పాకిస్తాన్‌లో నిలిచిపోయిన చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పనులు
ఇస్లామాబాద్ : చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ప్రధానంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న మూడు హైవేలకు అవినీతి సాకుతో చైనా నిధులు నిలిపివేయడంతో పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. చైనా తిరిగి నిధులను పునరుద్దరిస్తేనే.. పనులు మొదలు పెడతామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని 22 మంది సభ్యులు కలిగిన పాకిస్తాన పార్లమెంటరీ కమిటీ స్పస్టం చేసింది. పాకిస్తాన్ అభివృద్ధి మంత్రి ఆషాన్ ఇక్బాల్ కూడా నిధుల విడుదల తరువాతే పనులు మొదలవుతాయని అన్నారు. చైనా నిధులు విడుదల చేస్తేనే సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన మూడు హైవేల నిర్మాణం పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు.
చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ గురించి పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మూడు హైవే ప్రాజెక్టులను రద్దు చేయలేదని... నిధుల కొరత వల్ల నిలిపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా... చైనా -పాకిస్తాన్ ఎకనమిరక్ కారిడార్ ఆర్థిక అవకతవకల వల్ల పూర్తిగా నిలిచిపోయిందనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజెక్ట్ మోదలయిన తరువాత ఇరుదేశాల మధ్య పలు సందర్భాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రధానంగా దీమార్ డ్యామ విషయంలో చైనా అభ్యంతరాలు వ్యక్తం చసింది. అదే సమయంలో.. పాకిస్తాన్ కూడా గ్వాదర్ పోర్టులో చైనా కరెన్సీ యువాన్‌ను అంగీకరించేది లేదంటూ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment