cpec
-
పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు -
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్‌ను గ్వాదర్ పోర్ట్‌తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది. ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు. వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. (చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!) -
చైనా-పాక్.. వేదాలు వల్లిస్తే..!!
గతంలో.. పాక్- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం. అయినా ఈ రెండు దేశాల బుద్ధి మాత్రం మారడం లేదు. పాత పాటే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రెండు దేశాలు మరోసారి కశ్మీర్ తేనెతుట్టేను కదిలించాయి. వింటర్ ఒలింపిక్స్ వంకతో చైనా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. వాణిజ్యపరమైన ఒప్పందాలు, చర్చల కోసం మరో నాలుగు రోజులు అక్కడే మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సరిహద్దు వివాదం.. అందునా కశ్మీర్‌పై ఇతరుల ఏకపక్ష చర్యల్ని సహించబోమంటూ ప్రకటనలు చేయడం విశేషం. ఒకవైపు తమ పౌరులపై పాక్‌లో వేర్పాటు వాద సంస్థలు దాడులు చేస్తుండడం, మరోవైపు ఉయిగర్లపై చైనా ఆర్మీ కొనసాగిస్తున్న హింసాకాండపై.. ఈ సమావేశాల్లో రెండు దేశాలు మౌనం వహించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి గత కొంతకాలంగా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ఈరెండు దేశాలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. ఇక చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రధాన అంశంగా సాగిన పాక్ ప్రధాని పర్యటనలో.. కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ తో కలసి పనిచేస్తామని చైనా హామీ ఇచ్చింది. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు పరోక్షంగా భారత్‌పై అక్కసు వెల్లగక్కాయి. శాంతియుత, సౌభాగ్య దక్షిణాసియా అన్నది ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షగా సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన నాలుగు రోజుల చైనా పర్యటనలో చివరి రోజు అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలుసుకుని చర్చలు నిర్వహించారు. పాకిస్థాన్ జాతీయ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, గౌరవం, తీవ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందని ఇమ్రాన్ తో జిన్ పింగ్ చెప్పినట్టు జిన్హువా న్యూజ్ ఏజెన్సీ పేర్కొనడం కొసమెరుపు. -
మారణహోమం: పాక్‌లో ప్రతీకార దాడులు
పాకిస్థాన్‌లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తీర నగరం గ్వాడర్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్ పోస్ట్ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది. Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar. 2 children died who were playing nearby & one Chinese sustained minor injuries. 3 persons injured including driver Police & CTD teams are on the crime scene. Investiga launched. Innocent Children,Afsos — Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021 బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా. చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా -
చైనా- పాక్ దుందుడుకుతనం.. 30 కి.మీ. మేర గోడ!
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాక్‌లోని బలూచిస్తాన్ తీరంలో గల గ్వడార్ పోర్టు వద్ద ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్) అథారిటీ మరో కీలక నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. గ్వడార్ పట్టణం చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుమారు 10 అడుగుల ఎత్తు, 30 కిలోమీటర్ల పరిధి మేర ఓ గోడను నిర్మించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువరించింది. ఈ విషయం గురించి మానవహక్కుల కార్యకర్తలు మాట్లాడుతూ.. రహస్యంగా గోడను నిర్మించడం వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా స్థానికులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు. అదే విధంగా పోర్టు సిటీలో పాక్ ఆర్మీ దురాగతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపెట్టకుండా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, మీడియాను నిషేధించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా.. గడ్వార్‌ను పూర్తిస్థాయిలో తమ నిఘా, నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా సుమారు 500 హెచ్డీ కెమెరాలు బిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులు, సామాజిక కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరి కదలికలను కనిపెడుతూ నిరసన గళాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. (చదవండి: నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు) కాగా గ్వడార్‌లో ఇప్పటికే సుమారు 15 వేల మంది (పాకిస్తాన్ 9 వేలు, డ్రాగన్ ఆర్మీ 6 వేలు) సైనికులను అక్కడ మోహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులు మాట్లాడుతూ.. ఆర్థిక కారిడార్ అని పైకి చెబుతున్నా మిలిటరీ బేస్ కోసమే గ్వడార్‌లో చైనా ఆర్మీ పలు నిర్మాణాలు చేపడుతోందని పేర్కొంటున్నారు. పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను ప్రయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. బెలూచిస్తాన్ నుంచి బెలూచీలను ఖాళీ చేయించి పంజాబీలు, ఫంక్తూన్లతో తమ ప్రాంతాన్ని నింపేందుకు చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు బదులుగా.. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే. సీపెక్.. భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. -
పాక్ పోర్టులో చైనా మరో నిర్మాణం.. అందుకేనా?
న్యూఢిల్లీ: సరిహద్దుల వద్ద భారత్‌తో విభేదాలు తలెత్తిన తరుణంలో చైనా మరింతగా దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నావికా దళాల్నిమోహరించేందుకు వీలుగా పాకిస్తాన్‌లోని గ్వడార్ పోర్టు వద్ద సరికొత్త నిర్మాణాలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా విడుదలైన సాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. కాగా భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టింది. (సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ) కర్టెసీ: సివింట్ ఈ క్రమంలో చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా వాణిజ్య సంబంధాల బలోపేతంతో పాటు ఇరాన్ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించడం సహా... గ్వడార్ పోర్టు ద్వారా హిందూ మహా సముద్రంపై పట్టు సాధించేందుకే డ్రాగన్ ఈ నిర్మాణాన్ని చేపట్టిందనే సందేహాలు ఉన్నాయి. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో గ్వడార్ పోర్టు ద్వారా సైన్యాన్ని తరలించేందుకే చైనా ఈ పోర్టును మరింతగా అభివృద్ధి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(పాక్‌లో హిందూ యువతులపై అకృత్యాలు) ఇదిలా ఉండగా.. సీపెక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నస్థానిక ప్రజల దాడుల నుంచి తమ ఇంజనీర్లు, ఇతర కార్మికులకు కాపాడుకునేందుకే డ్రాగన్ తాజా నిర్మాణాలు చేపట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచి ప్రజల ఆగ్రహ జ్వాలలకు తమ పౌరులు బలైపోకూడదనే ఉద్దేశంతో డ్రాగన్ ఈ చర్యకు ఉపక్రమించినట్లు పలువురు భావిస్తున్నారు. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. -
‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు కీలక అంశాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తమ దేశం ఎదురుచూస్తోందంటూ పాక్ ప్రధానిని కొనియాడారు. సౌదీ- పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సల్మాన్ ప్రస్తుతం పాక్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో కెమికల్, క్రీడా రంగాలు, సౌదీ దిగుమతులు, పవర్ జనరేషన్ ప్రాజెక్టులు, సంప్రదాయ వనరుల అభివృద్ధి వంటి సుమారు 20 బిలియన్ డాలర్ల మొత్తానికి సంబంధించిన పలు ఎంఓయూలపై ఇరు దేశాధినేతలు సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయంలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘ నేను యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత తూర్పులో ఇదే నా మొదటి పర్యటన. నేను సందర్శించిన మొదటి దేశం పాకిస్తాన్. పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం. వారితో భవిష్యత్తులో మేము మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ప్రస్తుతం ఓ గొప్ప వ్యక్తి నేతృత్వంలో పాక్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వారితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు మేము కోరుకుంటున్నాం. మా ప్రాంతంపై మాకు నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం అంటూ ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అదే విధంగా తమ దేశంలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు స్పందనగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘ అత్యవసర సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్న స్నేహితుడు సౌదీ అని వ్యాఖ్యానించాడు. తమ దేశ హజ్ యాత్రికుల ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించాలని సల్మాన్‌ను కోరారు. అదే విధంగా రియాద్ నుంచి బీజింగ్ చేరుకునేందుకు చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)ను ఉపయోగించుకోవాలని విఙ్ఞప్తి చేశారు.(జైషే చీఫ్‌పై మారని చైనా తీరు) కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్‌ను విమర్శిస్తుండగా సౌదీ యువరాజు ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జైషే మహ్మద్ చీఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు నిరాకరించి చైనా పరోక్షంగా.. పాక్‌కు మద్దతు తెలుపుతుండగా ప్రస్తుతం సౌదీ కూడా అందుకు తోడైనట్లు కన్పిస్తోంది. ఇక భారత్- పాకిస్తాన్ల మధ్య వివాదానికి కారణమైన సీపెక్ గురించి ఇమ్రాన్ మాట్లాడి.. భారత్ పట్ల చైనా, పాకిస్తాన్‌లు వైఖరి ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
పాక్‌లో ఉగ్ర బీభత్సం
కరాచీ/బీజింగ్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలోని చైనా కాన్సులేట్‌పై శుక్రవారం దాడికి దిగిన సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులను అక్కడి భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు.. మొత్తం నలుగురు మరణించగా చైనాకు చెందిన కాపలాదారుడు గాయపడ్డారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడి పెను విధ్వంసం సృష్టించడమే ఆ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద ఆయుధాలతోపాటు ఆహార పదార్థాలు, ఔషధాలు ఉండటంతో చైనీయులను బందీలుగా చేసుకోవడం వారి ప్రణాళికలో భాగమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దాడి తమ పనేనని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)కు, బలూచిస్తాన్‌లో చైనా సైనిక కార్యకలాపాల విస్తరణకు తాము వ్యతిరేకమని బీఎల్ఏ గతంలో పేర్కొంది. దాడి నేపథ్యంలో పాక్‌లో సీపీఈసీ కోసం పనిచేస్తున్న వేలాది మంది చైనీయులకు రక్షణ పెంచాలని పాక్‌ను చైనా కోరింది. గేటు బయటే భద్రతా దళాలు ముగ్గురు ముష్కరులను అంతమొందించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. గ్రెనేడ్లు, ఏకే–47 తుపాకులతో.. కరాచీలోని ఖరీదైన, ప్రముఖ ప్రాంతం క్లిఫ్టన్ ఏరియాలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది ప్రముఖులు కూడా నివాసం ఉంటారు. వివిధ దేశాల కాన్సులేట్లు/రాయబార కార్యాలయాలతోపాటు కరాచీలో పేరుగాంచిన పాఠశాలలు, రెస్టారెంట్లు ఇక్కడే ఉంటాయి. మొత్తం 9 హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే–47 తుపాకులు, భారీ సంఖ్యలో బుల్లెట్లు, తుపాకీ మేగజీన్లు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు ఓ వాహనంలో చైనా కాన్సులేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వాహనం నుంచి దిగి, కాన్సులేట్ బయట ఉన్న సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌పైకి గ్రెనేడ్ విసిరారు. అనంతరం అక్కడ ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఇద్దరు పోలీసులతోపాటు అక్కడ ఉన్న ఓ బాలుడు, అతని తండ్రి కూడా ఈ కాల్పుల్లో చనిపోయారు. అనంతరం కాన్సులేట్ గేటు వైపుకు ఉగ్రవాదులు వస్తుండగా కార్యాలయం వద్ద ఉన్న ప్రజలు, సిబ్బందిని వెంటనే భద్రతా దళాలు లోపలకు పంపించి తలుపులు మూశాయి. తర్వాత పారామిలిటరీ దళాలు ఉగ్రవాదాలపై కాల్పులు ప్రారంభించి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం మృతదేహాల వద్ద తనిఖీలు చేయగా భారీ సంఖ్యలో ఆయుధాలు, ఆహార పదార్థాలు, ఔషధాలు లభించాయి. చనిపోయిన ఉగ్రవాదులు తమ వారేనని బీఎల్ఏ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ‘చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. తమ ప్రాణాలను అర్పించి ఉగ్రవాదుల విజయాన్ని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ధైర్యానికి నా సెల్యూట్’ అని ఖాన్ ట్వీట్ చేశారు. మార్కెట్లో ఆత్మాహుతి దాడి... 32 మంది మృతి పెషావర్: పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్క్వా ప్రావిన్సులో ఉగ్రవాదులు శుక్రవారం రెచ్చిపోయారు. ఒరక్జై గిరిజన జిల్లాలో షియాల పవిత్రస్థలమైన ఇమామ్బర్ఘా వద్ద రద్దీగా ఉన్న జుమ్మా మార్కెట్ లక్ష్యంగా ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సిక్కు వ్యాపారస్తులు సహా 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉన్నిదుస్తులు కొనేందుకు ప్రజలు శుక్రవారం భారీగా మార్కెట్‌కు చేరుకున్నవేళ ఈ దాడి చోటుచేసుకుంది. ఈ విషయమై జిల్లా డీసీపీ ఖలీద్ ఇక్బాల్ మాట్లాడుతూ..‘మార్కెట్లో కూరగాయలున్న ఓ బైక్‌కు బాంబును అమర్చిన ఉగ్రవాది రిమోట్ కంట్రోల్ సాయంతో వాహనాన్ని పేల్చివేశాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిక్కు వ్యాపారులు సహా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది షియాలే ఉన్నారు’ అని తెలిపారు. ఉగ్రవాదుల్ని అణచివేస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పునరుద్ఘాటించారు. దాడిని ఎదిరించిన ధీర వనిత సుహాయ్ సింధ్ ప్రావిన్సుకు చెందిన ఆ అధికారిణి పూర్తి పేరు సుహాయ్ అజీజ్ తాల్పూర్. నాణ్యమైన విద్య కోసం ఆమెను చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే సంప్రదాయాలను ధిక్కరిస్తున్నారంటూ వారి బంధువులు ఆమె కుటుంబంతో మాట్లాడటం మానేశారు. ఈ వెలివేతతో ఆమె కుటుంబం వేరే ఊరికి వలసవెళ్లింది. బీకాం పూర్తి చేసిన ఆమె 2013లో పాక్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ఉద్యోగ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి పోలీసు శాఖలో ఉన్నతాధికారిణిగా ఉద్యోగం పొందింది. కాన్సులేట్‌పై దాడిని అడ్డుకున్న భద్రతా దళాల బృందానికి ఆమె నాయకత్వం వహించింది. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టి ధీర వనితగా నిలిచింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం -
చైనా పాక్ ఒప్పందం.. భారత్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్ చర్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా నిర్మించిన బస్ సర్వీస్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లనున్న ఈ బస్ సర్వీస్ భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని అన్నారు. (పాకిస్తాన్లో మోదీ మంత్ర) చైనా-పాకిస్తాన్ మధ్య రూపుదిద్దుకున్న ‘సరిహద్దు ఒప్పందం 1963’ అక్రమమైనది, కాలం చెల్లినది’ అని రవీష్ పేర్కొన్నారు. విలువలేని ఈ ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ ఆమోదించబోదనీ, ఈ బస్ సర్వీస్ ముమ్మాటికీ ఉల్లంఘనలతో కూడుకున్నదేనని ఉద్ఘాటించారు. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్ సర్వీస్ నవంబర్ 13న ప్రారంభం కానుందని సమాచారం. 50 బిలియన్ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు. (క్రిస్టియన్ మహిళ కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు) -
బీఆర్ఐకి వ్యతిరేకం
చింగ్‌దావ్: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్దావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం వేదికగా బీఆర్ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ దేశాలు సంతకం చేశాయి. భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్ బయల్దేరారు. అనుసంధానతే మా లక్ష్యం.. కానీ! ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్ పోర్టు అభివృద్ధి, అష్గాబట్ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్ ఎస్సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. బీఆర్ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్ అన్నారు. బీఆర్ఐ ఏంటి? ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి. అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్ఐలో చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ భావిస్తోంది. -
చైనాకు పాక్ భారీ షాక్!
లాహోర్: చైనాకు భారీ షాక్ ఇచ్చేందుకు పాకిస్థాన్ సిద్ధమైపోయింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో చైనా అజమాయిషీని తగ్గించే దిశగా పావులు కదుపుతోంది. ప్రాజెక్టు పేరిట పాక్ సరిహద్దులో చైనా అడ్డగోలుగా భూదందాలకు పాల్పడుతోంది. దీనిని నిలువరించాలని కోరుతూ న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పరిణామాలతో ఒప్పందంలో కీలక సవరణలు చేయాలంటూ చైనా ముందు పాక్ ప్రతిపాదన ఉంచింది. సుమారు 60 బిలియన్ డాలర్ల వ్యయం అంచనాతో చైనా సీపీఈసీ ప్రాజెక్టును 2013లో మొదలుపెట్టింది. ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక లీజు తీసుకున్న భూముల్లో చైనీయులు కొందరు ప్రైవేట్ నిర్మాణాలు చేపట్టారు. రిక్రియేషనల్ పార్కులు, నివాస కాలనీలు నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఒప్పందంలో ఎలాంటి షరతులు లేకపోవటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. దీంతో జఫరుల్లా ఖాన్ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో సోమవారం ఓ పిటిషన్దాఖలు చేశారు. చైనా మోసం చేస్తోంది... ‘చైనా తీరు అభ్యంతరకరంగా ఉంది. పాక్ గౌరవానికి భంగం కలిగించేలా బీజింగ్ వర్గాలు వ్యవహరిస్తున్నాయి. లీజుల పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. పైగా ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాల్లో నివసించే పౌరులను బానిసలుగా చూస్తున్నారు. ఈస్టిండియా కంపెనీ రెండు శతాబ్ధాలపాటు ఉపఖండాన్ని ఎలా దోచుకుందో.. ఇప్పుడు చైనా తీరు కూడా అలాగే ఉంది. ఏకపక్ష ఒప్పందం చేసుకుని చైనా లాభాలను పొందుతోంది. పాక్ వ్యాపారస్థులకు చైనాలో సరైన గౌరవం ఉండదు. కానీ, వారు పాక్‌లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సీపీఈసీలోని ఒప్పందాలను సమీక్షించి.. సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి. పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడండి’ అని జఫరుల్లా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘.పిటిషనర్ వాదనల్లో వాస్తవం లేకపోలేదని, కానీ, సీపీఈసీ ఒప్పందంలో సవరణల కోసం చైనా ముందు ఇప్పటికే ప్రతిపాదనలు పాక్ ప్రభుత్వం ఉంచిందని.. అది పెండింగ్‌లో ఉందని’ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. పాక్ కూడా అసంతృప్తి... ఈ మెగా ప్రాజెక్టుపై పాక్ మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కీలక ప్రాజెక్టులో తమకు తగినంత ప్రాధాన్యం లభించట్లేదని, పైగా నిధుల విషయంలోనూ చైనా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించింది. ప్రాజెక్టులో భాగంగా రోడ్లు నిర్మించేందుకు చైనా జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలను తరలించగా.. పాక్ పార్లమెంట్లో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. దీంతో ఖైదీలను వెనక్కి తీసుకోవాలంటూ చైనాను పాక్ కోరింది. కానీ, అది జరగలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడటం, గ్వదార్ వద్ద భూకంపం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నిర్మాణంలో మార్పులు చేపట్టాలని చైనాను పాక్ కోరింది. కానీ, చైనా మాత్రం ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకపోవటం పాక్‌కు విసుగు పుట్టిస్తోంది. ఇప్పుడు కోర్టు విచారణ నేపథ్యంలో ప్రాజెక్టులో సవరణలు తప్పనిసరిగా చేయాలని, ఆధిపత్యాన్ని తగ్గించుకోవాలని, అలాకాని పక్షంలో ప్రాజెక్టును నిలువరించే ప్రయత్నం చేస్తామని పాక్ చైనాకు సంకేతాలు పంపింది. -
మోదీ, జిన్‌పింగ్ విస్తృత చర్చలు
వుహాన్: ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పెద్ద సరిహద్దు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు కీలక ముందడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య చైనాలోని పర్యాటక కేంద్రం వుహాన్‌లో శుక్రవారం అనధికార శిఖరాగ్ర భేటీ ప్రారంభమైంది. హృదయపూర్వక సమావేశం (హార్ట్ టు హార్ట్ సమ్మిట్)గా పేర్కొంటున్న ఈ భేటీలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, చైనాల సంప్రదాయ, సాంస్కృతిక స్నేహ సంబంధాలను గుర్తు చేసుకున్నారు. తమ రెండు దేశాల అభివృద్ధితో పాటు ప్రపంచ పురోగతిలో కీలక పాత్ర పోషించే సమర్థత భారత్, చైనాలకుందని స్పష్టం చేశారు. భేటీ అనంతరం తొలి రోజు చర్చలు విస్తృతంగా, ఫలప్రదంగా ముగిశాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రెండో రోజు చర్చలు నేడు ఉదయం ప్రారంభం కానున్నాయి. సరిహద్దు వివాదాలు సహా ఇరుదేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంపైనే వీరిరువురు చర్చించారు. ఇరుదేశాల మధ్య ఇలాంటి చర్చలు తరచూ జరుగుతూ ఉండాలని మోదీ అభిలషించారు. 2019లో భారత్‌లో జరిగే ఈ తరహా చర్చలకు రావాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మనమే బలం: భారత్, చైనాలు కలసి పనిచేస్తే తమ దేశాల ప్రజలతోపాటు ప్రపంచానికి మేలు చేసేందుకు గొప్ప అవకాశం లభిస్తుందని మోదీ తెలిపారు. భారత్–చైనాల మధ్య శతాబ్దాల బంధాన్ని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత్, చైనాలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ‘గత 2వేల ఏళ్లలో దాదాపు 1600 ఏళ్ల పాటు భారత్, చైనాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలే దాదాపు 50 శాతం భాగస్వామ్యాన్ని కలిగున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. బీజింగ్‌కు వెలుపల రెండుసార్లు జిన్‌పింగ్ స్వాగతం పలికిన తొలి భారత ప్రధానిగా నిలవటం గర్వంగా ఉందని మోదీ తెలిపారు. ఇది భారత ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల కోసం ‘ఉమ్మడి ఆలోచన, సమాచార మార్పిడి, బలమైన బంధం, పరస్పర ఆలోచన విధానం, పరస్పర పరిష్కారం’ అనే ఐదు అంశాలను మోదీ ఈ భేటీలో ప్రతిపాదించారు. సంయుక్త భాగస్వామ్యంతో..: ఇలాంటి చర్చలు భవిష్యత్తులో కూడా జరుగుతాయని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక బంధాల్లో ఈ భేటీ కొత్త అధ్యాయానికి తెరలేపనుందని ఆయన తెలిపారు. ‘గంగా, యాంగ్జీ నదులు నిరంతరం ప్రవహిస్తున్నట్లే ఇరుదేశాల మధ్య స్నేహం కూడా కొనసాగుతూనే ఉండాలి. భారత్–చైనా సహకారానికి బంగారు భవిష్యత్తు ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ‘ఐదేళ్లుగా మనం చాలా సాధించాం. సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాం. ఈ దిశగా సానుకూల ఫలితాలు సాధిస్తున్నాం. మరింత అభివృద్ధి జరిగేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన భాగస్వామ్య ప్రభావం స్పష్టంగా కనబడుతోంది’ అని జిన్‌పింగ్ తెలిపారు. ‘మీతో కలిసి పలు అంశాలపై మరింత లోతైన భాగస్వామ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాను’ అని ఆయన మోదీతో తెలిపారు. ‘మన దేశాలకు పునరుత్తేజం కల్పించేందుకు అవసరమైన సుస్థిరత కల్పించుకోవటం, అన్ని రంగాల్లో అభివృద్ధి, పరస్పర అభివృద్ధికి సహకారాన్ని బలోపేతం చేసుకోవటం, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం పనిచేయటంపై భారత్–చైనా దృష్టిపెట్టాలి’ అని చైనా అధ్యక్షుడు పేర్కొన్నారు. అమెరికా సహా పలు దేశాలు రక్షణాత్మక వ్యూహాలు అమలుచేస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఘనస్వాగతం పలికిన జిన్‌పింగ్: శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వుహాన్ చేరుకున్నారు. మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాల అనంతరం అనధికార చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య బంధాన్ని వ్యూహాత్మకంగా, దీర్ఘకాల లాభాలను దృష్టిలో పెట్టుకుని సమీక్ష జరుపుతారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘ద్వైపాక్షిక బంధాల బలోపేతంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకున్నారు’ అని ఆయన చెప్పారు. జిన్‌పింగ్‌కు అద్భుతమైన కానుక: ఈ చర్చల సందర్భంగా ప్రఖ్యాత చైనా కళాకారుడు జు బీహోంగ్ వేసిన చిత్రాన్ని జిన్‌పింగ్‌కు మోదీ కానుకగా ఇచ్చారు. ప్రస్తుత పశ్చిమబెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీలో 20వ శతాబ్దపు ప్రారంభంలో బీహోంగ్ చిత్రలేఖనం బోధించేవారు. ఆధునిక చైనా చిత్రకళను ఈయన ప్రపంచానికి పరిచయం చేశారు. ‘స్ట్రెంత్’కు మోదీ నిర్వచనం: చైనా పర్యటనలో ప్రధాని మోదీ భారత్, చైనా ప్రజల మధ్య బంధాల బలోపేతాన్ని కాంక్షిస్తూ స్ట్రెంత్ అనే పదానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. స్ట్రెంత్ పదంలోని ఆంగ్ల అక్షరాలకు వరుసగా ఎస్ అంటే ఆధ్యాత్మికత (స్పిరిచువాలిటీ), టీ అంటే సంప్రదాయం, వాణిజ్యం, సాంకేతికత (ట్రెడిషన్, ట్రేడ్, టెక్నాలజీ), ఆర్ అంటే బంధం (రిలేషన్షిప్), ఈ అంటే వినోదం (ఎంటర్టైన్మెంట్ – సినిమాలు, కళలు, నృత్యాలు మొదలైనవి), ఎన్ అంటే పర్యావరణ పరిరక్షణ (నేచర్ కన్జర్వేషన్), జీ అంటే క్రీడలు (గేమ్స్), టీ అంటే పర్యాటకం (టూరిజం), హెచ్ అంటే ఆరోగ్యం (హెల్త్, హీలింగ్) అని పేర్కొన్నారు. అప్పుడు సీఎంగా.. ఇప్పుడు పీఎంగా! గుజరాత్ సీఎంగా స్టడీ టూర్లో భాగంగా ‘త్రీ గార్జెస్ డ్యామ్’ను సందర్శించినట్లు మోదీ తెలిపారు. ‘వేగంగా పూర్తయిన ఈ డ్యామ్ నిర్మాణం, దీని ఎత్తు నన్ను అబ్బురపరిచాయి. ఓ రోజంతా డ్యామ్ దగ్గరే గడిపి దీని విశేషాలు తెలుసుకున్నాం’ అని మోదీ తెలిపారు. యాంగ్జీ నదిపై నిర్మించిన ఆ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు. 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తు, 32 హైడ్రో పవర్ టర్బో జనరేటర్లు, ఐదు దశల షిప్ లాక్, షిప్ లిఫ్ట్ వ్యవస్థతో అధునాతన ప్రాజెక్టుగానూ ప్రత్యేకతను చాటుకుంది. డోక్లామ్, సీపీఈసీలను లేవనెత్తండి! న్యూఢిల్లీ/మంగళూరు: చైనా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా డోక్లాం, చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)ల గురించి చర్చించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎలాంటి అజెండా లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నప్పటికీ భారత్‌కు నష్టం కలిగించే అంశాలను భేటీలో ప్రస్తావించాలన్నారు. చైనా పర్యటన సందర్భంగా మోదీ కాస్త టెన్షన్‌గా కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి తమ పార్టీ మద్దతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈస్ట్ లేక్ ఒడ్డున డిన్నర్ చర్చలు చర్చల అనంతరం ఇరువురు నేతలు హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించారు. ఈ మ్యూజియంలో పెద్ద సంఖ్యలో చైనా చారిత్రక, సాంస్కృతిక స్మారకాలున్నాయి. సాయంత్రం ఇరువురు నేతల మధ్య చర్చల్లో ఇరుదేశాల నుంచి ఆరుగురు అధికారుల చొప్పున పాల్గొన్నారు. రాత్రి ఈస్ట్ లేక్ ఒడ్డున ఉన్న అతిథిగృహంలో వీరిద్దరు మాత్రమే భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. దీంతో తొలిరోజు చర్చలు ముగిశాయి. శనివారం ఉదయం పదిగంటలనుంచి (స్థానిక కాలమానం ప్రకారం) మళ్లీ ఇరువురు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు చేయాల్సిన అవసరం లేకుండా ఒత్తిడిలేని వాతావరణంలో ఈ అనధికార సదస్సు జరగాలని ముందుగానే నిర్ణయించిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ పగ్గాలు చేపట్టాక పలు అంతర్జాతీయ వేదికలపై 12సార్లకు పైగా వీరు కలుసుకున్నారు. అయినప్పటికీ.. ఇద్దరు దేశాధినేతలు మనసువిప్పి మాట్లాడుకోవటం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న పలు సమస్యల పరిష్కారంపై తరచూ సమీక్షలు నిర్వహించాలనే ఆలోచనలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానిగా మోదీకి ఇది నాలుగో చైనా పర్యటన. వుహాన్‌లోని ఓ ఎగ్జిబిషన్లో వాద్యపరికరాన్ని వాయిస్తున్న మోదీ -
చైనా ఇంజనీర్లు వర్సెస్ పాక్ పోలీసులు
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా నిర్మిస్తున్న చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) వద్ద చైనా ఇంజనీర్లకు, పాకిస్తాన్ పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ వద్ద జరిగిన ఈ గొడవలో చైనీయులు పాక్ పోలీసులను కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు పారిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీపీఈసీ పరిధిలోని ‘ఎమ్4 మోటార్వే’ నిర్మాణం వద్ద చైనా ఇంజనీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో క్యాంప్ వదిలి వెళ్లిపోవాల్సిందిగా వారిని పాక్ పోలీసులు బెదిరింపులకు గురిచేశారనే కారణంగా పోలీసులకు చైనీయులకు మధ్య చిన్నపాటి వాదన తలెత్తింది. ఇది చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ గొడవకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో ప్రైవేట్ వీడియోలో చైనా ఇంజనీర్ ఒకరు పోలీసు వ్యాను పైకెక్కి డోర్ తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడి నుంచి తప్పించుకునేందుకు పోలీసు లోపలి వైపు నుంచి డోర్ లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. గొడవ ముగిసిన తర్వాత పాక్ పోలీసుల క్యాంప్‌కు కరెంటు సరఫరా నిలిపివేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టామని.. ఈ గొడవకు పూర్తి బాధ్యత చైనా ఇంజనీర్‌దే అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని పేర్కొన్నారు. గొడవకు కారణమైన ఐదుగురు చైనీయులను వెళ్లిపోవాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
చైనా, పాక్ బరి తెగింపు.. ఖైదీలతో భారీ ప్రాజెక్టు..
ఇస్లామాబాద్ : చైనా, పాకిస్థాన్‌లు బరితెగించాయి. యుద్ధంలో ఓడిపోయి దొరికిపోయిన సైనికులను బానిసలుగా మార్చుకొని వెట్టి చాకిరీ చేయించుకునే రోజులు మనం చరిత్రలో చూశాం. ఇప్పటికీ పలు పుస్తకాల్లో అలాంటి అంశాలను చదివి ఆశ్చర్యపోతాం. కానీ, ఇప్పటికీ అదే పోకడను చైనా అనుసరిస్తుందంటే నమ్ముతారా..! కానీ, తప్పనిసరిగా నమ్మితీరాల్సిందే. అయితే, ఇప్పుడు వారు పనిచేయించుకొంటున్న ఖైదీలు ఏ దేశంపైనో యుద్ధానికి వెళితే ఓడిపోయి చైనాకు లొంగిపోయిన వారు కాదు.. చిన్నచిన్న దొంగతనాలు, దోపిడీలు, హత్య నేరాలు, తదితరమైన నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా మొండిపట్టుతో చైనా ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టును తలపెట్టిన విషయం తెలిసిందే. భారత సరిహద్దును సైతం తడుముతూ చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) పేరిట పెద్ద ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా తమ దేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఉపయోగిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ స్పష్టం చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన జాతీయ అసెంబ్లీ సభ్యుడు నవాబ్ మహ్మద్ యూసఫ్ తాల్పుర్ ఇటీవల జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ 'చైనా జైళ్లలో నుంచి ఖైదీలను పట్టుకొచ్చి సీపెక్ ప్రాజెక్టులో భాగంగా రోడ్లు, భవనాలు, వంతెనలు నిర్మించేందుకు ఉపయోగించుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలా చేసే సమయంలో అప్పటికే నేరగాళ్లయిన వాళ్లు మరోసారి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. కచ్చితంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి' అని అన్నారు. నేరస్తులతో పనిచేయించుకునే విషయంలో బహుశా రెండు దేశాల మధ్య రహస్య ఒప్పందం జరిగి ఉండొచ్చని, ఎందుకంటే సహజంగా ఒక దేశం నుంచి మరో దేశానికి సరైన అనుమతులు ప్రొసీజర్ ఫాలో అవకుండా నేరస్థులను పంపిచకూడదని ఆయన చెప్పారు. ఒక వేళ ఇలాంటి రహస్యాలు బయటకు చెప్పకూడదనుకున్నప్పుడు చట్టసభ సభ్యులమైన తమకు వివరించాలని కోరారు. -
బలూచిస్తాన్ నాయకులతో చైనా మంతనాలు
ఇస్లామాబాద్: వాణిజ్యాభివృద్ధి కోసం చైనా.. పాకిస్థాన్‌లో నిర్మిస్తున్న చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులకు ఇబ్బందులను నివారించడానికి డ్రాగన్... బలూచిస్థాన్ తిరుగుబాటుదారులతో సయోధ్య కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పలువురు వేర్పాటువాద నాయకులతో బీజింగ్ నేరుగా చర్చిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం వెల్లడించింది. సీపెక్ కోసం 60 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను పాక్ చేపట్టింది. బలూచిస్థాన్ నాయకులతో సయోధ్య కుదుర్చుకోవడంలో చైనా చాలా వరకు సఫలమైందని పాక్ అధికారి ఒకరు అన్నారు. తిరుగుబాటుదారులు చిన్నాచితకా దాడులు చేస్తున్నా, భారీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. సీపెక్‌లో భాగంగా చైనాలోని కష్గర్ నుంచి పాక్‌లోని గ్వాదర్ వరకు చైనా రోడ్డు, రైలు మార్గాలు నిర్మిస్తోంది. గ్వాదర్ బలూచిస్థాన్‌లోనే ఉంది. -
చైనా మెగా ప్రాజెక్టుకు పాక్‌లోనే పెనుముప్పు!
హంగ్ కాంగ్ : బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చైనాలోని జిన్జియాంగ్ నుంచి పాక్‌లోని గ్వదార్ పోర్టు గుండా ఈ ప్రాజెక్టు మార్గం వెళ్తోంది. అయితే గ్వదార్ వద్ద దీనికి పెను ముప్పు పొంచి ఉన్నట్లు వారు చెబుతున్నారు. ‘చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హంగ్ కాంగ్’కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త యాంగ్ హంగ్ఫెంగ్ ఈ తీర ప్రాంతంపై మూడు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్వదార్ చాలా ప్రమాదకరమైన ప్రాంతం అని ఆయన చెబుతున్నారు. మక్రాన్ ట్రెంచ్‌కు సమీపంలో ఉన్న గ్వదార్ పోర్టు గతంలో పెను భూకంపంతో సర్వనాశనం అయ్యింది. 1945లో రిక్చర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో పెను భూకంపం ఇక్కడ సంభవించింది. సునామీ దాటికి ఇరాన్, పాక్, ఒమన్, ఇండియా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ ప్రకృతి విలయంలో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం గుండానే చైనా మెగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం 40 ఏళ్లపాటు చైనా ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకుంది. అంతేకాదు ఇక్కడ ఓ నేవల్ బేస్‌ను నెలకొల్పాలన్న ఆలోచనలో డ్రాగన్ కంట్రీ ఉండగా.. భారత్ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలకు రవాణా సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నది చైనా లక్ష్యం. కానీ, ఇప్పుడు భూకంపం, సునామీ ప్రభావితమైన ఈ ప్రాంతం వల్ల ప్రాజెక్టుపైనే కాకుండా.. పాక్-చైనాలోని తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఈ అంశాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజింగ్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
భారత్ దాడి.. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు..!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణాలపై భారత్ దాడి చేస్తుందేమోనని పాకిస్తాన్ భయపడుతోంది. ఈ మేరకు గిల్గిత్ బాల్టిస్తాన్లోని ప్రభుత్వానికి పాకిస్తాన్ కేంద్ర హోం శాఖ మంత్రి లేఖ రాసినట్లు ఆ దేశ జాతీయ పత్రిక ఒకటి పేర్కొంది. గిల్గిత్లోని సీపీఈసీ నిర్మాణాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పింది. భారత్ 400 మంది ముస్లిం యువతకు ఆప్ఘనిస్తాన్‌లో సీపీఈసీ మార్గంలో దాడి చేసేందుకు ట్రైనింగ్ ఇస్తోందని కూడా లేఖలో ఉన్నట్లు తెలిపింది. కారాకోరం పర్వత శ్రేణి వద్ద గల బ్రిడ్జి కూడా భారత్ ఎంచుకున్న లక్ష్యాల్లో ఉందని చెప్పింది. సీపీఈసీ ప్రాజెక్టు కశ్మీర్లో అంతర్భాగమైన గిల్గిత్ బాల్టిస్థాన్ నుంచి వెళ్తుండటంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన చైనా గత వారం సీపీఈసీపై చర్చలకు సిద్ధమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్‌తో విభేదాలు ఇష్టం లేదు : చైనా
బీజింగ్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్తున్న చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ) ప్రాజెక్టుపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సోమవారం చైనా ప్రకటించింది. సీపీఈసీపై భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబవాలే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా సీపీఈసీపై భారత్‌కు ఉన్న అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. సీపీఈసీ వల్ల ఇరుదేశాల మధ్య విభేదాలు తలెత్తడం ఇష్టంలేదని చెప్పింది. ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు సీపీఈసీ కారణంగా ప్రభావితం అవకుండా ముందే చర్చలు జరపడం మేలని తెలిపింది. సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్టు అని పేర్కొంది. ఎవరినో లక్ష్యంగా చేసుకుని తాము ఈ ప్రాజెక్టును ప్రారంభించలేదని చెప్పింది. భారత్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలకు వస్తే.. బలమైన సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రారంభిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్లడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గల గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్సును సీపీఈసీ ప్రాజెక్టు కలుపుతుంది. -
పాకిస్తాన్ : అవన్నీ అబద్దాలే..!
ఇస్లామాబాద్ : గ్వాదర్ ఓడరేవు వద్ద చైనా ఎటువంటి మిలటరీ బేస్‌ను నిర్మించడం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ఈ ప్రచారంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్వాదర్ పోర్టు దగ్గర చైనా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదు.. ప్రస్తుతం జరుగుతున్నవి చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనులు మాత్రమేనని ఆ దేశ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ పేర్కొన్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌తో బలపడుతున్న చైనా-పాకిస్తాన్ దౌత్య సంబంధాలను దెబ్బతీసేలా పొరుగుదేశాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా.. భారత్ ఈ మధ్య ఇంటర్‌స్పెక్టర్ మిస్సైల్‌ను పరీక్షించడంపై ఆయన స్పందించారు. తమ దగ్గర శక్తివంతమైన యాంటి బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్ ఉందని.. పొరుగు దేశం తమను తక్కువ అంచనా వేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఉపఖండంలో భారత్ ఆయుధ పోటీకి కేంద్రంగా మారిందని.. ఇది ఎవరికీ మంచిది కాదని అన్నారు. ఉపఖండంలో శాంతిని పెంపొందించే క్రమంలో క్షిపణులు, అణ్వాయుధ పరీక్షలను కొంత కాలం నిలిపివేయాలని ప్రతిపాదించామని ఫైజల్ తెలిపారు. పాకిస్తాన్ ప్రతిపాదనలను భారత్ తోసిపుచ్చి మరీ ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. -
భారత్ పై పాక్ మరోసారి తీవ్ర ఆరోపణలు
కరాచీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. 57బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ పావుగా ఉపయోగించుకుంటోందని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి అషాన్ ఇక్బాల్ ఆరోపించారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను నీరుగార్చేందుకు పాకిస్తాన్ శత్రువులంతా కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. ‘సీపీఈసీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా భారత్ అన్ని రకాల కుట్రలు చేస్తోంది.. అయితే ప్రజల నమ్మకం, సహకారం, మద్దతుతో పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోంద’ని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా భారత్ కుట్రలకు తెరతీస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇదిలావుండగా.. ప్రతిష్టాత్మక సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి సీపీఈసీ ప్రాజెక్ట్ వెళ్లడంపై భారత్ మొదట నుంచి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. త్యాగాలను గుర్తించండి! పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాటలు దాడులు చేయడం మంచిది కాదని ఆయన అమెరికాకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ చేసిన త్యాగాలను అమెరికా ఇప్పటికైనా గుర్తించాలని ఆయన చెప్పారు. -
‘భారత్‌కు వ్యతిరేకం కాదు’
బీజింగ్: చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ భారత్కువ్యతిరేకంగా నిర్మించడం లేదని చైనా ప్రకటించింది. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్ఘనిస్తాన్ వరకూ విస్తరించడంపై భారత్ అనుమానించాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చుయాంగ్ అన్నారు. ఈ విస్తరణతో భారత్‌ను చైనా ఒంటరి చేయాలని అనుకోవడం లేదని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్ట్ విస్తృత ప్రయోజనాలను ఉపఖండంలోని అన్ని దేశాలు పొందాలని మాత్రమే చైనా అలోచిస్తోందని ఆమె తెలిపారు. చైనా, పాకిస్తాన్లను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశం. దీంతో ఆ దేశంలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించాలన్న ఆలోచన వచ్చిందని ఆమె చెప్పారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల భౌగోళిక, ఆర్థిక అంతరాలు తగ్గుతాయని, అంతేకాక రీజియన్ కెనక్టివిటీ పెరుగుతుందని ఆమె అన్నారు. ఇదిలావుండగా.. చైనా - పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్ వరకూ విస్తరించాలని ఈ మధ్యే చైనా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్గాన్‌కు వరకు విస్తరించడంపై భారత్ ఆందోళన వ్యక్తంచేస్తోందంటూ వస్తున్న వార్తలపై బీజింగ్ స్పందించింది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది ఆర్థిక సహకారానికి సంబంధించినదని, దీనిపై రాజకీయం చేయడం మంచిదికాదని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ మొత్తం ప్రాంతానికి లాభం చేకూరుతుందని చెప్పారు. -
‘భారత్-అమెరికా కుట్రలు పనిచేయవు’
బీజింగ్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ తప్పకుండా విజయవంతమవుతుందని చైనా స్పష్టం చేసింది. ఓబీఓర్ ప్రాజెక్ట్‌పై చైనా 50 బలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్-అమెరికాలు సంయుక్తంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌పై కుట్రలు పన్నుతున్నాయని.. పాకిస్తాన్ రక్షణ శాఖ రెండు రోజుల కిందట చైనాకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చైనా బుధవారం స్పందించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఒన్‌బెల్ట్ ఒన్రోడ్లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చేయాంగ్ స్పష్టం చేశారు. ఓబీఓఆర్‌లో భాగంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్.. వివాదాస్పద ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్న విషయం తెలిసిందే. పీఓకేలో సీపీఈసీ ప్రాజెక్ట్ వెళుతుండడంపై ఇప్పటికే భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీపీఈసీ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి చైనాలోని జిన్జియాంగ్ వరకూ కనెక్టివిటీ ఏర్పడుతుంది. చైనా-పాకిస్తాన్ల మధ్య సుదీర్ఘకాలం స్నేహ సంబంధాలను కాపాడేందుకు ఎకనమిక్ కారిడార్ దోహదం చేస్తుందని హువా చేయాంగ్ చెప్పారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇది చైనా, పాక్‌లతోపాటు మొత్తం దక్షిణాసియా దేశాల అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌కు ఇతర దేశాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుందన్నారు. -
చైనా విషయంలో అదంతా రూమరే! : పాక్
ఇస్లామాబాద్ : చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు సంబంధించి గత కొన్నిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డ్రాగన్ కంట్రీ నుంచి నిధుల నిలిపివేత కారణంగా పాక్ పనులను ముందుకు సాగించలేకపోతుందన్నది దాని సారాంశం. ఈ నేపథ్యంలో పాక్ స్పందించింది. చైనా నిధులు నిలిపివేసిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ గురువారం వెల్లడించారు. ఈ మేరకు బీజింగ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం కూడా అందలేదన్నారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమీక్ష చేపట్టిన తర్వాత ఆర్థిక సాయం అందించటం ఆపేపిందని ఓ పుకారు చెలరేగింది. అలాంటిదేం జరగలేదు.. మిత్రపక్షం(చైనా) ఏనాడూ అలా చేయబోదు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ, తాత్కాలికంగా పనులు నిలిపివేసిన మాట వాస్తవమేనని.. చైనా నుంచి అనుమతులు రాగానే వాటి పనులు తిరిగి ప్రారంభిస్తామని చెప్పకొచ్చారు. అయితే దాని వెనుక ఉన్న కారణాలను మాత్రం వివరించలేదు. సాంకేతిక సమస్యల కారణంగానే రోడ్ నెట్ వర్క్‌కు సంబంధించిన ఈ మూడు ప్రాజెక్టులను ఆపేశారని ఇంతకు ముందు పాక్ మీడియా సంస్థ డాన్ ప్రచురించిన విషయం తెలిసిందే. త్వరలో చైనా నిపుణులు ఆయా ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించి క్లియరెన్స్ ఇస్తారని పాక్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
సంక్షోభంలో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్
ఇస్లామాబాద్ : చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ప్రధానంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న మూడు హైవేలకు అవినీతి సాకుతో చైనా నిధులు నిలిపివేయడంతో పాకిస్తాన్ ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. చైనా తిరిగి నిధులను పునరుద్దరిస్తేనే.. పనులు మొదలు పెడతామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. ఇదే విషయాన్ని 22 మంది సభ్యులు కలిగిన పాకిస్తాన పార్లమెంటరీ కమిటీ స్పస్టం చేసింది. పాకిస్తాన్ అభివృద్ధి మంత్రి ఆషాన్ ఇక్బాల్ కూడా నిధుల విడుదల తరువాతే పనులు మొదలవుతాయని అన్నారు. చైనా నిధులు విడుదల చేస్తేనే సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన మూడు హైవేల నిర్మాణం పనులు మొదలు పెడతామని ఆయన స్పష్టం చేశారు. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ గురించి పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో మూడు హైవే ప్రాజెక్టులను రద్దు చేయలేదని... నిధుల కొరత వల్ల నిలిపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా... చైనా -పాకిస్తాన్ ఎకనమిరక్ కారిడార్ ఆర్థిక అవకతవకల వల్ల పూర్తిగా నిలిచిపోయిందనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. సీపీఈసీ ప్రాజెక్ట్ మోదలయిన తరువాత ఇరుదేశాల మధ్య పలు సందర్భాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రధానంగా దీమార్ డ్యామ విషయంలో చైనా అభ్యంతరాలు వ్యక్తం చసింది. అదే సమయంలో.. పాకిస్తాన్ కూడా గ్వాదర్ పోర్టులో చైనా కరెన్సీ యువాన్‌ను అంగీకరించేది లేదంటూ ప్రకటించింది.