సీపెక్ ప్రతీకాత్మక చిత్రం
ఇస్లామాబాద్: వాణిజ్యాభివృద్ధి కోసం చైనా.. పాకిస్థాన్‌లో నిర్మిస్తున్న చైనా–పాక్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులకు ఇబ్బందులను నివారించడానికి డ్రాగన్... బలూచిస్థాన్ తిరుగుబాటుదారులతో సయోధ్య కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పలువురు వేర్పాటువాద నాయకులతో బీజింగ్ నేరుగా చర్చిస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం వెల్లడించింది. సీపెక్ కోసం 60 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులను పాక్ చేపట్టింది. బలూచిస్థాన్ నాయకులతో సయోధ్య కుదుర్చుకోవడంలో చైనా చాలా వరకు సఫలమైందని పాక్ అధికారి ఒకరు అన్నారు. తిరుగుబాటుదారులు చిన్నాచితకా దాడులు చేస్తున్నా, భారీ నష్టం కలిగించడం లేదని చెప్పారు. సీపెక్‌లో భాగంగా చైనాలోని కష్గర్ నుంచి పాక్‌లోని గ్వాదర్ వరకు చైనా రోడ్డు, రైలు మార్గాలు నిర్మిస్తోంది. గ్వాదర్ బలూచిస్థాన్‌లోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment