చైనా పాక్‌ ఒప్పందం.. భారత్‌ మండిపాటు | Pakistan China Bus Service Through Pak Occupied Kashmir Is A Violation | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 12:03 PM | Last Updated on Thu, Nov 1 2018 1:07 PM

Pakistan China Bus Service Through Pak Occupied Kashmir Is A Violation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌ చర్యలపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)లో భాగంగా నిర్మించిన బస్‌ సర్వీస్‌ను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రవీష్‌కుమార్‌ తెలిపారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా వెళ్లనున్న ఈ బస్‌ సర్వీస్‌ భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను ప్రశ్నించేదిగా ఉందని అన్నారు. (పాకిస్తాన్‌లో మోదీ మంత్ర)

చైనా-పాకిస్తాన్‌ మధ్య రూపుదిద్దుకున్న ‘సరిహద్దు ఒప్పందం 1963’ అక్రమమైనది, కాలం చెల్లినది’ అని రవీష్‌ పేర్కొన్నారు. విలువలేని ఈ ఒప్పందాన్ని భారత్‌ ఎన్నడూ ఆమోదించబోదనీ, ఈ బస్ సర్వీస్‌ ముమ్మాటికీ ఉల్లంఘనలతో కూడుకున్నదేనని ఉద్ఘాటించారు. దీనిని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లోని లాహోర్‌.. చైనాలోని కాష్గార్‌ల మద్య ఈ బస్‌ సర్వీస్‌ నవంబర్‌ 13న ప్రారంభం కానుందని సమాచారం. 50 బిలియన్‌ డాలర్లతో 2015లో మొదలైన సీపీఈసీలో భాగంగా పాకిస్తాన్‌, చైనాల మధ్య విరివిగా రోడ్డు రైల్వే మార్గాలు నిర్మించనున్నారు.

(క్రిస్టియన్‌ మహిళ కేసులో పాక్‌ కోర్టు సంచలన తీర్పు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement