఉట్టిపడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోనూ వర్షం ముంచెత్తింది. నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ ప్రాంతంలోని కొండగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. అత్యధికంగా చీడికాడలో 5సెంటీమీటర్లు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని పంటపొలాలన్నీ నీటమునిగాయి. పెద్దేరు, కోనాం జలాశయాల్లో నీటిని విడుదలకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
పై-లీన్ ఆందోళన
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పంటపై పై-లీన్ తుపాను ప్రభావం పడింది. వాతావరణంలో మార్పులతో తెగుళ్లు షురూ అయ్యాయి. దోమపోటు, మొగితెగులు, ఆకుముడత తెగులు సోకాయి. దీంతో రైతులు వేలాది రూపాయలు మందుల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దోమపోటు ముదిరితే పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఆయకట్టులో రెండేళ్లుగా సాగునీరు లేక పంటలు పండక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది సాగునీటిని విడుదల చేయగా పంటలు పుష్కలంగా పండుతాయనుకున్న తరుణంలో తుపాను ప్రభావం రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వాప్తంగా ఖరీఫ్‌లో 1,43,917 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రానుంది. 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కానీ దోమపోటు కారణంగా బీపీటీ(సాంబమసూరి) వరి దెబ్బతిని పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. పురుగు మందులకు అదనపు డబ్బులు వెచ్చిస్తున్న రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు. పెరిగిన ఖర్చులు.. ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతాంగానికి ఖర్చులు భారీగా పెరిగాయి. పై-లీన్ తుపానుకు ముందే రైతులు ఎకరానికి 6 కిలోల చొప్పున 240 రూపాయలు వెచ్చించి గుళికలు చల్లారు. ఆ తర్వాత కూడా తెగుళ్లకు ఎకరానికి 500 రూపాయల నుంచి 800 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క రైతు మూడు పర్యాయాలు మందులు పిచికారీ చేస్తున్నారు. పిచికారీ చేసినందుకు ఎకరానికి మరో 300 అదనంగా ఖర్చు చేస్తున్నారు. సుమారుగా ఎకరానికి ఒకసారి మందు పిచికారి చేస్తేనే రెండు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వరికి సోకుతున్న తెగుళ్లు ఇవే.. ప్రస్తుతం వరికి ఆకుముడత, మొగితెగులు (కాండం తొలిచే పురుగు), పాముపొడ, దోమపోటు తెగుళ్లు సోకుతున్నాయి. ప్రస్తుతం పై-లీన్ తుపాను కారణంగా దోమపోటు షురూ అయ్యింది. దోమపోటు ఎక్కువైతే పంట దిగుబడి తగ్గే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పు వల్లే తెగుళ్లు : శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ మిర్యాలగూడ పై-లీన్ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో వరికి దోమపోటు పెరిగే అవకాశం ఉంది. దోమపోటు పెరిగితే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా మందులు పిచికారీ చేసుకుంటే తెగుళ్లు నివారించుకోవచ్చు. ఆకుముడత తెగులు నివారణకు క్లోరైఫైరీపాస్ గానీ, కినాల్పాస్ గానీ ఎకరానికి 400 మిల్లీ లీటర్లు పిచికారీ చేయాలి. మొగితెగులు నివారణకు ఎకరానికి పాస్పామిడాన్ 400 మిల్లీ లీటర్లు గానీ, కార్పాస్హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేస్తే తగ్గిపోతుంది. దోమపోటు నివారణకు ఎస్సీఫ్యాక్ట్ 300 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా బుప్రోఫాజిన్ 300 మిల్లీ లీటర్లు ఎకరానికి పిచికారీ చేయాలి. -
జూబ్లీహిల్స్, చార్మినార్‌లలో అమ్మోనియా అధికంగా నమోదు
సనత్‌నగర్, న్యూస్‌లైన్: నగర కాలుష్యంలో ‘అమ్మోనియా’ చేరడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డై ఆక్సైడ్స్, పీఎం 10 అత్యధిక మోతాదులో నమోదవుతూ వస్తుండగా... ఇప్పుడు అమ్మోనియా మోతాదు మించడం ఆందోళన కలిగిస్తోంది. మనిషి జీవక్రియకు కొంత మోతాదులో అమ్మోనియా అవసరమే. కానీ మోతాదు మించితే మానవ ఆరోగ్యం, మొక్కల ఎదుగుదలపై తీవ్ర దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో అమ్మోనియా మోతాదు వార్షిక సరాసరి క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు (100 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు)గా ఉండాలి. కానీ నగరంలో అంతకుమించిన స్థాయిలో అమ్మోనియా వెలువడుతుందని, ఇది ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంద ని పీసీబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది వార్షిక సరాసరిని పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 123 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు గా నమోదు కావడం విశేషం. ఆ తరువాత స్థానాల్లో చార్మినార్ 120, ఉప్పల్ 118గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జూపార్కు, జీడిమెట్ల ప్రాంతాల్లో సైతం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో అమ్మోనియా విడుదలైనట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుదలకు కారణాలివే... అమ్మోనియా ఉద్గారాలు పారిశ్రామికవాడల నుంచి అధికంగా విడుదలవుతున్నట్లు పీసీబీ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, ప్లాస్టిక్, పేలుడు పదార్థాలు, వస్త్రాలు, కెమికల్, రంగులు తయారీ పరిశ్రమల్లో విచ్చలవిడిగా అమ్మోనియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆయా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో అమ్మోనియా వాయువులు గాలిలోకి విడుదలవుతుంటాయి. ఒక్కోసారి అధిక వేడికి అమ్మోనియా కంటైనర్లు పేలిపోతుంటాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యంపై పెనుప్రభావం పడుతోంది. పాతకాలం నాటి రిఫ్రిజిరేటర్లు, ఐస్ తయారీ కేంద్రాలు, డ్రైక్లీనర్స్ ద్వారా అమ్మోనియా వెలువడుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా చోట్ల కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అమ్మోనియా ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలే కారణం పరిశ్రమల ద్వారా అమ్మోనియా ఎక్కువగా విడుదలయ్యే అ వకాశం ఉంది. ఇది జనావాసాల్లో సైతం ఎక్కువగా ఉంటుం దంటే డ్రైక్లీనింగ్ల వాడకం అధికంగా ఉండడమో లేక సమీప పరిశ్రమల నుంచి విడుదలైన అమ్మోనియా ఆయా ప్రాంతాలకు వ్యాపించడమో జరగాలి. దీన్ని ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం భారంగా ఉంటుంది. ఆక్సిజన్ సైతం సరైన మోతాదులో అందదు. - వీరన్న, పీసీబీ సైంటిస్ట్ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అమ్మోనియా ఎక్కువగా పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటే కళ్లు, గొంతు, చర్మం మంటలు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. - డాక్టర్ పద్మజ, అమీర్‌పేట్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారిణి మోతాదు మించితే దుష్ర్పభావాలెన్నో... నిర్దేశిత ప్రమాణాలకు మించి అదనంగా ఒక గ్రాము/క్యూబిక్ మీటరు విడుదలైనా ఇబ్బందే అధిక మోతాదులో అమ్మోనియాను పీలిస్తే శ్వాస భారమవుతుంది. చర్మం, కళ్లు మంటలు పుడతాయి. ముక్కు, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేహంలోని మాంసకృత్తులను విచ్ఛిన్నం చేస్తాయి. అమ్మోనియా హైడ్రాక్సైడ్ మానవ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.అమ్మోనియాను ఎక్కువగా పీలిస్తే కడుపు మంట కూడా ఉంటుంది. మొక్కల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది గాలి కంటే బరువైంది. ఏ ప్రాంతంలోనైనా దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. బరువుగా ఉంటున్నందున ఊపిరితిత్తులపై భారం అధికంగా ఉంటుంది. ఈ వాసన పీల్చిన వారిలో చిరాకు ఎక్కువగా ఉంటుంది.