విశాఖ-చెన్నై కారిడార్‌పై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) మంజూరు చేసిన నిధుల వివరాలపై, కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ పనితీరుపై వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించి సమాధానమిచ్చారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఏడీబీ 2016 సెప్టెంబర్ 20న రూ.4,165 కోట్లు రుణాలు, గ్రాంట్లు రూపంలో మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం, పారిశ్రామిక పాలసీలు, బిజినెస్ ప్రమోషన్లు, టెక్నికల్ అసిస్టెన్స్ కోసం ఈ రుణాలు, గ్రాంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తొలిదశకు 25 ఏళ్ల సమయం ఉందని, ఇందులో గ్రేస్ పీరియడ్ ఐదేళ్ల కాలపరిమితి ఉన్నట్లు వాణిజ్యశాఖ వెల్లడించింది.
గత మూడేళ్లుగా కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ పనితీరు వివరాలను సంబంధితమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఓ ప్రకటనలో వివరించారు. గత మూడేళ్లలో లాభాలు 50శాతం కంటే తగ్గలేదని, 2014-15 కాలంలో పన్నులు తీసేసిన తర్వాత లాభం రూ.17,733 కోట్లు వచ్చిందని, 2015-16లో రూ.16,004 కోట్లు వచ్చినట్లు ఆ శాఖ వెల్లడించింది. క్రూడ్ ఆయిల్ ధరల 2014లో అమెరికన్ డాలర్లు 110/బీబీఎల్ ఉండగా 2016లో 28/బీబీఎల్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు చాలా తగ్గాయని, తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ జరిగిన నగరం గ్రామంలో నాన్ లీకేజ్ పైపులైన్లు మార్చడంతో రెవెన్యూ రాబడి కొంత తగ్గినట్లు సమాచారం.