ADB
-
ఎకానమీకి ప్రభుత్వ వ్యయం, వ్యవసాయం దన్ను
న్యూఢిల్లీ: మెరుగైన వ్యవసాయోత్పత్తి, అధిక ప్రభుత్వ వ్యయాలు భారత్ ఆర్థిక కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనావేసింది. వ్యవసాయం రంగం పురోగమనం నేపథ్యంలో గ్రామీణ వినియోగం బాగుంటుందని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ వృద్ధి 7 శాతంగా ఉంటుందని తన సెప్టెంబర్ అప్డేటెడ్ అవుట్‌లుక్ (ఏడీఓ) నివేదికలో అంచనా వేసింది.2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా అవుట్‌లుక్ విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులకు సేవల రంగం తోడ్పాటును అందిస్తుందని నివేదిక వివరించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.7 శాతం ఎకానమీ వృద్ధి నమోదయినప్పటికీ, రానున్న కాలంలో ఈ రేటు పుంజుకుంటుందన్న భరోసాను నివేదిక వెలిబుచ్చింది. ఎకానమీ 2023–24లో 8.2 శాతం పురోగమించగా, 2024–25లో 7.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తోంది. ‘‘ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ చక్కటి, స్థిరమైన పనితీరు కనబరిచింది’’అని ఏడీబీ కంట్రీ (ఇండియా) డైరెక్టర్ మియో ఓకా చెప్పారు. కాగా, 2024–25లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది.దక్షిణాసియాకు భారత్ భరోసా: డబ్ల్యూఈఎఫ్ సర్వేఇదిలావుండగా, ఎకానమీ దృఢమైన పనితీరుతో భారత్ మొత్తం దక్షిణాసియా ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ స్థాయిలో నిలుపుతున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సర్వేలో పాల్గొన్న మెజారిటీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే గ్లోబల్ రికవరీ పట్ల ఆశావహ దృక్పదాన్ని వెలువరిస్తూనే కొన్ని సవాళ్లూ ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా పెరుగుతున్న రుణ స్థాయిలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. దీనివల్ల మౌలిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వ్యయాలకు గండిపడే అవకాశం ఉందని అంచనావేశారు. మొత్తంమీద 2024, 2025లో ప్రపంచ ఎకానమీ ఒక మోస్తరు, లేదా పటిష్టంగా పురోగమించడం ఖాయమన్నది వారి అభిప్రాయం. అమెరికా ఎన్నికల ఫలితాలు కూడా ప్రపంచ ఎకానమీపై ప్రభావం చూపే కీలక అంశాల్లో ఒకటిగా ఆర్థికవేత్తలు పేర్కొనడం గమనార్హం. -
భారత్‌లో ఉపాధి కల్పనపై దృష్టి
న్యూఢిల్లీ: భారత్‌లో ఉపాధి కల్పనతోపాటు, పర్యావరణ అనుకూల వృద్ధికి ప్రోత్సాహం, సామాజిక, ఆర్థిక సమగ్ర వృద్ధికి మద్దతు ఇవ్వనున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రకటించింది. 2023–27 కాలానికి తన ప్రణాళికలను సంస్థ ప్రకటించింది. భారత్ కోసం నూతన భాగస్వామ్య విధానాన్ని ప్రారంభించింది. భారత్‌తో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో సమ్మిళిత, బలమైన సమగ్రాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వనున్నట్టు తెలిపింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి భారత్ త్వరగా పుంజుకుందని తెలిపింది. 2023–24 సంవత్సరానికి భారత్ 6.4 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, మానవాభివృద్ధి, ఆదాయం, ప్రాంతీయ అసమానతలు, వాతావరణం పరంగా సున్నితత్వం, ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలబడే సుస్థిర, సమగ్రాభివృద్ధి భారత్‌కు అవసరమని అభిప్రాయపడింది. పారిశ్రామిక కారిడార్లు, మల్టిమోడల్ లాజిస్టిక్స్, పట్టణ మౌలిక వసతులు, నైపుణ్యాల అభివృద్ధి, చిన్న వ్యాపారాలకు మద్దతుగా నిలవనున్నట్టు ఏడీబీ తెలిపింది. దీనివల్ల పట్టణ ప్రాంతాలు మరింతగా వృద్ధి చెందుతాయని, పారిశ్రామిక పోటీతత్వం పెరుగుతుందని, సంఘటిత తయారీ రంగం, సేవల రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. ‘‘ఏడీబీ ఒకే సారి విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రతకు మద్దతునిస్తుంది. మెరుగైన పట్టణ జీవనం, గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇస్తూ లింగ సమానత్వం, పర్యావరణ సుస్థిరతతకు ప్రోత్సాహాన్నిస్తుంది’’అని ఏడీబీ భారత్ డైరెక్టర్ టకియో కొనిషి తెలిపారు. భారత వాతావరణ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం తమ నూతన అజెండాలో భాగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాల ద్వారా ఈ లక్ష్యాలను చేరుకుంటామన్నారు. ఏడీబీలో భారత్ నాలుగో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2022 డిసెంబర్ చివరికి 605 ప్రభుత్వరంగ రుణాలకు సంబంధించి 52.6 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అలాగే 8 బిలియన్ డాలర్ల ప్రైవేటు పెట్టుబడులనూ అందించనుంది. -
భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ఇంచియాన్ (దక్షిణ కొరియా): పర్యావరణ పరిరక్షణకు (గ్రీన్) దోహదపడే భారత్ పరిశ్రమకు రాయితీలతో కూడిన రుణాలను మరింతగా మంజూరు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ)కి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. భారత్ ఆర్థిక పురోగతి ఇటు ప్రాంతీయ, అటు అంతర్జాతీయ ఎకానమీ సానుకూల వాతావరణానికి దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవాతో ఆమె ప్రతినిధుల స్థాయి ద్వైపాక్షిక సమావేశం జరిపారు. ఏడీబీ సావరిన్ నాన్ సావరిన్ ఆపరేషన్స్‌లో భారత్ కీలక దేశంగా కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సభ్య దేశాలకు 100 బిలియన్ డాలర్ల ‘గీన్’ ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించి ఏడీబీ నిబద్ధతను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా పునరుద్ఘాటించారు. ఆసియా, పసిఫిక్‌లో గ్రీన్ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఏడీబీ వినూత్న విధానాలకు మద్దతు ఇచ్చినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయి డినామినేటెడ్ బాండ్లతో ఏడీబీ నిధుల సమీకరణ.. కాగా, రూపాయి డినామినేటెడ్ బాండ్ల ద్వారా మరిన్ని నిధులను సేకరించాలని చూస్తున్నట్లు ఏడీబీ పెసిడెంట్ ఈ సందర్భంగా తెలిపారు. భారత్ మౌలిక, గ్రీన్ ప్రాజెక్టులకు 2027 నాటికి 25 బిలియన్ డాలర్ల మేర సమకూర్చాలని ఏడీబీ ప్రతిపాదిస్తుండడం గమనార్హం. ఈ ప్రతిపాదనను ఆమోదం నిమిత్తం ఏడీబీ బోర్డు చర్చించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు -
భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ 2021–22 ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి అంచనాలకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) కోత పెట్టింది. ఏప్రిల్‌నాటి 11 శాతం వృద్ధి పరుగు అంచనాను తాజాగా 10 శాతానికి కుదించింది. కోవిడ్–10 మహమ్మారి ప్రేరిత సవాళ్లు ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగిస్తుండడమే తాజా అంచనాలకు కారణమని తన ఆసియా డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీఓ)లో పేర్కొంది. 46 సభ్య దేశాలతో కూడిన ఏడీబీ అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23లో భారత్ వృద్ధి 7.5 శాతానికి పరిమితం అవుతుంది. ► కరోనా సెకండ్‌వేవ్ భారత్ సేవలు, దేశీయ వినియోగం, పట్టణ అసంఘటిత రంగం ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► 2020–21తో పోలి్చతే 2021–22లో వినియోగం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వ వ్యయాలు, ఎగుమతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థకు కలిసి వచ్చే అంశాలివి. ► మూడవ వేవ్ సవాళ్లు లేకపోతే 2021–22 చివరి మూడు త్రైమాసికాల్లో (2021జూలై–మార్చి 2022 )ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, మౌలిక రంగం పురోగతి, ఆరోగ్య సంబంధ సేవల పటిష్టత వంటి అంశాలు వృద్ధి రికరవీ వేగవంతానికి దోహదపడతాయి. ► 2021లో ఆసియా ప్రాంత వృద్ధి రేటు 7.3 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ► చైనా విషయంలో 2021 వృద్ధి రేటు అంచనా 8.1 శాతంగా ఉంది. గృహ డిమాండ్ పటిష్టత దీనికి కారణం.అయితే 2022లో 5.5 శాతానికి తగ్గుతుంది. హైబేస్ దీనికి కారణం. కాగా ఉపాధి కల్పనా మార్కెట్, వినియోగ విశ్వాసం పటిష్టంగా ఉన్నాయి. ► దక్షిణాసియాలోని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో ఎకానమీల వృద్ధి తీరు వివిధ తీరులుగా ఉంటుంది. ఇంతకుముందు అంచనాలకన్నా వృద్ధి వేగం ఆయా దేశాల్లో మందగిస్తుంది. అయితే 2022లో వృద్ధి వేగం పెరిగే వీలుంది. ► వేగవంతమైన వ్యాక్సినేషన్ వల్ల ఎకానమీల్లో కేసులు, మరణాల తీవ్రత తగ్గుతోంది. ► కాగా అమెరికా, యూరో ప్రాంతం, జపాన్లలో 2022 వృద్ధి సగటును 3.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఆసియా ఎకానమీల్లో ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇంధన, ఆహార ధరలు పెరుగుదలతోపాటు, కరెన్సీ విలువలు తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అయితే సెంట్రల్ బ్యాంకులకు నిర్దేశిత స్థాయిలకన్నా భారీగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు. ► ప్రభుత్వాల ద్రవ్య, పరపతి విధానాలు సరళతరంగా కొనసాగుతాయని భావిస్తున్నాం. భారీ వృద్ధి అంచనాకు సెకండ్‌వేవ్ దెబ్బ కరోనా ప్రేరిత సవాళ్లతో గడచిన ఆర్థిక సంవత్సరంలో 7.3 క్షీణతను నమోదుచేసుకున్న ఆర్థిక వ్యవస్థ, 2021–22 మొదటి జూన్ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధిని సొంతం చేసుకుంది. నిజానికి లోబేస్‌కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (2021 ఏప్రిల్, మే) సెకండ్‌వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. ఇక రెపోను వరుసగా ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం, ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. కాగా, రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. అయితే జూలైలో 5.59 శాతం దిగువకు చేరింది. ఆగస్టులో 5.3 శాతానికి దిగివచి్చంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. -
నేపాల్‌కు ఏడీబీ సాయం
ఖాట్మాండు: కరోనా పోరాటంలో నేపాల్‌కు సాయం చేసేందుకు ఏషియన్ డెవెలప్మెంట్ బ్యాంక్ మరోసారి ముందుకొచ్చింది. మంగళవారం 250 మిలియన్ డాలర్ల రాయితీ రుణాన్ని ఏడీబీ నేపాల్‌కు మంజూరు చేసింది. ఈ విషయంపై ఏడీబీ అధ్యక్షుడు మసత్సుగు అసకావా మాట్లాడుతూ... ఈ విపత్కర పరిస్థితుల్లో ఏడీబీ నేపాల్‌కు అండగా నిలబడుతుంది. ఈ రాయితీ రుణం నేపాల్ ప్రభుత్వం పేదలకు మరింత సాయం చేయడానికి ఉపయోగపడుతుంది. నేపాల్ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోవడానికి ఈ రుణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కరోనా మహమ్మారి చాలా కాలం వరకు కొనసాగుతూ ప్రజారోగ్యంతో పాటు నేపాల్ సామాజిక, ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఏడీబీ ప్రభుత్వంతోపాటు ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తూ నేపాల్‌కు అండగా ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. (భారత్‌పై నేపాల్ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు) ఇప్పటికే కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్టు (కేర్) కార్యక్రమం రోజుకు మూడులకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు, రెండు లక్షల మందికి క్వారంటైన్ సదుపాయాలు కల్పించేందుకు దోహదపడింది. ఏడీబీ సాయంతో నేపాల్ ప్రభుత్వం వైద్యపరమైన, ఆర్థికపరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు ఆహారాన్ని అందిచడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే యునిసెఫ్‌తో కలిసి 3లక్షల డాలర్లను ఏడీబీ నేపాల్‌కు అందించింది. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) -
కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందించేందుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,000 కోట్లు) రుణాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. కోవిడ్-19 కట్టడి, నివారణ చర్యలు, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహణ లాంటి తక్షణ ప్రాధాన్యతా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ మసాట్సుగు అసకావా (ఫైల్ ఫోటో) భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం (రూ. 11,000 కోట్లు) ఇవ్వడానికి ఏడీబీ మంగళవారం అంగీకరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ -19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రాం పేదలు, మహిళలు , ఆర్థికంగా బలహీన వర్గాలకు సామాజిక రక్షణతో పాటు, వ్యాధి నివారణ చర్యలకు మద్దతుగా ఈ నిధులను సమకూర్చనున్నామని ఏడీబీ అధ్యక్షుడు మసాట్సుగు అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. 2020 మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలులో ఏడీబీ అందించిన ఆర్థిక సాంకేతిక సహకారం దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిసమీర్ కుమార్ ఖరే చెప్పారు. దీంతోపాటు వృద్ధిని పెంచడానికి, బలమైన పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు ఏడీబీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. క్రెడిట్ గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం తద్వారా ప్రభావిత పరిశ్రమలు వ్యవస్థాపకులకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ) మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) -
రూ.46,675 కోట్లతో వాటర్ గ్రిడ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా మండు వేసవిలో సైతం తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ.46,675 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, అనిల్‌కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెరిగే జనాభాను అంచనా వేసి, 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ డిజైన్‌ను అధికారులు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 46,982 నివాసిత ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని 110 పట్టణ, నగర పాలక ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని, మొదటి దశలో రూ.37,475 కోట్లు, రెండో దశలో రూ.9,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.2,500 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించారు. భూగర్భ జలాల వినియోగం నిలిపివేత! వాటర్ గ్రిడ్ పథకంలో.. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి కుళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తారు. తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఇకలేదని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. గిరిజన ప్రాంతాల్లో నదులు, నీటి వనరులు, రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల కోసం జలజీవన్ మిషన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ప్రాంతాల వారీగా ఎంత నీరు అవసరం? జలాశయాలు, నదులు, ఇతర వనరుల్లో ఉన్న నీటి లభ్యత ఎంత? అనేదానిపై సమగ్ర సమాచారం సేకరించాలని మంత్రులు ఆదేశించారు. తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలకు నీటి సరఫరాలో సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కేంద్రానికి ఆర్బీఐ నిధులు మంచికే: ఏడీబీ
న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకిహికో నకయో పేర్కొన్నారు. రూ.1.76 లక్షల కోట్ల మిగులు బదలాయింపు ‘‘తగిన విధానం’’గా ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి పెట్టుబడులకు సానుకూలమైనదని వివరించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా–చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చని అన్నారు. అయితే ఇపుపడు భయమంతా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, బలహీన మార్కెట్ సెంటిమెంట్, మారకపు విలువల్లో ఒడిదుడుకులేనని వివరించారు. నాలుగురోజుల నకయో భారత్ పర్యటన శుక్రవారంతో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020–21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది. -
‘7.2 శాతం వృద్ధి రేటుతో దూసుకెళతాం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ నరేంద్ర మోదీ సర్కార్‌కు ఊరట ఇచ్చే అంచనాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) బుధవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.2 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఏడాది 7.3 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఏడీబీ నివేదిక అంచనా వేసింది. వడ్డీరేట్లు దిగిరావడం, రైతులకు పెట్టుబడి ఊతం, దేశీయ డిమాండ్ ఊపందుకోవడంతో భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. దేశీయ వినిమయం పటిష్టంగా ఉండటంతో ఎగుమతులు తగ్గినా దాని ప్రభావం ఆసియా దేశాలపై అంతగా ఉండబోదని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యుసుకి సవద పేర్కొన్నారు. ఆసియా దేశాలు సైతం రాబోయే రెండేళ్లలో ఐదు శాతం మేర వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఏడీబీ అంచనా వేసింది. -
పదేళ్లలో భారత్ జీడీపీ రెట్టింపు
మనిలా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ అంచనా జీడీపీ వృద్ధి 7 శాతం ‘అత్యంత వేగవంతమైనదని’ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ...ఇదే వేగం కొనసాగితే వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపవుతుందని వ్యాఖ్యానించింది. 8 శాతం వృద్ధి సాధించలేకపోతున్నామన్న ఆందోళన భారత్‌కు వద్దని, దేశంలో ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం ద్వారా దేశీయ డిమాండ్ పెరిగేందుకు చర్యలు చేపట్టాలని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయూకి సావాడా సూచించారు. ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వృద్ధి అనేది ఎగుమతులకంటే వినియోగం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. భారత్ జీడీపీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2019–2020లో 7.6 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని ఏడీబీ అంచనా వేసింది. అయితే 2017–2018 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.6 శాతానికే పరిమితమవుతుందని అంచనా. 2016–17లో సాధించిన 7.1 శాతం వృద్ధికంటే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు తగ్గనుంది. ఏడు శాతం వృద్ధి అంటేనే అత్యంత వేగవంతమైనదని, అలాంటిది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరం 7.6 శాతం చొప్పున వృద్ధిచెందడమంటే అద్భుతమైన అంశమని సావాడా విశ్లేషించారు. అయితే భారత్‌కు 8 శాతం వృద్ధి సాధన పెద్ద సవాలేనని, అంత వృద్ధి సాధించలేకపోతున్నామన్న ఆందోళన అక్కర్లేదని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన ముఖ్యం... ఆదాయ అసమతౌల్యాన్ని తొలగించడం, పేదరికాన్ని నిర్మూలించడం అధిక వృద్ధి సాధనలో ముఖ్యపాత్ర వహిస్తాయని సావాడా అన్నారు. వినియోగం పెరిగితే..ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఉపాధి కల్పన జరుగుతుందని ఆయన వివరించారు. పేదల జీవనప్రమాణాలు మెరుగుపడితే..వారు మంచి వినియోగదారులుగా అవతరిస్తారని అన్నారు. ఎగుమతులు కూడా అధిక వృద్ధిసాధనలో భాగమే అయినప్పటికీ, భారత్ వృద్ధి మాత్రం అధికంగా దేశీయ మార్కెట్ మీద ఆధారపడిందేనని అన్నారు. సర్వీసుల రంగం కూడా అధిక వృద్ధి సాధనలో తగిన పాత్ర పోషిస్తున్నదని ఆయన చెప్పారు. -
వృద్ధి రేటు అంచనా ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. జీఎస్టీ అమలుతో పాటు బ్యాంకింగ్ సంస్కరణలతో పెట్టుబడులు ఊపందుకున్నాయని దీంతో ఆర్థిక వృద్ధి రేటు ఆజాశనకంగా నమోదవుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల రద్దు కష్టాలు, జీఎస్టీ ఆరంభ సమస్యలతో వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనాలకు ఏడీబీ వృద్ధి రేటు అంచనా సారూప్యంగా ఉంది. అయితే ఆర్బీఐ అంచనా (7.4)కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం. జీఎస్టీ అమలు గాడినపడి ఉత్పాదకత పెరగడం, బ్యాంకింగ్ సంస్కరణలతో పెట్టుబడులు ఊపందుకోవడం మెరుగైన వృద్ధి రేటుకు ఉపకరిస్తాయని ఏడీబీ స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరింత ప్రోత్సాహకరంగా 7.6 శాతంగా ఉంటుందని ఏడీబీ నివేదిక పేర్కొంది. ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోనున్నందున మెరుగైన వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. జీఎస్టీ క్రమంగా కుదురుకోవడంతో పాటు ప్రభుత్వానికి భారీ రాబడిని సమకూర్చుతుందని, ఇది ఆర్థిక స్ధిరత్వానికి, సంస్కరణలకు, ఎఫ్‌డీఐ మెరుగుదలకు దోహదపడుతుందని అంచనా వేసింది. అయితే వడ్డీరేట్లు మున్ముందు పెరిగే అవకాశం ఉందని ఏడీబీ నివేదిక స్పష్టం చేసింది. -
ఈసారి 7.4 శాతం వృద్ధి రేటు
భారత్‌పై అంచనాలను యథాతథంగా ఉంచిన ఏడీబీ న్యూఢిల్లీ: గతంలో అంచనా వేసిన 7.4% వృద్ధి రేటు సాధన దిశగా భారత్ ముందుకెళుతోందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదే రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది. అటు ఆసియా ప్రాంత వృద్ధి రేటు అంచనాలను మాత్రం గతంలో ప్రకటించిన 5.7% నుంచి 5.9%కి పెంచుతున్నట్లు తెలిపింది. ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) 2017 నివేదికకు అనుబంధ నివేదికలో వర్ధమాన ఆసియా దేశాలకు సంబంధించి అంచనాలను ఈ మేరకు సవరించింది. 2018లో వర్ధమాన ఆసియా వృద్ధిని 5.7% నుంచి 5.8%కి పెంచింది. ఇక 2017–18లో భారత వృద్ధి 7.4% ఉండగలదని, 2018–19లో 7.6%కి పెరగగలదని ఏడీబీ తెలిపింది. మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాల నిర్వహణ సులభతరం కావడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) దోహదపడగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
ఏడీబీ రోడ్డు అభివృద్ధికి రూ.230 కోట్లు
- నెల రోజుల్లో ఖరారు కానున్న టెండర్లు - పూర్తి కావొచ్చిన భూసేకరణ గ్రామసభలు రాజానగరం : కాకినాడ నుంచి రాజానగరం వరకు ఉన్న ఏడీబీ రోడ్డును (30 కిలోమీటర్ల వరకు) నాలుగు లేన్లగా అభివృద్ధి చేసే ప్రక్రియను రూ.230 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారని ఆర్అండ్బీ ప్రత్యేక డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్సన్‌రాజు తెలిపారు. రాజానగరం మండలం రామస్వామిపేటలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అందుకు అవసరమైన 74 ఎకరాల భూసేకరణకుగాను నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు కూడా పూర్తికావొచ్చాయన్నారు. రాజానగరంలో జాతీయ రహదారిని ఏడీబీ రోడ్డు కలిసే జంక్షన్ వద్ద ‘ట్రంపెట్’ని నిర్మించి కాకినాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు జాతీయ రహదారి పైకి చేరేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణపై ప్రజలకు అవగాహన కలిగిచేందుకుగాను శనివారం రాజానగరంలో తుది గ్రామసభను నిర్వహిస్తున్నామన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూములు కోల్పోతున్నవారికి పరిహారం చెల్లిస్తున్నారన్నారు. అయితే ఈ పరిహారం విషయమైగాని, ఇతర ఏవిధంగా అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయమని సూచించామన్నారు. రామస్వామిపేటలో గ్రామసభ ఏడీబీ రోడ్డు విస్తరణకుగాను రామస్వామిపేటలో భూములు, గృహాలు కోల్పోతున్న వారి జాబితా, వారికి లభించే పరిహారానికి సంబంధించిన వివరాలను తహసీల్దారు జీఏఎల్ సత్యవతిదేవి తెలియజేశారు. భూములకు, నిర్మాణాలకు, ఫలసాయం ఇచ్చే వృక్షాలకు వేరువేరుగా పరిహారం ఏవిధంగా చెల్లించేది వివరించారు. ఈ విషయంలో ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా వెంటనే తెలియజేయాలన్నారు. జాబితాలో తమ పేర్లు లేవని, కాని భూసేకరణకు మార్కింగ్ ఇచ్చారని కొందరు, నిర్మాణాలకు మీరిచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, పెంచాలని మరికొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆ మేరకు లేఖలు ఇచ్చే వాటిని పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అశోక్, గ్రామపెద్దలు గుత్తుల ఆదినారాయణ, అట్రు బ్రహ్మం పాల్గొన్నారు. -
విశాఖ-చెన్నై కారిడార్‌పై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) మంజూరు చేసిన నిధుల వివరాలపై, కేజీ బేసిన్లో ఓఎన్జీసీ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించి సమాధానమిచ్చారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఏడీబీ 2016 సెప్టెంబర్ 20న రూ.4,165 కోట్లు రుణాలు, గ్రాంట్లు రూపంలో మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం, పారిశ్రామిక పాలసీలు, బిజినెస్ ప్రమోషన్లు, టెక్నికల్ అసిస్టెన్స్ కోసం ఈ రుణాలు, గ్రాంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తొలిదశకు 25 ఏళ్ల సమయం ఉందని, ఇందులో గ్రేస్ పీరియడ్ ఐదేళ్ల కాలపరిమితి ఉన్నట్లు వాణిజ్యశాఖ వెల్లడించింది. గత మూడేళ్లుగా కేజీ బేసిన్లో ఓఎన్జీసీ పనితీరు వివరాలను సంబంధితమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఓ ప్రకటనలో వివరించారు. గత మూడేళ్లలో లాభాలు 50శాతం కంటే తగ్గలేదని, 2014-15 కాలంలో పన్నులు తీసేసిన తర్వాత లాభం రూ.17,733 కోట్లు వచ్చిందని, 2015-16లో రూ.16,004 కోట్లు వచ్చినట్లు ఆ శాఖ వెల్లడించింది. క్రూడ్ ఆయిల్ ధరల 2014లో అమెరికన్ డాలర్లు 110/బీబీఎల్ ఉండగా 2016లో 28/బీబీఎల్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు చాలా తగ్గాయని, తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ జరిగిన నగరం గ్రామంలో నాన్ లీకేజ్ పైపులైన్లు మార్చడంతో రెవెన్యూ రాబడి కొంత తగ్గినట్లు సమాచారం. -
పాకిస్తాన్ కు ఏడీబీ ఝలక్
-
పాకిస్తాన్ కు ఏడీబీ ఝలక్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సింధు నదిపై పాకిస్తాన్ రూ. 1,400 కోట్లతో నిర్మించాలనుకున్న రిజర్వాయర్‌కు నిధులివ్వడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నిరాకరించింది. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు కూడా నిధులివ్వడానికి ఒప్పుకోలేదు. భారత్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాలని అప్పట్లో ప్రపంచబ్యాంకు కోరగా.. అందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఆ బ్యాంకు కూడా నిధులివ్వడానికి ముందుకురాలేదు. తాజాగా ఏడీబీ అధ్యక్షుడు టకిహికో నకావో పాక్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనిపై మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు’ అని తెలిపారు. సెంట్రల్ ఏసియన్ రీజినల్ ఎకనమిక్ కో ఆపరేషన్(సీఏఆర్ఈసీ) ప్రోగ్రామ్ 15వ మంత్రిత్వ సమావేశం ముగింపు సందర్భంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్‌దార్‌తో సమయుక్త విలేకరుల సమావేశంలో టకిహికో ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలోని గిల్గిట్, బాల్తిస్తాన్ పరిధిలో సాగునీరు, విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని, దీనికి మరిన్ని భాగస్వామ్యాలు అవసరమని టకిహికో పిలుపునిచ్చారు. పెద్ద ప్రాజెక్టు అయినందువల్లే ఏడీబీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులో ఏడీబీ పాలుపంచుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ లోని డాన్ పత్రిక పేర్కొంది. -
విశాఖ-చెన్నై కారిడార్‌పై అధ్యయనం పూర్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఐఐఎఫ్‌టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలను కాకినాడ ఎక్స్పోర్ట్ జోన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఎన్ఐడీ-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించామన్నారు. విదేశీ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికే డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెరైక్టర్ జన రల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిర్వహిస్తుంద ని వివరించారు. -
గతవారం బిజినెస్
నియామకాలు ⇔ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్‌గా తకిహికొ నకయో తిరిగి ఎన్నికయ్యారు. నవంబర్ 24 నుంచి ఐదేళ్ల పదవీ కాలంలో కొనసాగడానికి బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్లు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ⇔ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్-సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా రాణి సింగ్ నాయర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ⇔ మైక్రోసాఫ్ట్’ ఇండియా ప్రెసిడెంట్‌గా అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. ఈయన మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రమాణిక్ నుంచి 2017 జనవరి 1 నుంచి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. జీఎస్టీకి ఆమోదం దేశంలో ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. దీనిపై పరిశ్రమ వర్గాలు, పన్ను నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. జీడీపీపై సానుకూల ప్రభావం ఉంటుందని, ఆర్థిక రంగ వృద్ధికి తోడ్పడుతుందని, వస్తు, సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, నల్లధనానికి కళ్లెం వేస్తుందని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. లాఇకో ‘సూపర్3’ సిరీస్ టీవీలు చైనా ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘లాఇకో’ తాజాగా తన ‘సూపర్3’ సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో 55 అంగుళాల ‘ఎక్స్55’, 65 అంగుళాల ‘ఎక్స్65’, 65 అంగుళాల ‘మ్యాక్స్65’అనే ప్రొడక్టులు ఉన్నాయి. 4కే అల్ట్రా హెచ్డీ (3840‘2160) రెజల్యూషన్ వీటి సొంతం. ‘ఎక్స్55’ ధర రూ.59,790గా, ‘ఎక్స్65’ ధర రూ.99,790గా, ‘మ్యాక్స్65’ ధర రూ.1,49,790గా ఉంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. వోకార్డ్‌కు యూఎస్ఎఫ్డీఏ మరో పంచ్ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తాజాగా ఫార్మా దిగ్గజం ‘వోకార్డ్’కు మరో షాకిచ్చింది. ఈ సంస్థకు చెందిన మరో ప్లాంటు ఔషధాల దిగుమతులపై నిషేధం విధించింది. వోకార్డ్ తన అంకలేశ్వర్ ప్లాంటులో తయారీ నిబంధనలు అతిక్రమించిందని, తదనుగుణంగానే అక్కడ త యారైన ఔషధాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నామని యూఎస్ఎఫ్డీఏ తన వెబ్సైట్లో పేర్కొంది. 8వ ఏడాదీ ముకేశ్ అంబానీ వేతనం రూ.15 కోట్లు భారత్ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదవ ఏడాది 2015-16 సంవత్సరంలోనూ రూ.15 కోట్ల వేతనమే తీసుకున్నారు. ఆమోదిత మొత్తం రూ.38.75 కోట్లు అయినా... రూ.15 కోట్లను ఆయన తీసుకున్నట్లు 2015-16 వార్షిక నివేదికలో ఆర్ఐఎల్ తెలిపింది. సంస్థ బోర్డ్‌లోని ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల వేతనం భారీగా పెరుగుతున్నా... ముకేశ్ తన నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు. టాప్-10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. సుబ్రతారాయ్ పెరోల్ పొడిగింపు సహారా చీఫ్ సుబ్రతారాయ్ పెరోల్‌ను సెప్టెంబర్ 16 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అయితే తదుపరి వాయిదాలోపు రూ.300 కోట్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డిపాజిట్ చేయాలని, లేదంటే తిరిగి జైలుకు పంపవలసి వస్తుందని స్పష్టం చేసింది. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమయిన కేసులో దాదాపు రెండేళ్లు తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇటీవలే తల్లి మరణంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ చౌక గృహ రుణాలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా చౌక గృహ రుణాలను ప్రకటించింది. ఏడవ వేతన కమిషన్ వల్ల ప్రయోజనం పొందిన రక్షణ సహా ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు బ్యాంకు ఈ రుణాలను ఆఫర్ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ఎస్బీఐ ప్రివిలేజ్ హోమ్ లోన్’, రక్షణ రంగ ఉద్యోగులకు ‘ఎస్బీఐ శౌర్య హోమ్ లోన్’ అనే రెండు రకాల గృహ రుణాలను ప్రవేశపెడుతున్నట్లు ఎస్బీఐ తెలియజేసింది. ఈ రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ ఉండ దని, రుణ గ్రహీతలు 75 ఏళ్లు వచ్చే వరకు రీ-పేమెంట్ (ఈఎంఐ) చెల్లించవచ్చని పేర్కొంది. బీఈఎల్ షేర్ల బైబ్యాక్ రక్షణ రంగ ప్రభుత్వ దిగ్గజ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) రూ.2,171 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయనుంది. 1.66 కోట్ల షేర్లను షేర్‌కు రూ.1,305 చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు బీఎస్ఈకి పంపిన సమాచారంలో తెలిపింది. బీఈఎల్‌లో ప్రభుత్వ వాటా 75.02 శాతం. తాజా బైబ్యాక్ ద్వారా ప్రభుత్వానికి కొంత మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. ఏడు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఓకే ప్రభుత్వం రూ.300 కోట్ల విలువైన ఏడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిల్లో రూ.267 కోట్ల విలువైన టికోన డిజిటల్ నెట్వర్క్స్ ప్రతిపాదన ప్రధానమైనది. లారస్ ల్యాబ్స్ ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు మార్గం సుగమమైంది. ఐదు ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ తిరస్కరించింది. మరో ఏడింటిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఫైనాన్షియల్ టైమ్స్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్, మెర్గాన్ స్టాన్లీ ఇండియా ప్రైమర్ డీలర్ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. డీల్స్.. ⇔ హైదరాబాద్ కేంద్రంగా పునరుత్పాదక రంగంలో సేవలందిస్తున్న మిత్ర వాయు (ఎంవీటీపీఎల్) 31 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఏపీలో 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకుగాను గుయామా పీఆర్ హోల్డింగ్స్ ఈ పెట్టుబడులు పెట్టిందని మిత్ర ఎనర్జీ తెలిపింది. ⇔ ఇజ్రాయెల్‌కు చెందిన క్లౌడ్ కంపెనీ క్లౌడిన్లో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.27 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ⇔ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్(డబ్ల్యూపీఎన్) కంపెనీ ఇజ్రాయెల్‌కు చెందిన హెచ్ ఆర్ గివోన్ను కొనుగోలు చేయనున్నది. -
ప్రైవేటు పెట్టుబడులు... గ్రామీణ డిమాండ్ కీలకం
భారత్ వృద్ధిపై ఏడీబీ విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్ ఆర్థికాభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కీలక అంశాలని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడిబీ) విశ్లేషించింది. 2016-17, 2017-18 సంవత్సరాల్లో వృద్ధికి ఈ అంశాలు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థపై ఈ మేరకు మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ రూపొందించిన నివేదికలో ముఖ్యాంశాలు... ♦ వృద్ధికి ప్రభుత్వ పెట్టుబడులు, పట్టణ వినియోగం (డిమాండ్) కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి పటిష్టతకు ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ కూడా పటిష్ట పడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల నేపథ్యంలో- దేశీయ డిమాండ్ అన్ని స్థాయిల్లో పటిష్ట పడాలి. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధిరేటు అంచనా 7.4 శాతం. బలహీన గ్లోబల్ డిమాండ్, ఎగుమతులు పడిపోవడం వంటి అంశాలు వృద్ధి రేటు తగ్గడానికి కారణం. ♦ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెరుగుదల వల్ల పట్టణ వినియోగ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో గ్రామీణ వినియోగ డిమాండ్ పటిష్టతపై సందేహాలు నెలకొన్నాయి. -
సోలార్ పార్కుల అభివృద్ధికి భారత్ కు రూ.5,681 కోట్లు
యూఎస్ఏఐడీ, ఏడీబీ మధ్య ఒప్పందం న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ పార్కుల ఏర్పాటుకు గానూ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఇవి రెండు క్లీన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా భారత్‌లో సోలార్ పార్కుల అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం భారత్‌కు రూ.5,681 కోట్లు అందించనున్నాయి. -
చైనాను మించనున్న భారత్ వృద్ధి
ఈ ఏడాది వృద్ధి రేటుపై ఏడీబీ అధ్యక్షుడి అంచనా న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు చైనాను మించే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకావో అభిప్రాయపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగాను, చైనా వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నకావో పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్య నాయుడుతో భేటీ అనంత రం విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2018 నాటి కల్లా భారత్‌కిచ్చే రుణాలు దాదాపు 50 శాతం పెంచి 12 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్లు నకావో చెప్పారు. -
నేడు అజర్‌బైజాన్‌కు జైట్లీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం అజర్‌బైజాన్‌కు వెళ్లనున్నారు. రాజధాని బకూలో జరుగుతున్న ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) వార్షిక సమావేశాల్లో పాల్గొనడం ఈ పర్యటనలో ప్రధాన అంశం. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ మహర్షిసహా పలువురు ఆర్థికశాఖ సీనియర్ అధికారులు ఇప్పటికే ఏడీబీ గవర్నర్ల బోర్డ్ సమావేశాల్లో పాల్గొనడానికి బకూకు చేరుకున్నారు. నేడు ప్రారంభమైన 48వ ఏడీబీ వార్షిక సమావేశాలు నాలుగురోజుల పాటు జరగనున్నాయి. పర్యటన అనంతరం జైట్లీ మే 5న భారత్‌కు తిరిగి వస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వస్తువుల సేవల పన్ను, బ్లాక్‌మనీ బిల్లు వంటి కీలక ఆర్థిక అంశాలు ప్రస్తుతం పెండింగులో ఉండడమే దీనికి కారణం. ఆయా బిల్లులు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం లోక్‌సభ ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు 2015కు కూడా రాజ్యసభ ఆమోదం లభించాల్సి ఉంది. ఏడీబీ దృష్టి పెట్టే అంశాలు..! ప్రపంచ ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలన, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రస్తుత ఏడీబీ సమావేశాలు దృష్టి పెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మౌలిక రంగం, విద్య, ప్రాంతీయ సహకారం, ఆర్థిక రంగం అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
పారిశ్రామిక కారిడార్‌పై కదలిక
‘చెన్నై-వైజాగ్’పై నేడు ఏపీ సీఎంకు ఏడీబీ ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియూ అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రతిపాదనల్లోని అంశాలను సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రణాళిక (బ్లూ ప్రింట్) సిద్ధం చేసిన ఏడీబీ.. ఈ ప్రాజెక్టుకు ఎన్నేళ్ల సమయం పడుతుంది? తమ అభివృద్ధి విధానం, అవసరమైన నిధులు ఇతర అంశాలను సీఎంకు వివరించనుంది. దీంతో ఈ కారిడార్‌లోని ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఈ ప్రాజెక్టులో రహదారుల శాఖ పాత్ర కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు. -
భారత్‌కు 10 బిలియన్ డాలర్ల రుణం
న్యూఢిల్లీ: భారత్‌కు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఐదు సంవత్సరాల కాలంలో (2013-17) 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.62,000 కోట్లు) రుణ సహాయాన్ని చేయనుంది. 2017 వరకూ వార్షికంగా 2 బిలియన్ డాలర్ల చొప్పున బ్యాంక్ ఈ సహాయాన్ని అందజేస్తుంది. ఏడీబీ-కేంద్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఒక వ్యూహాత్మక భాగస్వామ్య వ్యూహాన్ని కుదుర్చుకున్నాయి. మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఏడీబీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. లక్ష్యాలు ఇవీ...: 12వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ నిధులు కొంత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి అవకాశాల కల్పన, పెట్టుబడుల సంస్కరణల అమలు, మౌలిక రంగం పురోభివృద్ధి లక్ష్యంగా ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి సేవలు, జలవనరుల సరఫరా, అభివృద్ధి వంటి అంశాల్లో ఈ నిధులను వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్ చర్యలు భేష్...: ఆర్థిక స్థిరత్వం, రూపాయి స్థిరీకరణ, మౌలిక రంగ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భారత్ విశ్వసనీయ చర్యలు తీసుకుంటోందని ఏడీబీ దక్షిణ ఆసియా అభివృద్ధి వ్యవహారాల డెరైక్టర్ జనరల్ జూయిన్ మిరాందా పేర్కొన్నారు. కాగా, కొన్ని క్లిష్టమైన విధాన సమస్యలు పరిష్కారమయితే భారత్ అధిక వృద్ధి సాధ్యమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక భూ సేకరణ, సహజ వనరులకు సంబంధించి లెసైన్సుల మంజూరుల్లో ఇబ్బందులు తొలగిపోవాల్సిన ఉందని సూచించింది.