![ADB Comments on RBI Funds to Central Government - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/30/dcb.jpg.webp?itok=tepGZgB8)
న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిధులను బదలాయించడం ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి దోహదపడుతుందని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకిహికో నకయో పేర్కొన్నారు. రూ.1.76 లక్షల కోట్ల మిగులు బదలాయింపు ‘‘తగిన విధానం’’గా ఆయన పేర్కొన్నారు. ఈ ధోరణి పెట్టుబడులకు సానుకూలమైనదని వివరించారు. ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అమెరికా–చైనా వాణిజ్య వివాదం నుంచి కొన్ని భారత్ పరిశ్రమలు ప్రయోజనం పొందవచ్చని అన్నారు. అయితే ఇపుపడు భయమంతా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, బలహీన మార్కెట్ సెంటిమెంట్, మారకపు విలువల్లో ఒడిదుడుకులేనని వివరించారు. నాలుగురోజుల నకయో భారత్ పర్యటన శుక్రవారంతో ముగుస్తుంది. మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని ఏడీబీ అంచనా. 2020–21లో ఇది 7.2 శాతంగా ఉంటుందని విశ్లేషిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment