చైనాను మించనున్న భారత్ వృద్ధి
ఈ ఏడాది వృద్ధి రేటుపై ఏడీబీ అధ్యక్షుడి అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు చైనాను మించే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకావో అభిప్రాయపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగాను, చైనా వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నకావో పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్య నాయుడుతో భేటీ అనంత రం విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2018 నాటి కల్లా భారత్‌కిచ్చే రుణాలు దాదాపు 50 శాతం పెంచి 12 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్లు నకావో చెప్పారు.