
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్‌లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్‌లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
ఏటా గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్‌లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్‌లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది.
వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది.
ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్‌లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్‌లను నిర్వహించారు.
(చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..)
Comments
Please login to add a commentAdd a comment