కరాచీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌పై భారత్ కుట్రలు పన్నుతోందని పాకిస్తాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించింది. 57బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఆపేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ పావుగా ఉపయోగించుకుంటోందని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి అషాన్ ఇక్బాల్ ఆరోపించారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను నీరుగార్చేందుకు పాకిస్తాన్ శత్రువులంతా కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు.
‘సీపీఈసీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా భారత్ అన్ని రకాల కుట్రలు చేస్తోంది.. అయితే ప్రజల నమ్మకం, సహకారం, మద్దతుతో పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు నడుస్తోంద’ని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా భారత్ కుట్రలకు తెరతీస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఇదిలావుండగా.. ప్రతిష్టాత్మక సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి సీపీఈసీ ప్రాజెక్ట్ వెళ్లడంపై భారత్ మొదట నుంచి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
త్యాగాలను గుర్తించండి!
పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుని మాటలు దాడులు చేయడం మంచిది కాదని ఆయన అమెరికాకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ చేసిన త్యాగాలను అమెరికా ఇప్పటికైనా గుర్తించాలని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment