విశాఖపట్టణం: నైరుతి రుతపవనాలు, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోకి శనివారం ప్రవేశించాయి. శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాలు మినహా 90 శాతం రుతు పవనాలు విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలోనూ రుతు పవనాలు విస్తరించాయని పేర్కొంది. అదే విధంగా ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగనుంది. దీంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.