materiology department
-
ఇరు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్టణం: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. ఒడిశా నుంచి నేరుగా కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉన్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ద్రోణి ఫలితంగా శని, ఆదివారాల్లో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు
విశాఖపట్టణం: కోస్తాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. ఆంధ్రతో పాటు ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను ఆనుకుని అల్పపీడనం ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడింది. అంతే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. -
బంగాళా ఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజులుగా వడగాడ్పులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉష్ణోగ్రతల్లో కొద్దిపాటి తగ్గుదల కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగానే నాలుగు రోజుల నుంచి వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తున్న భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వాటిని ఉపసంహరించింది. గడచిన 24 గంటల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం కూడా పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కావలి, ఒంగోలు, తిరుపతిల్లో 40 డిగ్రీలు, మచిలీపట్నం, బాపట్ల, నెల్లూరులో 39 డిగ్రీలు, విశాఖపట్నం, కాకినాడ, తుని, కర్నూలుల్లో 38 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవి సాధారణంకంటే 4 నుంచి 6 డిగ్రీలు అధికం. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
కోస్తాలో విస్తారంగా వర్షాలు!
విశాఖపట్నం: ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కో స్తాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో కురుపాంలో 10 సెం.మీలు, అవనిగడ్డలో 7, భీమడోలు 5, పాలేరు బ్రిడ్జి, మారుటేరులో మూడు సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్ర, తెలంగాణకు నైరుతి రుతుపవనాలు
విశాఖపట్టణం: నైరుతి రుతపవనాలు, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోకి శనివారం ప్రవేశించాయి. శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాలు మినహా 90 శాతం రుతు పవనాలు విస్తరించాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలోనూ రుతు పవనాలు విస్తరించాయని పేర్కొంది. అదే విధంగా ఛత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగనుంది. దీంతో కోస్తాంధ్రలో అక్కడకక్కడా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.