బీజింగ్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ తప్పకుండా విజయవంతమవుతుందని చైనా స్పష్టం చేసింది. ఓబీఓర్ ప్రాజెక్ట్‌పై చైనా 50 బలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్-అమెరికాలు సంయుక్తంగా సీపీఈసీ ప్రాజెక్ట్‌పై కుట్రలు పన్నుతున్నాయని.. పాకిస్తాన్ రక్షణ శాఖ రెండు రోజుల కిందట చైనాకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చైనా బుధవారం స్పందించింది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆగదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చేయాంగ్ స్పష్టం చేశారు.
ఓబీఓఆర్‌లో భాగంగా నిర్మిస్తున్న చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్.. వివాదాస్పద ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్న విషయం తెలిసిందే. పీఓకేలో సీపీఈసీ ప్రాజెక్ట్ వెళుతుండడంపై ఇప్పటికే భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సీపీఈసీ ప్రాజెక్ట్ ద్వారా పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి చైనాలోని జిన్‌జియాంగ్ వరకూ కనెక్టివిటీ ఏర్పడుతుంది.
చైనా-పాకిస్తాన్‌ల మధ్య సుదీర్ఘకాలం స్నేహ సంబంధాలను కాపాడేందుకు ఎకనమిక్ కారిడార్ దోహదం చేస్తుందని హువా చేయాంగ్ చెప్పారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఇది చైనా, పాక్‌లతోపాటు మొత్తం దక్షిణాసియా దేశాల అభివృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్‌కు ఇతర దేశాల నుంచి ఊహించని మద్దతు లభిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment