న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)కి సంబంధించిన బహుళ బిలియన్ డాలర్ల కనెక్టివిటీ కారిడార్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా చైనా ఈ సీపెక్ ప్రాజెక్టులో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మూడో దేశాన్ని భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీంతో భారత్ ఆగ్రహంతో పాక్, చైనా చర్యలను తీవ్రంగా ఖండించింది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద ఇటువంటి కార్యకలాపాలు స్వభావసిద్ధంగా 'చట్ట విరుద్ధం' అని నొక్కి చెప్పింది.
ఇది ఆమోద యోగ్యం కాదని కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే భారత్ తదను గుణంగా వ్యవహరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గట్టిగా హెచ్చరించారు. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ భూభాగంలోని ఈ ప్రాజెక్టులను భారత్ దృఢంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అంతేగాదు ఇవి నేరుగా భారత్ సార్వ భౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్యలని అన్నారు.
వాస్తవానికి సీపెక్ అనేది చైనాకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)లో భాగం. ఈ సీపెక్ 2013లో ప్రారంభమైంది. ఇది పాకిస్తాన్ రోడ్డు, రైలు ఇంధన రవాణా అవస్థాపనను మెరుగుపరచడమే కాకుండా సముద్రపు నౌకాశ్రయం గ్వాదర్‌ను చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌తో కలుపుతుంది. ఐతే సీపెక్ చొరవలో భాగంగా ఈ బీఆర్‌ఐని ఆది నుంచి భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది.
(చదవండి: యూపీలో మంకీపాక్స్ అనుమానిత కేసు.. పలు రాష్ట్రాల్లో హైఅలర్ట్!)
Comments
Please login to add a commentAdd a comment