చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియూ అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
‘చెన్నై-వైజాగ్’పై నేడు ఏపీ సీఎంకు ఏడీబీ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఆసియూ అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బ్యాంకు ప్రతినిధులు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ప్రతిపాదనల్లోని అంశాలను సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రణాళిక (బ్లూ ప్రింట్) సిద్ధం చేసిన ఏడీబీ.. ఈ ప్రాజెక్టుకు ఎన్నేళ్ల సమయం పడుతుంది? తమ అభివృద్ధి విధానం, అవసరమైన నిధులు ఇతర అంశాలను సీఎంకు వివరించనుంది.
దీంతో ఈ కారిడార్‌లోని ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, పట్టణ ప్రాంతాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమవుతోంది. ఈ ప్రాజెక్టులో రహదారుల శాఖ పాత్ర కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వివరించారు.