Diamer-Bhasha dam
-
సంక్షోభంలో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్
ఇస్లామాబాద్ : చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ప్రధానంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న మూడు హైవేలకు అవినీతి సాకుతో చైనా నిధులు నిలిపివేయడంతో పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. చైనా తిరిగి నిధులను పునరుద్దరిస్తేనే.. పనులు మొదలు పెడతామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని 22 మంది సభ్యులు కలిగిన పాకిస్తాన పార్లమెంటరీ కమిటీ స్పస్టం చేసింది. పాకిస్తాన్ అభివృద్ధి మంత్రి ఆషాన్ ఇక్బాల్ కూడా నిధుల విడుదల తరువాతే పనులు మొదలవుతాయని అన్నారు. చైనా నిధులు విడుదల చేస్తేనే సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన మూడు హైవేల నిర్మాణం పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ గురించి పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మూడు హైవే ప్రాజెక్టులను రద్దు చేయలేదని... నిధుల కొరత వల్ల నిలిపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా... చైనా -పాకిస్తాన్ ఎకనమిరక్ కారిడార్ ఆర్థిక అవకతవకల వల్ల పూర్తిగా నిలిచిపోయిందనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజెక్ట్ మోదలయిన తరువాత ఇరుదేశాల మధ్య పలు సందర్భాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రధానంగా దీమార్ డ్యామ విషయంలో చైనా అభ్యంతరాలు వ్యక్తం చసింది. అదే సమయంలో.. పాకిస్తాన్ కూడా గ్వాదర్ పోర్టులో చైనా కరెన్సీ యువాన్‌ను అంగీకరించేది లేదంటూ ప్రకటించింది. -
చైనాకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చిన పాక్..!
బీజింగ్: మిత్రదేశం చైనాకు పాకిస్థాన్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో ఆ దేశం ఆఫర్‌ను పాక్ తిరస్కరించింది. సీపీఈసీలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో డైమర్-భాష డ్యామ్ నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ముందుకురాగా.. పాక్ అందుకు నిరాకరించింది. 60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యామ్‌ను తామే కట్టుకుంటామని పాక్ నేరుగా చైనాకే చెప్పినట్టు తెలుస్తోంది. భారత్ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యామ్ నిర్మిస్తుండటంతో.. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం నిరాకరించాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీలో కీలకమైన ఈ డ్యామ్‌కు రుణమిచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్ డాలర్లకు పెంచడం.. ఈ మేరకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు తీవ్రమైన షరతులు పెట్టడంతో పాక్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో చైనా షరతులు అంగీకరించడం ఎంతమాత్రం వీలు కాదని, అందుకే సొంతంగా ప్రాజెక్టు చేపడతామని పాకిస్థాన్ సర్కారు స్పష్టం చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. డైమర్-భాషా డ్యామ్ విషయంలో చైనా పెడుతున్న షరతులు ఆమోదయోగ్యం కాదు.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్ వాటర్, విద్యుత్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ముజామిల్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై పాకిస్థాన్ తాజా వైఖరి చైనాను బిత్తరపోయేలా చేసింది. తమను సంప్రదించకుండా ప్రాజెక్టును పాక్ ఇలా ఊహించని ఝలక్ ఇస్తుందని తాము అనుకోవడం లేదని చైనా వర్గాలు అంటున్నాయి. మొత్తం సీపీఈసీ ప్రాజెక్టును ప్రమాదంలో పడేసేలా చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించలేదని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు దేశ ప్రయోజనానికి భంగకరమని పాక్ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
పాకిస్తాన్ కు ఏడీబీ ఝలక్
-
పాకిస్తాన్ కు ఏడీబీ ఝలక్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సింధు నదిపై పాకిస్తాన్ రూ. 1,400 కోట్లతో నిర్మించాలనుకున్న రిజర్వాయర్‌కు నిధులివ్వడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నిరాకరించింది. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు కూడా నిధులివ్వడానికి ఒప్పుకోలేదు. భారత్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాలని అప్పట్లో ప్రపంచబ్యాంకు కోరగా.. అందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఆ బ్యాంకు కూడా నిధులివ్వడానికి ముందుకురాలేదు. తాజాగా ఏడీబీ అధ్యక్షుడు టకిహికో నకావో పాక్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనిపై మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు’ అని తెలిపారు. సెంట్రల్ ఏసియన్ రీజినల్ ఎకనమిక్ కో ఆపరేషన్(సీఏఆర్ఈసీ) ప్రోగ్రామ్ 15వ మంత్రిత్వ సమావేశం ముగింపు సందర్భంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్‌దార్‌తో సమయుక్త విలేకరుల సమావేశంలో టకిహికో ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలోని గిల్గిట్, బాల్తిస్తాన్ పరిధిలో సాగునీరు, విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని, దీనికి మరిన్ని భాగస్వామ్యాలు అవసరమని టకిహికో పిలుపునిచ్చారు. పెద్ద ప్రాజెక్టు అయినందువల్లే ఏడీబీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులో ఏడీబీ పాలుపంచుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ లోని డాన్ పత్రిక పేర్కొంది.