OBOR project
-
చైనీయులూ, పాకిస్తాన్లో జాగ్రత్తగా ఉండండి!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఉంటున్న చైనీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. చైనీయులపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. అందువల్ల చైనీయులు గుంపుల దగ్గర ఉండరాదని ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్ నిర్మాణంలో భాగంగా వేలాది మంది చైనా కార్మికులు పాకిస్తాన్లో నివాసముంటున్నారు. ఈ ఒబీఒఆర్తో చైనాకు మధ్యప్రాచ్యం, ఐరోపాతో నేరుగా వాణిజ్య సంబంధాలు ఏర్పడతాయి. ఈ రహదారి పనులను ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాణపనుల్లో పాల్గొంటున్న చైనా కార్మికులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందని చైనా తెలిపింది. ఈ దాడులనుంచి చైనీయులు తప్పించుకునేందుకు ఎల్లప్పుడూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాక కొత్తవారితో మాట్లాడ్డం, జన సందోహం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని చెప్పారు. ప్రస్తుతం పాకిస్తాన్లో 4 లక్షల మంది చైనీయులు ఉన్నట్లు అంచనా. వీరంతా చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. చైనా అధికారులు చేసిన ప్రకటనపై పాకిస్తాన్ నుంచి ఇంకా ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. -
హిందూ మహాసముద్రం కోసమే చైనా కయ్యం
బీజింగ్ : భారత్-చైనాల మధ్య డోక్లాం తరువాత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్ఎస్జీ, ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, వంటి వివాదాలు ఇరు దేశాల మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను మరీ బలోపేతం చేసుకోవడం కూడా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య హిందూమహాసముద్రం వేదికగా మరిన్ని కొత్త వివాదాలు ఏర్పడనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్, చైనా మధ్య హిమాలయాలకంటే అధికంగా హిందూ మహాసముద్రమే వివాదాలకు, ఒకరకంగా చెప్పాలంటే యుద్ధానికి కూడా కారణమవుతుందని చైనాకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు బ్రెర్టిల్ లిన్టర్ చెబుతున్నారు. బ్రెటిల్ తాజాగా రచించిన ‘చైనాస్ ఇండియా వార్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, సిల్క్ రోడ్లు ఇందుకు కారణంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. సముద్రంపై చైనా అసక్తి చైనా దాదాపు 60 ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించలేదు. అయితే ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంతో పాటు.. హిందు మహాసముద్రంపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హిమాలయాలకన్నా.. చైనాకు ఇప్పుడు హిందూమహాసముద్రమే చాలా విలువైంది. 1959లో యుద్ధం జరగాల్సింది! భారత్‌పై చైనా 1959లోనే యుద్ధం చేయాలని భావించినట్లు ఆయన తన పుస్తకంలో తెలిపారు. అయితే భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. సరిహద్దు సమస్యలపై చైనాతో చర్చించడంతో యుద్ధాన్ని వాయిదా వేసుకుంది. అయితే 1962లో మాత్రం చైనా యుద్ధానికి దిగింది. -
చైనాకు పోటీ: అమెరికా, భారత్ 'ఐపీఈసీ'
వాషింగ్టన్: దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)కు గట్టి పోటీ నిచ్చేందుకు అమెరికా న్యూ సిల్క్ రోడ్(ఎన్ఎస్ఆర్), ఇండో-పసిఫిక్ కారిడార్(ఐపీఈసీ) ప్రాజెక్టులను పునరుద్ధరించనుంది. అయితే, దీని వల్ల భారత్‌కు ఏంటి ప్రయోజనం?. 2011లో భారత్‌లో పర్యటించిన అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ఎన్ఎస్ఆర్, ఐపీఈసీలపై చెన్నైలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల కేంద్రంగా ఈ ప్రాజెక్టులను చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో భారత్ కీలక పాత్ర పోషించాలని ఆమె కోరారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రాజెక్టు వైపు అడుగులు పడలేదు. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టులతో ప్రపంచంలోని ముఖ్య ప్రాంతాల్లో ఎకనమిక్ కారిడార్లు తలపెట్టడం అగ్ర రాజ్యానికి అంత రుచించినట్లు లేదు. అందుకే బడ్జెట్ ప్రస్తావనలో సిల్క్ ప్రాజెక్టుల అంశాన్ని అమెరికా మంగళవారం చర్చించింది. అంతేకాదు త్వరలో ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రానున్న ఈ ప్రాజెక్టుల్లో భారత్ కీలకపాత్ర పోషించనుంది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూ సిల్క్ రోడ్(ఎన్ఎస్ఆర్) ప్రాజెక్టు ఆప్ఘనిస్తాన్ దాని పొరుగు దేశాల గుండా పోతుందని, ఇండో-పసిఫిక్ కారిడార్(ఐపీఈసీ) దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలను కలుపుతుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆయా దేశాలు, బ్యాంకులు, ప్రైవేటు కంపెనీలతో త్వరలో చర్చిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్‌లో మార్పుకు కృషి చేస్తున్న అమెరికా.. న్యూ సిల్క్ రోడ్ ద్వారా మరింత మార్పును తెస్తుందని వివరించింది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం మధ్య ఆసియా దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఫారిన్ రిలేషన్స్ కౌన్సిల్ ప్రతినిధి జేమ్స్ మెక్ బ్రైడ్ అన్నారు. చైనా చేపట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు వివాదాస్పద ప్రాంతమైన గిల్గిత్ బాల్టిస్తాన్ గుండా పోతుండటంతో భారత్ ఓబీఓఆర్‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చైనా ప్రాజెక్టుకు ధీటుగా ప్రారంభించనున్న ఎన్ఎస్ఆర్, ఐపీఈసీలకు భారత్ సంపూర్ణ మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల్లో భారత్ కీలక భాగస్వామి కావడం వల్ల టర్క్‌మన్ గ్యాస్ ఫీల్డ్స్ నుంచి భారత్‌కు అవసరమవుతున్న ఇంధనాలను సులభంగా తెచ్చుకునే వీలు కలుగుతుంది. తాజిక్ కాటన్ భారత్‌కు అందుబాటులోకి వస్తుంది. ముంబై మార్కెట్ పెద్ద ఎత్తున విస్తృతమయ్యే అవకాశం కలుగుతుంది. అయితే, మరి ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయ్యేందుకు భారత్ అంగీకరిస్తుందా? అన్న విషయం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
ఓబీఓఆర్ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకరం
భారత్-చైనా మిత్రమండలి హైదరాబాద్: చైనా ప్రతిపాదిస్తున్న ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ (ఓబీఓఆర్) పథకం బహుళ ప్రయోజనకరమని భారత్, చైనా మిత్రమండలి అభిప్రాయపడింది. మండలి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని బేగంపేట సెస్ ప్రాంగణంలో ఆదివా రం కామ్రేడ్ జ్వాలాముఖి సంస్మరణార్థం ‘సిల్క్ రూట్.. ఫాస్ట్ అండ్ ఫ్యూచర్’ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. దివంగత కామ్రేడ్ జ్వాలాముఖి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొ.నర్సింహా రెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాలను కలుపుతూ రహదారులు, సముద్ర మార్గాలు, గ్యాస్, టెలికం పైప్లైన్లు సహా భారీ నిర్మాణాలతో 65 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్ట్‌లో 62 దేశాలు భాగస్వామ్యులుగా చేరాయని, ప్రాజెక్ట్ పూర్తరుుతే చౌకగా విసృ్తత స్థారుులో సరుకు రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షుడు సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రొ.ఆర్వీ.రమణమూర్తి, ముత్యంరెడ్డి, మండలి సభ్యులు జతిన్‌కుమార్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.