ఓబీఓఆర్ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకరం | OBOR project with multiple beneficial | Sakshi
Sakshi News home page

ఓబీఓఆర్ ప్రాజెక్ట్ బహుళ ప్రయోజనకరం

Published Mon, Dec 12 2016 3:16 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

OBOR project with multiple beneficial

భారత్-చైనా మిత్రమండలి
 
 హైదరాబాద్:
చైనా ప్రతిపాదిస్తున్న ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ (ఓబీఓఆర్) పథకం బహుళ ప్రయోజనకరమని భారత్, చైనా మిత్రమండలి అభిప్రాయపడింది. మండలి ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని బేగంపేట సెస్ ప్రాంగణంలో ఆదివా రం కామ్రేడ్ జ్వాలాముఖి సంస్మరణార్థం ‘సిల్క్ రూట్.. ఫాస్ట్ అండ్ ఫ్యూచర్’ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. దివంగత కామ్రేడ్ జ్వాలాముఖి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొ.నర్సింహా రెడ్డి మాట్లాడుతూ వివిధ దేశాలను కలుపుతూ రహదారులు, సముద్ర మార్గాలు, గ్యాస్, టెలికం పైప్‌లైన్లు సహా భారీ నిర్మాణాలతో 65 లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్ట్‌లో 62 దేశాలు భాగస్వామ్యులుగా చేరాయని, ప్రాజెక్ట్ పూర్తరుుతే చౌకగా విసృ్తత స్థారుులో సరుకు రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్ర మంలో సంస్థ అధ్యక్షుడు సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రొ.ఆర్‌వీ.రమణమూర్తి, ముత్యంరెడ్డి, మండలి సభ్యులు జతిన్‌కుమార్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement