పచ్చని చెట్లు కొట్టేస్తూంటే మీకు గుబులుగా ఉంటోందా? ఊరి చెరువు నెర్రలుబారితే అయ్యో ఇలా అయ్యిందేమిటి? అన్న ఆందోళన మొదలవుతుందా? ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినా..‘‘అంతా అయిపోయింది’’ అన్న ఫీలింగ్ మీకు కలుగుతోందా? అయితే సందేహం లేదు.. మీరు కూడా ఎకో యాంగ్జైటీ బారిన పడ్డట్టే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఏంటీ ఎకో యాంగ్జైటీ? మానసిక రోగమా? చికిత్స ఉందా? లేదా? ఎలా ఎదుర్కోవాలి?
ఈ రోజు జూన్ ఐదవ తేదీ. ప్రపంచం మొత్తమ్మీద పర్యావరణ దినంగా ఉత్సవాలు జరుగుతాయి. మారిపోతున్న పర్యావరణం తీసుకొచ్చే ముప్పుల గురించి చర్చలు, అవగాహన శిబిరాలూ నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో పర్యావరణ మార్పుల చర్చల్లో ఎకో యాంగ్జైటీ కూడా ఒక టాపిక్‌గా మారిపోయింది.
వాతావరణంలో వస్తున్న మార్పుల మీలో ఆందోళన, ఒత్తిడి కలిగిస్తూంటే దాన్ని ఎకో యాంగ్జైటీ అని పిలుస్తున్నారు. కొన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. గానీ ఆ ప్రభావం మనం మీద ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా మన మూడ్స్ మారిపోవడం జరిగి ఒక దానిపై ఏకాగ్రత పెట్టలేని స్థితికి చేరుకుంటాం. ముఖ్యంగా వరదలు, అడవి మంటలు, భూకంపాలు, అపూర్వమైన వేసవి, చలికాలం, హిమనీనదాలు కరగడం, గ్లోబల్ వార్మంగ్ తదితరాలన్నీ మానవులను ఆందోళనకు గురి చేసేవేననిశారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవేనని నిపుణులు చెబుతున్నారు.
పెనుముప్పు...
మారుతున్న వాతావరణం కలిగించే ఆందోళన ప్రపంచానికి పెనుముప్పు అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ స్వయంగా చెబుతోందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. చాలాసార్లు దీన్ని వైద్య పరీక్షల ద్వారా గుర్తించలేమని అంచనా. అయితే తట్టుకునేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయని వీరు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. అందుకోసం శాస్త్రీయంగా చేయాల్సిన పనులపై దృష్టిసారించడం, తీసుకోవాల్సిన చర్యలు, పరిష్కారాలను అమలు చేయడం వంటివి చేయాలి.
కార్బన్ ఉద్గారాలను తగ్గించేలా పర్యావరణ అనుకూలమైన జీవనశైలి మార్పులను చేసుకోవడం వాతావరణ పరిక్షణకు అనుకూలంగా ఉన్న విధానాలకు మద్దతు ఇవ్వడం లేదా స్థానిక పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనడం.
మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్‌ను ప్రాక్టీస్ చేయడం. మనసు ప్రశాంతంగా ఉంచేలా ధ్యానం, శ్వాస లేదా ప్రకృతిలో గడపడం వంటి వాటితో ఈ పర్యావరణ ఆందోళనను తగ్గించుకోవచ్చు ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా ఇతరులతో కనెక్ట్ అవ్వడం.
ఆన్‌లైన్ కమ్యూనిటీలు లేదా స్థానిక సంస్థల్లో చేరడం వంటివి చేయండి. వాతావరణ సంక్షోభంపై అవగాహన కలిగి ఉండటం తోపాటు సవాళ్లును ఎదుర్కొనేలా సిద్ధం కావాలి. అలాగే పురోగతిని, వాతావరణ మార్పులు పరిష్కరించడానికి సమిష్టి ప్రయత్నాలు చేయాలి.
(చదవండి: పర్యావరణహితం యువతరం సంతకం)
Comments
Please login to add a commentAdd a comment