ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు.
ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్‌లో గ్రీన్ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు.
రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ..
కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment