‘భారత్‌కు వ్యతిరేకం కాదు’ | CPEC's extension to Afghanistan not against India | Sakshi
Sakshi News home page

‘భారత్‌కు వ్యతిరేకం కాదు’

Published Thu, Dec 28 2017 5:07 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

CPEC's extension to Afghanistan not against India - Sakshi

బీజింగ్‌: చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ భారత్‌కువ్యతిరేకంగా నిర్మించడం లేదని చైనా ప్రకటించింది. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ వరకూ విస్తరించడంపై భారత్‌ అనుమానించాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చుయాంగ్‌ అన్నారు. ఈ విస్తరణతో భారత్‌ను చైనా ఒంటరి చేయాలని అనుకోవడం లేదని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ విస్తృత ప్రయోజనాలను ఉపఖండంలోని అన్ని దేశాలు పొందాలని మాత్రమే చైనా అలోచిస్తోందని ఆమె తెలిపారు. చైనా, పాకిస్తాన్‌లను ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు దేశం. దీంతో ఆ దేశంలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసేందుకే ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించాలన్న ఆలోచన వచ్చిందని ఆమె చెప్పారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం వల్ల భౌగోళిక, ఆర్థిక అంతరాలు తగ్గుతాయని, అంతేకాక రీజియన్‌ కెనక్టివిటీ పెరుగుతుందని ఆమె అన్నారు. 

ఇదిలావుండగా..  చైనా - పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ వరకూ విస్తరించాలని ఈ మధ్యే చైనా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను ఆఫ్గాన్‌కు వరకు విస్తరించడంపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేస్తోందంటూ వస్తున్న వార్తలపై బీజింగ్‌ స్పందించింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ అనేది ఆర్థిక సహకారానికి సంబంధించినదని, దీనిపై రాజకీయం చేయడం మంచిదికాదని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల ఈ మొత్తం ప్రాంతానికి లాభం చేకూరుతుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement