బీజింగ్ : పాక్‌తో వర్తక వ్యాపారాలు కొనసాగించే విషయంలో భారత్ చేసిన ప్రతిపాదనను చైనా తోసిపుచ్చింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్ పేరును మార్చి.. జమ్ము కశ్మీర్(సమస్మాత్మక) మార్గంలో కాకుండా మరో ప్రత్యామ్నాయా రూట్‌లో వ్యాపారం కొనసాగించాలని భారత్ సూచించింది. కానీ, అందుకు చైనా సుముఖత వ్యక్తం చేయలేదు.
గత వారం భారత్‌లోని చైనా రాయబారి లూఓ ఝావోయూయి ఢిల్లీలో మాట్లాడుతూ... భారత్ నుంచి ప్రతిపాదన వస్తే మంచిదని.. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్. ఓబీఓఆర్ ప్రాజెక్టు నేపథ్యంలో భారత్ సలహాను చైనా పాటించే అంశాలే ఎక్కువ ఉన్నాయని లూఓ అభిప్రాయపడ్డారు. కానీ, చైనా మాత్రం ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు సరికదా పాక్‌ను వెనకేసుకొచ్చింది. కశ్మీర్ అంశం తమ ఆర్థిక ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని తేల్చేసింది. కశ్మీర్ సమస్య భారత్-పాక్‌దే తప్ప.. తమది కాదని.. చర్చల ద్వారానే ఆ రెండు దేశాలు పరిష్కరించుకోవాలని సూచించింది.
ఇదిలా ఉంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని 68 దేశాలను కలుపుతూ.. ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తీవ్రవాద ప్రభావిత దేశాల్లో నిర్మిస్తుండడంతో అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సైతం వెనకంజ వేస్తున్నాయి. దీనిపై ఈ మధ్య 29 దేశాల ప్రతినిధులతో బీజింగ్‌లో సదస్సు నిర్వహించగా.. భారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సదస్సు నుంచి బయటకు వచ్చేసింది. ముందు పొరుగున ఉన్న దేశాలతో స్నేహ పూర్వక ఒప్పందాలు చేసుకోవటం అలవరచుకుంటే మంచిదని ఆ సమయంలో చైనా భారత్‌కు చురకలంటించగా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్తునందునే తాము ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు భారత్ తేల్చేసింది.
మరోవైపు చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఐరోపా మేధావులు గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. సీపీఈసీ కారిడార్ అనేది గిల్గిత్-బలిస్తాన్ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమేనని వారు ప్రకటించారు. పైగా ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment