పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సింధు నదిపై పాకిస్తాన్ రూ. 1,400 కోట్లతో నిర్మించాలనుకున్న రిజర్వాయర్‌కు నిధులివ్వడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నిరాకరించింది. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు కూడా నిధులివ్వడానికి ఒప్పుకోలేదు. భారత్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాలని అప్పట్లో ప్రపంచబ్యాంకు కోరగా.. అందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఆ బ్యాంకు కూడా నిధులివ్వడానికి ముందుకురాలేదు.