ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో ఉంటున్న చైనీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. చైనీయులపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. అందువల్ల చైనీయులు గుంపుల దగ్గర ఉండరాదని ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్ నిర్మాణంలో భాగంగా వేలాది మంది చైనా కార్మికులు పాకిస్తాన్‌లో నివాసముంటున్నారు. ఈ ఒబీఒఆర్‌తో చైనాకు మధ్యప్రాచ్యం, ఐరోపాతో నేరుగా వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి.
ఈ రహదారి పనులను ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణపనుల్లో పాల్గొంటున్న చైనా కార్మికులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని చైనా తెలిపింది. ఈ దాడులనుంచి చైనీయులు తప్పించుకునేందుకు ఎల్లప్పుడూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాక కొత్తవారితో మాట్లాడ్డం, జన సందోహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 4 లక్షల మంది చైనీయులు ఉన్నట్లు అంచనా. వీరంతా చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. చైనా అధికారులు చేసిన ప్రకటనపై పాకిస్తాన్ నుంచి ఇంకా ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment