సాక్షి, హైదరాబాద్: దేశంలో మిల్లెట్ సాగుకు అనుకూలమైన వాతావర ణం ఉందని నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ అన్నారు. శుక్రవారం హైదరా బాద్‌లో ‘మిల్లెట్ కాంక్లేవ్– 2023’ని జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా షాజీ మాట్లాడు తూ మిల్లెట్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అద్భుత మైన ఫలితాలు అందించిందని చెప్పారు. గ్రామీణ–పట్టణ ఆదాయ అసమానతలు తగ్గించడం, సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం తమ కర్తవ్యమన్నారు.
ఐక్యరాజ్యసమి తి 2023ని మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించడానికి మన దేశమే కారణమని, మిల్లెట్లను మరింత ముందుకు తీసుకెళ్ల డానికి ఇది భారతదేశానికి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్‌ను మిల్లెట్ గ్లోబల్ హబ్‌గా మార్చ డానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అత్యుత్తమ కేంద్రంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మిల్లెట్‌పై వ్యవసాయ, వివిధ రంగాల ప్రముఖు లు చర్చించారు. అపెడా చైర్మన్ అభిషేక్ దేవ్ వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. నాబార్డు సీజీఎంలు మోనోమోయ్ ముఖర్జీ, ఉదయ్ భాస్కర్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment